thondangi
-
తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, హేచరీలు, బల్క్ డ్రగ్ పార్క్...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. పారిశ్రామిక కారిడార్‌కు ఊతం తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్ఈజెడ్ భూ సేకరణను సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడమనే ప్రక్రియ దేశంలోనే తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాకినాడ తీరంలో ఒక వెలుగు ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చురుగ్గా మేజర్ హార్బర్ పనులు కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ మినీ హార్బర్ స్థానే మేజర్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ప్లాంట్లు కూడా సిద్ధవమతున్నాయి. తీరం వెంబడి... ► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి జీవనోపాధి లభిస్తోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది. ► కాకినాడ ఎస్ఈజడ్లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ) ► పెద్దాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది. ళీ తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్ఫ్యాక్టరీలు, థర్మాకోల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. నమ్మకంతో వస్తున్నారు తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్కుకు భూమిని కేటాయిస్తారు. – దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్ హార్భర్ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్ హార్భర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. –పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం -
తొండంగి తహసీల్దార్‌పై ఏసీబీ విచారణ
తొండంగి (తుని) : తాము కొనుగోలు చేసిన జిరాయితీ భూమికి సంబంధించి ఆన్లైన్ అండగళ్‌లో వివరాలు నమోదు చేసేందుకు తహసీల్దార్ సొమ్ములు డిమాండ్ చేశారని బాధితుడు ఫిర్యాదుపై శనివారం రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సీఐ పి.వి.సూర్యమోహన్ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు. బాధితుడు, రిటైర్డ్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి సంకు వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి... కోన ఫారెస్టు పరిధిలో తన భార్య సంకు గిరిజ పేరున సర్వే నెంబర్ 47/18, 47/19లలో 2.05 ఎకరాల భూమిని 2006లో కొనుగోలు చేసి తుని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించిన వివరాలు జిరాయితీ భూమిగా ఆన్లైన్లోని 1బీ ఫారంలో కూడా నమోదైంది. అంతేకాకుండా అప్పటి రెవెన్యూ అధికారులు గిరిజ యజమానిగా పేర్కొంటూ పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్యం హక్కుపత్రాలను మంజూరు చేశారు. అయితే ఆన్లైన్ అడంగళ్ వివరాలలో సంకు గిరిజ నమోదైనట్టు రాకపోవడంతో ఆన్లైన్ చేయాలని 2016లో దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం పలు దఫాలుగా తిరిగినప్పటికీ తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణ, కంప్యూటర్ సిబ్బంది కూడా పట్టించుకోలేదని, ఆన్లైన్ అడంగళ్ నమోదు చేసేందుకు తహసీల్దార్ రూ.రెండు లక్షలు సొమ్ము డిమాండ్ చేశారంటూ 2016 ఆగస్టులో ముఖ్యమంత్రికి, ఏసీబీ డీజీపీకి, ఇతర అధికారులకు భార్య సంకు గిరిజ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈనేపథ్యంలో రాజమండ్రి ఏసీబీ సీఐ పి.వి.సూర్యమోహన్ తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణను విచారణ చేశారు. ఈవిచారణకు సంకు వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. అయితే కోనఫారెస్టు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులో అసైన్డ్ భూమిగా ఉందని, ఈవిధంగా చాలా మంది భూముల పెండింగ్‌లో ఉన్నాయంటూ తహసీల్దార్ సూర్యనారాయణ ఏసీబీ అధికారి సూర్యమోహన్‌కు వివరణ ఇచ్చారు. 1975 తర్వాత కోనఫారెస్టు అసైన్డ్ భూములను రైతులకు ప్రభుత్వం పట్టాలిచ్చిందన్నారు. ఈ భూములనే ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ) సేకరించిందన్నారు. ఆన్లైన్ అడంగళ్ చేసేందుకు తాను ఎటువంటి సొమ్ములు డిమాండ్ చేయలేదని, వాస్తవంగా ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో ఉన్న విషయాన్నే తెలిపానన్నారు. కలెక్టర్, ఆర్డీవో, డీఆర్వో అధికారులతో చర్చించి ఆన్లైన్ ప్రక్రియపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ పూర్తయిన అనంతరం సూర్యమోహన్ మాట్లాడుతూ తహసీల్దార్‌పై వచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టామన్నారు. విచారణ పూర్తిస్థాయిలో జరిగిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో కూడా భూమి రికార్డుల ప్రకారం సంబం«ధిత భూమి అమ్మిన రైతులను కూడా విచారణ చేస్తామని వివరించారు. కాగా ఇలాంటి సంఘటనపై గతంలో కూడా ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టినట్టు సమాచారం. వరుస ఏసీబీ అధికారుల విచారణలతో రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలైంది. -
తొండంగిలో మళ్లీ 144 సెక్షన్
కాకినాడ: తొండంగి మండలంలో పోలీసులు మళ్లీ 144 సెక్షన్ విధించారు. దివీస్ ఫ్యార్మాస్యూటికల్స్ కంపెనీకి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. గ్రామస్ధులు కంపెనీ స్ధాపనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కాగా, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు ముసలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివీస్ ఫ్యాక్టరీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీపీఎం నేతలతో పాటు మరో 200 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
తుపాను గుప్పెట్లో బోట్లు!
సముద్రంలోనే కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు అనుకున్న సమయానికి తీరం చేరటం కష్టమని బంధువుల ఆందోళన పిఠాపురం : వార్దా తుపాను తీవ్రమవుతున్న తరుణంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన 30 బోట్లు సముద్రంలో చిక్కుకోవడం మత్స్యకార కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ బోట్లలో వేటకెళ్లిన సుమారు 160 మంది వరకు మత్స్యకారులు ఉండడంతో వారి బంధువులు భయపడుతున్నారు. తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం వుందని చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారే తప్ప ఆ హెచ్చరికలు నడిసముద్రంలో ఉన్న మత్స్యకారులకు చేరే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మత్స్యకారులందరి వద్ద సెల్ఫోన్లు ఉన్నా సుదూర ప్రాంతం కావడంతో సెల్ఫోన్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయానికి తప్పక తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తుండగా సుమారు 150 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మత్స్యకారులకు ఆ సమాచారం అంది, వారు వేటను నిలిపివేసి తిరిగి ప్రయాణం అయినా తీరానికి చేరుకోవడానికి సుమారు 24 గంటల నుంచి 36 గంటలు పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుపానులో చిక్కుకునే అవకాశం ఉందని మత్స్యకారుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడలో కడలి కన్నెర్ర తుపాను ప్రభావంతో ఉప్పాడ సమీపంలోని తీరప్రాంతం వెంబడి ఉన్న బీచ్‌రోడ్డు కడలి ఆగ్రహానికి గురై ముక్కలైంది. దీంతో కాకినాడ–ఉప్పాడల మధ్య బీచ్‌రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. శుక్రవారం ఉదయం నుంచి సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. తీరంలో కెరటాలు సుమారు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ తీరప్రాంతాన్ని తీవ్ర కోతకు గురిచేస్తున్నాయి. తీరానికి సమీపంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. బలమైన ఈదురుగాలులు ఈ ప్రాంతంలో మత్స్యకారుల గృహాలను ధ్వంసం చేస్తున్నాయి. అందరికీ సమాచారం అందించే ఏర్పాట్లు చేశాం సముద్రంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులకు ఇప్పటికే సమాచారం అందించాం. చాలాబోట్లు ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నాయి. ఇంకా 30 వరకు బోట్లు ఒడ్డుకు చేరుకోవాలి. అవి శనివారం ఉదయానికి తప్పక చేరుకుంటాయి. మత్స్యకారులకు సంబంధించినంత వరకు అందరి ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సాంకేతికపరమైన పరికరాలతో సమాచారం అందించే ఏర్పాట్లు చేశాం. ఎవరికైనా సమాచారం అందకపోతే తక్షణం చర్యలు తీసుకునే విధంగా మత్స్యఖాధికారులను అప్రమత్తం చేశాం. మత్స్యకార కుటుంబీకులు ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదు. – అంజలి, మత్స్యశాఖ డీడీ, కాకినాడ -
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
తొండంగి (తూర్పు గోదావరి) : రైలు కిందపడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖకు చెందిన అవంతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మణికంఠ(20), కె.దివ్య(20) శుక్రవారం ఉదయం గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తుని ఆర్పీఎఫ్ పోలీసుల సమాచారం మేరకు తొండంగి పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి ఆనవాళ్ల ఆధారంగా వారిద్దరూ ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
32 ఆకుల ధర్మచక్రశిల లభ్యం
తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లి మెట్టపై క్రీస్తుశకం 3వ శతాబ్దం నాటి 32 ఆకుల ధర్మచక్ర శిల బయల్పడింది. ఈ మెట్టపై కొంత కాలం నుంచి పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రెండో విడత తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ ఇక్కడ క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటి బౌద్ధస్థూపావశేషాలు, శిలాశాసనాలు, విగ్రహాలు లభ్యమయ్యాయి. శనివారం నాటి తవ్వకాల్లో సారనాథ్‌లో అశోకుని ధర్మచక్రం లాంటి మరో ధర్మచక్ర శిలాధారం లభ్యమైంది. ఇది ఇక్ష్వాకుల కాలంనాటిదిగా భావిస్తున్నామని పురావస్తుశాఖ సహాయసంచాలకులు పట్టాభిరెడ్డి, సాంకేతిక సహాయకులు వెంకటరావు, తిమ్మరాజు తెలిపారు. అశోకుని ధర్మ చక్రంలో 24 ఆకులు ఉంటే ఈ ధర్మచక్రం 32 ఆకులతో ఉందన్నారు. పాళీ భాషలో త, ద, మ, ర, ఛి, థ, స, ద అక్షరాలతో ఉన్న శిలాశాసనం లభించిందని, దానికి సంబంధించి లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. సమగ్రమైన నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి
తొండంగి (తూర్పు గోదావరి) : సాగునీటి సంఘాల ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లి గ్రామానికి జరగబోయే సాగు నీటి సంఘాల ఎన్నికలకుగాను సోమవారం మధ్యాహ్నం నామినేషన్ వేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల బలగాలను మోహరించారు. -
రెండు లారీలు ఢీ: ఒకరి మృతి
తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం బెండపూడి హైవే పై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీనీ వెనక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఢీకొట్టిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
12 మంది మత్స్యకారులు గల్లంతు
తొండంగి : తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన శనివారం తొండంగి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని హుకుంపేట గ్రామానికి చెందిన 12 మంది రెండు బోట్లలలో శనివార తెల్లవారు జామున చేపల వేటకు వెళ్లారు. అయితే వీరు తిరిగిరాకపోవడంతో మత్య్సకారుల కుటుంబాలకు అధికారులకు సమాచారం అందించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటానికి తోడు వర్షం కురుస్తుడటంతో బాధితుల కుంటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇన్పుట్ సబ్సిడీని రికవరీ చేస్తారా?
తొండంగి, న్యూస్‌లై న్ : ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని కూడా బ్యాంకు అధికారులు రికవరీకి ప్రయత్నించడంపై అన్నదాతలు మండిపడ్డారు. బుధవారం తొం డంగిలోని కార్పొరేషన్ బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వారి వివరాల ప్రకారం.. గతంలో సంభవించిన నీలం తుపాను నష్ట పరిహా రాన్ని ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. ఇలా బ్యాం కుకు సుమారు కోటి రూపాయలు విడుదలయ్యాయి. పరిహారం కోసం తమ ఖాతాల నుంచి సొమ్ము తీసుకునేందుకు రైతులు బ్యాంకుకు వెళ్లగా, అవి పాత బకాయిలకు జమ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో తొండ ంగి, కృష్ణాపురం, శృంగవృక్షం తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మందికి పైగా రైతులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తొండంగి సర్పంచ్ పెదిరెడ్ల సురేష్, వైఎస్సార్ సీపీ నాయకుడు శివకోటి ప్రకాష్, సీపీఐ తుని ఏరియా కోఆర్డినేటర్ శివకోటి రాజు, నాగం నాగబాబు తదితరులు బ్యాంకు అధికారులతో చర్చించారు. ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ ఎక్కువ కావడంతో, వాటిని తీర్చాలని మాత్రమే చెప్పామని బ్యాంకు అధికారులు వివరించారు. బ్యాంకు ఇచ్చిన రుణాలకు, ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సొమ్ముకు సంబంధం ఏమిటని రైతులు నిలదీశారు. ఏ విధమైన ఆంక్షలు లేకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామని బ్యాం కు మేనేజర్ సతీష్ చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. నీలం పరిహారంలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరపాలని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి, వినతిపత్రం సమర్పించారు.