Town Bank
-
‘బ్రదర్ ఇదంతా రాజకీయ కక్ష.. నాకేం తెలియదు'
2005లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో మొదలైన షణ్ముగం నేరచరిత్ర ఇప్పటి వరకు 14 కేసులకు చేరుకుంది. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన పాత్రికేయుడిని బెదిరించడం నుంచి విధినిర్వహణలో ఉన్న పోలీసును కొట్టడం, మోసాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, చెక్‌బౌన్స్ కేసులు ఇలా జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, బంగారుపాళ్యం తదితర ఏడు స్టేషన్లలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో అరెస్టుకాకుండా టీడీపీ నేతల పేర్లుచెప్పి ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్నాడు. చిత్తూరు టౌన్ బ్యాంకును బురిడీ కొట్టించిన కేసులో ఎట్టకేలకు అరెస్టయ్యాడు. సాక్షి, చిత్తూరు అర్బన్: షణ్ముగం.. చిత్తూరులో పరిచయం అవసరం లేని పేరు. ఎంతటివారైనా ఇతని వాగ్ధాటి ముందు చిన్నబోవాల్సింది. వేటగాడి ఉచ్చునుంచి చిరుతపులైనా తప్పించుకోవచ్చుగానీ.. ఇతని మాటల ఉచ్చు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి వ్యక్తికి నాటి టీడీపీ పాలకులు వేలాదిమంది ఖాతాదారులు కష్టాన్ని దాచుకున్న టౌన్‌బ్యాంకు పాలకవర్గం పగ్గాలు అప్పగించారు. దొంగ చేతికి తాళం అందినట్టుగా చైర్మన్ హోదాలో బ్యాంకుకే శఠగోపం పెట్టాడు. 5.16 కిలోల నకిలీ బంగారు ఆభరణాలతో తప్పుడు ఖాతాలతో చిత్తూరు సహకార టౌన్‌బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న ఈ మోసగాడి దెబ్బకు బకాయిలు రూ.1.20 కోట్లకు చేరుకున్నాయి. అతన్ని మంగళవారం అరెస్టుచేసిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిత్తూరు నగర డీఎస్పీ కవలకుంట్ల ఈశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ ఎన్.భాస్కర్‌రెడ్డిలు విలేకరులకు షణ్ముగం నేరాలచిట్టాను వివరించారు. చదవండి: అమరావతిలో పరిటాల బంధువుల పాగా షణ్ముగంను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు ♦టౌన్‌బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడే షణ్ముగం ఉద్దేశపూర్వకంగా బ్యాంకును బురిడీకొట్టించాలని పథకం పన్ని ఖాతాదారుల డిపాజిట్ల నుంచి నకిలీ బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నాడు. వచ్చిన డబ్బులతో తన ఇద్దరు భార్యలకు రెండు కార్లు, మొదటి భార్య కుమార్తెకు నాగాలమ్మ గుడి వద్ద ఓ ఇల్లు, రెండో భార్య పేరిట టెలిఫోన్ కాలనీలో మరో ఇల్లు కొన్నాడు. దాదాపు రూ.కోటి విలువచేసే ఆస్తు లు, వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ♦టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ మంత్రి వద్ద తన కుమారుడు పేషీగా పనిచేస్తున్నట్లు చూపించి టీటీడీకి వందలాది సిఫారసు లేఖలు ఇచ్చి దర్శనాలు, గదులు, ప్రసాదాలు పొందినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేయాలని టీటీడీ విజిలెన్స్‌కు లేఖ రాస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ♦ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు గుంజేసినట్లు ఫోన్లో ఫిర్యా దులు వచ్చాయని.. దీనిపై బాధితులు ధైర్యంగా ముందుకువచ్చి జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పెట్టొచ్చని డీఎస్పీ పేర్కొన్నారు. ♦ తిరుపతిలో ఇనామ్ భూములు పేరుమార్చి ఇస్తానని చెప్పి రూ.17.60 లక్షలు మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి చెందిన కృష్ణారెడ్డి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆభరణాలు తాకట్టుపెడతానని చెప్పి తనపేరిట ఖాతా తెరచి తీరా నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి రూ.6.55 లక్షలు అప్పుచేశాడని మరో బాధితుడు చిరంజీవి తెలిపాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసినట్లు తాజాగా చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు మరో ఫిర్యాదు అందగా.. దీనిపై విచారణ చేస్తున్నారు. ఇంత జరిగిన తరువాత ఎలాంటి వ్యక్తిలో అయినా పశ్చాత్తాపం ఉంటుంది. కానీ షణ్ముగం మాత్రం ‘‘బ్రదర్.. ఇది పూర్తిగా అన్యాయం. నాపై రాజకీయకక్షతో కేసులు పెట్టించారు. నాకేమీ తెలియదు..’’ అంటూ కేకలు వేయడం అతనికే చెల్లుతుందని అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇంతటి నేరచరిత్ర ఉన్న వ్యక్తికి టౌన్‌బ్యాంకు చైర్మన్ పదవిలో ఎలా కూర్చోబెట్టారని పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షణ్ముగంపై రౌడీషీట్ తెరవడానికి ఎస్పీకి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. తమ పేరిట నకిలీ బంగారు పెట్టాడని చెబుతున్న బాధితుడు చిరంజీవి టీడీపీ నేత షణ్ముగంకు 14 రోజుల రిమాండ్ చిత్తూరు సహకార టౌన్బ్యాంకును మోసం చేసి నకిలీ ఆభరణాలతో రూ.1.20 కోట్లు బకాయిపడ్డ టీడీపీ నేత షణ్ముగంకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిరుపమాబాంజ్దేవ్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం షణ్ముగంను అరెస్టు చేసిన పోలీసులు చిత్తూరులోని 4వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. షణ్ముగంను మార్చి 3వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. -
చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ టీడీపీ నేత అరెస్ట్
-
టౌన్ బ్యాంకులో సీబీసీఐడీ గుబులు
సాక్షి, జమ్మలమడుగు/ రూరల్ : జమ్మలమడుగు టౌన్ బ్యాంకులో 2016లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై సీబీసీఐడీ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం టౌ న్‌బ్యాంకు తాత్కాలిక పాలకవర్గం మూకుమ్మడి రా జీనామాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టౌన్‌బ్యాంక్‌లో రూ.5కోట్ల అవినీతి... టౌన్ బ్యాంక్‌లో 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో టౌన్‌బ్యాంకు చైర్మన్, మేనేజర్లు సుమారు ఐదు కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారు. స్థానికంగా వస్త్ర వ్యాపారులు ఇక్కడి నుంచి ఎక్కువగా గుజరాత్ లోని అహమ్మదాబాద్, సూరత్ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని టౌన్‌బ్యాంకులో డీడీలు తీసి పంపించేవారు. అయితే డీడీలు పంపిన నెలకు కూడా డబ్బులు పడకపోవడంతో గుజరాత్ వ్యాపారులు స్థానిక వ్యాపారులను డబ్బులు ఇవ్వాలంటూ ఫోన్లు చేస్తూ వచ్చారు. అయితే తాము డీడీల రూపంలో డబ్బులు పంపినా వారి ఖాతాల్లో ఎందుకు జమ కాలేదని బ్యాంకు చైర్మన్, మేనేజర్లను వ్యాపారులు ప్రశ్నించారు. దీంతో తీగ లాగితే డొంక కదిలిందన్నట్లు అవినీతి బాగోతం వెలుగు చూసింది. టౌన్‌బ్యాంకులో ఉన్న రెండువేల మంది ఖాతాదారులకు సంబంధించిన ఐదుకోట్ల రూపాయలను చైర్మన్, మేనేజర్లు కలిసి వాడుకున్నారన్న విషయం బయపడింది. కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు ఇక్కడ జరుగుతున్న లావాదేవీలపై విచారణ చేపట్టారు. ఐదు కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసినట్లు తేల్చారు. మూకుమ్మడిగా పాలకవర్గం రాజీనామాలు టౌన్ బ్యాంక్‌లో కొనసాగుతున్న తాత్కాలిక పాలక వర్గం తమ పదవులకు సోమవారం రాజీనామాలు చేశారు. 2016 టౌన్‌బ్యాంక్‌లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో 2018లో చైర్మన్, వైస్ చైర్మన్, నలుగురు డైరెక్టర్లతో తాత్కాలికంగా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన పాలకవర్గం ఏర్పాటై ఏడాది గడిచినా బ్యాకు బాధితులకు మాత్రం ఎలాంటి న్యాయం చేయలేదు. దీంతో విధి లేని పరిస్థితిలో బాధితులు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీ సీఐడీ విచారణకు ఆదేశిస్తే పాలకవర్గం స్థానంలో ఉండి తాము సీబీసీఐడీ అధికారుల ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని, ఆ తలనొప్పి తమకెందుకనే ఉద్దేశంతోనే పాలకవర్గం రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేసింది వాస్తవమే.. టౌన్‌బ్యాంకు తాత్కాలిక పాలక వర్గంలో నలుగురు డైరెక్టర్లు, చైర్మన్, వైస్‌చైర్మన్ రాజీనామా చేసిన మాట వాస్తవమేనని టౌన్ బ్యాంక్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సెల్ అధికారి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. పాలకవర్గం రాజీనామా లేఖలను ఉన్నతాధికారులకు పంపించామని ఆయన తెలిపారు. న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని కలిసిన బాధితులు ఈనెల 8వతేదీన జమ్మలమడుగులో రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ బాధితులు హెలిప్యాడ్ వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టౌన్‌బ్యాంక్ బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా టౌన్ బ్యాంకులో జరిగిన అవినీతిని బట్టబయలు చేయడం కోసం త్వరలో సీబీసీఐడీ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. -
లూటీ కేసులో రిక‘వర్రీ’
బ్యాంక్ ఖాతాదారుల నమ్మకాన్ని వారు సొమ్ము చేసుకున్నారు. చైర్మన్, సీఈఓ సంయుక్తంగా భారీ మొత్తాన్ని స్వాహా చేశారు. రెండేళ్లవుతున్నా నిందితులపై చర్యలు లేవు. నాటి సహకార మంత్రి వారికి కొమ్ముకాయడంతో అధికార యంత్రాంగం ముందడుగు వేయలేకపోయింది. దీంతో బ్యాంకును లూటీ చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. బాధితులకు మాత్రం నేటికీ పరిష్కారం కనిపించలేదు. తాత్కాలిక పాలకవర్గం కూడా కనీస చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి కడప: జమ్మలమడుగు టౌన్ బ్యాంక్‌పై తొలినాళ్ల నుంచి దేవగుడి బ్రదర్స్‌దే పెత్తనం. పాలకవర్గ ఎన్నికల్లోనూ వారిదే ఆధిపత్యం. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమీప బంధువు తాతిరెడ్డి హృషికేశవరెడ్డి దీనికి చైర్మన్‌గా ఉండేవారు. 2017లో టౌన్‌బ్యాంక్‌లో ఖాతాదారుల సొమ్ము స్వాహా అయినట్లు గుర్తించారు. ఖాతాదారుల ఆందోళనతో ఈ వైనం బయటపడింది. ఆరా తీస్తే అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ.3.49 కోట్లు పక్కదారి పట్టిందని తేలింది. అప్పటి కో–ఆపరేటివ్ అధికారి వెంకటసుబ్బయ్య విచారించి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. టౌన్‌బ్యాంక్ చైర్మను, సీఈఓలపై పోలీసులు కేసు నమోదుచేశారు. స్వాహా అయిన మొత్తంలో సీఈఓ కమ్ మేనేజర్‌గా ఉన్న శ్రీనివాస బాలాజీ రూ.1.5కోట్లు కాజేసినట్లు తేల్చారు. మిగతా మొత్తం హృషికేశవరెడ్డి వాడుకున్నట్లు స్పష్టమైంది. అటాచ్డ్తో సరిపెట్టిన యంత్రాంగం... ఈ సంఘటన తర్వాత ఖాతాదారుల్లో అలజడి చెలరేగింది. సేవింగ్స్‌లో డిపాజిట్ చేసిన మొత్తం పరులుపాలైయ్యిందని తెలుసుకొని లబోదిబోమంటూ రోడ్డు ఎక్కారు. అప్పట్లో కో–ఆపరేటివ్ యంత్రాంగం చైర్మన్, సీఈఓ ఆస్తులు ఆచాట్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ తర్వాత అడుగు పడలేదు. తదుపరి ఉత్తర్వులు అమలుపర్చి ఖాతాదారులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టలేదు. సీఈఓ శ్రీనివాస బాలాజీకి సంబంధించిన ఇళ్లు, హృషికేశవరెడ్డి ఆస్థిని టౌన్‌బ్యాంక్ అధికారులు అటాచ్ చేసుకున్నారు. సీఈఓ నుంచి రూ.6.83లక్షలు నగదు, మూడు వాహనాలు, 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.93.46 లక్షలు బ్యాంక్ డబ్బును వడ్డీల రూపంలో కొందరికి ఇచ్చారని విచారణలో తేల్చారు. హృషికేశవరెడ్డి నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు. అప్పట్లో సహకార మంత్రిగా ఆదినారాయణరెడ్డి ఉండడంతో ఇందుకు అధికారులు సాహసించలేకపోయారని తెలిసింది. సహకారశాఖ ఆస్తులను అటాచ్ చేసినా వేలం వేయకుండా హైకోర్టు నుంచి స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకున్నారు. సహకార శాఖ యంత్రాంగం హైకోర్టుకు వెళ్లి స్టేటస్కో ఆర్డర్ రద్దు చేయించడం, చైర్మన్ ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేయడం లాంటి ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కానీ ఎలాంటి చర్యలు చేపట్టడడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరించింది. తాత్కాలిక పాలకమండలి సైతం.... టౌన్ బ్యాంక్‌లో ఎప్పటి నుంచో దేవగుడి బ్రదర్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు గౌరవాధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. ఖాతాదారుల సొమ్ము స్వాహా నేపథ్యం తర్వాత తాత్కాలిక పాలకమండలిని ఏర్పాటు చేశారు. అందులో కూడా చాతుర్యం ప్రదర్శించి, ధర్మాపురం మాజీ సర్పంచ్‌ను చైర్మనుగా ఎంపికయ్యేలా చక్రం తిప్పారు. తాత్కాలిక పాలకమండలి సైతం స్వాహా కేసులో రికవరీకి చర్యలు తీసుకోవలేదనే ఆరోపణలు ఉన్నాయి. 2వేల మంది ఖాతాదారులు దాచుకున్న సొమ్మును స్వాహా చేసిన వారి నుంచి ఆ మొత్తాన్ని రాబట్టేందుకు అడుగులు వేయలేదు. మంత్రిగా ఆదినారాయణరెడ్డి ఉన్నారనే చర్యలకు వెనకాడినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి టౌన్ బ్యాంక్‌ను లూఠీ చేసి దర్జాగా తిరుగుతున్న చైర్మన్, సీఈఓల నుంచి రికవరీ చేయాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలల్లో వారి ఆస్తులు విక్రయించి సొమ్ము తిరిగి అప్పగిస్తామని ఖాతాదారులకు చెప్పిన అధికారులు రెండేళ్లవుతోన్నా స్పందించడంలేదు. -
ఇప్పించే దమ్ముందా?
ఉరవకొండ, న్యూస్‌లైన్ :‘పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ఇంటి ఎదుట ధర్నా చేసి..ఆయనతో రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే లేఖ ఇప్పించే దమ్ము, చిత్తశుద్ధి మీకు ఉందా?’ అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. స్థానిక తొగట వీరక్షత్రియు కళ్యాణ వుండపంలో శనివారం నిర్వహించిన పట్టణ కార్యకర్తల సవూవేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీలో నాయకత్వమేలేదని పయ్యావుల విమర్శించడాన్ని ఆయన ఖండించారు. ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకంగా మారిన పయ్యావులకు వైఎస్సార్సీపీని విమర్శించే అర్హత లేదన్నారు. ఉరవకొండ మేజర్ పంచాయుతీని వుున్సిపాలీటీ కాకుండా పయ్యావుల అడ్డుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుని నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలారన్నారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇరుప్రాంతాలవారికి సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. కనీసం అసెంబ్లీ సవూవేశాల్లో స్పీకర్ వుుందుకు కూడా రాలేకపోతున్నారన్నారు. అధికార పార్టీతో కలిసి టీడీపీ కుట్రలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని నీచరాజకీయాలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలని, లేదా సమైక్య తీర్మానం చేయూలని పట్టుబడిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అక్రవుంగా అరెస్టు చేరుుంచారన్నారు. రాష్ర్ట్ర సమైక్యత కోసం పార్టీ చారిత్రక పోరాటం చేస్తోందన్నారు. సమావేశానికి పార్టీ పట్టణ కన్వీనర్ బసవరాజు అధ్యక్షత వహించారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తేజోనాథ్, కిసాన్‌సెల్ కోఆర్డినేటర్ అశోక్, వుండల, పట్టణ కన్వీనర్ సుంకన్న, యుువజన విభాగం జిల్లా కార్యదర్శి నిఖిల్నాధ్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు తిప్పయ్యు, టౌన్‌బ్యాంకు అధ్యక్షుడు చందావెంకటస్వామి, మేజర్ పంచాయుతీ ఉపసర్పంచ్ జిలకరమోహన్, మైనార్టీ విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జిలాన్, యుువజనవిభాగం జిల్లా కమిటీ సభ్యులు వన్నప్ప, వుుద్దాలపురం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
తాకట్టుకు టౌన్‌హాల్
= వడ్డీలు చెల్లించలేని దుస్థితిలో బీబీఎంపీ.. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమాజంలో దివాళా తీసిన వాడిని గురించి ‘వడ్డీకి వడ్డీ కట్టి మునిగిపోయాడు’ అని చెప్పడం సహజం. ఘనత వహించిన బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను ఇప్పుడు ఆ విధంగానే పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు, వడ్డీలు చెల్లించలేక ఏకంగా నగరంలోని ప్రతిష్టాత్మక టౌన్ హాలును తాకట్టు పెట్టడానికి బీబీఎంపీ సిద్ధమైంది. ఆర్థిక పరంగా ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో మునిగిపోయిన బీబీఎంపీ, ప్రస్తుతం టౌన్ హాలును తాకట్టు పెట్టాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శల పాలవుతోంది. కెనరా బ్యాంకు నుంచి 2010లో తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, టౌన్ బ్యాంకును అదే బ్యాంకుకు తాకట్టు పెట్టడం ద్వారా రుణ విముక్తం కావాలని బీబీఎంపీ నిర్ణయించింది. సోమవారం జరిగిన బీబీఎంపీ సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు సర్క్యులర్‌ను కూడా ప్రవేశపెట్టింది. నగరంలో ప్రాథమిక సదుపాయాల కల్పన కోసం చెల్లింపు హుండీల ద్వారా బీబీఎంపీ కెనరా బ్యాంకు నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో రూ.155 కోట్లు తీసుకుంది. దీనికి 14 శాతం వడ్డీని కలుపుకొంటే ప్రస్తుతం ఆ మొత్తం రూ.200 కోట్లకు చేరుకుంది. ఎంతకూ ఈ మొత్తాన్ని చెల్లించక పోవడంతో కెనరా బ్యాంకు ఈ లావాదేవీని ఎన్పీఏ (నిరర్థక ఆస్తి)గా పరిగణించింది. పరువు పోతుందని గ్రహించిన బీబీఎంపీ ఈ గండం నుంచి బయటపడే మార్గం చెప్పాల్సిందిగా బ్యాంకును కోరింది. కెనరా బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న టౌన్ హాలుతో పాటు దాని పక్కనున్న పార్కింగ్ ప్రదేశాన్ని తాకట్టుగా పెడితే ఎన్పీఏ ముద్ర పడకుండా చూస్తామని బ్యాంకు సూచించింది. పైగా రుణ మొత్తంలో రూ.45 లక్షల రాయితీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇదేదో చక్కని ఐడియా అని భావించిన బీబీఎంపీ, తాకట్టుకు సిద్ధమైంది. దీనిపై బీబీఎంపీ కమిషనర్ లక్ష్మీ నారాయణ సీఎం క్యాంప్ కార్యాయం కృష్ణాలో సిద్ధరామయ్యతో గురువారం చర్చించారు. అయితే టౌన్ హాలు కాకుండా వేరే ఏదైనా భవనాన్ని తాకట్టు పెట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. దీంతో బీబీఎంపీ సందిగ్ధంలో పడింది. ఘన చరిక్రత టౌన్ హాలుకు ఘన చరిత్ర ఉంది. 1933లో అప్పటి మైసూరు మహారాజు క ృష్ణరాజ ఒడయార్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1935 సెప్టెంబరు 11న నిర్మాణం పూర్తయింది. అప్పటి మహారాజు కంఠీరవ నరసింహ రాజ ఒడయార్ దీనిని ప్రారంభించారు. ఇందులో కార్యక్రమాలను 1,038 మంది కూర్చుని తిలకించే అవకాశం ఉంది. -
ఈ నరకాసురుడి నుంచి రక్షించండి
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ‘‘జిల్లా అధికారులంతా నా చేతిలో ఉన్నారు. ప్రాథమిక విద్యాశాఖ మాత్యులకు నేను ఏది చెబితే...అదే. టపాసుల వ్యాపారులంతా ఒక్కొక్కరు రూ.50 వేలు కట్టాల్సిందే. ఇదేమని ప్రశ్నిస్తే రౌడీషీటర్లను పంపుతా’’ అంటూ బెదిరిస్తున్న కలియుగ నరకాసురుడు టౌన్ బ్యాంకు అధ్యక్షుడు గౌతమ్ నుంచి తమను రక్షించాలని టపాసు విక్రేతలు పోలీసులను కోరారు. నగరంలోని టపాసుల విక్రయ కేంద్రం (జూనియర్ కళాశాల మైదానం)లో టపాసుల వ్యాపారుల సంఘం మాజీ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, లలిత్ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టపాసుల వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా గౌతమ్ తనకు తాను ప్రకటించుకుని, ఒక్కో వ్యాపారి నుంచి రూ.50 వేలు చొప్పున మొత్తం రూ.24 లక్షలు దండుకున్నాడని ఆరోపించారు. తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుని.. పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు మరీ రూ.20 వేలు చొప్పున కట్టాలంటూ బెదిరిస్తున్నాడన్నారు. దుకాణానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించి ఖర్చు రాదన్నారు. అయితే తమ నుంచి రూ.50 వేలు వసూలు చేసి.. దానికి నేటికీ లెక్కలు చూపడం లేదన్నారు. దీన్ని ప్రశ్నించిన వ్యాపారులపై బెదిరింపులకు దిగుతున్నాడన్నారు. ఈసారి తానే అధ్యక్షుడిని కావాలనుకుంటున్నా వ్యాపారులు ససేమిరా అనడంతో తమ గోదాములపై పోలీసులను ఉసిగొలిపి దాడులు చేయించి ఆర్థికంగా దెబ్బకొట్టాడన్నారు. సేల్‌ట్యాక్స్, అగ్నిమాపకశాఖ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల పేర్లు చెప్పి వేలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. మూడు నెలల క్రితం టపాసులను తరలిస్తున్న వాహనాన్ని ఇటుకలపల్లి సీఐ మహాబూబ్‌బాషా పట్టుకుంటే ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న గౌతమ్ ఇటుకలపల్లి సీఐ పేరు చెప్పి రూ.55 వేలు లంచం వసూలు చేసుకున్నాడన్నారు. మున్నానగర్ రౌడీ షీటర్లు తనకు తెలుసని ఏదైనా మాట్లాడితే ఎంతకైనా తెగిస్తానని బెదిరించాడని బాధిత వ్యాపారి విజయ్ ఆరోపించాడు. ఆరోపణల్లో వాస్తవం లేదు : గౌతమ్ తనపై సుధాకర్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని గౌతమ్ అన్నారు. డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులను బెదిరించుకుంటూ కొన్నేళ్లుగా టపాసుల వ్యాపారుల నుంచి లక్షలు దండుకున్న సుధాకర్‌రెడ్డి రెండేళ్లుగా అధ్యక్ష పదవిలోకి మరొకరు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు. తాను అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం ఆయన ఆటలకు చెక్ పెట్టినట్లైందన్నారు. ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా తాను వ్యాపారుల నుంచి తీసుకోలేదని తెలిపారు. ఇదేమీ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్కు కాదు... ఈ వ్యాపారానికి మంత్రి పేరు చెప్పకొని దోచుకోవాల్సిన అవ సరం లేదన్నారు. తనకు ఏ రౌడీషీటర్లూ తెలియదని... వారితో పరిచయాలు కూడా లేవన్నారు. సుధాకరరెడ్డి కొన్నేళ్లుగా సేల్స్ ట్యాక్స్‌ని కట్టకుండా ఎగరేస్తున్నాడని తెలిపారు. వారు చేసే ప్రతి ఆరోపణకూ తన వద్ద ఆధారాలున్నట్లు తెలిపారు. అవసరమైతే మీడియాతో పాటు పోలీసులకు కూడా వాటిని అందజేసి తన నిజాయితీని రుజువు చేసుకుంటానని తెలిపారు. దుకాణాల ఏర్పాటుతో పాటు విద్యుత్ చార్జీలతో పాటు ఇతర ఖర్చుల కింద ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో వ్యాపారులతో ఈ ఖర్చుల విషయమైచర్చించాల్సి ఉందన్నారు. -
ఇక దూకుడే
సాక్షి, తిరుపతి/ కార్పొరేషన్: సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వారం తా ఏకమయ్యారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి వేదికగా తిరుపతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేయాలని తీర్మానించారు. ఆర్టీసీ జేఏసీ, ఫ్రెండ్స్ అసోసియేషన్ పిలుపుమేరకు ఉద్యోగ , ప్రజాసంఘాల నాయకులు, రాజకీయవేత్తలు ఆది వారం రాత్రి ఓ ప్రైవేటు హోటల్లో ఉద్యోగ-ప్రజాసంఘాలు-సమైక్యవాదుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. జాతీయ మీడియా ద్వారా ఢిల్లీ పెద్దలకు సమైక్యవాణిని వినిపించాలంటే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతే వేదిక కావాలని తీర్మానించారు. అందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను కేంద్రం పట్టించుకోవడం లేదనే నిర్ణయానికి వచ్చారు. సమైక్యవాణి ఢిల్లీకి వినిపించాలంటే రైల్రోకోతోపాటు తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. కేసులుపెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. కేసు లు పెడితే ఉచితంగా న్యాయసహాయం అందించి నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయవాదుల జేఏసీ హామీ ఇచ్చింది. ఒక్కటైన 150 జేఏసీలు సమైక్యాంధ్ర కోసం 48 ప్రభుత్వ శాఖల జేఏసీలు, 22 ఉపాధ్యాయ, 8 ఆర్టీసీ, 72 ప్రజాసంఘాలు ఒక్కటయ్యాయి. సంఘాల ప్రతినిధులంతా సోమవారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. 24న శ్రీవారి భక్తులెవరూ తిరుమలకు రావద్దని పిలుపునిచ్చారు. కనీసం ద్విచక్ర వాహనాలూ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సోమవారం నుంచి 30వ తేదీ వరకు ప్రైవేటు పాఠశాలలు సంపూర్ణంగా బంద్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేసేం దుకు నిర్ణయించారు. వీరే ఉద్యమానికి సారథ్యం వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 24న టీటీడీలోని అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొనాలన్నారు. అదే రోజు రహదారులను దిగ్బంధించాలన్నారు. నాల్గవ తరగతి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు తిరుపతి టౌన్‌బ్యాంక్ ముందుకొచ్చినట్టు ఆ బ్యాంక్ అధ్యక్షుడు పులుగోరు మురళీకృష్ణారెడ్డి ప్రకటిం చారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్, ఆర్డీవో రామచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకులు మునిసుబ్రమణ్యం, ప్రకాష్, ఆవుల ప్రభాకర్‌యాదవ్, సురేంద్రబాబు, లతారెడ్డి, ఈసీ బాబు, డాక్టర్ కృష్ణప్రశాంతి, నరసింహులునాయుడు, న్యాయవాద జేఏసీ నుంచి దినకర్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, నవీన్‌కుమార్‌రెడ్డి, విద్యా సంస్థల జేఏసీ నుంచి తమ్మినేని వెంకటేశ్వర్లు, శర్మ, టీటీడీ జేఏసీ నుంచి విజయకుమార్, మెడికల్ జేఏసీ నుంచి చెంగల్రాయులు, రుక్మిణి, ఏపీఎన్జీవోల నుంచి విజయలక్ష్మి, నిర్మల, సాం స్కృతిక జేఏసీ నుంచి సురేష్, బీసీ జేఏసీ నుంచి అశోక్‌సామ్రాట్, సాప్ప్ జేఏసీ నుంచి రాజారెడ్డి పాల్గొన్నారు.