Tribal hordes
-
'తండాలను పంచాయితీలుగా మారుస్తాం'
నిజామాబాద్: గిరిజనుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. సుమారు 500 జనాభా ఉన్న ప్రతీ గిరిజనతండాను గ్రామపంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల నాటికి గ్రామపంచాయతీలు ఏర్పడతాయన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం కాజుభాగ్ తండాలో ఎంపీ కవిత సోమవారం పర్యటించారు. గ్రామంలో జరిగిన తీజ్ పండుగకు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. Tribal hordes, MP kavitha, theej festival, నిజామాబాద్ ఎంపీ, కవిత, తీజ్ పండుగ, -
సమస్యల 'తాండ'వం
మెదక్‌రూరల్ : గిరిజన తండాలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. తాగునీరు దొరకక...వీధిలైట్లు వెలగక...రోడ్లు సరిగాలేక గిరిజన ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకాదు. మెదక్ మండలం అవుసులపల్లి సమీపంలో ఓ గిరిజన తండా ఉంది. తండాలో సుమారు 20 నివాస గృహాలు ఉన్నాయి, ఎక్కువ శాతం పూరి గుడిసెలే ఇక్కడ కనిపిస్తాయి. పట్టణానికి 4కిలో మీటర్ల దూరంలో మెదక్-రామాయంపేట ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఈ గిరిజన తండా అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. తండాలో సీసీ రోడ్లు మచ్చుకైనా కనిపించవు. ఇటివల కురిసిన చిలకరి జల్లులకే రోడ్డంతా బురదమయంగా మారి నడవలేని స్థితికి చేరింది. వీధిలైట్లు అమర్చినప్పటికీ అవి నెలరోజులుగా వెలగక పోవడంతో గిరిజనులు అంధకారంలో మగ్గుతున్నారు. తండాలో తాగునీటి సమస్య ఘోరంగా ఉంది. రెండు మినీ ట్యాంకులున్నప్పటికీ ఇందుకు సంబంధించిన బోరుబావుల్లో చుక్కనీరు లేదు. దీంతో బోరుబావిలోని మోటార్‌ను గ్రామ సర్పంచ్ రెండు నెలల క్రితం తీసుకెళ్లగా, స్ట్రాటర్ బోర్డును వార్డు సభ్యుడు తీసుకెళ్లాడని గిరిజనులు తెలిపారు. అప్పటి నుంచి తండాలోకి వాటర్ ట్యాంకర్‌ను కూడా పంపించడం లేదని గిరిజనులు వాపోయారు. వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి నానా పాట్లు పడుతూ బోర్ల వద్దనుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నామని వాపోయారు. ఈ క్రమంలో తాగునీటి కోసం వ్యవసాయ పొలాల్లోకి వెళ్లగా కిందపడటంతో తండాలోని ఓ వృద్ధురాలి చేయి విరిగింది. తండాకు ఆనుకొని ప్రధాన రోడ్డు ఉన్నప్పటికీ ఒక్క బస్సుకూడా ఆపరు. దీంతో ప్రైవేట్ వాహనాలే దిక్కు. తండాలోని పిల్లలు చదువుల కోసం మెదక్ పట్టణానికి వెళ్లాలంటే పడరాని పాట్లు పడాల్సిందే.. చీకట్లో మగ్గుతున్నాం.. తండాలో వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురికావాల్సి వస్తోంది. - లక్ష్మి, అవుసులపల్లి తండా తాగునీటి కోసం పోతే చేయి విరిగింది తండాలో బోర్లు వస్తలేవు. ట్యాంకర్లు కూడా పంపిస్తలేరు. వ్యవసాయ పొలాల్లోకి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం. తాగునీళ్లకోసం పొలాల్లోకి ఒడ్డుమీదకెళ్లి పడ్డా.. దాంతో చేయి విరిగింది. - తోతి,అవుసులపల్లి తండా పిల్లల చదువుకు కష్టమైతోంది.. తండాలోని పిల్లలు చదువుకోసం మెదక్ వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు. తండా ప్రధాన రహదారికి పక్కనే ఉన్నప్పటికీ ఇక్కడ ఒక్క బస్సు కూడా ఆపరు. తండాలోని పిల్లలు ఆటోల్లో వెళ్లక తప్పడం లేదు. - నరేష్, అవుసులపల్లి తండా -
102 తలలు.. తెగిపడ్డాయి!
* పోలీసుల పహారాలోనే దున్నపోతులు బలి * నల్లగొండ జిల్లాలో సామాజిక దురాచారం * శ్రీ రామనవమి పేరిట వింత ఆచారం సాక్షి, హైదరాబాద్: అదో గిరిజన తండా.. అనాదిగా కొలుస్తున్న అమ్మవారి కోసం అక్కడ ఏటా పెద్ద సంఖ్యలో జంతు బలులు జరుగుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాలుగా ఈ బలి కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది.. ఒక్క వేటుకు ఒక్కో దున్నపోతు తల తెగి పడాల్సిందే. ఆ దున్నపోతు తలను వచ్చే ఏడాది వరకు గుంతలో పూడ్చి ఉంచాల్సిందే. మళ్లీ మరుసటి ఏడాది కొత్త తలలు తెగినప్పుడు.. పాత తలలు బయటకు తీస్తారు. అలా బలి ఇస్తే అమ్మవారు తాము కోరిన కోర్కెలు తీర్చుతుందని భక్తుల నమ్మకం. కంకాళి భవానీ (అంకాలమ్మ) జాతర పేరుతో శ్రీరామనవమి మరుసటి వేకువజామున నిర్వహించే ఈ మూఢాచార కార్యక్రమం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. ఈ ఒక్క ఏడాదే 102 దున్నపోతులు తెగిపడ్డాయంటే భక్తుల నమ్మకం ఎలా ఉందో.. శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో దూసుకుపోతున్న నవీన యుగంలో కూడా మూఢాచారాల పట్ల ప్రజల విశ్వాసం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లా పెదవూర మండలం రామన్నగూడెం తండా పరిధిలోని కంకాళి భవానీ అమ్మవారికి ఇచ్చే బలులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అసలు కథ ఇదీ.. గిరిజనులు ఆరాధ్యదైవంగా భావించే పెదవూర మండలంలోని రామన్నగూడెంలో కొలువై ఉన్న కంకాళి భవానీ (అంకాలమ్మ), లాల్‌సాద్, గురునానక్‌ల జాతరను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండగ తర్వాతి రోజున ఘనంగా నిర్వహించటం పరిపాటి. లాల్‌సాద్ అనే గిరిజనుడు ప్రతి ఏటా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న కంకాళి భవానీ ఆలయానికి వెళ్లి వచ్చేవాడు. అప్పట్లో రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడికి వెళ్లడం ఇబ్బందిగా మారింది. దీంతో రామన్నగూడెంలో 1944వ సంవత్సరంలో కంకాళి భవానీ అమ్మవారిని ప్రతిష్టించి గుడిని నిర్మించాడు. దీంతో పరిసర తండాల్లోని గిరిజనులు ఈ గుడికి వచ్చి పూజించేవారు. అలా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాలకు పాకింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి పర్వదినం మరుసటి రోజున కంకాళి భవానీ జాతర జరుగుతోంది. లాల్‌సాద్ మరణానంతరం ఆయన కుటుంబికులే వంశపారంపర్యంగా ఈ గుడికి పూజారులుగా ఉంటున్నారు. అయితే, ఇక్కడి ఆచారమేమిటంటే.. తాము కోరుకున్న కోర్కెలు తీరితే దేవతకు దున్నపోతులను బలిస్తామని మొక్కుకుంటారు. గిరిజనులే కాకుండా ఇతరులు కాకుండా ఇలా దున్నపోతులను బలి ఇచ్చి మొక్కులను తీర్చుకుం టున్నారు. జాతర రోజు వేకువ జామున కంకాళి భవానీ దేవాలయం ముందు ఈ తతంగం ప్రారంభించి, సూర్యుడు ఉదయించే వరకు పదునైన పెద్ద కత్తులతో దున్నపోతులను నరుకుతారు. దున్నపోతుల కళేబరాలను మాత్రం స్థానికులు కొందరు వండుకుని తింటారని సమాచారం. అయితే. ఈ తతంగమంతా పోలీసు పహారాలోనే జరుగుతుండ డం గమనార్హం. కనీవినీ ఎరుగని రీతిలో బలి.. అంకాలమ్మ దేవాలయం ముందు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో శనివారం వేకువజామున 102 దున్నపోతులను బలి ఇచ్చారు. వీటి మొండేలను సమీప గ్రామాలకు చెందిన ప్రజలకిస్తారు. పక్క గ్రామానికి చెందిన 40 కుటుంబాల వారు కంకాళి భవానీకి బలి ఇచ్చిన దున్నల కళేబరాలను పంచుకుంటారని తెలుస్తోంది. దేవాలయం వద్ద నుంచి దున్నపోతుల మొండేలను ట్రాక్టర్లో తరలించి పంపకాలు చేసుకుని వాటిని ఆరగిస్తారు. గిరిజన భక్తులు దేవతలకు బెల్లం, రొట్టెలను, పరమాన్నాన్ని సమర్పించారు. కొందరు భక్తులు తలనీలాలు సైతం ఇస్తుంటారు. దున్నపోతులను బలి ఇవ్వడం పూర్తికాగానే.. మేకపోతులు, గొర్రెపోతులను కూడా దేవతామూర్తి ముందు బలియిచ్చి మొక్కులు తీర్చుకుని అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేస్తారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈ సామాజిక అనాచారంపై స్థానికుడొకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కష్టకాలం వచ్చినప్పుడు అభయమిచ్చే కంకాళి భవానీ మాతకు మొక్కుకుంటే తప్పక కష్టాలు తీరుతాయని చెప్పాడు. ఇన్నేళ్లలో ఎన్నడూ రానన్ని దున్నపోతులను ఈ ఏడాది భక్తులు అమ్మవారికి బలి ఇచ్చారని, ఏటేటా జాతరకు జనం పెరుగుతున్నారని ఆయన వెల్లడించారు. -
తండాకు కరెంట్ షాక్.. వివాహిత మృతి
రేగోడ్: అధికారుల నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం.. మూడు రోజులుగా ఆ తండాలో ఇంటింటికీ కరెంట్ షాక్ వస్తుండగా.. ఐదుగురు గాయపడ్డారు. అయినా విద్యుత్ అధికారులు పరిస్థితి చక్కదిద్దకపోవడంతో నిండు ప్రాణం బలైంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం దుద్యాల పంచాయతీ పరిధి మంచిర్యాల గిరిజన తండాకు చెందిన సురేఖ (25) మూడు రోజుల క్రితం నారాయణఖేడ్‌లోని పుట్టింటికి వెళ్లింది. శనివారం మంచిర్యాల తండాకు వచ్చింది. తండాలో 3 రోజులుగా కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు గాయపడ్డారని ఆమెకు తెలియదు. ఇంటి ముందున్న కరెంటు స్తంభం నుంచి ఓ కర్రకు బిగించిన ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా సురేఖకు షాక్ కొట్టింది. స్థానికులు రక్షించే లోపే సురేఖ ప్రాణం కోల్పోయింది. దీంతో భర్త, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. దీనిపై విద్యుత్ ఏఈ మోహన్‌ను వివరణ కోరగా.. తండాలో శనివారం మాత్రమే కరెంట్ షాక్ వచ్చిందన్నారు. -
చౌక మద్యంపై నో వ్యాట్!
రాష్ట్ర సర్కారు ఆలోచన సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో మంచినీళ్ల బాటిల్ ధర రూ. 20 పలుకుతోంది. సీసా కల్లు ధర కూడా రూ. 20కి తక్కువకు దొరకట్లేదు. కానీ అక్టోబర్ నుంచి రాష్ట్రంలో రూ.15కే చౌకమద్యం అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గిరిజన తండాలు మొదలుకొని గ్రామాలు, నగరాల వరకు ఎక్కడైనా లభిస్తున్న గుడుంబాకు విరుగుడుగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు మద్యాన్ని అందించాలని నిర్ణయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తొలుత గుడుంబా ప్యాకెట్లను విక్రయిస్తున్న రూ.10కే 90 ఎంఎల్ మద్యాన్ని (కంట్రీ లిక్కర్) అందించాలని సీఎం కేసీఆర్ సూచించినా ఆ ధరకు మద్యాన్ని అందించేందుకు డిస్టిలరీలు ముందుకు రావని అధికారులు చెప్పడంతో ధరను రూ. 15గా ఖాయం చేశారు. నూతన మద్యం విధానం రూపకల్పనలో రూ. 15 మద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మద్యం పాలసీపై చర్చించేందుకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ శనివారం ఉన్నతాధికారులు, బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. రూ. 15కు మద్యం అందించడం వల్ల ఎక్సైజ్ శాఖకు వచ్చే లాభనష్టాలపై చర్చించారు. పకడ్బందీగా ఎక్సైజ్ పాలసీ ప్రతిపాదనలు రూపొందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆరు డిస్టిలరీలు సిద్ధం మద్యం దుకాణాల్లో ప్రస్తుతం చీప్ లిక్కర్ 90 ఎంఎల్, 180 ఎంఎల్ బాటిళ్లలో లభ్యమవుతోంది. 90 ఎంఎల్ ధర కనీసంగా రూ. 30 కాగా, 180 ఎంఎల్ రూ. 55గా ఉంది. రాష్ట్రంలో ఉన్న 16 డిస్టిలరీల్లో ఐఎంఎఫ్ఎల్తోపాటు చీప్ లిక్కర్ కూడా తయారవుతోంది. వివిధ రకాల పేర్లతో బేవరేజెస్ గోడౌన్ల ద్వారా మద్యం దుకాణాలకు చేరుతుంది. ఇప్పుడు సర్కార్ తెస్తున్న రూ.15కే కంట్రీ లిక్కర్ కారణంగా అధిక ధరలో లభించే చీప్ లిక్కర్ మీద దెబ్బపడనుంది. సర్కార్‌కు వచ్చే రాబడిలో చీప్ లిక్కర్ ఆదాయమే అధికం. ఈ నేపథ్యంలో చీప్ లిక్కర్‌కు బదులు కంట్రీ లిక్కర్ తయారు చేసి డిపోలకు అందించేందుకు ఆరు డిస్టిలరీలు ఇప్పటికే ముందుకొచ్చాయి. అధికారికంగా మద్యం పాలసీ ఖరారైతే మరిన్ని డిస్టిలరీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉంది. అలాగే మద్యం దుకాణాలపైనా ప్రభావం పడనుంది. గ్రేటర్ సహా పలు నగరాల్లో ఏడాదికి రూ. 90 లక్షల లెసైన్సు ఫీజుతో మద్యం దుకాణాన్ని నిర్వహించే వారికి రూ. 15కే చీప్ లిక్కర్ అమ్మడం వల్ల గిట్టుబాటు కాదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల ప్రతిపాదనలను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. వ్యాట్ మినహాయింపు ఆలోచన? గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ‘ఆరోగ్యకరమైన’ మద్యాన్ని అతి తక్కువ ధరకు అందించేందుకు దీనికి వ్యాట్ నుం చి మినహాయింపు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మద్యం మీద 60% నుంచి 160% వరకు ప్రభుత్వం వ్యాట్ విధిస్తోంది. చీప్ లిక్కర్‌పై 60% వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే రూ. 15కే అందించే మద్యం పై వ్యాట్ వడ్డించాలంటే ఒక్కో 90 ఎంఎల్ బాటిల్ రూ. 6 లోపే డిస్టిలరీలో తయారు కావాల్సి ఉంటుంది. పెట్ బాటిల్, స్పిరిట్ (మద్యం) తయారీకి ఖర్చయ్యే రూ.6తో ఇది సాధ్యం కాదని డిస్టిలరీలు చెబుతున్నాయి. నష్టం జరగకుం డా ఉండాలంటే వ్యాట్ మినహాయింపు ఒక్కటే మార్గమని వాది స్తున్నాయి. అయితే వ్యాట్‌ను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై భారీగా కోత పడుతుంది. ఈ నేపథ్యంలో గతేడాది లో చీప్ లిక్కర్ అమ్మకాలు, తద్వారా ప్రభుత్వానికి డిస్టిలరీలు చెల్లించిన వ్యాట్‌కు సంబంధించిన లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు. -
తాగునీటి కోసం తండ్లాట..!
- మంచినీటి బోరుమోటార్తో వ్యవసాయానికి వాడకం - గుక్కెడు నీటికోసం తండావాసుల తంటాలు మెదక్ రూరల్: ఓ గిరిజన తండాలో తాగునీటి అవసరాల కోసం బోరుబావిలో వేసిన మోటార్‌ను అదే తండాకు చెందిన ఓ వ్యక్తి తీసుకవెళ్లి తన వ్యవసాయ బోరుబావికి వేసుకోవడంతో గుక్కెడు నీటికోసం తండావాసులు తల్లడిల్లుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండలం చిట్యాల పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాలో గిరిజనుల తాగునీటికోసం ట్యాంకును నిర్మించారు. దానికోసం బోరుబావిని తవ్వి నీటిని మళ్లిస్తున్నారు. కాగా బోరు బావిలో కొంత కాలంగా నీటి ఊటలు తగ్గిపోవటంతో తండావాసులకు తాగు నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో అధికారులు కొంత కాలం క్రితం తండాలో మరోబోరు బావి తవ్వారు అందులో పుష్కలంగా నీరు వచ్చింది. దీంతో సింగిల్ ఫేజ్ మోటారును అమర్చారు. దీంతో తండాకు నీటి కష్టాల తప్పాయి. కాగా ఇటీవల తండాకు చెందిన ఓ వ్యక్తి ఆ బోరుబావిలోని మోటార్‌ను తీసుకవెళ్లి తన పొలంలోని బోరుబావిలో దింపి పొలానికి నీటిని పెట్టుకుంటున్నాడని తండాకు చెందిన పలువురు గిరిజనులు వాపోయారు. దీంతో తండాలో నీటికష్టాలు మళ్లీ ప్రారంభం కావటంతో తండావాసులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి కాలం కావటంతో తండాలో తాగునీటికోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా బోరుమోటార్‌ను తొలగించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని బోరుబావిలో మోటారు దింపి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని తండా వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
చదువుకోవాలని ఉంది సారూ..
గొర్రెలకు కాపలాగా వెళుతున్న బాలికల ఆవేదన మెదక్ రూరల్: తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలని ఉందని గొర్రెలకు కాపలాగా వెళుతున్న మెదక్ మండలం రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి గిరిజన తండాకు చెందిన ఇరువురు గిరిజన బాలికలు అనిత, సంగీత వాపోతున్నారు. తమను పెద్దలు గతకొన్నిరోజులుగా చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శనివారం రాజ్‌పల్లి పంటపొలాల్లో జీవాలను మేపుతున్న ఆ బాలికలు సాక్షి ప్రతినిధి కంటపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలనే ఉందన్నారు. తండాకు చెందిన లంబాడి హమ్యా లక్ష్మి దంపతులకు సంగీత ఒక్కతే కుమార్తె. ఆమె ప్రస్తుతం రాజ్‌పల్లి ఉన్నతపాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.సంగీత తండ్రి హమ్య ఇటీవల పాముకాటుతో మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబం గడవటం కష్టంగా మారిందని, చేసేదిలేక తల్లి లక్ష్మి తన కూతురు చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపిస్తోంది. అయితే చదువంటే తనకు ప్రాణమని, ఆర్థిక ఇబ్బందువల్ల తన తల్లి చదువు మాన్పించిందన్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే చదువుకుంటానని చెబుతోంది. అలాగే ఇదేతండాకు చెందిన మంగ్యా, బీబ్లీ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆఖరు సంతానం అనిత ప్రస్తుతం మెదక్‌లోని బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉన్నట్టుండి తనను చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని అనిత పేర్కొంది. తమకు బాగా చదువుకోవాలని ఉందని వారు వాపోయారు. ఈ విషయమై అధికారులు స్పందించి సంగీత, అనిత తల్లి దండ్రులకు అవగాహన కల్పించి వారిని మళ్లీ బడికి పంపేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
చుక్క నీటికీ చిక్కే!
⇒తాగునీటికి అల్లాడుతున్న గిరిజన తండాలు ⇒వర్షాలు లేక అడుగంటిన భూగర్భ జలాలు ⇒వేసవికి ముందే తాగునీటికి కటకట కుల్కచర్ల: తండాల్లో అప్పుడే తాగునీటి ఎద్దడి మొదలైంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గిరిజనులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. కిలోమీటర్లకొద్దీ నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.కోట్లు విడుదల చేస్తున్నా.. సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంటోంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో సుమారు పది గిరిజన తండాలు ఉండగా అందులో సగానికి పైగా తండాల్లో నీటి సమస్య ఉంది. పరిగి నియోజకవర్గం పరిధిలో 150 వరకు గిరిజన తండాలు ఉండగా 100కు పైగా తండాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఈ నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలంలో సుమారు 105కుపైగా తండాలున్నాయి. దాదాపు అన్ని తండాల్లో నీటి సమస్య ఉంది. తాండూరు పరిధిలో సుమారు 58 తండాలు ఉండగా 25 తండాల్లో తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 11 తండాలు ఉండగా నాలుగు తండాలు, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో సుమారు 50 తండాలు ఉండగా 15 తండాలు, ఇబ్రహీంపట్నం నియోజక వర్గం పరిధిలో 29 తండాలు ఉండగా 12 తండాలు, వికారాబాద్ నియోజక వర్గం పరిధిలోని 65 తండాల్లో 19 తండాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. గుక్కెడు నీటికి ఎన్ని కష్టాలో..! కుల్కచర్ల మండలంలో 29 గ్రామ పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు, గుర్తింపు పొందిన తండాలు సుమారు 75, అధికారుల రికార్డుల్లో లేనివి 30 తండాల వరకు ఉన్నాయి. తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. పదేళ్లుగా స్వజల ధార పథకం కింద మినీ ట్యాంకులు, ఓవర్‌హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఒక్కో తండాలో రూ.3లక్షల నుంచి రూ. 6లక్షల వరకు వెచ్చించి ట్యాంకులను ఏర్పాటు చేసి, బోర్లు కూడా వేశారు. పైపులైన్లు లేకపోవడంతో ఈ ట్యాంకులు వృథాగా మారాయి. ట్యాంకులకు కనెక్షన్లు ఇవ్వాలని గిరిజనులు అధికారుల చుట్టూ ఏళ్లతరబడి తిరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరికొన్ని తండాల్లో బోర్లు వెసి సింగల్ ఫేజ్ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యుత్ ఉంటేనే నీళ్లు.. లేదంటే అంతే సంగతులు. ఎక్కడా చేతిపంపులు పనిచేయడం లేదు. నీటి కోసం వ్యవసాయ బావులు, చెరువులను ఆశ్రయించాల్సి వస్తోంది. కలుషిత నీరు తాగి ఇటీవల అడివి వెంకటాపూర్, చిన్నరామయ్య తండా, బింద్యంగడ్డ, చెరుముందలి తండా, గొరిగడ్డ, వెంకటాపూర్ తండా, నేర్లేల కుంట తండాల్లో ప్రజలు రోగాల బారిన పడ్డారు. చాలా తండాల్లో డెరైక్ట్ పంపింగ్ ఏర్పాటు చేశారు. పగలు విద్యుత్ లేక పోవడం రాత్రుళ్లు తాగునీటి కోసం బోర్ల దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురవుతున్నారు. ఇటీవల కుస్మసముద్రం పంచాయితీ పరిధిలోని నాగమ్మగడ్డ తండాలో దేవేందర్ అనే విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. వేసవి కాలం రానేలేదు.. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గడవని పూట.. వలసబాట
కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో కలిపి సుమారు 150 వరకు గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో సుమారు 35వేల వరకు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో బతుకుదెరువు నిమిత్తం పుణే, ముంబై తదితర పట్టణాలకు 60శాతం మందికి పైగా వలస వెళ్లారు. నిత్యం కుల్కచర్ల, గండేడ్ మండలాల నుంచి పరిగి, మహబూబ్‌నగర్, తాండూరు డిపోల ఆర్టీసీ బస్సులు ముంబై, పుణేలకు రద్దీగా వెళ్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవిత కాలమంతా .. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన గిరిజనులు యేడాదిలో ఎనిమిది నెలలు అక్కడే పనులు చేసుకుంటున్నారు. నాలుగు నెలలు మాత్రం తిరిగివచ్చి తమ కుటుంబాలు, వ్యవసాయాన్ని చూసుకుని వెళ్తున్నారు. తిండి గింజలు ఇంట్లోవేసి, పిల్లల్ని పెద్దల దగ్గర ఉంచి తిరిగి పట్టణాలకు పయనమవుతారు. ఇంటిదగ్గర ఉన్న వృద్ధులపైనే అధిక భారం పడడంతో కాయాకష్టం చేసి, కట్టెలు అమ్ముకుని పిల్లల్ని కాపాడుకుంటున్నారు. పడని అడ్డుకట్ట.. వలసల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. అవగాహనా లోపమో, లేక ఇక్కడ లభిస్తున్న ఉపాధి కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదన్న కారణమో గానీ వలసలు మాత్రం ఆగడం లేదు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులతో ఆయా తండాల్లో మరింత పెరిగాయి. కూతుళ్ల పెళ్లికని చేసిన అప్పు తీర్చేందుకు కొందరు, తల్లిదండ్రుల ఆరోగ్యం నిమిత్తం ఉన్నదంతా ఖర్చు చేసి తిరిగి సంపాదించుకునేందుకు మరికొందరు, తాముపడిన కష్టం పిల్లలు పడకూడదని వారిని బాగా చూసుకునేందుకు కాస్తోకూస్తో కూడబెట్టాలనే తాపత్రయంతో ఇంకొందరు.. ఇలా గ్రామాలను విడిచి వెళ్తున్నారు. భరోసా ఇవ్వన్ని ‘ఉపాధి’ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గిరిజనులకు భరోసా కల్పించలేకపోతోంది. నెలలు గడిచినా చేసిన పనికి కూలీ డబ్బులు చేతికందకపోవడంతో దీనికన్నా వలసబతుకు లే మేలని అటువైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం కల్పిం చే ఉపాధికన్నా ముంబై, పుణేల్లో చేసే కూలీ పనులకే ఎక్కువ గిట్టుబాటవుతోందని అంటున్నారు. చేసిన పనికి వారంరోజుల్లో కూలీ డబ్బులు చెల్లిస్తే, ఉన్న ఉపాధిని నిరుపేద రైతుల వ్యవసాయానికి అనుబంధం చేస్తే కొంతవరకు వలసలను నిరోధించవచ్చని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే.. మారుమూల గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే సంక్షేమ నిధులు వస్తాయని, వాటితో అభివృద్ధితోపాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుందని గిరిజనులు పేర్కొంటున్నారు. అప్పుడు ఇక్కడే ఉండి తమ పిల్లల బాగోగులు, చదువులు కూడా చూసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. -
దా‘రుణాలు’
తీవ్ర వర్షాభావం...భూగర్భ జలాలు అంతంతమాత్రం..పంటలన్నీ కళ్లముందే ఎండిపోయాయి. పెట్టుబడులకోసం, బోర్లు వేసేందుకు చేసిన అప్పులు గుండెలపై కుంపటిలా మారాయి..ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా శుక్రవారం జిల్లాలో ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (45) పురుగుల మందు తాగి తనువు చాలించగా, రామాయంపేట మండలం కోమటిపల్లి గిరిజన తండాకు చెందిన బధావత్ మోతీలాల్ (40) విష గుళికలు మింగి ప్రాణం తీసుకున్నాడు. ఇద్దరు అన్నదాతల బలవన్మరణం * అప్పులబాధలే కారణం * బూర్గుపల్లి, కోమటిపల్లి గిరిజనతండాలలో విషాదం సిద్దిపేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన బోదాస్ మల్లయ్య (45) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న మూడెకరాలలో రెండు ఎకరాలు మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే మొలకలు రాకపోవడంతో మరో సారి మొక్కజొన్న తెచ్చి సాగు చేశాడు. దీంతో పాటు ఉన్న మరో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. అయితే ఉన్న బోరులో నీరు సక్రమంగా రాకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోయాయి. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు సుమారు రూ. 1.50 లక్షలు అప్పు చేశాడు. అయితే పంటలు చేతికి అందే పరిస్థితి లేకపోవడం, పెళ్లీడుకువచ్చిన కుమార్తె ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో శుక్రవారం ఉదయం మల్లయ్య తన వ్యవసాయం పొలం వద్దకు వెళ్లి పురుగు మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పొరుగు పొలాల రైతులు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికి మల్లయ్య మరణించాడు. మృతునికి భార్య లక్ష్మితో పాటు పెళ్లిడుకొచ్చిన కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బాబురావు, ఉప సర్పంచ్ రామరాజులు కోరారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్, ఏఎస్ఐ వెంకటయ్య సిబ్బందితో గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో.. రామాయంపేట పంచాయితీ కోమటిపల్లి గిరిజన తండాకు చెందిన బదావత్ మోతీలాల్ (40) తనకున్న రెండెకరాల భూమిలో మొక్కజొన్నతో పాటు వరి పంట వేశారు. అయితే వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ పొలంలో గతంలో తవ్విన రెండు బోర్లలోనూ నీరు పడలేదు. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు సుమారు రూ. 2లక్ష మేర అప్పు చేశాడు. అయితే రుణదాతల నుంచి అప్పు తీర్చాలని ఒత్తిళ్లు రావడంతో కలత చెంది గురువారం రాత్రి పంట చేను వద్దకు వెళ్లి అక్కడ విష గుళికలు మింగాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. కడుపు మంటతో మోతీలాల్ అల్లాడుతుంటే కుటుంబ సభ్యులు అతడిని నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు భార్యలు లక్షి్ష్మ, విజయలక్ష్మితో పాటు ఆరేళ్ల లోపు ఇద్దరు పిల్లలున్నారు. వారికున్న ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. -
వాహ్..తీజ్
గిరిజన ఆడపడుచుల సంప్రదాయ ఉత్సవం ఏటా రాఖీ పౌర్ణమితో షురూ.. తండాల్లో కొనసాగుతున్న తీజోత్సవం.. ఉట్నూర్ : గిరిజన ఆడపడుచుల సంప్రదాయ ఉత్సవం తీజోత్సవం ఆరంభమైంది. జిల్లాలోని గిరిజన తండాల్లో ఉత్సవాలను గిరిజనులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏటా రాఖీ పౌర్ణమితో ఆరంభమయ్యే ఈ పండుగ.. శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ తీజ్ ఉత్సవాల్లో గో ధుమలు వినియోగించడం ఓ ప్రత్యేకమైతే.. తీజ్ అంటే పచ్చదనం అనే అర్థం ఉండడం మరో విశేషం. తండాల్లో కొనసాగుతున్న తీజ్ సంబరాలపై ఈ వారం సండే స్పెషల్.. ఉత్సవంలో భాగంగా తొమ్మిదో రోజు సాయంత్రం తండా పెద్ద(నాయక్) ఇంటి ఎదుట మొలకెత్తిన గోధుమ బుట్టల్లో నుం చి కొన్ని గోధుమ మొలకలను తండా పెద్దల తల పాగాల్లో పెడుతారు. ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బు ట్టలను నెత్తిన పెట్టుకుని సంప్రదాయ పద్ధతుల్లో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ తండా శివారుల్లో ఉండే నీటి వనరుల్లో వాటిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ క్రమంలో వచ్చే ఏడాది తాము తీజ్ ఆడుతామో లేదోననే ఆందోళన పెళ్లి యువతుల్లో కనిపిస్తుంది. అంతకుముందు గ్రామంలో పెళ్లి కాని గిరిజన యువకులు చేతుల్లో పీడీయాను పట్టుకుని ఉంటారు. పెళ్లి కాని యువతులు ఆ యువకుల చేతిలోని పీడీయాను వివిధ ప్రయత్నాలు చేస్తూ విడిపిస్తారు. అయితే పీడీయా పట్టుకున్న వ్యక్తి ఇంటి పేరు విడిపించే యువతుల ఇంటి పేర్లు ఒక్కటి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా బుట్టలను నెత్తిన ఎత్తుకున్న యువతుల పాదాలను ఆమె సోదరులు నీళ్లతో కడిగి ఆశీర్వాదం పొందుతారు. ‘‘ఈ తీజ్ ఉత్సవాల ద్వారా యువతులు కోరుకున్న కోరికలు తీరుతాయని, తండాల్లో అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా గడుపుతారని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని గిరిజ న పెద్దలు చెబుతుంటారు.’’ ఈ వేడుకల్లో పెళ్లికాని యువతులే పాల్గొనడం విశేషం. ఏటా రాఖీపౌర్ణమి రోజు నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు తీజ్ ఉత్సవాలు జరుగుతాయి. పెళ్లికాని యువతులు, చిన్నారులు తొమ్మిది రోజులపాటు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ముందుగా తండాల్లో పెద్దలు ప్రతి ఇంటి నుంచి గోధుమలు సేకరిస్తారు. చిన్న చిన్న వెదురు బుట్టలు కొనుగోలు చేస్తారు. సేకరించిన గోధుమలను రోజంతా నీళ్లలో నానబెడుతారు. పెళ్లి కాని యువతులు తండాలకు సమీపంలో చీమల పుట్ట మన్ను(మకొడ ధూడ్) తీసుకువచ్చి వెదురు బుట్టల్లో నింపుతారు. రాఖీపౌర్ణమి రోజున ఆ బుట్టల్లో ప్రత్యేక పూజలతో గోధుమలు మొలకెత్తడానికి చల్లుతారు. అనంతరం తండా పెద్ద ఇంటి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచె, పందిరిపై స్థలంలో బుట్టలు పెడుతారు. యువతులు ఉపవాస దీక్షతో ప్రతీరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పవిత్ర జలాలు పోస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఎనిమిది రోజుల పాటు సాయంత్రం వేళ గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉత్సవం నిర్వహిస్తుంటారు. -
అథ్లెటిక్స్‌లో గిరిపుత్రుడు
గిరిజనతండాలు అంటేనే అత్యంత వెనుకబడిన ఆవాస ప్రాంతాలకు నిలయాలు. కనీస వసతులతోపాటు రవాణా సౌకర్యం అసలే ఉండదు. దీంతో అక్కడి ప్రజలు దయ నీయ పరిస్థితుల మధ్య జీవన పోరాటం చేస్తుంటారు. అలాంటి తండాకు చెందిన ఓ యువకుడు అథ్లెటిక్స్‌లో చిరుత వేగతంలో దూసుకెళ్లి సత్తాచాటుతున్నాడు. అతడే కోదాడ మండలంలోని భీక్యాతండాకు చెందిన గగులోతు వెంకటేష్. ఇతడు అనతికాలంలోనే మండలస్థాయి నుం చి అంతర్‌జిల్లాల స్థాయి పోటీల్లో పాల్గొని పలు బహు మతులు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. -భీక్యాతండా (కోదాడ రూరల్) కోదాడ మండలంలోని భీక్యాతండా గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గుగులోతు భద్యా- లక్ష్మి దంపతుల రెండో కుమారుడు వెంకటేష్‌కు చిన్నప్పటి నుంచే ఆటలంటే చాలా ఇష్టం. అందులోనూ పరుగు పందెంలో పాల్గొనడమంటే ఎగిరి గంతేంచేవాడు. ఆ మక్కువతోనే ఎక్కడ అథ్లెటిక్స్ జరిగినా పాల్గొని మెరుపు వేగంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకునేవాడు. ఇలా మండల స్థాయి అథ్లెటిక్స్ నుంచి రాష్ట్రస్థాయి వరకు పాల్గొని ఎన్నో పతకాలు, ప్రశంసపత్రాలు సొంతం చేసుకున్నాడు. హైస్కూల్ చదివేటప్పుడే మూడేళ్ల పాటు వరుసగా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందాడు. అథ్లెటిక్స్‌లోనే కాకుండా మరోవైపు లాంగ్జం ప్, క్రికెట్ పోటీల్లో కూడా ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం ఆడి పలు విజయాలతో బహుమతులు దక్కించుకున్నాడు. చదువుల్లోనూ ముందే.. ఆటలతో పాటు చదువులోనూ గుగులోతు వెంకటేష్ ముం దంజలోనే కొనసాగుతున్నాడు. 1 నుంచి 5 వరకు స్వగ్రామంలో చదివిన వెంకటేష్ 6 నుంచి పదో తరగతి వరకు చిలుకూరు మండలం నారాయణపురంలో చదివాడు. అనంతరం ఇంటర్మీడియట్‌ను కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిచేశాడు. తన హైస్కూల్, ఇంటర్ చదువులు ప్రతిరోజూ సైకిల్ మీద వచ్చి చదివాడు. ఇంటర్మీడియట్లో ఇతడు సాధించిన అత్యుత్తమ మార్కులను చూసిన చిలుకూరు మండలం రామాపురంలో గల గాంధీ అకాడమిక్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గేట్) కళాశాల యాజమాన్యం స్పందించి తమ కళాశాలలో డిప్లొమా (ఎలక్ట్రానిక్స్) కోర్సును ఉచితంగా చదివించింది. ఆ కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతో వెంకటేష్ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తాచాటాడు. అనంతరం వెంకటేష్ పీసెట్ రాసి రాష్ట్రస్థాయిలో 508 వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఖాళీగా ఉండకుండా స్థానిక విద్యార్థులకు క్రీడల్లో మెళకువలను నేర్పుతున్నాడు. వెంకటేష్ సాధించిన విజయాలు * 2003, 04, 05 సంవత్సరాల్లో 8 ,9, 10వ తరగతులు చదువుతున్నప్పుడు జిల్లాస్థాయిలో నిర్వహించిన వందమీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్ పోటీల్లో పాల్గొని ప్రతిఏటా జిల్లా మొదటిస్థానంలో నిలిచాడు. * 2006లో నిర్వహించిన ఇంటర్‌లెవల్ స్కూల్‌స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొని కాంస్య పతకం గెలుచుకున్నాడు. * ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా 2013లో నల్లగొండడలో నిర్వహించిన జిల్లాస్థాయి వందమీటర్ల పరుగు పందెంలో 11 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. * 2014 మార్చిలో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబర్చి ప్రశంసపత్రం పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహించాలి ఇప్పటికే చాలా పోటీల్లో పాల్గొని సత్తాచాటాను. దాతలు ప్రోత్సహిస్తే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకుంటా. క్రీడల్లో రాణించే గిరిజన విద్యార్థులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. భవిష్యత్‌లో విద్యార్థులకు ఉచితంగా క్రీడా పాఠాలు నేర్పుతా. - గగులోతు వెంకటేష్, అథ్లెటిక్స్ -
అమ్మకానికి ఆడశిశువు
రూ.15 వేలకు కుదిరిన బేరం విశ్వసనీయ సమాచారంతో అడ్డుకున్న పోలీసులు.. కేసు నమోదు కొండమల్లేపల్లి : అంగట్లో ఆడశిశువును అమ్ముకునే దుస్థితి, పరిస్థితి గిరిజన తండాల్లో ఇంకా మారడం లేదు. ఓ వైపు మగసంతానంపై ఆసక్తి, మరోవైపు అధిక సంతానాన్ని పెంచలేని పేదరికంతో ఆడశిశువులను అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. తాజాగా దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో రూ.15వేలకు ఆడశిశువును విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఫకీర్‌నాయక్ తండాకు చెందిన మూడావత్ బాలు, కుమారీలకు ఇప్పటికే ఇద్దరు ఆడసంతానం. పదిహేను రోజుల క్రితం మూడవ కాన్పులో మళ్లీ ఆడపిల్లే జన్మించడంతో భారంగా భావించిన తల్లిదండ్రులు ఆ శిశువును అమ్మకానికి పెట్టారు. అదే తండాకు చెందిన మూడావత్ భారతి అనే మహిళ మధ్యవర్తిత్వం నెరిపింది. హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో పనిచేస్తున్న పి.కుమార్ అనే వ్యక్తికి రూ.15 వేలకు అమ్మడానికి బేరం కుదిరింది. ఈ నేపథ్యంలో శిశువును శుక్రవారం వారికి అప్పగించడానికి ప్రయత్నిస్తుండగా సమాచారం బయటకు పొక్కడంతో వీఆర్ఓ వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ భాస్కర్ వారిని కొండమల్లేపల్లిలో పట్టుకొని కేసు నమోదు చేశారు. శిశువును విక్రయించడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు, కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన పి.కుమార్, మధ్యవర్తి భారతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శిశువును దేవరకొండ శిశుగృహకు తరలించారు. -
తండాలకు మహర్దశ
- గిరిజన పల్లెలు ఇక పంచాయతీలు - 500 జనాభా పైగా ఉన్న తండాల గుర్తింపు - జిల్లాలో 142తండాలకు పంచాయతీ హోదా - ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నిత్యం సమస్యలతో సతమతమవుతున్న గిరిజన తండాలకు ఇక మహర్దశ కలగనుంది. వాటికి పంచాయతీ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. ఈ మేరకు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామన్న ప్రభుత్వ హామీకి అనుగుణంగా జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో 500 మందికిపైగా జనాభా ఉన్న గిరిజన ఆవాసాలను గుర్తించారు. ‘మా తండాలో మా పాలన’ నినాదంతో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలంటూ గిరిజన సంఘాలు డిమాండు చేస్తూ వస్తున్నాయి. తండాలకు పంచాయతీ హోదా దక్కితే అధికార వికేంద్రీకరణ జరగడంతో పాటు పాలనలో పారదర్శకత సాధ్యమనే భావన వ్యక్తమవుతోంది. జిల్లాలో 1202 గిరిజన ఆవాసాలు ఉండగా, వీటిని మూడు కేటగిరీలుగా అధికారులు వర్గీకరించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 500 మంది లోపు జనాభా, 500 కంటే ఎక్కువ, వెయ్యి కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న తండాలను గుర్తించారు. మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్‌లోనే తండాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. గ్రామ పంచాయతీ, రెవెన్యూ విభాగాల సహకారంతో నివేదిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1329 గ్రామ పంచాయతీలు, 13566 వార్డులు ఉన్నాయి. జిల్లా జనాభాలో 8.99 శాతంగా ఉన్న గిరిజనులకు 151 గ్రామ పంచాయతీలు, 1384 వార్డులను ప్రత్యేకించారు. 500 జనాభా పైబడిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తే జిల్లాలో 142 గిరిజన తండాలకు పంచాయతీహోదా దక్కుతుంది. సమస్యలతో సతమతం జన జీవన స్రవంతికి దూరంగా విసిరేసినట్లు ఉంటున్న గిరిజనతండాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్య, వైద్యం, మురుగు కాల్వలు, విద్యుత్ వంటి మౌలిక సమస్యలు తాండవిస్తున్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిత్యావసరాల కోసం సమీప గ్రామాలకు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమల్లో ఉన్నా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండటంతో కొద్ది సంఖ్యలో జనాభా వున్న తండాలను పట్టించుకునే పరిస్థితి లేదు. నిధుల వినియోగంలోనూ పారదర్శకత ఉండటం లేదనే విమర్శలొస్తున్నాయి. పట్టణాలకు దగ్గరలో ఉండే గిరిజన తండాల వైపు మాత్రమే అధికారులు దృష్టి సారిస్తున్నారు. తండాలు పంచాయతీలుగా మారితే ‘స్థానిక’ పరిపాలనలో తమ భాగస్వామ్యం పెరుగుతుందన్న ఆశ గిరిజనల్లో వ్యక్తమవుతోంది. తండాల వారీగా గిరిజన జనాభా వివరాలను ప్రభుత్వానికి పంపించామని..పంచాయతీగా మార్చే నిర్ణయం ప్రభుత్వం చేతిలోనే ఉందని డీపీఓ రవీందర్ ‘సాక్షి’తో అన్నారు. -
తీరనున్న తండ్లాట
- గ్రామ పంచాయతీల ఏర్పాటుపై ఆశలు - 500 జనాభా గల తండాలు గుర్తింపు - 341 కొత్త జీపీలు అయ్యే అవకాశం జిల్లావ్యాప్తంగా 1,207కు పెరగనున్న జీపీలు ఉట్నూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. 500 జనాభా ఉన్న గిరిజన తండాలు, గూడెలను పంచాయతీలుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అందుకు అనుగుణంగా నివేదికలు పంపించారు. జిల్లా వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం గుర్తించిన 32 నోటిఫైడ్ గిరిజన మండలాలతోపాటు మరో 12 మండలాల్లో 4,95,794 గిరిజన జనాభా ఉంది. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుండగా ఇందులో షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలిపి 272 గిరిజన పంచాయతీలు, 646 గ్రామాలు, 2 వేల వరకు అనుసంధాన గ్రామాలు ఉన్నాయి. ఇక తెగలవారీగా గిరిజన జనాభాలో గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, ప్రధాన్స్ 26,029, మన్నెవార్ 15,370, నాయక్‌పోడ్ 5,206, తోటి 2,231, ఎరుకల 1,735, కోయ, ఇతరులు 30,739 చొప్పున నివాసం ఉంటున్నారు. 341 పంచాయతీలు అయ్యే అవకాశం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మార్చితే నూతనంగా 341 గ్రామ పంచాచతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. తండాలు, గూడాల పూర్తి వివరాలు ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో 272 గిరిజన గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి అనుసంధానంగా ఉన్న తండాలు, గూడాలను గుర్తించి వాటిలో 500 గిరిజన జనాభా ఉన్న వాటిని విలీనం చేస్తూ నూతన పంచాయతీల ఏర్పాటు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గిరిజన పంచాయతీల ఏర్పాటు ఏ విధంగా చేపట్టాలో ప్రభుత్వం నుంచి విధివిధానాలు రాక పోవడంతో తాము కేవలం సమాచారం సేకరించి పంపినట్లు అధికారులు తెలిపారు. అభివృద్ధి వేగవంతం గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం పంచాయతీలకు అనుసంధాన తండాలు, గూడాలు కిలోమీటర్ల దూరం ఉండటంతో పాలకవర్గాలు, యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించక అభివృద్ధి కుంటుపడుతోంది. ఇప్పటికీ తండాలు, గూడాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ విద్య తదితర మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు తమ మనుగడ, ఓటు బ్యాంక్ కోసం ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను జనాభా అధికంగా ఉండే పంచాయతీల్లో ఖర్చు చేస్తూ అనుబంధంగా ఉన్న పంచాయతీలను విస్మరించారు. నూతన పంచాయతీలుగా ఏర్పాటుతో అయా పంచాయతీల్లో స్థానికంగా రాజకీయ అవకాశాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం బాధ్యత పెరిగి అభివృద్ధి వేగవంతం అవుతుంది. ప్రయోజనాలు ఇవే.. - నూతన పంచాయతీల వల్ల పాలన సులభం అవుతుంది. తద్వారా ప్రజలు పంచాయతీల ద్వారా వివిధ ధ్రువీకరణ పత్రాలు సునాయసంగా పొందవచ్చు. - పంచాయతీల విడిది చిన్నదిగా ఉండటంతో గ్రామాల్లో మురికి కాలువల నిర్వహణ, వీధి దీపాలు, తాగు నీరు ఇతర వసతుల కల్పనలో ఎలాంటి అటంకాలు ఉండవు. - పంచాయతీ జనాభా తక్కువగా ఉండటం వల్ల పంచాయతీ పాలక వర్గాలు ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి. - ప్రజలకు పంచాయతీలకు మధ్య దూరభారం తగ్గుతుంది. గ్రామ సమస్యలను ప్రజలు పాలకుల దృష్టికి తీసుకురాగలుగుతారు. - ప్రభుత్వ నిధుల విడుదలతో గ్రామాల అభివృద్ధి వేగం అవుతుంది. - ప్రభుత్వం పంచాయతీల ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకు అందించేందుకు వీలవుతుంది. -
తాండాలకు కొత్త కళ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గిరిజన తండాలు త్వరలో కొత్త కళను సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా అవతరించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసే అంశంపై గతవా రం సీఎం కేసీఆర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఇందులో భాగంగా చర్చకు వచ్చిన అంశాలపై వివరాలు సేకరించేం దుకు ఆ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చే శారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ శాఖ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు క్షేత్రస్థాయి లో వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మూడు రకాలుగా వివరాల సేకరణ తండాలను గ్రామ పంచాయతీలుగా రూపొందించే అంశంపై మూడు రకాలు గా వివరాలు సమర్పించాలంటూ మం డల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో గ్రామ పంచాయ తీ పేరు, జనాభాతో పాటు వాటి పరిధి లో 500, 750, 1000 జనాభా ఉన్న తం డాల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని సూ చించింది. ఈ వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 14లోగా సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. అధికారులు వివరాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలో 705 పంచాయతీలకుగాను 18 పంచాయతీలను ఐదు నగర పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసే క్రమంలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వాటిని పం చాయతీలుగా ఉంచినప్పటికీ.. ఎన్నికలు నిర్వహించలేదు. ఇవికాకుండా మరో 350 వరకు తండాలున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. తాజాగా సేకరిస్తున్న వివరాల ప్రకారం వీటిలో ఎన్ని తండాలు గ్రామపంచాతీయలుగా మారనున్నాయో త్వరలో స్పష్టత రానుంది.