సత్యమార్గంలో సాగండి
కర్నూలు(న్యూసిటీ) : ప్రతి ఒక్కరూ భగవన్నామ స్మరణ చేస్తూ సత్యమార్గంలో నడవాలని స్వామి సుందర చైతన్యానందులు భక్తులకు పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శుక్రవారం రాత్రి సుందర సత్సంగ ఆధ్వర్యంలో 232వ జ్ఞానయజ్ఞం ఆరవ రోజు భాగవతంలోని శ్రీకృష్ణుని లీలల్లో కాళీయమర్థనం, గోవర్ధనగిరి అంశాలపై స్వామీజీ భక్తులకు ఉపదేశించారు. తార్కికంగా ఆలోచించి పనిచేస్తేనే విజయం సిద్ధిస్తుందన్నారు.కార్యక్రమంలో సుందర సత్సంగ్ కమిటీ అధ్యక్షుడు వేముల నాగేశ్వరరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.