swachha bharath
-
మురికిగుంట ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: ‘మీరు మాకు ఓటేయండి.. మేము మీకు మలేరియా, డెంగ్యూ లాంటివి ఇస్తాం’ ఇదీ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల పేరిట వెలిసిన పోస్టర్లు. నడివీధిని మురుగు నీరు ముంచెత్తి, బహిరంగ చెరువును తలపిస్తున్న దృశ్యాన్ని నిరసిస్తూ ఓ రొబోటిక్ ఇంజినీర్ తన నిరసనను ఇలా వ్యక్తం చేశారు. ‘ఓపెన్ ఎయిర్ సీవేజ్ లేక్’ ప్రారంభోత్సవం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎంపీ మీనాక్షి లేఖి, ఎమ్మెల్యే శివచరణ్‌లను ఆయన ఆహ్వానించారు. ముందుగా చెప్పుకున్న పోస్టర్లలో వీరిద్దరి ఫొటోలు చేర్చారు. అసలే ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతున్న కార్యక్రమమంటే మాటలా? దీంతో దుర్గంధభరిత పరిసరాల్ని శుభ్రం చేసే పని మొదలైంది. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ప్రజాపనుల విభాగం ట్రక్కులు ఒక దాని వెనక మరొకటి వచ్చి మురుగు నీటిని తొలగించి అక్కడి డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టారు. ఎన్నికల సమయం కూడా కావడంతో సమస్య త్వరగా పరిష్కారమైందని అంటున్నారు ఆ ఇంజినీర్ తరుణ్ భల్లా. ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ‘హింసాత్మక మార్గంపై నాకు ఆసక్తి లేదు. అలాగే, మునిసిపల్ అధికారుల చేతికి గ్రీజు అంటించాలని కూడా అనుకోలేదు. ఓ సామాన్యుడిగా ఇతరుల మద్దతు కూడగట్టడమే నా బలం’ అని సమస్య పరిష్కారం సందర్భంగా తరుణ్ వ్యాఖ్యానించారు. శుభ్రంగా మారిన రోడ్డు -
గాంధీజీ కలను నిజం చేద్దాం
న్యూఢిల్లీ: స్వచ్ఛతా ఉద్యమంలో పాలుపంచుకునేవారు వారు గాంధీజీకి నిజమైన వారసులుగా నిలిచిపోతారని, జాతిపిత కలైన స్వచ్ఛ భారత్‌ను నిజం చేసేలా ప్రజలు పునరంకితం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. ఒంటరిగా ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించలేదని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. ‘స్వచ్ఛతా హీ సేవ’(స్వచ్ఛతే సేవ) ప్రచార ఉద్యమాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు. వచ్చే నెల అక్టోబర్ 2 వరకూ ఇది కొనసాగుతుంది.పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశ ప్రజల్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 2, 2015న స్వచ్ఛతా సేవను ప్రధాని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు మత, ఆధ్యాత్మిక గురువులు, పలువురు ప్రముఖులతో దాదాపు రెండు గంటలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సంభాషించారు. అనంతరం ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని బీఆర్ అంబేడ్కర్ స్కూల్లో పరిసరాల్ని చీపురు పట్టి శుభ్రం చేశారు. 4.5లక్షల గ్రామాలు బహిర్భూమి రహితం ‘స్వచ్ఛ భారత్ ప్రాజెక్టు వల్ల గత నాలుగేళ్లుగా దేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు 40 నుంచి 90 శాతానికి విస్తరించాయి. సమాజంలోని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కేవలం నాలుగేళ్లలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 450 జిల్లాలు, 4.5 లక్షల గ్రామాలు బహిర్భూమి రహితంగా మారడాన్ని మీరు ఊహించారా? ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని ప్రధాని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2, 2018 నాటికి దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్ బహిర్భూమి∙రహిత రాష్ట్రంగా మారనుందని స్వచ్ఛ భారత్ సర్వే వెల్లడించిందని గుర్తు చేశారు. ‘అక్టోబర్ 2019 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ 1.36 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం’ అని యోగి పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ ప్రభు త్వం చేపట్టిన చర్యల్ని మోదీ ప్రశంసించారు. మీడియా కృషిని ప్రశంసించిన ప్రధాని ప్రజల జీవన ప్రమాణాల్ని మెరగుపర్చడంలో స్వచ్ఛత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ‘పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వల్ల మూడు లక్షల మంది ప్రాణాల్ని కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. డయేరియా కేసులు 30 శాతం తగ్గుతాయి’ అని ఆయన వెల్లడించారు. అస్సాం, కేరళ, తమిళనాడు, బిహార్, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా రాష్ట్రాల ప్రజలతో మోదీ సంభాషించారు. కశ్మీర్‌లోని లేహ్ ప్రాంతంలో ప్యాంగాంగ్ సరస్సు శుద్ధిలో పాలుపంచుకుంటోన్న టిబెట్ సరిహద్దు పోలీసు బలగాలతో పాటు పట్నా సాహిబ్ గురుద్వారాకు చెందిన సిక్కు మతపెద్దలు, అజ్మీర్ షరీఫ్ దర్గాకు చెందిన ముస్లిం మతగురువులు, దైనిక్ జాగరణ్ మీడియా గ్రూపు సిబ్బందితో మోదీ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ప్రచారంలో వార్తా పత్రికలు, చానళ్లు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీలకు ప్రశంసలు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక వేత్త రతన్‌టాటాలు కూడా ప్రధానితో సంభాషించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ చేస్తున్న ప్రయత్నాల్ని కొనియాడారు. అలాగే తమిళనాడులో స్వచ్ఛ భారత్ ప్రచారంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పాలుపంచుకోవడాన్ని అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫరీదాబాద్‌లో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పట్నాలో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగాయి. -
ఉపాధి హామీలో ఘన వ్యర్థాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా ప్రతి 1000 మంది జనా భాకు 5 లక్షల చొప్పున ఖర్చు పెడతారు. ఈ పనిలో పాలుపంచుకున్న పారిశుధ్య కార్మికులు ఎంత సమయం పని చేయాలి, వారికి ఎంత వేతనం చెల్లించాలనే వివరా లను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ పనులకు నిధు లు సమకూర్చే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. -
దేశం గర్వపడేలా చేశారు..!
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నాలుగు మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా సహా.. సైనా, సింధు తదితర క్రీడాకారులను ఆయన ప్రశంసించారు. ఆటగాళ్ల నిరంతర శ్రమకు ప్రతిఫలమే ఈ ఫలితాలన్నారు. మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి మోదీ మాట్లాడారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలకు ముందే.. దేశ స్వచ్ఛతపై నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు యువత నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇందుకోసం వేసవి సెలవుల్లో ప్రభుత్వం చేపట్టిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. నీటి సంరక్షణ, వాజ్‌పేయి జై విజ్ఞాన్ నినాదం తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మహ్మద్ ప్రవక్తను, బుద్ధ పౌర్ణిమ నేపథ్యంలో గౌతమ బుద్ధుడిని గుర్తుచేసుకున్నారు. క్రీడాకారులకు అభినందనలు కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఎక్కువ పతకాలు సాధించిన మహిళా క్రీడాకారులు చూపిన పోరాటపటిమను ప్రధాని ప్రశంసించారు. పతకాలు సాధించిన తర్వాత త్రివర్ణపతాకాన్ని భుజాన వేసుకుని జాతీయగీతాలాపన వింటుంటే గర్వంగా ఉంటుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు క్రీడాకారులు తనతో పంచుకున్నారన్నారు. బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణుల (సైనా నెహ్వాల్, పీవీ సింధు) మధ్యే పోటీ నెలకొన్నా.. మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి పెరిగిందన్నారు. ‘గత నెల మన్‌కీ బాత్‌లో దేశ ప్రజలందరినీ.. ‘ఫిట్ ఇండియా’లో పాల్గొనాలని కోరాను. అనారోగ్యం దరిచేరకుండా నిరోధించేందుకు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. సినీనటుడు అక్షయ్ కుమార్ సహా చాలా మంది.. ఫిట్నెస్ అవసరాన్ని తెలుపుతూ వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారు. అందరికీ కృతజ్ఞతలు’ అని మోదీ తెలిపారు. ఫిట్‌గా ఉండటం, మానసిక, శారీరక సంతులకోసం యోగా చాలా ప్రత్యేకమైందన్నారు. రంజాన్, బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు ఉపవాసం ఉండటం ద్వారా ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకోవచ్చని, దాహంగా ఉన్నప్పుడే ఇతరుల దాహం అర్థమవుతుందన్న మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మే 15నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా దేశవాసులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని.. ఈ విలువలే నేటి ప్రపంచానికి చాలా అవసరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా తన ఆలోచనల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పదాలను కూడా బుద్ధ భగవానుడి బోధనలనుంచే గ్రహించినట్లు చెప్పిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. మే 29న బుద్ధ పౌర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో మే 11న (బుద్ధ పౌర్ణిమ) నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్వహించిన అణుపరీక్షలను మోదీ గుర్తుచేశారు. నవభారత నిర్మాణం కోసం జై జవాన్, జై కిసాన్లతోపాటు వాజ్‌పేయి సూచించిన ‘జై విజ్ఞాన్’ నినాదంలోని అంతరార్థాన్ని నేటి యువత గుర్తించాలని ప్రధాని కోరారు. మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వచ్ఛత కోసం ఇంటర్న్‌షిప్ వేసవి సెలవుల్లో ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా నిర్వహిస్తున్న ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్–2018’ కార్యక్రమంలో పాల్గొనాలని యువతను కోరారు. తద్వారా సమాజంతో మమేకమవటంతోపాటు సానుకూల మార్పు తీసుకురావటంలో భాగస్వాములం అవుతామన్నారు. ఇందులో పాల్గొన్న యువతకు సర్టిఫికెట్లు ఇస్తారని.. ఇందులో రాణించిన వారికి యూజీసీ రెండు క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తుందన్నారు. ‘మైగవ్’ యాప్ ద్వారా ఇంటర్న్‌షిప్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. మన పూర్వీకులు కూడా జల సంరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టారని.. పలు దేవాలయాల్లో ఇప్పటికీ ఈ శాసనాలను గమనించవచ్చన్నారు. మూడున్నరేళ్లలో జల సంరక్షణకు రూ. 35వేల కోట్లు వెచ్చించామన్నారు. దీని ద్వారా కోటిన్నర ఎకరాల భూమికి మేలు జరిగిందన్నారు. -
125 కోట్ల ప్రజల ఆత్మగౌరవమే రైజింగ్ ఇండియా!
న్యూఢిల్లీ: రైజింగ్ ఇండియా అంటే ఆర్థిక వ్యవస్థ, జీడీపీ, విదేశీ పెట్టుబడులు మొదలైనవి మాత్రమే కాదని.. రైజింగ్ ఇండియా అంటే 125కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజలు మద్దతుగా నిలుస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ‘న్యూస్ 18’ గ్రూప్ ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ప్రధాని ప్రసంగించారు. నోట్లరద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు. తమ ప్రభుత్వ విజయాలతోపాటు రాబోయే కాలంలో తమ లక్ష్యాలను ఈ ప్రసంగంలో మోదీ వెల్లడించారు. ‘చాలా తక్కువ సమయంలోనే స్వచ్ఛభారత్ మిషన్ ఓ ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలు నగదురహిత లావాదేవీలను ఓ ఆయుధంగా మలుచుకున్నారు. ప్రజల మద్దతు కారణంగానే మా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోగలిగింది. ప్రజలు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం ఓ సానుకూల మార్పు దిశగా వెళ్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘నేడు దేశవ్యాప్తంగా 13కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లున్నాయి. నాలుగేళ్లలో దేశంలో పారిశుద్ధ్య పరిధి 38 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది’ అని మోదీ వెల్లడించారు. ఉజ్వల జీవితానికి..: ‘ఉజ్వల పథకం ద్వారా పేదల వంటింట్లో వెలుగులతోపాటు కోట్ల కుటుంబాల్లో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. భారత్ అభివృద్ధి చెందేందుకు అందరూ సమానమనే భావన రావాలి. అందుకే అసమానతలను రూపుమాపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని మోదీ అన్నారు. ‘యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్’ అనేది తమ నినాదమని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం దృష్టిలో తూర్పు రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఇతర రాష్ట్రాలూ ఉన్నాయన్నారు. అస్సాంలో 31 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్యాస్ క్రాకర్ ప్రాజెక్టును తాము అధికారంలోకి రాగానే ప్రారంభించామన్నారు. వైద్య సమస్యల పరిష్కారం: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మెడికల్ సీట్లను గణనీయంగా పెంచాం. ప్రతి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనుకుంటున్నాం. ప్రతి పంచాయతీని ఆరోగ్యంగా మార్చటం మా లక్ష్యం. మన తల్లులు, చెల్లెళ్ల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వ ప్రాధాన్యత’ అని ప్రధాని తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా 3వేలకు పైగా పబ్లిక్ హెల్త్ క్లినిక్‌లు ప్రారంభమయ్యాయన్నారు. రూ. లక్షకోట్లతో విద్యారంగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. నాడు కొరత.. నేడు మిగులు: ‘అంతకుముందు, పునరుత్పాదక విద్యుత్ విభాగానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందో తెలిసేది కాదు. దీని ద్వారా చాలా సమస్యలు తలెత్తేవి. కానీ ఆ పరిస్థితిని అధిగమించి నేడు మిగులు విద్యుత్‌తో దూసుకెళ్తున్నాం. ఒక దేశం–ఒక గ్రిడ్ స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. ‘స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలోని 18వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. మేం 16వేల గ్రామాలకు ఇప్పుడు వెలుగులు తీసుకొచ్చాం’ అని నరేంద్రమోదీ వెల్లడించారు. నాలుగేళ్లుగా భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాల కారణంగా ప్రపంచదేశాలపై భారత్ ప్రభావం పెరిగింది. యెమెన్‌లో సంక్షోభం తలెత్తినపుడు.. అక్కడున్న భారతీయులతోపాటు 48 దేశాల ప్రజలను మనం క్షేమంగా బయటకు తీసుకొచ్చాం. ఆర్థిక వ్యవస్థపై..: ‘భారత్ తన సంకెళ్లను తెంచుకుని 21వ శతాబ్దంతో పోటీపడి ముందుకెళ్తోందని ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన భాగస్వామ్యం గతంతో పోలిస్తే ఏడురెట్లు పెరిగింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత్ గురించి సానుకూలంగా చర్చిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తొలి రెండు దేశాల్లో మనం ఉన్నాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గతంలో సానుకూల వాతావరణం ఉండేది కాదు. కానీ కొన్ని నిబంధనలను సరళీకరించటంతో ఎఫ్‌డీఐల ప్రవాహం పెరిగింది’ అని ప్రధాని తెలిపారు. క్షేత్రస్థాయికి పరిశోధనలు ఇంఫాల్: ప్రజలకు మరింత మేలుకలిగేలా పరిశోధనల పరిధిని విస్తృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రయోగశాలలనుంచి క్షేత్రస్థాయికి ఈ పరిశోధనలు మారాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ని పునర్నిర్వచించి.. దేశాభివృద్ధికి ప్రయోగాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన అనంతరం శాస్త్రవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. శాస్త్ర, సాంకేతికతను కనుగొనటం, వినియోగించటంలో భారత్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. ఫలితాలు సామాన్యుడికి అందేలా: సాంకేతికత ద్వారా విద్య, వైద్యం, బ్యాంకింగ్ తదితర రంగాల్లో పౌరులకు మరింత విస్తృతమైన సేవలందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ‘శాస్త్ర, సాంకేతికత ద్వారా ఇప్పటికీ చేరుకోలేని వర్గాలను చేరుకోవటం’ అనేది ఈసారి సైన్స్ కాంగ్రెస్ ఇతివృత్తం. ‘మన చిన్నారులకు ప్రయోగశాలనను అందుబాటులోకి తీసుకురావాలి. పాఠశాల విద్యార్థులతో శాస్త్రవేత్తలు తరచూ సంభాషించే వ్యవస్థను రూపొందించాలని కోరుతున్నాను. ఒక్కో శాస్త్రవేత్త.. ఏడాదిలో 100 గంటల సమయాన్ని కనీసం 100 మంది 9–12 తరగతుల విద్యార్థులతో గడిపి వారిని ప్రోత్సహించాలి’ అని ప్రధాని కోరారు. భారతీయ సైన్స్ కాంగ్రెస్ సభలకోసం ముందుగా నిర్ణయించుకున్నట్లుగా హైదరాబాద్ కాకుండా చివరి నిమిషంలో ఇంఫాల్‌కు మారటంతో డెలిగేట్ల సంఖ్య పలుచగా కనిపించింది. -
ఘనవ్యర్థాల నిర్వహణకు ‘గోబర్ ధన్’
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్’కింద 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే ఘనవ్యర్థాల నిర్వహణ కోసం గోబర్–ధన్ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని మరుగుదొడ్లు నిర్మిస్తామని గురువారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటికే 6 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు జైట్లీ పేర్కొన్నారు. దీంతో దేశంలోని మహిళల గౌరవం, బాలికల విద్య.. మొత్తంగా కుటుంబ ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. భారత్‌ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చే లక్ష్యంలో భాగంగా గోబర్–ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రిసోర్సెస్ ధన్) కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పశువుల పేడ, ఘన వ్యర్థాలను కంపోస్ట్, ఎరువులు, బయోగ్యాస్‌లా మార్చడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. -
ప్రజల మద్దతుతోనే స్వచ్ఛత
స్వచ్ఛ సర్వేక్షణ్’ కార్యక్రమంలో వెంకయ్య సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ కార్యక్రమాలు ప్రజల మద్దతుతోనే విజయవంతమవుతా యని, కేవలం పీఎం, సీఎం, మంత్రుల వల్ల పరివర్తన రాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దీన్ని గుర్తించే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌ను రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చార న్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్.. వావ్ హైదరాబాద్’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... రాజకీయ నాయకులు పారదర్శకతతో ఉంటే ప్రజలు మద్దతిస్తారన్నారు. నిధుల కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్థానిక సంస్థలే సమకూర్చుకోవాలని, అందుకు గానూ పన్నులు వేయడం అవసరమన్నారు. అయితే... సదుపాయాలు కల్పించాక జరిమా నాలు వేస్తే ఫర్వాలేదు కానీ, అవి లేకుండానే వేస్తే సమయం వచ్చినప్పుడు ప్రజలు రాజకీయ నాయకులకు ఫైన్లు వేస్తారన్నారు. తాత్కాలిక దృష్టితో కాకుండా 25 సంవ త్సరాలకు సరిపడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. స్వచ్ఛాగ్రహిలు కావాలి... ‘స్వచ్ఛ కార్యక్రమం కోసం నాడు స్వాతంత్య్ర సమయంలో సత్యాగ్రహం మాదిరిగా నేడు ప్రజలంతా స్వచ్ఛాగ్రహిలుగా మారాలి. చెత్త తొలగించే పని కూడా ప్రభుత్వానిదేనని భావించరాదు. స్వచ్ఛభారత్‌కు బాగా కృషి చేసే కార్పొరేటర్లకు 10శాతం నిధుల్ని ప్రోత్సా హకంగా ఇస్తాం. పనిచేయని వారికి 10 శాతం తగ్గిస్తాం’ అని వెంకయ్యనాయుడు చెప్పారు. మార్పు అంటే కేవలం మ్యాపుల్ని మార్చడం కాదని, ప్రక్షాళన చేయడమని, ప్రధాని మోదీ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారన్నారు. తొలుత మనసులు పరిశుభ్రమైతే.. తర్వాత భాగ్య నగరం శుభ్రమవుతుందన్నారు. జనాకర్షక పథకాలతో సమస్యలు పరిష్కారం కావని, ప్రజల శక్తిసామర్థా్థ్యలను వినియోగించి ఉత్పాదక శక్తి పెంచాలని పిలుపునిచ్చారు. మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... చెత్త నుంచి విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించేలా సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల విరాళాలు.. స్వచ్ఛ కార్యక్రమాల అమలుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రామ్కీ సంస్థ రూ.2 కోట్లు, కామినేని కోటి రూపాయల విరాళాలు అందజేశాయి. ఈసారి టాప్–5లో... రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛహైదరాబాద్ అమలుకు ఏ నగరం చేయని విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ఏడాది స్వచ్ఛ ర్యాంకుల్లో 19 స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈసారి తొలి ఐదు స్థానాల్లో నిలవగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణలోని 73 యూఎల్బీల్లో నూ స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సమావేశంలో పలువురు మంత్రులు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ్ భారత్‌కు నటుడు నరేష్ తోడ్పాటు
హిందూపురం : స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు నరేష్ తనవంతు సహకారంతో ముందుకు వచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో మోడల్ పార్క్ ఏర్పాటు కోసం రూ.25 వేలు విరాళంగా అందించారు. శుక్రవారం హిందూపురంలోని తన నివాసంలో నరేష్ స్వచ్ఛ్ భారత్ పట్టణ కమిటీ సభ్యుడు గోపికి రూ.25 వేల చెక్కును అందజేశారు. -
‘స్వచ్ఛ భారత్’కు సవరణ అవసరం
పరిశుభ్రత విషయంలో ప్రజలు తమ అపరాధాన్ని అంగీకరించేలా చేయడం వరకు ప్రధాని నరేంద్ర మోదీ చేసింది సరైందే. అయితే బహిరంగ స్థలాల పరిశుభ్రతపై మాత్రమే దృష్టి పెట్టడం తప్పు. వ్యక్తులు చెత్త వేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. సాంస్కృతికపరమైన ఈ అలవాటు ఇకపై కొనసాగకుండా చర్యలు చేపట్టాలి. ఇతరులు ఏం చేస్తున్నా సరే.. మనం మాత్రం చెత్త వేయకూడదన్నది జాతి నేర్చుకోవాల్సిన పాఠం. అవలోకనం మన దేశం మాదిరే, థాయ్‌లాండ్‌లో అనేక కార్లలోని డాష్ బోర్డుల్లో, శుభం కలగడానికి అదృష్టదేవత చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటారు. అయితే థాయ్ కార్లలోని విగ్రహాలు భారత్‌లో లాగా కారు లోపలికి కాకుండా రోడ్డుకు అభిముఖంగా తమ ముఖాలను ప్రదర్శిస్తుంటాయి. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ‘నేను సురక్షితంగా ఉం డేలా చూడు’ అనేలా మన ప్రవృత్తి ఉం టుంది. ‘ఎవరూ గాయపడకుండా ఉండేలా రోడ్డును గమనించు’ అన్నది థాయ్ ప్రజల వైఖరి. థాయ్‌లాండ్ పరిశుభ్రమైన దేశం. సాపేక్షంగా అది పేద దేశమే అయినప్పటికీ (నిజానికి భారత్‌లాగే పేద దేశం) వారి బహిరంగ స్థలాలు పరిశుభ్రంగా ఉంటాయి. నేడు వారి బహిరంగ మరుగు దొడ్లు దాదాపుగా మచ్చలేని విధంగా ఉండటమే కాదు.. యూరోపి యన్ దేశాల కంటే మంచిగా... ఒక్కోసారి వాటికంటే ఉత్తమంగా కూడా ఉంటాయి. బ్యాంకాక్‌లోని వీధులకు, ముంబై, ఢిల్లీ వీధు లకు, అలాగే ఢాకా, లాహోర్, కరాచీ నగరాల్లోని వీధులకు మధ్య కూడా ఏమాత్రం పోలిక ఉండదు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం (అంటే ఆర్థికవ్యవస్థ మాత్రమే కాదు.. ఇప్పటికీ ఆదిమ స్వభావంతో ఉంటున్న నాగరికత, సంస్కృతి కూడా ‘అభివృద్ధి’ చెందవలసి ఉంది). థాయ్‌లాండ్ అభివృద్ధి చెందిన దేశం. దీనికి వారు అనుసరిస్తున్న బౌద్ధ మతంలోని హీనయాన శాఖ కూడా ఒక కారణమని నేనంటాను. దీన్ని తెరవాద అని కూడా పిలుస్తారు. తెరవాద శాఖను పాటిస్తున్న శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్, కాంబోడియా, బర్మా వగైరా దేశాలన్నీ ఒకరకమైన ఏకత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇది ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రయత్నమైన స్వచ్ఛ భారత్ కార్యక్రమం (క్లీన్ ఇండియా మిషన్) అనే అంశాన్నే నేను ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నాను. ఈ వారం ములాయం సింగ్ యాదవ్ కోడలు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. స్వచ్ఛ భారత్‌పై మోదీ వైఖరిని మహాత్మాగాంధీతో ఆమె పోల్చి చూపారు. ఆమెతో నేను ఏకీభవిస్తాను. ప్రధాని ఒక గాంధియన్ తత్వాన్ని ఆచరిస్తున్నారని భావిస్తున్నాను. నిజానికి గాంధీజీ కూడా మోదీ ప్రయత్నాన్ని ఆమోదించేవారు. అయితే మోదీ మనస్సులో ఈ ఆలో చన కొత్తది కాదన్నది వాస్తవం. ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రభావశీల నేత ఎం.ఎస్ గోల్వాల్కర్ జీవిత చరిత్రను రచించిన సందర్భంలో మోదీ ఒక పిట్టకథని జోడించారు. ఒకసారి గురూజీ (గోల్వాల్కర్) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లా రు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ఉదయం 4 గంటల 30 నిమి షాలకు చేరుకుంది. అక్కడ అది 45 నిమిషాలు ఆగింది. ఆ సమ యంలో స్వయంసేవకులు గురూజీ, రైలు లెట్రిన్‌ను ఉపయోగిం చుకునేందుకు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి సీనియర్ స్వయంసేవక్ అయిన బాపూరావ్ మోఘేతో మాట్లాడుతూ ఆ రోజు కార్యక్రమం ఏమిటని గురూజీ అడిగారు. కార్యక్రమ వివరాలను గమనించిన గురూజీ తర్వాత బాపూరావ్ని ఒక ప్రశ్న అడిగారు, రైలు టాయ్లెట్లలో ఒక చిన్న నోటీసున యినా మీరు గమనించారా? చూశానన్నారు బాపూరావు. గురూజీ అప్పుడన్నారు. ‘రైలు ఒక స్టేషన్లో ఆగి ఉన్నప్పుడు లెట్రిన్‌ను ఉపయోగించవద్దని అక్కడ రాసి ఉంది. నేను ఈ నిబం దనను అన్ని వేళలా తప్పకుండా పాటిస్తాను’. ఈ పిట్టకథను ప్రస్తావించిన మోదీ దానికి మరో ప్రశ్నను జోడించారు. ‘ఎన్ని లక్షలమంది ప్రయాణికులు ఈ నోటీసును చూసి ఉంటారో కాస్త ఊహించండి. వాస్తవానికి వీరిలో ఎంతమంది దీన్ని పాటించి ఉంటారు’? స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మోదీ ఒక ప్రతిజ్ఞ రూపొందించారు. దాని ద్వారా ఇతరులు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘నేను ఈ ప్రతిజ్ఞను స్వీకరిస్తున్నాను. పరిశుభ్రతకు నేను కట్టు బడి ఉంటాను. దీనికోసం సమయాన్ని కేటాయిస్తాను. పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి నేను సంవత్సరా నికి 100 గంటలు కేటాయిస్తాను అంటే వారానికి రెండు గంటలన్న మాట. నేను చెత్త వేయను, ఇతరులను వేయనీయను. నేనూ, నా కుటుంబం, నా నివాస ప్రాంతం, నా గ్రామం, నా పనిస్థలం అన్ని చోట్లా పరిశుభ్రత కోసం ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను’’. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే పలు దేశాల్లో అక్కడి పౌరులు చెత్త పారవేసే చర్యలను చేపట్టకపోవడం, ఇతరులు చెత్త పోయడాన్ని అనుమతించకపోవడం వల్లే అది సాధ్యమైందని నా విశ్వాసం. ఈ దృఢవిశ్వాసంతోటే, గ్రామాల్లో, పట్టణాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమ సందేశాన్ని నేను ప్రచారం చేస్తాను. ఈ రోజు నేను స్వీకరిస్తున్న ఈ ప్రతిజ్ఞను స్వీకరించవలసిందిగా వందమంది వ్యక్తులను నేను ప్రోత్సహిస్తాను. పరిశుభ్రత కోసం తమ వంద గంటలను వారు కేటాయించేలా ప్రయత్నాలు చేపడతాను. ప్రస్తుతం జరుగుతున్న ముఖ్యమైన పని ఏమిటంటే, ఇతరులు కూడా ఈ ప్రతిజ్ఞను స్వీకరించేలా చేయడం, (మోదీ పలువురు సెలబ్రిటీలను ఇలా పురమాయించారు) అలాగే కొన్ని బహిరంగ స్థలాలను శుభ్రపర్చేందుకు సమయాన్ని కేటాయించేటట్లు చేయ డం. భారత్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి చేయవలసిన అనేక పనుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పొందుపర్చింది. ఆ వివరాలు పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్సైట్లో ఉన్నాయి. మోదీ అవలంబించిన విధానం పట్ల నాకు కొంత భేదాభిప్రా యం ఉంది. ప్రజలు తమ అపరాధాన్ని అంగీకరించేలా చేయడం వరకు ఆయన చేసింది సరైందే. అయితే తర్వాత బహిరంగ స్థలాలను పరిశుభ్రపర్చడంపై దృష్టి పెట్టడం తప్పు. వ్యక్తులు చెత్త వేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. సాంస్కృతికపరమైన ఈ అలవాటు ఇకపై కొనసాగకుండా చర్యలు చేపట్టాలి. బహిరంగ స్థలాల్లో చీపుర్లు పట్టి ఫొటోలు తీయడం వెనుక, భారత్‌ను మురికి దేశంగా మారుస్తున్నది ఇతరులే అనే సందేశం వ్యక్తమవుతోంది. దీని నుంచే, ‘కాబట్టి బహిరంగ స్థలాలను పరిశు భ్రం చేయడంలో నేను సహాయం చేయాలి’ అనే భావనవస్తోంది. దీన్ని మనం మార్చాలి. ఈసారి విగ్రహం మనవైపే చూస్తుం డాలి కాని రోడ్డుకు అభిముఖంగా కాదు. ఇతరులు ఏం చేస్తున్నా సరే.. మనం మాత్రం చెత్త వేయకూడదు. ఇది జరిగినట్లయితే, మోదీ ప్రారంభించిన మంచి ప్రయత్నం మరింత ఉత్తమంగా విజయవంతమవుతుంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్