ఉరవకొండ, న్యూస్‌లైన్ :‘పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ఇంటి ఎదుట ధర్నా చేసి..ఆయనతో రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే లేఖ ఇప్పించే దమ్ము, చిత్తశుద్ధి మీకు ఉందా?’ అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. స్థానిక తొగట వీరక్షత్రియు కళ్యాణ వుండపంలో శనివారం నిర్వహించిన పట్టణ కార్యకర్తల సవూవేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీలో నాయకత్వమేలేదని పయ్యావుల విమర్శించడాన్ని ఆయన ఖండించారు. ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకంగా మారిన పయ్యావులకు వైఎస్సార్‌సీపీని విమర్శించే అర్హత లేదన్నారు. ఉరవకొండ మేజర్ పంచాయుతీని వుున్సిపాలీటీ కాకుండా పయ్యావుల అడ్డుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుని నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలారన్నారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
రాష్ట్రంలో ఇరుప్రాంతాలవారికి సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. కనీసం అసెంబ్లీ సవూవేశాల్లో స్పీకర్ వుుందుకు కూడా రాలేకపోతున్నారన్నారు. అధికార పార్టీతో కలిసి టీడీపీ కుట్రలకు పాల్పడుతూ వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని నీచరాజకీయాలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలని, లేదా సమైక్య తీర్మానం చేయూలని పట్టుబడిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అక్రవుంగా అరెస్టు చేరుుంచారన్నారు. రాష్ర్ట్ర సమైక్యత కోసం పార్టీ చారిత్రక పోరాటం చేస్తోందన్నారు.
సమావేశానికి పార్టీ పట్టణ కన్వీనర్ బసవరాజు అధ్యక్షత వహించారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తేజోనాథ్, కిసాన్‌సెల్ కోఆర్డినేటర్ అశోక్, వుండల, పట్టణ కన్వీనర్ సుంకన్న, యుువజన విభాగం జిల్లా కార్యదర్శి నిఖిల్‌నాధ్‌రెడ్డి, ఎస్‌సీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు తిప్పయ్యు, టౌన్‌బ్యాంకు అధ్యక్షుడు చందావెంకటస్వామి, మేజర్ పంచాయుతీ ఉపసర్పంచ్ జిలకరమోహన్, మైనార్టీ విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జిలాన్, యుువజనవిభాగం జిల్లా కమిటీ సభ్యులు వన్నప్ప, వుుద్దాలపురం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పించే దమ్ముందా?
Published Sun, Jan 12 2014 2:42 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM
Advertisement
Advertisement