రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయూలు
బెలగాం, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన పాలవలస గంగయ్య రజక వృత్తి చేస్తున్నాడు. ఉతికిన దుస్తులు పార్వతీపురం తీసుకెళ్లి, తిరిగి రిక్షాలో స్వగ్రామం బయల్దేరాడు. మార్గమధ్యంలో పద్మపేరాంటాలు గుడి దాటిన తరువాత వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న అదే గ్రామానికి చెందిన నగిరెడ్డి పోలినాయుడు, ఈదుబిల్లి లకు్ష్మనాయుడు ఢీకొన్నా రు. దీంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యూరుు. దీనిని గమనించిన స్థానికులు వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్సను అందించారు. పోలినాయుడు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు.