Toy Train
-
మాథేరాన్ టాయ్‌ట్రైన్ వచ్చేస్తోంది..
దాదర్: పర్యాటకులకు ఎంతో ఇష్టమైన నేరల్–మాథేరాన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ సేవలు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 నుంచి సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా ఆకస్మిక వర్షాల కారణంగా ఇది వాయిదా పడింది. కాని రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేరల్–మాథేరాన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ రైలు మార్గం 80% కొండ అంచుల మీదుగా ఉంది. నేలపై ఉన్న నేరల్ నుంచి కొండపై ఉన్న మాథేరాన్ మధ్య 21 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ (అప్, డౌన్లో) గమ్యస్థానానికి చేరుకోవాలంటే రెండు గంటలపైనే సమయం పడుతుంది.ముఖ్యంగా వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, కల్వర్టులు కొట్టుకుపోవడం, పట్టాల కిందున్న మట్టి, కంకర వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతుంది. ఫలితంగా అనేక చోట్ల రైలు పట్టాలు గాలిలో వేలాడుతుంటాయి. దీంతో ప్రమాదాలు జరగక ముందే ముందు జాగ్రత్త చర్యగా ఏటా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు అంటే జూన్ 15వ తేదీ నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు ఈ రైలు మార్గం పూర్తిగా మూసి వేస్తారు. ఈ సమయంలో రైల్వే ఇంజిన్లు, కోచ్‌లు మరమ్మతుల నిమిత్తం పరేల్‌లోని రైల్వే వర్క్ షాపునకు తరలిస్తారు. అలాగే ఈ నాలుగు నెలల కాలవ్యవధిలో రైల్వే ట్రాక్స్‌కు మరమ్మతు పనులు పూర్తిచేసి అక్టోబరు 16 నుంచి రైలు సేవలు పునరుద్ధరిస్తారు. ఆ ప్రకారం అక్టోబరు 16 నుంచి టాయ్ ట్రైన్ సేవలు వినియోగంలోకి రావాల్సి ఉంది. పర్యాటకులు కూడా మాథేరాన్ రావడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఏడాది అక్టోబరులో 15 తర్వాత కూడా భారీ వర్షాలు కురవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టాయ్ ట్రైన్ సేవల ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందిప్రారంభించి వందేళ్లు దాటినా...ఈ రైలు మార్గాన్ని ప్రారంభించి వందేళ్లు దాటినప్పటికీ ఇంకా పర్యాటకుల మన్ననలు పొందుతూనే ఉంది. రోడ్డు మార్గం కంటే రైలు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకునే అనుభూతి పర్యాటకులు ఎన్నటి మరిచిపోరు. ఏటా లక్షలాది పర్యాటకులు మాథేరాన్‌ను సందర్శిస్తారు. వంద శాతం పర్యాటకులు టాయ్ ట్రైన్‌ను ఎక్కి ప్రయాణం చేయాలని కోరుకుంటారు. టికెట్లు దొరకని వారు రోడ్డు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకుంటారు. చదవండి: మహారాష్ట్ర చూపంతా ఈ నియోజకవర్గంపైనే...నవంబర్ 1కి వాయిదా పడిన విషయం కొందరు పర్యాటకులకు తెలియలేదు. ఎప్పటిలాగే అనేకమంది పర్యాటకులు ఎంతో ఉత్సాహంతో తమ కుటుంబ సభ్యులతో ఈ నెల 16, 17వ తేదీన నేరల్‌కు చేరుకున్నారు. వర్షాల కారణంగా నవంబర్ ఒకటో తేదీకి వాయిదా పడినట్లు తెలియగానే కొందరు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రోడ్డు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకున్నారు. -
గంటకు 9 కిలోమీటర్లు.. మనదేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇదే!
Nilgiri mountain train: బిజీ జీవితాన్ని పక్కనపెట్టి.. అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలునెవరైనా ఎక్కుతారా? అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు.మనదేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది అక్కడి ప్రకృతి. మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు.. దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి కొండలు అబ్బుర పరుస్తాయి. ఇదంతా ఓకే.. కానీ ఆలస్యానికి కారణం మాత్రం.. అక్కడ ఉన్న వంతెనలు, సొరంగాలు. 100కు పైగా వంతెనల మీదుగా, 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన ములుపులు వందకు పైనే ఉన్నాయి. మధ్యలో ఐదు స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది. ఇది మనదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవునా నీలగిరి కొండల అందాలను ఆస్వాదించవచ్చు. ఊటీ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది.రైలు ప్రయాణానికే కాదు.. ఈ మార్గం నిర్మాణానికో చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి.. 1908లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్‌మీద ప్రయాణించే రైలుకెంత ప్రత్యేకత ఉండాలో కదా! అందుకే ఈ రైలునూ అలాగే తయారు చేశారు. బోగీలన్నింటినీ కలపతో తయారు చేశారు. చదవండి: బాలపిట్టలూ బయటికెగరండిమేఘాలను ప్రతిబింబించే నీలి రంగు వేయడంతో వింటేజ్ భావన కలిగిస్తుంది. రైలులో నాలుగు బోగీలుంటాయి. ఫస్ట్ క్లాస్ బోగీలో 72 సీట్లు, సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. మొదట మూడు బోగీలే ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు బోగీ ఏర్పాటు చేశారు. సెలవులు, వారాంతాల్లో బిజీగా ఉండే రైలులో ప్రయాణించాలంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేటి నుంచి టాయ్‌ట్రైన్ పునఃప్రారంభం
సాక్షి, ముంబై: వర్షాకాలం నేపథ్యంలో సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన మాథేరన్ టాయ్‌ట్రైన్ (మినీ రైలు) సేవలు పునఃప్రారంభం కానున్నాయి. నవంబరు 4వ తేదీ శనివారం నుంచి ఈ ట్రైన్ ప్రారంభించేందుకు సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నేరుల్–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ రెండేసి చొప్పున.. మొత్తం నాలుగు సర్విసులు నడపనున్నారు. మరోవైపు మార్పులు చేసిన సమయాలనుసారం అమన్ లాడ్జీ–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ మార్గాల్లో ఆరు చొప్పున మొత్తం 12 సర్విసులు, శని, ఆదివారాల్లో అదనంగా రెండేసి చొప్పున ప్రత్యేక టాయ్ రైళ్లను నడపనున్నారు. వర్షాకాలంలో నిలిపివేత.. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షా కాలం ప్రారంభం కాగానే టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేస్తారు. ఆ తరువాత మళ్లీ అక్టోబరు 15వ తేదీ నుంచి సర్విసులు పునఃప్రారంభిస్తారు. కానీ ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా పునఃప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతంలో ఒకటైన మాథేరాన్‌ను సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రైలులో కొండల మధ్య నుంచి ప్రయాణిస్తూ.. జలపాతాలు, పచ్చదనాన్ని చూసేందుకు ఇష్టపడతారు. నేరుల్ నుంచి 21 కి.మీ. దూరంలో కొండపై ఉన్న మాథేరాన్ చేరుకోవాలంటే రోడ్డు మార్గం కంటే మినీ రైలులో వెళ్లే ఆనందమే బాగుంటుందని పర్యాటకులు ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంటుంటారు. రెలు మార్గం దాదాపు 90 శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో రైల్వే ట్రాక్ కిందున్న మట్టి కొట్టుకుపోవడం, కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యేంత వరకు రైలు సేవలు పూర్తిగా నిలిపివేస్తారు. ఈ సమయంలో పర్యాటకులు రోడ్డు మార్గం మీదుగా మాథేరాన్ చేరుకోవల్సిందే. ఇప్పుడు టాయ్ ట్రైన్ సేవలు ప్రారంభమవుతుండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
రైల్వే ట్రాక్ ఎలా వేలాడుతుందో చూడండి..
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది. షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు. ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. "Guys this is very scary" Heavy damage to Kalka-Shimla railway track due to heavy rain and landslides. The earth below the track and been washed away at one place.#Himachal #HimachalPradeshRains #HimachalFloods #himachalrains #HimachalPradesh #TRAIN @AshwiniVaishnaw pic.twitter.com/E4V8jIS2uZ — कालनेमि (Parody) (@kalnemibasu) August 14, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్ -
పట్టాలు తప్పిన ఊటీ టాయ్ ట్రైన్
సాక్షి, చైన్నె: నీలగిరి కొండల్లో ప్రయాణించే ఊటీ టాయ్ ట్రైన్ గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. రెండు బోగీలు ట్రాక్ నుంచి బయటకు వచ్చేశాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికులను కొండ మార్గం గుండా ప్రత్యేక బస్సుల్లో మేట్టుపాళయానికి తరలించారు. నీలగిరి జిల్లాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఊటి. ఇక్కడకు రోడ్డు మార్గంలో కన్నా, రైలు మార్గంలో పయనం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బ్రిటీషు హయాంలో మేట్టు పాళయం నుంచి కున్నూరు వరకు తొలుత ఈ రైలు సేవలకు శ్రీకారం చుట్టారు. తదుపరి దశల వారీగా విస్తరించి చివరకు ఊటీ వరకు ఈ రైలు సేవలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కొండలు, లోయల మధ్య సాగే ఈ ప్రయాణంలో 208 మలుపులు, 250 వంతెనలు, 16 సొరంగ మార్గాలు, 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు ప్రయాణం నిమిత్తం ముందుగా రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం ఓ రైలు మేట్టు పాళయం నుంచి ఊటీకి బయలు దేరుతుంది. మరో రైలు ఊటీ నుంచి మేట్టుపాళయంకు బయలు దేరుతుంది. ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం కున్నూరు రైల్వే స్టేషన్‌ను దాటి వంద మీటర్లు పయనించిన ఈ రైలు హఠాత్తుగా పట్టాలు తప్పింది. వెనుక ఉన్న రెండు బోగీలు పూర్తిగా ట్రాక్ నుంచి కిందకు వచ్చేశాయి. డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అందులోని ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రయాణికులను కొండ మార్గంలో ప్రత్యేక బస్సులను రప్పించి మేట్టుపాళయంకు తరలించారు. వర్షం పడుతుండడం వల్లే రైలు బోగీలు జారి ట్రాక్ నుంచి బయటకు వచ్చి ఉంటాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ సకాలంలో రైలును ఆపి వేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. కాస్త ముందుకు వెళ్లి ఉంటే బోగీలు లోయలో పడి పెను ప్రమాదం సంభవించేదని భావిస్తున్నారు. -
దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు
చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్ ట్రైన్’. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. భారత్‌లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్‌గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. The slowest train goes uphill at the speed of 10 kilometers per hour You can jump off the train, light up a smoke, take few drags and climb on the train again. It’s the Mettupalayam Ooty Nilgiri Passenger train. pic.twitter.com/DHyFKe3cbp — Gouthama Venkata Ramana Raju Chekuri (@gouthamaraju) May 2, 2020 ఆహ్లాదానిచ్చే రైడ్.. ఐఆర్టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధాన స్టేషన్లు.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్లో ప్రధానంగా కూనూర్, వెల్లింగ్టన్, అరవన్‌కుడు, కెట్టి, లవ్‌డేల్ వంటి స్టేషన్లు వస్తాయి. ఈ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని రెండు రకాల కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్‌లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. హాలీడేస్, వీకెండ్లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా! -
ఇక్కడ కూత పెడితే... అక్కడికి వినిపిస్తుంది!
ఒక రైలు తన ప్రయాణం మొదలుపెట్టిందంటే... ఇక అది గమ్యం చేరడానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? కొన్ని వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది? నీలగిరుల్లో ప్రయాణించే ఊటీ – మెట్టుపాలయం టాయ్‌ట్రైన్ కూడా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే... గట్టిగా పదిహేను కిలోమీటర్లు కూడా ప్రయాణించకనే గమ్యం చేరే రైలు మనదేశంలో ఉంది. ఈ రైలు పేరు ఐట్–కోంచ్– ఐట్ షటిల్. అత్యంత తక్కువ నిడివి ఉన్న రైలుమార్గం ఇదే. బయలుదేరిన తర్వాత 35 నిమిషాలకు గమ్యం చేరుతుంది. అందరూ టికెట్ కొంటారు!! కోంచ్–ఐట్ మధ్య దూరం 13.68 కిలోమీటర్లు. ఈ కొద్ది దూరానికి ఒక రైలు... ఆ రైలు కోసం రైల్వే లైన్ వేయడమూ, ఒక స్టేషన్ కట్టడమూ జరిగింది. ఉత్తరప్రదేశ్, బుందేల్‌ఖండ్ లో ఉన్న గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను ఐట్లో మార్కెట్ చేసుకోవడం కోసం బ్రిటిష్ పాలకులు కోంచ్ నుంచి ఐట్ జంక్షన్ వరకు రైల్వేలైన్ వేశారు. కోంచ్లో స్టేషన్ కట్టారు. ఒక రైలును నడిపారు. మూడు పెట్టెలు మాత్రమే ఉండే ఈ రైలు తెల్లవారు జామున నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోజులో నాలుగుసార్లు అటూ ఇటూ ప్రయాణిస్తుంది. రోజుకు నాలుగైదు వందల మంది ప్రయాణిస్తారు. ఇందులో టికెట్ ఐదు రూపాయలు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది! ఇందులో ప్రయాణించే వాళ్లు ఎవరూ టికెట్ కొనకుండా రైలెక్కరు. ఇదంతా నిజాయితీ అనుకుంటే పొరపాటేనని స్థానికులే చమత్కరిస్తుంటారు. రైలు నష్టంలో నడిచే పరిస్థితి కనుక ఎదురైతే రైల్వే డిపార్ట్మెంట్ ఈ రైలును ఆపేస్తుందేమోననే భయంతోనేనంటారు వాళ్లు. -
పర్యాటకులకు పండగే...
‘వినాయకసాగర్ ’ ఏర్పాటుకు కసరత్తు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు ఈనెల 9న సీఎంకు సమగ్ర నివేదిక వాటర్ స్పోర్ట్స్.. టాయ్‌ట్రైన్ ఇలా పర్యాటకులను ఆకట్టుకునేలా వినాయక్ సాగర్‌ను అధికారులు తీర్చిదిద్దనున్నారు. పది నెలల్లో ఇందిరాపార్కుకు సరికొత్త రూపు తీసుకురానున్నారు. 12 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు రూపొందించారు. దీనిని ఈ నెల 9న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు అందిచనున్నారు. హైదరాబాద్: నగరంలోని ప్రధాన పార్కుల్లో ఒకటైన ఇందిరాపార్కు రానున్న పదినెలల్లోగా సరికొత్త రూపు సంతరించుకోనుంది. ఇందిరాపార్కులో వినాయక నిమజ్జనం నిర్వహించేలా వినాయకసాగర్ పేరుతో సరస్సును నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఆ మేరకు పార్కులో ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 76 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇందిరాపార్కుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో రాక్గార్డెన్తోపాటు ల్యాండ్‌స్కేప్ గార్డెన్ తదితర ఆకర్షణలున్నాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ల్యాండ్‌స్కేప్‌లు, సహజసిద్ధ శిలలు, స్కేటింగ్ రింగ్, టెన్నిస్ కోర్టు, రోజ్ గార్డెన్లతో పాటు గంధపు చెట్లు, మామిడి, అల్ల నేరేడు తదితర పండ్ల చెట్లతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ వినాయక చెరువు నిర్మాణానికి సుమారు 12 ఎకరాల స్థలం సరిపోతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. వినాయకసాగర్‌లో ఇలా.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ వైపు, ట్యాంక్‌బండ్ వైపు దాదాపు 2.5 కిలోమీటర్ల దూరాన్ని వినియోగిస్తున్నట్లు అంచనా వేశారు. అంతకు తగ్గకుండా ఇందిరా పార్కులోనూ సరస్సును ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంతే కాకుండా ఏడాదిలో దాదాపు నెల రోజులపాటు వినాయక నిమజ్జనం కార్యక్రమాలుంటాయి కనుక మిగతా 11 నెలల్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వాటర్ స్పోర్ట్స్‌కు, పిల్లలను ఆకట్టుకునేలా టాయ్‌ట్రైన్ తదితర సదుపాయాలు కల్పించేందుకు అవకాశాలున్నాయని గుర్తించారు. టాయ్ ట్రైన్ బోగీలపైకి విగ్రహాలను చేర్చి.. అక్కడి నుంచి చెరువులోకి విగ్రహాలను వదిలేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీటిని నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుందని అంచనా వేశారు. నిమజ్జనం సందర్భంగా ఇబ్బందుల్లేకుండా అవసరమైన రహదారుల్ని అదనంగా నిర్మించే యోచనలో ఉన్నారు. ఇందిరాపార్కుకు ప్రవేశ రుసుము, పార్కింగ్ ఫీజు, సినిమా షూటింగ్‌లు తదితరమైన వాటిద్వారా ప్రస్తుతం ఏటా రూ. 25 లక్షల ఆదాయం లభిస్తోంది. కొత్తగా చేసే ఏర్పాట్లతో మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. సరస్సు ఏర్పాటుతోపాటు వివిధ అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వానికి సమర్పించే పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో రెండు మూడు రాకల ప్రతిపాదనలు, డిజైన్లు, ప్రత్యామ్నాయ మార్గాలతోపాటు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. -
నెరూల్‌లో నీటికి కటకట
సాక్షి, ముంబై: నెరూల్ రైల్వే స్టేషన్లో తాగునీరు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రైల్వే స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతమైన మాథేరాన్‌ను సందర్శించేందుకు రోజుకు కొన్ని వేల మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇక్కడి నుంచి టాయ్ ట్రైన్‌ను ఆశ్రయించి మాథేరాన్ వెళుతుంటారు. గత మూడు రోజుల నుంచి ఇక్కడ తాగునీరు లభించక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్‌కు మంచి నీరు సరఫరా చేస్తున్న స్థానిక గ్రామ పంచాయతీ ఇటీవల ధరను పెంచడంతో అందుకు సెంట్రల్ రైల్వే ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో సదరు గ్రామ పంచాయతీ నెరూల్ స్టేషన్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. కాగా, నెరూల్ గ్రామ పంచాయతీతో మంచి నీటి సరఫరా కోసం మూడేళ్ల కాంట్రాక్ట్‌ను సెంట్రల్ రైల్వే కుదుర్చుకుంది. ఇందుకుగాను సెంట్రల్ రైల్వే రూ.1.71 లక్షలు చెల్లించింది. అయితే ఈ కాంట్రాక్ట్ గడువు పూర్తి అవడంతో సదరు గ్రామ పంచాయతీ మంచి నీటి సరఫరా కోసం రూ.3.42 లక్షలను పెంచింది. దీంతో సెంట్రల్ రైల్వే పెంచిన మొత్తాన్ని అంగీకరించలేదు. దీంతో గ్రామ పంచాయతీ ఈ స్టేషన్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. ఈ విషయమై సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ...ఈ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఓ బావి నుంచి స్టేషన్ వరకు మంచి నీటి పైప్లైన్లను అమర్చామన్నారు. దీనిద్వారా నీటి సరఫరా చేస్తున్నామని సెంట్రల్ రైల్వే పీఆర్వో ఎ.కె.సింగ్ తెలిపారు. కాగా, మాథేరాన్‌ను సందర్శించేందుకు వేసవి కాలంతో పాటు చలి కాలంలో రోజుకు దాదాపు 20,000 మంది పర్యాటకులు నెరూల్కి వస్తుంటారు. ఈ స్టేషన్లో టాయ్ ట్రైన్ సేవల కోసం రోజుకు రూ.25,000 టికెట్లను సెంట్రల్ రైల్వే విక్రయిస్తోంది. అయితే సెలవులను పురస్కరించుకొని టికెట్ ధరలను పెంచుతోంది. కాగా, ఆరు టాయ్ ట్రైన్లు మాథేరాన్ గుట్టపై ఉన్న అమన్ లాడ్జీ వరకు సేవలను అందిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు టాయ్ ట్రైన్ సేవల వల్ల సెంట్రల్ రైల్వేకు రూ.1.56 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే గతంలో ఇదే సమయంలో కేవలం రూ.53 లక్షలను మాత్రమే సెంట్రల్ రైల్వే ఆదాయంగా పొందింది. -
విహారం: నీలగిరులు.. పడమటి పూలబుట్ట
కూ... చుక్... చుక్... టాయ్ ట్రైన్ నీలగిరుల పర్యటనలో టాయ్‌ట్రైన్ ప్రయాణం మధురానుభూతి. మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు నడిచే ఈ లైన్‌ను నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ అంటారు. ఉదయం ఏడు గంటలకు మెట్టుపాలయంలో బయలుదేరి మధ్యాహ్నానికి ఊటీ చేరుతుంది. అదే రైలు తిరిగి మూడింటికి బయలుదేరి ఆరున్నరకు మెట్టుపాలయం చేరుతుంది. వేసవిలో రెండు రైళ్లు తిరుగుతాయి. ఈ రైలు ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందంటే... ‘కూర్చుని కూర్చుని కాళ్లు పట్టేశాయనిపిస్తే రైలు దిగి నాలుగడులు వేసి తిరిగి రెలైక్కవచ్చు’ అని జోకులేస్తారు ఇందులో ప్రయాణించిన వాళ్లు. ఈ రెలైక్కడంలో ఉద్దేశం త్వరగా ఊటీ చేరడం కాకూడదు. కొండలు, సన్నని మలుపులు, పచ్చదనాలలోని లాలిత్యాలను ఆస్వాదిస్తూ చల్లదనంతో సేదదీరడమే అయి ఉండాలి. నీలగిరులు... ఈ కొండలు పన్నెండేళ్లకోసారి నీలాలను ఒలకబోస్తాయి. పుష్కర కాలానికోసారి ఈ కొండల మీద నీలం రంగులో మెరుపులీనే కురింజి పూలు ఈ కొండలకు నీలగిరులు అనే పేరుని తెచ్చిపెట్టాయి. నీలగిరులు అనగానే మనకు గుర్తొచ్చే పర్యాటక ప్రదేశం ఊటీ. అయితే అంతకంటే సుందరమైన ప్రదేశం ఊటీకి 17 కిలోమీటర్ల దూరాన ఉన్న కూనూర్. డెబ్బై, ఎనభైలలో సినిమా షూటింగులన్నీ ఇక్కడే జరిగేవి. లాంబ్స్ రాక్, డాల్ఫిన్స్ నోస్, లేడీ కేనింగ్ సీట్, లాస్ ఫాల్స్, డ్రూంగ్ హిల్స్, సిమ్స్ పార్క్, టీ తోటలు, టీ ఫ్యాక్టరీలు... ఊటీ, కూనూర్, కోటగిరి వేసవి విడుదుల్లో పర్యాటకులను అలరించే విశేషాలు. సిమ్స్ పార్కు అప్పర్ కూనూర్‌లో ఉంటుంది. ముప్పై ఎకరాల్లో విస్తరించిన సిమ్స్ పార్కులో ఉన్న పూలమొక్కలు, పైన్ లాంటి వృక్షజాతులు, ఫెర్న్ వంటి గుబుర్లు వెయ్యి రకాలు ఉంటాయి. ఏటా మే నెలలో ఈ పార్కులో పండ్లు, కూరగాయల ప్రదర్శన నిర్వహించడం సంప్రదాయం. ఈ పార్కుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే... బ్రిటిష్ పాలనకాలంలో నీలగిరుల అటవీ శాఖ అధికారి జె.డి సిమ్స్ ఈ పార్కుని అభివృద్ధి చేశాడు. ఈ పార్కు అప్పట్లో మనదేశంలో ఉద్యోగం చేస్తున్న తెల్లవాళ్లకు వేసవి విడిది, వారాంతపు హాలిడే హోమ్. వాల్మీకి రామాయణంలో నీలగిరుల ప్రస్తావన ఉంది. కూనూరుకి మూడు కిలోమీటర్ల దూరాన హులికల్ దుర్గ్ ఉంది. ఇది బకాసురుడు నివసించిన ప్రదేశం అని చెబుతారు. దీనిని ఇప్పుడు టైగర్ రాక్‌ఫోర్ట్ అని పిలుస్తున్నారు. డాల్ఫిన్స్ నోస్ పాయింట్ నుంచి కేథరీన్ఫాల్స్ కనిపిస్తుంది. కూనూర్ జంక్షన్ నుంచి మెట్టుపాలయం రూట్లో ప్రయాణిస్తుంటే నీలగిరి కొండలు, బండరాళ్ల చాటు నుంచి ‘ఇక్కడ మేమూ ఉన్నాం చూడండి’ అంటున్నట్లు రెండు జలధారలు కూనూర్ నదిలోకి దూకుతుంటాయి. అవే లాస్ ఫాల్స్. కూనూర్ నుంచి 17 కిలోమీటర్లు ప్రయాణిస్తే డ్రూంగ్ వస్తుంది. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న కోటలో మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ విహారానికి వచ్చినప్పుడు బస చేసేవాడు. ఈ కోట నుంచి విస్తారమైన కొండలు, లోయల మధ్య ఉన్న పీఠభూములు కనిపిస్తాయి. ఈ వ్యూ చూడడానికే ఈ కోటకు వెళ్తారు. బహుశా టిప్పుసుల్తాన్ కూడా గొప్ప ప్రకృతి ప్రేమికుడు అయి ఉండవచ్చు. అందుకే ఇంత చక్కటి వ్యూ ఉండే ప్రదేశంలో కోట కట్టుకున్నాడు. కూనూర్ నుంచి లాంబ్స్ రాక్కెళ్లే మధ్యలోనే కనిపిస్తుంది లేడీ కేనింగ్స్ సీట్. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ భార్య లేడీ కేనింగ్. ఆమె నీలగిరుల్లో విహారానికి వచ్చినప్పుడు ఇక్కడే ఎక్కువ సేపు గడిపేది. దాంతో ఈ ప్రదేశానికి లేడీ కేనింగ్స్ సీట్‌గా నామకరణం చేసేశారు. ఇక్కడి నుంచి చూస్తే చుట్టూ విస్తారమైన టీ తోటలు, వాటి మీదుగా కనుచూపు మేరలో లాంబ్స్ రాక్, డ్రూంగ్, లాంప్టన్స్ పీక్ కనిపిస్తాయి. వీటితోపాటు దూరంగా మెట్టుపాలయం రోడ్డు కూడ కనిపిస్తుంది. ఆ దారి వెంట ఊటీ చేరగానే బొటానికల్ గార్డెన్ స్వాగతం పలుకుతుంది. ఇది అరవై ఎకరాల ఉద్యానవనం. ఇక్కడ ఏటా మే నెలలో జరిగే ఫ్లవర్ షో చూడడానికి రెండు కళ్లు చాలవు. ఈ గార్డెన్లో 20 మిలియన్ల ఏళ్ల నాటి మహావృక్షం ఉంటుంది. ఇక్కడి నుంచి ఊటీ సరస్సు వైపుగా వెళ్తే పడవలో విహరిస్తున్న పర్యాటకులతో ఆ ప్రదేశమంతా సందడిగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ బోట్‌హౌస్, దాని పక్కనే ఉన్న మినీ గార్డెన్. ఊటీ సరస్సులో పెడల్ బోట్, రోయింగ్ బోట్, మోటార్ బోట్లు ఉంటాయి. ఇక్కడ గిన్నిస్ రికార్డుకెక్కనున్న ఒక విచిత్రం త్రెడ్ గార్డెన్. ఈ తోటలో కనిపించే పూలు, ఆకులు, రాళ్లు, వంతెనలు కూడా దారంతో చేసినవే. ఈ గార్డెన్ కోసం 50 మంది మహిళలు పన్నెండేళ్లు శ్రమించారు. ఈ విచిత్రం గిన్నిస్ రికార్డు కోసం నామినేట్ అయింది. దాదాపుగా రెండు వందల యేళ్ల కిందట నిర్మించిన ఈ సరస్సులో చేపల వేట సరదాగా ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా చేపలు దొరకవు. ఫిషింగ్‌కి ముందుగా అనుమతి తీసుకోవాలి. చేపల వేట ప్రయత్నం పూర్తయ్యాక ఊటీలో ఇంకా చూడాల్సినవి ఏంటని ఆరా తీస్తే దొడబెట్ట గురించి చెబుతారు. ఇది నీలగిరుల్లో ఎత్తై శిఖరం. నిలబడిన చోటు నుంచి కదలకుండా ఊటీ మొత్తాన్ని చూడాలంటే ఇదే సరైన ప్రదేశం. ఊటీని వదిలిన తర్వాత కనిపించే హిల్‌స్టేషన్ కోటగిరి. ఊటీ, కూనూర్లతో పోలిస్తే ప్రశాంతమైన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి మరో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొడనాడు వ్యూ పాయింట్ వస్తుంది. ఇది నీలగిరుల చివరి భాగం. ఇక్కడి రంగస్వామి శిఖరం, మేయార్ నది, ‘తోడ’ గిరిజనుల ఇళ్లు, ముకూర్తి శిఖరం, గోపాల స్వామి బెట్ట మీద ఉన్న పురాతన ఆలయం చూడవచ్చు. బందిపూర్ సాంక్చురీ, మధుమలై రిజర్వ్ ఫారెస్టు చూడాలంటే ఒక రోజు కేటాయించాలి. ఇక ఇక్కడ చివరగా చూడాల్సింది వంద అడుగుల ఎత్తు నుంచి దూకే కాల్హట్టి జలపాతం. కాలహట్టి, మసినగూడి లోయల్లోకి జాలువారే నీటిధారలు, వన్యప్రాణులు పర్యాటకులను అలరిస్తుంటాయి. జనవరిలో నీలగిరుల్లో పర్యటిస్తే ఊటీలో జరిగే టీ అండ్ టూరిజం ఫెస్టివల్‌ని మిస్ కాకూడదు. అలాగే టీ ఫ్యాక్టరీలలో ఇచ్చే టీ తాగకుండా ఈ పర్యటన ముగించకూడదు. ఎలావెళ్లాలి? సమీప విమానాశ్రయం: కోయంబత్తూర్. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కి ఎకానమీ క్లాస్ టిక్కెట్ 3-4 వేల రూపాయల మధ్య ఉంటుంది. ప్రయాణ సమయం ఒకటిన్నర గంట. స్పైస్‌జెట్, జెట్ కనెక్ట్, జెట్ ఎయిర్ సర్వీసులు నడుస్తున్నాయి. కోయంబత్తూర్ నుంచి ఊటీకి 85 కి.మీ.లు. రెండున్నర గంటల ప్రయాణం. గుడలూర్, మధుమలై రిజర్వ్‌ఫారెస్ట్, మెట్టుపాలయం, కూనూర్ల మీదుగా ఊటీ చేరాలి. సమీప రైల్వేస్టేషన్: కోయంబత్తూర్ జంక్షన్. హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్), కొంగు ఎక్స్‌ప్రెస్(కాచిగూడ)లు ఉన్నాయి. 20 గం॥ప్రయాణం. పర్యటనలో మైసూర్ ఉంటే జెపి మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో మైసూరులో దిగి రోడ్డు మార్గాన నీలగిరులను చేరవచ్చు. ఎక్కడ ఉండాలి? హోటల్ దర్శన్ ఊటీ సరస్సు దగ్గరగా ఉంటుంది. ఇందులో గది అద్దె ఒక రోజుకి 1,400 రూపాయలు. ‘స్టెర్లింగ్ ఫెర్న్‌హిల్ ఊటీ’ అంతర్జాతీయ ప్రమాణాలున్న త్రీస్టార్ హోటల్. ఇందులో అద్దె మూడువేలు. కురుంబ విలేజ్ రిసార్టులో కాటేజ్ అద్దె తొమ్మిది వేల రూపాయలు. బడ్జెట్ అకామడేషన్ కావాలంటే కూనూర్ స్టేషన్ ఎదురుగా వెంకటేశ్వరా లాడ్జ్‌లో గది 450 రూపాయలు. భోజనం ఎలా? ‘లాబెల్లె వీ’ కూనూర్‌లో పేరున్న ఫ్రెంచ్ క్విజిన్. ఇండియన్ క్విజిన్ ‘క్వాలిటీ రెస్టారెంట్’. కురుంబ విలేజ్ రిసార్టులో ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ రుచులు దొరుకుతాయి. రుచికరమైన ఎగ్‌బిర్యానీ గ్రీన్‌ఫీల్డ్ రెస్టారెంట్‌కి వెళ్లాలి. బర్గర్, హాట్‌డాగ్ వంటి ఫాస్ట్‌ఫుడ్, రుచికరమైన కాఫీ కావాలంటే ‘చెరీ బ్రూస్’ని సందర్శించాలి. షాపింగ్! త్రెడ్ గార్డెన్ నుంచి త్రెడ్ప్లాంట్లు, టీ పొడి, యూకలిప్టస్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, హీనా ఆయిల్, నీలగిరి తైలం, తేనె. ఇంకా ఏమేమి చూడవచ్చు! వ్యాలీ వ్యూ పాయింట్... కూనూర్‌కి దగ్గరగా ఉంటుంది. ఈ లోయలో 21 గ్రామాలున్నాయి. ఇక్కడ హిందీ సినిమా సాజన్ చిత్రీకరణ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ మెమోరియల్ పిల్లర్... కూనూర్‌లో ఉంది. ఇక్కడి విల్లింగ్టన్ గోల్ఫ్‌కోర్సులో రాజా హిందూస్తానీ సినిమా పాటల చిత్రీకరణ జరిగింది. మయూర్ టీ ఎస్టేట్‌లో విహారం... ఇది మయూర్ మాల్వానీది. ఇతడు సినీనటి ముంతాజ్ భర్త. పాతిక వేల ఎకరాల ఎస్టేట్ ఇది. ఎస్టేట్‌లో ఉన్న టీ షాప్‌లో చాకొలెట్ టీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడే రకరకాల టీ పొడులు కొనుక్కోవచ్చు. కురింజి పూలు 2006లో పూశాయి. మళ్లీ ఈ పూలు పూసేది 2018లోనే.