Traffic challans
-
తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ట్రాఫిక్ ఛలాన్ల రాయితీ గడువును మరోసారి పెంచారు. వచ్చే నెల(ఫిబ్రవరి) 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పొడిగింపు ఉండదని అధికార వర్గాలు వెల్లడించినా.. పొడిగింపు వైపే ప్రభుత్వం మొగ్గు చూపించినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు. తొలుత పదిహేను రోజులపాటు అవకాశమిచ్చిన పోలీసులు ఆ తర్వాత జనవరి 10 నుంచి ఈ నెలాఖరు వరకు పొడిగించారు. .. తద్వారా పెండింగ్ చలాన్ల రాయితీ చెల్లింపులకు నెల రోజులకు పైగా సమయం దొరికింది. ఇక.. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. -
TS: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
హైదరాబాద్, సాక్షి: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టి(జనవరి 10)తో ముగియాల్సి ఉంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని... గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతూ వచ్చారు. మొత్తం పెండింగ్ చలాన్లు 3 కోట్ల 9 లక్షల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు కోటీ 7 లక్షల మంది మాత్రమే ఛలాన్లు చెల్లించగా.. రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో గడువును పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గడువు పొడిగించిన నేపథ్యంలో.. ఇంకా ఎవరైనా చెల్లించకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
TS Challan: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు నేడే ఆఖరు
నిజామాబాద్: రాయితీపై ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం బుధ వారం ముగియనుంది. కొంత మంది వాహనాదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు స్పందించడంలేదు. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాహనాలకు కూడా జరిమానాలు ఉన్నా ఇంకా చెల్లించనట్లు తెలుస్తోంది. వాహనా లకు ఉన్న జరిమానాలను ఆర్టీసీ బస్సులపై 90శాతం, టూ వీలర్, త్రీవీలర్ వాహనాలకు 80శాతం, ఫోర్ వీలర్, భారీ వాహనాలపై 60 శాతం సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించి నేటి వరకు గడువు విధించింది. 2018 నుంచి 2024 జనవరి 8 నాటికి జిల్లాలో 5 లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 30 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. సోమవారం నాటికి 2.25 లక్షల కేసులకు రూ. 2.50 కోట్లు చెల్లించారు. ఇంకా జిల్లాలో 2.75 లక్షల వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గడువు పెంచాలంటున్న వాహనదారులు ప్రజాపాలన కార్యక్రమం కారణంగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడానికి మీ సేవ, ఆధార్ సెంటర్లు ప్రజలతో సందడిగా మారడంతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేకపోతున్నామని వాహనాదారులు చెబుతున్నారు. ఆన్లైన్, పేటీఎం ద్వారా చలాన్లు చె ల్లించడానికి అవగాహన లేకపోవడంతో చెల్లించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం గడువు పెంచితే చెల్లిస్తామని చెబుతున్నారు. వెంటనే చెల్లించాలి రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు ప్రభుత్వం ఇచ్చిన గడువు బుధవారం ముగుస్తుంది. జిల్లా లోని వాహనదారులు తమ వాహనాలపై ఉన్న చలాన్లను వెంటనే చెల్లించుకోవాలి. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువు పెంపునకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. – నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, నిజామాబాద్ -
TS: చలాన్ల చెల్లింపులపై భారీ స్పందన.. రూ. 67 కోట్లు వసూలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో వాహనాదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76లక్షలకు పైగా చలాన్లను క్లియర్ చేసుకున్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ కట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 77 లక్షల చలాన్లు క్లియర్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ చలాన్లకు సంబంధించి శనివారం వరకు రూ. 67 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. ట్రాఫిక్ చలాన్ల వెబ్సైట్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఫేక్ చలాన్ వెబ్సైట్లను నిలిపివేశామని తెలిపారు. మరోవైపు.. చలాన్ల పెండింగ్‌పై వాహనదారుల స్పందనను గమనించిన ప్రభుత్వం.. చలాన్ల చెల్లింపులపై మరింత వెసులుబాటు కల్పించింది. ఈనెల పదో తేదీ వరకు డిస్కౌంట్‌తో చలాన్లను చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. -
ఆఫర్ ఉందని చలాన్లు కడుతున్నారా ?..జాగ్రత్త !
-
3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకుంటు న్నారు. 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లకు సంబంధించి రూ.8.44 కోట్ల మేర జరిమానాలను చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ వర్గాలు వివరాలు వెల్లడించాయి. హైదరా బాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్లతో రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరి ధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపుతో రూ.1.80 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93 వేల చలాన్ల నుంచి రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు. -
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ సర్కార్ జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బైక్‌లు, ఆటోలకు 80 శాతం.. బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ వెహికల్స్‌కు 60 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరిట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రూ ల్స్‌ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ఇదీ చదవండి: ‘బావ-బావమరిది చెమట కక్కి సంపాదించారా?’ -
త్వరపడండి చలాన్లపై భారీ డిస్కౌంట్
-
TS: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై చలాన్ల మొత్తంలో 80 శాతం రాయితీ ఇచ్చింది. అలాగే కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్ల మొత్తంలో 60 శాతం రాయితీని, ఆర్టీసీ డ్రైవర్లకు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీని ప్రకటించింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించడంతో పోలీస్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. https://echallan. tspolice.gov.in/publicview/ వెబ్సైట్లో వాహనదారులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ చలాన్ల విలువ రూ. 800 కోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉండగా వాటి విలువ సుమారు రూ. 800 కోట్ల వరకు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రాయితీలు కల్పించడం వల్ల పెండింగ్‌లో ఉన్న చలాన్లను వాహనదారులు చెల్లిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో మెగా జాతీయ లోక్ అదాలత్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై ఇదే తరహాలో ఇచ్చిన డిస్కౌంట్‌ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు సద్వినియోగం చేసుకోగా జిల్లాల్లోని వాహదారులకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన లేక ఆశించినట్లు వినియోగించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. అప్పట్లో సుమారు రూ. 350 కోట్ల మేరకు రాయితీలను ఉపయోగించుకొని వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. రాయితీలు ఇలా.. ద్విచక్ర వాహనాలు,ఆటోలు 80% కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు 60% ఆర్టీసీ డ్రైవర్లు,తోపుడు బండ్లకు..90% -
TS: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ల చెల్లింపుల్లో వాహనదారులకు ఊరట అందించింది. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చారు. చలాన్ల చెల్లింపులో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. చలాన్లలో డిస్కౌంట్ ఇలా.. ►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్ ► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్ ►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్. కాగా, నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. -
TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్?
హైదరాబాద్, సాక్షి: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు గతంలో చేపట్టిన కార్యాచరణను మరోసారి అమలు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో అతిత్వరలో చలాన్లపై రాయితీల ప్రకటన అధికారికంగా చేయనుంది. అయితే ఈసారి ఆ రాయితీలు భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా.. చిన్నచిన్న పట్టణాల స్థాయి దాకా ఉల్లంఘనకు ఛలాన్ల విధింపు ఉంటోంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ పని మరింత సులభతరం అయ్యింది. అయినా కూడా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్ చలాన్ల సంఖ్య పెరిగిపోతోంది. నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని.. అదీ కొత్త ఏడాది కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు సమాచారం. న్యూఇయర్‌కి.. కుదరకుంటే జనవరి చివరకు దీనిపై ప్రకటన చేయొచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. గతంలో.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. ఇదీ చదవండి: వైన్ షాపులు.. కావవి బార్లు! -
ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా..
హర్యానా: హర్యానాలో హవాల్దార్ జనక్, ఓంబీర్ అనే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ట్రాఫిక్ చలాన్ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో కాకుండా తమ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకుంటూ దాదాపుగా మూడు కోట్లు దోచుకున్నారు. ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ జనక్ పోలీసులకు పట్టుబడగా మరో కానిస్టేబుల్ ఓంబీర్ మాత్రం పరారీలో ఉన్నాడు. పాల్వాల్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీగ లాగితే.. కొద్దీ రోజుల క్రితం హర్యానా ఎస్పీ లోకేంద్ర సింగ్ మే నెలలో విధించిన ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన నివేదికను కోరగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న జనక్, ఓంబీర్ ఇద్దరూ చేతులు కలిపి ఈ చలానా సొమ్ములో చిన్నమొత్తాన్ని ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లలో వేస్తూ మిగిలింది తమ ఖాతాలోకి దారి మళ్లించారు. ప్రభుత్వ అకౌంట్లో కాకుండా.. ట్రాఫిక్ డీఎస్పీ సందీప్ మోరే తెలిపిన వివరాల ప్రకారం.. చాలా కాలంగా మా ఖాతాలో ఏ రోజుకు ఆ రోజు వేయాల్సిన సొమ్మును 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉండటంతో అనుమానం వచ్చి జనవరి 2020 నుండి మార్చి 2023 వరకు రికార్డులను పరిశీలిస్తే ఈ స్కాం బయటపడింది. ఈ కానిస్టేబుళ్లు ఇద్దరూ కలిసి కరోనా సమయం నుండి మొదలుపెట్టి ఇప్పటివరకు సుమారు 3.23 కోట్లు స్వాహా చేశారని తెలిపారు. మూడు సంవత్సరాల నుండి.. 2020 జూన్, అక్టోబర్ నెలల్లో మొత్తం రూ. 14 లక్షలు చలాన్ల రూపంలో రావాల్సి ఉండగా వీరు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని తెలిపారు. బహుశా నకిలీ చలాన్లు సృష్టించి వీళ్ళు మాయ చేసుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు 1 నుండి 31 వరకు సుమారు రూ. 1.4 లక్షలు డిపార్ట్ మెంటుకు రావాల్సి ఉండగా అందులో రూ.14,500 తగ్గిందని, అక్టోబరులో రూ.1800 తగ్గిందని ఇలా వీరు గడిచిన మూడు నాలుగేళ్ళలో కేవలం రూ.30 లక్షలు మాత్రమే డిపార్ట్ మెంట్ ఖాతాలో వేసి మిగిలిన రూ.3.23 కోట్లు కాజేశారని తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు.. -
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ చలాన్లతో వేధిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఆరోపించారు. శనివారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చాటుగా ఉండి ఫొటోలు తీసి, చలాన్లు వేస్తున్నారని తెలిపారు. కృష్ణానదీ జలాల పంపిణీ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. వర్షాలొస్తే కుంటలు ఉప్పొంగి పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయమతున్నాయని, ఈ నేపథ్యంలో జలాశయాలకు మరమ్మతులు చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ బోర్డుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, ఈ పథకం కింద చికిత్సలకు నిధులు పెంచాలని కోరారు. వివి ధ కారణాలతో తొలగించిన హోంగార్డులను మానవీయకోణంలో తిరిగితీసుకోవాలన్నారు. -
వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!
బెంగళూరు: పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫిబ్రవరి 11 వరకు చలాన్లపై 50 శాతం డిస్కంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వాహనదారులు పేటీఎం, ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. అందరికీ న్యాయం చేకూర్చేలా ట్రైఫిక్ ఫైన్లపై రాయితీ కల్పించాలని కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తీర్మానం చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు ఈ ప్రతిపాదన పంపింది. దీంతో కర్ణాటకవ్యాప్తంగా చలాన్లపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రవాణా శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 11 వరకు విధించే ట్రాఫిక్ చలాన్లపై 50శాతం డిస్కంట్ వర్తిస్తుందని చెప్పింది. అయితే ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. చదవండి: దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని.. -
బాబోయ్ చలాన్ల బాదుడు.. అలా చేస్తే 2వేలు, 10వేల వరకు జరిమానా
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మోటారు వెహికల్ యాక్ట్‌లో తాజాగా కీలక సవరణలు చేసింది. ఈ మేరకు జరిమానాల మోత మోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త రోడ్డు భద్రతా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సాక్షి, చెన్నై: రాజధాని చెన్నై సహా అనేక నగరాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. కేవలం సిటీ దాటేందుకే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనూ కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే అనేక ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారిని, త్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా దూసుకెళ్లే కుర్ర కారును, రాత్రుల్లో మద్యం తాగి నడిపే వారిని, బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకునే వారిని ఇకపై ఊపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్‌లో సవరణలు చేసింది. ఫలితంగా జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలు కూడా మరింత కఠినమయ్యాయి. ఇందుకు తగ్గట్లు చెన్నైలో అనేక మార్గాల్లో పెద్దఎత్తున నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నేరగాళ్లను, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టనున్నారు. అమల్లోకి కొత్త జరిమానాలు.. ఇకపై అతివేగంగా వాహనం నడిపే వారికి తొలిసారి రూ. 1000, మళ్లీ పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు రూ. 2 వేల విధించనున్నారు. మానసికంగా, ఆరోగ్య రీత్యా సామర్థ్యం లేని వారు వాహనాలు నడిపితే తొలిసారి రూ. 1000, రెండోసారి రూ. 2 వేలు వసూలు చేస్తారు. అంబులెన్స్, అగ్నిమాపక వంటి అత్యవసర సేవల వాహనాలకు దారి ఇవ్వకుండా వ్యవహరించే వాహనదారులకు విధించి ఫైన్‌ను రూ. 10 వేలుకు పెంచారు. నిషేధిత ప్రాంతాల్లో హారన్ ఉపయోగిస్తే రూ. 1000, రిజిస్ట్రేషన్లు సక్రమంగా లేని వాహనాలకు తొలిసారి రూ. 2,500, తర్వాత రూ. 5,000 , అధిక పొగ వెలువడే వాహనాలకు రూ. 10 వేలు, బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారి నుంచి రూ. 10 వేల వరకు ఫైన్ వసూలు చేస్తారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి రూ. 1000, సిగ్నల్ దాటితే రూ. 500 జరిమానాగా నిర్ణయించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకూ ఆ అధికారం.. ట్రాఫిక్ పోలీసులే కాదు, ఇకపై లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్ఐ, ఆ పైస్థాయి అధికారుల కూడా వాహనాలు తనిఖీ చేసేందుకు, జరిమానా విధించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు మోటారు వెహికల్ యాక్ట్‌లో మార్పులు చేశారు. రవాణాశాఖ చెక్‌పోస్టులు మినహా తక్కిన అన్ని ప్రాంతాల్లో పోలీసులు జరిమానా విధించే నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. -
హెల్మెట్ లేకుంటే నా ‘తోపుడు బండి’ని ఆపేస్తారు సార్..!
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఎవరూ లేరు కదా అని హెల్మెట్ పెట్టుకోకపోయినా.. నిఘా కెమెరాల ద్వారానే చలాన్లు జారీ చేస్తున్నారు పోలీసులు. దీంతో భారీగా జారీ అవుతున్న చలాన్లతో ప్రజలు బెబెలెత్తిపోతున్నారు. కొందరు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారుకూడా. ఈ క్రమంలో తోపుడు బండిపై కూరగాయలు విక్రయించే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుంటే నా బండిని పోలీసులు ఆపేస్తారు సార్ అంటూ అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియోను షాకాస్మ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. తోపుడు బండికి హెల్మెట్ ఎందుకు ధరించావని వీడియో తీసిన వ్యక్తి అడిగాడు. దానికి,హెల్మెట్ లేకుంటే పోలీసులు అడ్డుకుంటారని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఈ నిబంధన కేవలం బైక్‌లకు మాత్రమేనని ఆ వ్యక్తికి వివరించే ప్రయత్నం చేశాడు వీడియో తీసిన వ్యక్తి. ట్విటర్లో వీడియో షేర్ చేస్తూ బ్రదర్ నీ తెలివి అమోఘం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అక్టోబర్ 9వ తేదీన వీడియో పోస్ట్ చేయగా.. 28,800వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫైన్లు వేస్తున్నారనే కారణంగా అమాయకులు భయపడుతున్నారు, చాలా బాధకరమైన విషయం, సరైన అవగాహన లేదు అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. కొందరి తప్పుడు సూచనలతో అమాయకులు భయపడుతున్నారంటూ మరొకరు పేర్కొన్నారు. Bhai apka knowledge to Kamal hai bhai 🤣🤣 pic.twitter.com/twjvQhNe6a — ShaCasm (@MehdiShadan) October 9, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లపై వాహనదారుల గరంగరం
-
పోలీసుల చలాన్లపై వాహనదారులు గరంగరం.. మైత్రివనంలో హైటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తమ బైక్‌లపై ట్రాఫిక్ చలాన్ విధించారని మైత్రివనం దగ్గర ట్రాఫిక్ పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి బైక్ స్టాప్‌లైన్‌ను దాటించాడని బైక్‌పై పోలీసులు చలాన్ విధించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన బైకర్.. తన బైక్‌కు తానే నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు. కాగా, పోలీసులు నగరంలో చాలాచోట్ల ట్రాపిక్ నిబంధనలు పాటించని వారికి చలాన్లు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే తనిఖీల్లో పాత చల్లాన్లు ఉంటే కట్టాలని కూడా కోరుతున్నట్టు సమాచారం. అయితే, సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త రూల్స్ ఇవే.. ► స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా ► ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే 1,000 జరిమానా ► ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసినా జరిమానా విధిస్తారు. -
‘చలాన్ల బాదుడు.. కేసీఆర్ ఎన్ని కోట్లు వసూలు చేశారో తెలుసా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు. తాజాగా ప్రజల రక్తమాంసాలను పీల్చేస్తూ.. ట్రాఫిక్ చలాన్ల రూపంలో కేసీఆర్ సర్కార్ మరో స్కామ్ చేస్తోందని కాంగ్రెస్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మండిపడ్డారు. మధు యాష్కీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2014లో ట్రాఫిక్ చలాన్ల కేసులు 50 లక్షలుగా ఉండి ఫైన్ల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ. 95 లక్షలుగా ఉంది. ఇక, కేసీఆర్ సర్కార్ పాలనలో 2021లోనే కేసుల సంఖ్య 2 కోట్లకు పైనే ఉండగా.. చలాన్ వేసిన మొత్తం రూ.877 కోట్లకు చేరింది. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో 9 కోట్ల కేసులు పెట్టి.. రూ. 2,671 కోట్ల రూపాయలను ఫైన్లుగా వసూలు చేశారు. అర్దరాత్రి వరకూ బార్లకు, వైన్ షాపులకు అనుమతులు ఇచ్చి.. ఆయా షాపులు పక్కనే చీకట్లో మాటేసి, డ్రంకన్ డ్రైవ్ పేరుతో చలాన్లు బాదేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దారి దోపిడీ దొంగల కన్నాహీనంగా మారి చలాన్లు, ఫైన్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తోంది. ట్రాఫిక్ అధికారులను కేవలం ఫొటోలు తీసేందుకు, చలాన్లు రాసేందుకు మాత్రమే అన్నట్లుగా మార్చేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయలను దోచుకుని కూడా హైదరాబాద్ నగరంలో రోడ్లను మాత్రం బాగుచేయడం లేదు. చలాన్ల సొమ్మును ఎక్కడ ఖర్చు పెట్టిందే శ్వేత పత్రం విడుదల చేయాలి. ఔరంగజేబు జిజియా పన్ను వేసినట్లుగా కేసీఆర్ వాహనదారులపై చలాన్ల పన్నేస్తూ జేబులు గుల్ల చేస్తున్నాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు చలాన్లపై కేసీఆర్ సర్కార్‌ను నిలదీయాలి’’ అని కోరారు. ఇది కూడా చదవండి: మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు.. -
బ్రదరూ! అక్కడుంటాడొకడు.. క్లిక్మనగానే ఇంటికి డైరెక్టుగా ట్రాఫిక్ చలానా!
టాఫిక్ పోలీస్ లేడని దర్జాగా దూసుకెళ్లినా.. నిబంధనలు అతిక్రమించినా ఒకడున్నాడు చూడ్డానికి. ఇకపై కూడళ్ల వద్ద మిమ్మల్ని నిరంతరం పర్యవేక్షిస్తాడు. ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా క్లిక్‌మని జరిమానా వేసేస్తాడు. – కాజీపేట ఇకపై ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఎందుకంటే కాజీపేట చౌరస్తాలో ఇటీవల కొత్తగా ఆటోమెటిక్ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. చక్కగా తన పనితాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక ముందు బీట్ కానిస్టేబుల్ చౌరస్తాలో నిలబడి నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఫొటోలు తీసి జరిమానా విధించే పని ఉండదు. ఆటోమెటిక్ కెమెరాలు తీసిన ఫొటోల ఆధారంగా నేరుగా ఈ–చలానా ఇంటికే వచ్చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఈవిధానం అమలవుతుండగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికోసం వరంగల్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి నిర్వహణ కొనసాగించనున్నారు. (చదవండి: బిహార్‌లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు) ఈ నిబంధనలు పాటించాల్సిందే.. ► హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు ► రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు ► వాహనాలపై పరిమిత సంఖ్యలో ప్రయాణించాలి ► ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించొద్దు ► నంబర్ ప్లేట్ వంచొద్దు. స్టిక్కర్లు అంటించొద్దు. ఈవిధానంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రాంతం నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారి ఫొటోలు ఈకెమెరాల్లో నిక్షిప్తమై కంట్రోల్ కేంద్రం నుంచి ఆటోమెటిక్‌గా ఈ–చలానా వాహనదారులకు చేరేలా ఏర్పాటు చేశారు. త్వరలో ఏఎంపీఆర్ విధానం ఆటోమెటిక్‌గా ఇంటిగ్రెటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమలు అనంతరం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏఎంపీఆర్ (ఆటో మెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) అమలు చేయనున్నట్లు సమాచారం. ఎవరైనా తమ వాహనం నంబర్లో ఒక సంఖ్య తొలగించి వాహనం నడిపితే సీసీ కెమెరాల్లో ఆవాహనం ఫొటో నిక్షిప్తమై తొలగించిన నంబర్‌ను గుర్తు పడుతోంది. అనంతరం ఆయజమాని సెల్‌ఫోన్‌కు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తుంది. (చదవండి: లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
అన్న హత్యకు సుపారీ ఇచ్చిన ఘనుడు.. మన డీటీఓ సార్ భద్రునాయక్
ఆయన జీవితం ఆద్యంతం వివాదాస్పదమే.. వృత్తిలో.. నిజ జీవితంలో.. పుట్టి పెరిగిన ప్రదేశంలో.. పనిచేసే చోట ఎక్కడైనా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్న అతని నేర ప్రవృత్తి తార స్థాయికి చేరింది. పాపం పండటంతో తను పన్నిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సొంత అన్నను హత్య చేసేందుకు కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని, ఓ యువకుడి హత్యకు కారణమైన అతను పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఓ రౌడీ షీటరో.. పాత నేరస్తుడో కాదు.. ఈ ఘనతలన్నీ మన డీటీఓ సార్ భద్రునాయక్వే.. వికారాబాద్: రెండేళ్ల క్రితం వికారాబాద్ డీటీఓగా విధులు చేపట్టిన భద్రునాయక్‌కు వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. జిల్లాలో లారీల్లో ఓవర్ లోడ్ (కెపాసిటీకి రెండింతలు) వేసేందుకు ఓనర్ల నుంచి నెలనెలా మూమూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. ఓవర్‌లోడ్ కారణంగా.. వేసిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఇక లైసెన్సులు, ఫిట్నెస్, ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిమిత రుసుముకు మూడు నుంచి పది రెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇతని తీరును నిరసిస్తూ ఏకంగా డీటీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. వాహనదారులతో దురుసు ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు డీటీఓ భద్రునాయక్ తనను దుర్భాషలాడారని ఇటీవల ఓ వ్యక్తి చన్గొముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో పలువురు వాహనదారులు, ప్రజలు బాధితుడికి అండగా వచ్చారు. భద్రునాయక్ ఆగడాలపై మండిపడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా.. డీటీఓపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇందులో కొందరు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని పీఎస్‌లోనే పంచాయితీ పెట్టి.. బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయనపై కేసు నమోదు కాకుండా జిల్లా పోలీసులే గట్టెక్కించారని తెలిసింది. జిల్లా రవాణాధికారిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు శుక్రవారం సంచలనంగా మారాయి. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై శనివారం ఉదయం వరకు స్పష్టత లేకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది. వసూళ్లకు ముఠా ఏర్పాటు రెండేళ్లుగా వికారాబాద్ డీటీఓగా విధులు నిర్వహిస్తు న్న భద్రునాయక్ అనేక వివాదాలకు తెరతీసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదాయ వనరు లు సమకూర్చుకునేందుకు తన కార్యాలయానికి చెందిన కొందరు కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఆర్టీఏ బ్రోకర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా యి. ఈయన క్యాడర్ ఎంవీఐ అయినప్పటికీ తన పలుకుబడితో డీటీఓగా పోస్టింగ్ వేయించుకుని రెండేళ్లుగా వికారాబాద్‌లో తిష్ట వేయడం గమనార్హం. విచారణలో కొత్త కోణాలు సొంత అన్నను హత్య చేయించేందుకు రూ.కోటితో పాటు ఎకరం పొలం ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్న భద్రునాయక్‌ను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖల పనితీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నను హత్య చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం, భద్రునాయక్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీకి చెబుతానని సొంత అన్నే అతన్ని బెదిరిస్తూ రావడం, భద్రునాయక్ అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉండటం అవినీతి నిరోధక, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల నిఘా వైఫల్యాలను సూచిస్తోంది. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన ఆగడాలను ఉపేక్షిస్తుండటం ఆర్టీఏ ఉన్నతాధికారుల డొల్లతనం, లోపాయికారీ ఒప్పందాలను ప్రస్ఫుటం చేస్తోంది. ప్రవీణ్ హత్య కేసును విచారణ చేస్తున్న సూర్యాపేట పోలీసులు భద్రునాయక్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయగా.. అతనిపై చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేయించి, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేసిన మన జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. -
Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!
బంజారాహిల్స్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో 85 శాతం మంది యువతే ఉంటున్నారు. జైలుకు వెళుతున్న వారిలో సైతం ఎక్కువగా యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రతిరోజు వేర్వేరు చోట్ల శ్వాస విశ్లేషణ పరీక్షలు (బ్రీత్ ఎనలైజర్) నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. కేసు నమోదు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 85 శాతం మంది 18–40 ఏళ్ల వారే ఉంటున్నట్లు ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పరిధిలోని ఐదు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 300 పైన నమోదైన వారికి జైలుశిక్ష విధించారు. బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్‌కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. చదవండి👉🏻 ఖమ్మంలో వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం 485 మంది కోర్టులో హాజరు.. డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో వాహనం ఆపిన వెంటనే మద్యం తాగిన వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలో వచ్చిన కౌంట్‌ను జత చేసి న్యాయస్థానానికి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ బీఏసీ 300 దాటితే వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 2100 కేసులు నమోదు కాగా ఇందులో 485 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 9 మందికి జైలుశిక్ష పడింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండుసార్లు పట్టుబడ్డ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో నాలుగైదు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. చదవండి👉🏼 ‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు? తీరు మారడం లేదు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ట్యాబ్‌లో ఫీడ్ చేయగానే అంతకుముందే పట్టుబడ్డట్లుగా తేలింది. దీంతో ఆయనున న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవింగ్ లైసెన్స్‌రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీని ఆధారంగా కోర్టులు రెండు రోజుల నుంచి నెల రోజుల పాటు శిక్షలు వేస్తున్నాయి. చదవండి👉 కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య -
వాహనదారులకు అలర్ట్
-
వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం పొడిగించింది. చలాన్లపై రాయితీని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ హోం శాఖ ప్రకటించింది. పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటివరకు రూ.250 కోట్లు వసూలైనట్లు హోంశాఖ తెలిపింది. చదవండి: రేవంత్‌రెడ్డి చిప్పకూడు తింటావ్.. జాగ్రత్త..! రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు, ఈ అవకాశాన్ని పొడిగించాలని విజ్ఞప్తులు రావడంతో పొడిగించామని వివరించారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి కోరారు.