suport prise
-
గర్జించిన అన్నదాత
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నదాత గర్జనతో రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతులు శుక్రవారం నిర్వహించిన మహా ర్యాలీ విజయవంతమైంది. సప్త వర్ణాలను తలపించేలా పతాకాలు చేతబట్టిన రైతన్నలు రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంటు స్ట్రీట్‌కు సమీపంలోని జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు, దారిపొడవునా బారికేడ్లు, వాటర్ క్యానన్లు, పోలీసు కెమెరాలు, సాయుధ బలగాలకు తొణకకుండా ముందుకు సాగారు. పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించాలని, శాశ్వతంగా రుణ విముక్తి కల్పించాలన్న డిమాండ్‌తో అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఇచ్చిన పిలుపు మేరకు ఈ రెండు రోజుల కవాతు జరిగింది. రామ్‌లీలా మైదానం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పార్లమెంటుకు ర్యాలీగా బయల్దేరారు. కానీ జంతర్‌మంతర్ వద్దే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రైతు పార్లమెంట్ నిర్వహించి తమ డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు. ఢిల్లీలో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ర్యాలీగా చెబుతున్న ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు మేథాపాట్కర్, యోగేంద్ర యాదవ్, అతుల్ కుమార్, హన్నన్ మొల్లా, కవితా కురగంటి, వీఎంకే సింగ్ తదితరులు ముందు నడవగా రైతులు వారిని అనుసరించారు. అయోధ్య కాదు..రుణ మాఫీ కావాలి: డప్పు నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, కోలాటాలు, విచిత్ర వేషాలు, గిరిజన నత్యాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలు, ఉరితాళ్లు, అప్పుల కోసం రాసిన ప్రామిసరీ నోట్లు వంటివి ప్రదర్శిస్తూ రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ‘అయోధ్య–రామజన్మభూమి కాదు.. రుణాలు మాఫీ కావాలి’, ‘రైతుల్ని రుణభారం నుంచి విముక్తం చేయాలి’, ‘చౌకీదార్ బడాచోర్’, ‘మోదీ కిసాన్ విరోధి’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘కిసాన్ ఏక్తా– జిందాబాద్’ లాంటి నినాదాలు ఢిల్లీ వీధుల్లో మార్మోగాయి. పోలీసులు అడ్డగించిన చోటల్లా రైతు ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, పంజాబ్సహా దేశంలోని 24 రాష్ట్రాల రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన మహిళలు అనేక మంది అప్పుల భారంతో మరణించిన తమ కుటుంబ పెద్దల ఫొటోలను చేతబూని ర్యాలీలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు.. ‘రుణమాఫీ పెద్ద దగా’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. రైతు సమస్యలే అజెండా కావాలి... జంతర్‌మంతర్ వద్ద రైతు పార్లమెంట్(సభ)లో పలువురు వక్తలు ప్రసంగిస్తూ.. రైతులు బిచ్చగాళ్లు కాదని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై నిలిచి ఒకే వాణి వినిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదీ బతికి బట్ట కట్టలేదని, అయోధ్య, రామజన్మభూమి..రైతు ఆత్మహత్యల కన్నా ఎక్కువ కాదని అన్నారు. మరోవైపు, రుణ విముక్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులకు అన్ని రాజకీయ పార్టీల మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ రైతు సదస్సు తీర్మానం చేసింది. రైతు మేనిఫెస్టోను ఆమోదిస్తూ మరో తీర్మానం చేసింది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏకేఎస్సీసీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జంతర్‌మంతర్ వద్ద రైతుల్ని ఉద్దేశించి ప్రసంగించిన వారిలో రాహుల్, కేజ్రీవాల్‌తో పాటు సీతారాం ఏచూరీ (సీపీఎం), సురవరం సుధాకరరెడ్డి (సీపీఐ), శరద్ పవార్ (ఎన్సీపీ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), శరద్ యాదవ్ (ఎల్జేడీ) తదితర జాతీయ నాయకులున్నారు. సంపన్నులకేనా రుణమాఫీ: రాహుల్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానికి సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలు బకాయిలు పడిన రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసిన ప్రభుత్వం రైతు రుణాలను ఎందుకు విస్మరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. రైతులు ప్రభుత్వం నుంచి ఉచిత కానుకలు కోరడం లేదని వారు అడుగుతున్న రుణమాఫీ, మద్దతు ధర వారి హక్కని రైతు సభలో పేర్కొన్నారు. రైతులు, యువత గొంతుకల్ని ప్రభుత్వం అణగదొక్కలేదని, ఒకవేళ వారిని అవమానిస్తే ఆ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఫసల్ బీమా యోజన ద్వారా అనిల్ అంబానీ సంస్థలకు ప్రధాని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీమా పథకాన్ని రెండుగా విభజించి అంబానీ, అదానీ సంస్థలకు పంచిపెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ..స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా రైతులను ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ రంగం తిరోగమన బాట పట్టిందని, అందువల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ విభజనవాద రాజకీయాలపై గళమెత్తాలని, రైతు సమస్యలపై అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ–అమిత్ షా ద్వయాన్ని ఆయన దుర్యోదన–దుశ్శాసనలుగా అభివర్ణించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రైతులు ఢిల్లీలో జరిగిన మహా ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రైతులు -
తెల్లబంగారానికి తగ్గుతున్న మద్దతు
ఆరుగాలం కష్టించి పత్తి పండించిన రైతన్నకు ఆదిలోనే ధరల దోబూచులాట తప్పడం లేదు. అప్పుడే పెరుగుతున్నట్లే అనిపిస్తున్న పత్తి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా రైతులు అయోమయంలో పడుతున్నారు. మద్దతు ధర కంటే అదనంగా ధర పలికినా.. అడ్తి కమీషన్, ఇతర ఖర్చులు పరిశీలిస్తే తక్కువ ధరకే చేతికి వస్తోందని రైతులు లెక్కలు వేస్తున్నారు. జమ్మికుంట(హుజురాబాద్): ఆరుగాలం కష్టపడి పత్తిని పండించిన రైతన్నలకు వ్యాపారుల కొనుగోళ్లతో మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదు..రోజురోజుకు పడిపోతున్న ధరలతో రైతుకు లాభం దక్కడం లేదు. మద్దతు కంటే అధనంగా ధర పలికినా.. ఆడ్తి కమీషన్, ఇతర ఖర్చులు పరిశీలిస్తే తక్కువ ధరనే చేతికి వస్తోందని రైతులు లెక్కలు వేస్తున్నారు. శుక్రవారం మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.5,550 ధర గరిష్టంగా పలికినా.. వాçస్తవానికి రైతుకు దక్కిన ధర రూ.5,350 మాత్రమే. అంటే సీసీఐ ధర కంటే రైతుకు క్వింటాల్‌కు రూ.100 వ్యత్యాసం ఉంది. మద్దతు కంటే తక్కువ ఇలా.. జమ్మికుంట పత్తి మార్కెట్లో ఆడ్తిదారుల సమక్షంలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈక్రమంలో రైతు పత్తిని అమ్మిన తర్వాత ఆడ్తి కమీషన్ మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం నూటికి రూ.2 రైతు నుంచి ఆడ్తిదారుడు వసూలు చేస్తూంటారు. అంటే క్వింటాల్ పత్తికి రూ. 5,550 ధర పలికితే ఇందులో రూ.111 ఆడ్తి కమీషన్‌కు కటింగ్ అవుతుంది. ఇతర ఎగుమతి, దిగుమతి చార్జీలు దాదాపు రూ.100 వరకు అధనంగా ఖర్చు వస్తుంది. క్వింటాల్ పత్తికి రూ.211 తీసేస్తే ఇక రైతుకు పలికిన ధర 5,339. దీంతో రైతులు సీసీఐకి విక్రయిస్తేనే లాభం జరుగుతోందని భావిస్తున్నారు. సీసీఐకి అమ్మితే.. రైతులు సీసీఐ సంస్థకు పత్తిని నేరుగా మద్దతు ధరకు అమ్ముకుంటే ఏలాంటి కమీషన్, ఇతర ఖర్చులు భారం పడదు. ఎన్ని క్వీంటాళ్ల పత్తిని అమ్మితే అన్ని క్వింటాళ్లకు పూర్తిగా లెక్కలు చేసి రైతులకు అందిస్తారు. అయితే పత్తిని అమ్మినరోజే చేతికి డబ్బులు రావు. మూడునాలుగు రోజులు ఆగితే రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ అయ్యే పరిస్థితి ఉంటుంది. సోమవారం సీసీఐ బోని కొట్టె అవకాశం..? జమ్మికుంట మార్కెట్లో మద్దతు కంటే ఎక్కువ ధరలు పలుకుతుండడంతో సీసీఐ సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు క్వింటాల్ పత్తిని సేకరించలేక పోయారు. మొదట్లో క్వింటాల్ పత్తికి రూ.5,850 వరకు ధర చేరడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. ప్రస్తుతం క్యాండి, గింజల ధరలకు డిమాండ్ లేకపోవడంతో ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం గింజల ధర రూ.1,950 నుంచి రూ.2,150 వరకు పెరిగనా..క్యాండి ధర రూ.47 వేల నుంచి రూ.46,100 వరకు తగ్గింది. దీంతో పత్తి ధర క్వింటాల్‌కు రూ. 5,550కి పడిపోయిందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. -
మళ్లీ ప్రా‘ధాన్యం’!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరించాల్సిన లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 1.40 మెట్రిక్ టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనేందుకు నిర్ణయించారు. జిల్లాలో 89 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాలవి 73 ఉండగా, ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) కేంద్రాలు 16 ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల సభ్యులకు శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లాలో 64,200 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. ఈసారి వర్షాలు కూడా బాగానే ఉండడంతో దిగుబడి కూడా అధికంగా వస్తుందనే ఆలోచనతో రైతులున్నారు. 2016–17లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా నిర్ణయించగా 1.40లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. నాడు ఖమ్మం జిల్లాలోని 21మండలాల పరిధిలో 34,835.609మెట్రిక్ టన్నులే సేకరించారు. గతేడాది (2017–18) ధాన్యం కొనుగోళ్లను పెంచాలని నిర్ణయించారు. 56వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించగా..మొత్తం 39,323.040మెట్రిక్ టన్నులు కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 89 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రైతుల నుంచి వచ్చే ధాన్యం తీవ్రతను బట్టి..మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా..? లేకపోతే ఉన్నవాటిని తగ్గించాలా..? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ముందస్తుగా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం అమ్మే రైతులు నాణ్యత ప్రమాణాలు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మే రైతులు తమవెంట ఆధార్‌కార్డు, గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ (బ్యాంక్ పాస్ పుస్తకం జత చేయాలి.), బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ధ్రువీకరించాలి. రైతు మొబైల్ నంబర్ లేనిపక్షంలో కుటుంబ సభ్యుల ఫోన్‌నంబర్ ఇవ్వాల్స ఉంటుంది. క్వింటా ధర రూ.200పెంపు గతంలో గ్రేడ్–ఏ రకానికి క్వింటా ధర రూ.1590 ఉండగా..కామన్ రకం రూ.1540 ఉండేది. అయితే రైతులను ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాకు రూ.200 ధర పెంచుతూ నిర్ణయించింది. ఈ ధర ఈ ఖరీఫ్ నుంచి అమలు కానుంది. వీటికి గ్రేడ్–ఏ రకం క్వింటా «ధాన్యం ధర రూ.1790, కామన్ రకం క్వింటా ధాన్యం ధర రూ.1740గా నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో 48 గంటల్లో నగదు చెల్లింపులు చేయనున్నారు. గతంలో ఆన్లైన్ తదితర సమస్యలు ఎదురవగా..ఈ సారి ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. 22న శిక్షణకు ప్రణాళిక.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు..ఆయా సంఘాల మహిళలకు ఈనెల 22వ తేదీన ఖమ్మంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా ధాన్యం తేమశాతం లెక్కించడం, ధాన్యంలో గ్రేడ్‌ను గుర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ అనంతరం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేయనున్నారు. -
నేటినుంచి ధాన్యం కొనుగోళ్లు..
జిల్లాలో బుధవారం ఖరీఫ్ సీజన్ వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, భువనగిరి వ్యవసాయ మా ర్కెట్ యార్డుల్లో కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఇందుకో సం జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ 63, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 50కేంద్రాలు ఉన్నాయి. కాగా ఈసీజన్‌కు గాను 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాక్షి, భువనగిరి : ఖరీఫ్ సీజన్ వరిధాన్యం కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. మొదట రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, భువనగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఈ సీజన్‌కుగాను 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 63, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 50 కేంద్రాలు ఉన్నాయి. రబీ సీజన్లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని అవి పునరావృతం కాకుండా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సన్నాహాలు జిల్లాలో సాధారణ విస్తీర్ణం 34,066 హెక్టార్లు కాగా ప్రస్తుత సాగు విస్తీర్ణం 42,770 హెక్టార్లు ఇందులో మూసీ పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో ఖరీఫ్ సీజన్‌కు గానూ 1.96 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అంచనాతో అధికారులు ముందుకు సాగుతున్నారు. మూసీ పరీవాహకేతర ప్రాంతాల్లో వరి సాగు విస్తీర్ణం కొంత వరకు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో వరి ఎండిపోయింది. ప్రస్తుతం మూసీ ఆయకట్టుతో పాటు చిన్న నీటి పారుదల కాల్వల కింద సాగు చేసిన పంట నుంచి ధాన్యం రావడానికి కొంత సమయం పట్టనుంది. అయితే మూసీ పరీవాహకేత ర ప్రాంతాల్లో ముందుగా సాగు చేయడంతో ఇప్పటికే వరికోతలు మొదలై ధాన్యం విక్రయాలు కూడా ప్రారంభించారు. పెరిగిన మద్ధతు ధర.. కేంద్ర ప్రభుత్వం ఈసారి మద్ధతు ధరను పెంచడంతో కొంత వరకు రైతులలో ఆశ కలిగింది.ధాన్యానికి క్వింటాకు ఏ–గ్రేడ్ రూ.1,770, బీ–గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,750 చొప్పున పెంచారు. గతంతో పోల్చుకుంటే ఏ–గ్రేడ్‌కు రూ.180, బీ–గ్రేడ్‌కు 200 చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం వివిధ శాఖల సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికను రూపొందించారు. ఖరీఫ్‌సీజన్‌కు గానూ 33.75 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం 33.59 లక్షల గన్నీ బ్యాగ్‌లను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్లు సిద్ధంగా ఉంచారు. ఏర్పాట్లు పూర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. బుధవారం కాకుంటే గురువారమైనా వ్యవసాయ మార్కెట్లలో కొనుగోళ్లను ప్రారంభిస్తాం. హమాలీలు అందుబాటులో ఉంటే ఇదేరోజు కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. – సంధ్యారాణి, డీఎస్ఓ మద్ధతు ధర పెరిగింది ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన సామగ్రిని సిద్ధంగా ఉంచాం. ఈసారి వరి ధాన్యానికి మద్ధతు ధర పెరిగింది. పెరిగిన మద్ధతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పెరిగిన మద్ధతు ధర గురించి రైతులకు తెలియజేస్తాం. – సారిక, మార్కెట్ శాఖ జిల్లా అధికారి -
సీసీఐ కసరత్తు..
ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం 5,81,767 ఎకరాలు కాగా, ప్రధాన పంటల్లో ఒకటైన పత్తిని 2,41,752 ఎకరాల్లో సాగు చేశారు. అక్టోబర్ నెలారంభం నుంచి పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరతో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,450 చెల్లించాలని, 8 నుంచి 12 తేమ శాతం కలిగిన పత్తిని మాత్రమే కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8 శాతం తేమ కలిగిన పత్తికి రూ.5,450లు చెల్లించనుంది. తేమ 9 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ. 54.50 తగ్గించి కొనుగోలు చేస్తారు. తేమ 10 శాతం ఉంటే ధర మరో రూ.54.50 తగ్గిస్తారు. తేమ శాతం 12కు మించితే పత్తిని కొనుగోలు చేయొద్దని నిబంధనలు వధించారు. గత ఏడాది ప్రభుత్వం మద్దతు ధర రూ.4,320 నిర్ణయించగా, సీసీఐ 1.26 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేటు మార్కెట్లో అధిక ధర పలకటంతో సీసీఐ కేంద్రాల్లో తక్కువ కొనుగోళ్లు జరిగాయి. ప్రైవేటు మార్కెట్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 లక్షల క్వింటాళ్లు కొనుగోళ్లు చేసినట్లు మార్కెటింగ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 5 మార్కెట్ల పరిధిలో పత్తి కొనుగోళ్లు.. జిల్లాలో సత్తుపల్లి వ్యవసాయ డివిజన్ మినహా ఖమ్మం, వైరా, మధిర, కూసుమంచి వ్యవసాయ డివిజన్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఖమ్మం, వైరా, మధిర, నేలకొండపల్లి, ఏన్కూరు.. 5 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మార్కెట్ల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో కూడా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 12 జిన్నింగ్ మిల్లులు ఉండగా 10 మిల్లులు నిర్వహణలో ఉన్నాయి. వాటిలో కూడా పలు మిల్లులకు తగిన అనుమతులు లేవని తెలిసింది. 6 మిల్లులు మాత్రం జిన్నింగ్‌కు అన్ని అనుమతులు కలిగి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 10 రోజుల్లో కేంద్రాలు మరో 10 రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను చేర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేసే కేంద్రాలను పరిశీలించారు. ప్రధానంగా మార్కెటింగ్ శాఖతో పాటు అగ్నిమాపక, లీగల్ మెట్రాలజీ, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు పంట ఉత్పత్తి కొనుగోలు అంశాలపై తగిన బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ పంట ఉత్పత్తి విక్రయాలపై గ్రామాలకు షెడ్యూల్‌ను రూపొందించి, కొనుగోలు కేంద్రాలను పంపించాలని సూచించారు. కాగా గతేడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లు చేపట్టారు. తేమశాతమే ప్రధాన ప్రామాణికం పత్తి కొనుగోళ్లలో ప్రధాన ప్రామాణికం తేమశాతమే. తేమ 8 నుంచి 12 శాతం వరకు తేమ కలిగిన తేమను మాత్రమే కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధనలు విధించింది. ఈ తేమశాతాన్ని గ్రామాల్లోనే పరిశీలించి సమీప కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు ఉండాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన గ్రామ వ్యవసాయ విస్తర్ణాధికారులకు తేమ శాతాన్ని గుర్తించే మాయిశ్చర్ మిషన్లను అందించి గ్రామాల్లోనే ఈ పరీక్షలు చేయించి పంటను విక్రయాలకు పంపించాలని నిర్ణయించారు. నూతనంగా రూపొందించిన ఈ విధానం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. గ్రామాల్లో ఏఈవోలు తేమశాతాన్ని ధ్రువీకరించి పంపించినా సీసీఐ కేంద్రాల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించి కొర్రీలు పెడతారా..? అనే సందేహాలు రైతులకు కలుగుతుంది. పత్తి జిన్నింగ్పై కుదరని ఒప్పందం సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిల్లాలో గుర్తించిన జిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పండించే అన్ని జిల్లాల్లో సీసీఐ జిన్నింగ్ మిల్లుల యాజమానులతో ఒప్పందం(కాంట్రాక్ట్) కుదుర్చుకుంది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం సీసీఐ నిబంధనల ప్రకారం జిన్నింగ్ చేయలేమని మిల్లుల యజమానులు వెనకడుగు వేశారు. లింట్ సైజు 30.5 మి.మీలు ఉండే విధంగా జిన్నింగ్ ఉండాలని సీసీఐ నిర్ణయించింది. ఇక్కడి జిన్నింగ్ మిల్లుల యజమానులు ఆ సైజుకు అంగీకరించటం లేదు. ఇక్కడ పండించే పత్తిలో విత్తనాలు అధికంగా ఉంటాయని, లింట్ సైజ్ 29.5 మి.మీలుగా నిర్ణయిస్తే జిన్నింగ్ చేస్తామని, లేదంటే మిల్లులను సీసీఐ లీజ్‌కు తీసుకొని నిర్వహించుకోవచ్చని యజమానులు చెబుతున్నారు. దీంతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. సీసీఐ మిల్లుల యజమానులతో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుల్లో, జిన్నింగ్ మిల్లుల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పత్తి విక్రయానికి తెచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాం. మరికొద్ది రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం -
అందరికీ ఆధునిక వైద్యం!
న్యూఢిల్లీ: దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్‌కు శంకుస్థాపనతోపాటు, సఫ్దార్‌జంగ్‌లోని 555 పడకల సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆధునిక వైద్య మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అనవసరంగా హెచ్చించాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని అన్నారు. ఎయిమ్స్‌లోని 300 పడకల పవర్‌గ్రిడ్ విశ్రామ్ సదన్‌ను, ఎయిమ్స్–అన్సారీనగర్–ట్రామా సెంటర్లను కలిపేలా వాహనాలు తిరిగే టన్నెల్‌ను మోదీ ప్రారంభించారు. 9 నెలల్లో 42 లక్షల మంది! గత 9 నెలల్లో దేశవ్యాప్తంగా 42 లక్షల మంది సీనియర్ సిటిజన్లు తమ రైల్వే రాయితీలను స్వచ్ఛందంగా వదులుకున్నారని మోదీ చెప్పారు. దేశంలో నిజాయితీగా ప్రజలు వ్యవహరించే వాతావరణం పెరుగుతోందని ప్రశంసించారు. ‘రైల్వే రాయితీ విషయంలో నేను ఎలాంటి పిలుపునివ్వలేదు. కానీ, రైల్వే శాఖ ఎవరైనా స్వచ్ఛందంగా వదులుకోవచ్చని లబ్ధిదారులకు సూచించింది. గత 8–9 నెలల్లో 42 లక్షల మంది వయోవృద్ధులైన ప్రయాణికులు స్వచ్ఛందంగా తమ రాయితీలను వదులుకున్నారు’ అని అన్నారు. నెలకోరోజు గర్భిణులకు ఉచితంగా చికిత్సనందించాలని వైద్యులను కోరానని.. ఇప్పటివరకు 1.25 కోట్ల మంది గర్భిణులు ఈ పద్ధతిలో ఉచిత చికిత్స పొందారన్నారు. 2016లో మన్‌కీ బాత్ ద్వారా ఇచ్చిన పిలుపుమేరకు.. ప్రతినెలా 9వ తేదీన ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారన్నారు. మంత్రిత్వ శాఖల సమన్వయంతో.. ప్రతి భారతీయుడికీ తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యం అందించడం, రోగాలకు కారణమవుతున్న సమస్యలను అంతం చేయడం కోసం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వైద్య శాఖతోపాటుగా గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆయుష్ శాఖలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’లోని రెండు ప్రధాన పిల్లర్ల గురించి మోదీ వివరించారు. మొదటిది.. 1.5లక్షల సబ్–సెంటర్లను హెల్త్, వెల్నెస్ సెంటర్లుగా మార్చడం ద్వారా క్షయ, కుష్టు, మధుమేహం, రక్తపోటు, కొన్ని (రొమ్ము, నోటి, గర్భాశయ) కేన్సర్లను గుర్తించడం. రెండోది.. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల బీమా సదుపాయం (ఒక్కో కుటుంబానికి). మరోవైపు, ఎయిమ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి మోదీ వాకబు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ శౌర్య’(ఆదీవాసీ వికాస్ విభాగ్)లో భాగంగా ఎవరెస్టును అధిరోహించిన 10 మంది గిరిజన విద్యార్థులు కలుసుకున్నారు. వచ్చేవారం మద్దతు ధర పెంపు వరి సహా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వచ్చేవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరకుకు తగిన మద్దతుధరను వచ్చే రెండు వారాల్లో ప్రకటిస్తామని.. 2017–18 ధర కంటే ఇది మెరుగ్గానే ఉంటుందని మోదీ వెల్లడించారు. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, పంజాబ్‌ల నుంచి వచ్చిన 140 మంది చెరకు రైతులతో సమావేశం సందర్భంగా ప్రధాని ఈ హామీ ఇచ్చారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా చక్కెర మిల్లులకు రూ.8,500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, పదిరోజుల్లో వివిధ రాష్ట్రాల రైతులతో మోదీ సమావేశం కావడం ఇది రెండోసారి. -
15 వేల కోట్లతో మద్దతు ధరకు యోచన
న్యూఢిల్లీ: పంటకు కనీస మద్దతు ధర లభించేలా చేసేందుకు ప్రభుత్వం త్వరలో ఓ కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 12 నుంచి 15 వేల కోట్ల రూపాయల వరకు వ్యయమవ్వొచ్చని అంచనా వేస్తోంది. ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలకు పెట్టుబడి కంటే 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండేలా చేస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ తాజా బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకోసం నీతి ఆయోగ్ త్వరలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో ఓ సమావేశం నిర్వహించనుంది. కనీస మద్దతు ధర విషయంలో రైతులకు లబ్ధి చేకూర్చేలా తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను ఆ సమావేశంలో చర్చించనున్నారు. -
చెరకుకు రూ. 2,900 మద్దతు ధర
చెల్లూరు సుగర్స్ జీఎం వెల్లడి చెల్లూరు (రాయవరం): మండలంలోని చెల్లూరు సర్వారాయ చక్కెర కర్మాగారం చెరకు సరఫరా చేసే రైతులకు మద్దతు ధరను ప్రకటించింది. ఈ విషయాన్ని సర్వారాయ చక్కెర కర్మాగారం జనరల్ మేనేజర్ జి.కోటేశ్వరరావు గురువారం విలేకరులకు తెలిపారు. 2016–17 సీజ¯ŒSకు కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధర టన్నుకు రూ.2,300 ప్రకటించిందన్నారు. అయితే రైతుల సంక్షేమాన్ని, వారి అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు పన్నుతో కలిపి టన్నుకు రూ.2,900 ఇవ్వనున్నట్టు తెలిపారు. 2016–17 సీజ¯ŒSకుగాను 2017 జనవరి 15వ తేదీ వరకు టన్నుకు రూ.2,825 వంతున కొనుగోలు చేస్తామని, 2017 జనవరి 16 నుంచి పరిశ్రమకు చెరకు సరఫరా చేసే రైతులకు కొనుగోలు పన్నుతో కలిపి టన్ను ఒక్కింటికి రూ.2,900 వంతున చెల్లించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. చెరకు సరఫరా చేసేందుకు అయ్యే రవాణా చార్జీలకు పరిశ్రమ ప్రకటించిన రాయితీ దీనికి అదనంగా చెల్లిస్తామని తెలిపారు. 2016–17 సీజ¯ŒSకు చెరకు నాటే రైతులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒక ఎకరానికి 4టన్నుల విత్తనం లేదంటే రూ.10వేల నారు మొక్కలు ఉచితంగా ఇస్తామన్నారు. రసాయనిక ఎరువులు వడ్డీలేని రుణం కింద ఇస్తామన్నారు. జీవన ఎరువులు ఎకరానికి ఆరు బస్తాలు వడ్డీలేని రుణం కింద ఇవ్వనున్నట్టు తెలిపారు. చెరకు తోటలో వచ్చే కీటకాలు, తెగుళ్ల నివారణకు క్రిమి సంహారక మందులను కొంత సబ్సిడీ మీద మిగిలిన మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇస్తామన్నారు. పరిశ్రమ పరిధిలోని రైతులు ఫ్యాక్టరీ ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు ఉపయోగించుకుని చెరకు సాగును విరివిగా చేపట్టాలని కోరారు.