దేశభక్తి చాటేందుకే తిరంగా యాత్ర
రైలుపేట : స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో సోమవారం బీజేపీ నగరశాఖ, జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కార్యక్రమం జరిగింది. లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆకుల సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ కంభంపాటి హరిబాబు, బీజేపీ ఏపీ ఇన్చార్జి సిద్దార్ధనా«ద్ సింగ్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ఉన్న స్వాతంత్య్ర ఉద్యమకారులు, జాతినేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ ప్రజల్లో, యువతలో జాతీయ భావాన్ని పెంపొందించి భావిభారత పౌరులను దేశభక్తి వైపు మరలిచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమకారుల స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసేందుకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ ఏపీ ఇన్చార్జి సిద్దార్ధనా«ద్ సింగ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు నలబోతు వెంకటరావు, పార్టీ నేతలు జమ్ముల శ్యామ్‌కిషోర్, శిఖాకొల్లి అభినేష్, చదలవాడ వేణుబాబు, చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు.