TRS party plenary
-
టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలు.. లైవ్ అప్డేట్స్
ప్లీనరీ అప్డేట్స్: 👉కేసీఆర్ విజన్ ఉన్ననేత అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే తెలుగు ప్రజల గుండెలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ రోజు తెలంగాణలో ఆచరిస్తున్నది.. దేశ వ్యాప్తంగా ఆచరించే పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. 👉రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయ్యిందన్నారు. తెలంగాణ పథకాలను పేరుమార్చి కేంద్రం కాపీకొడుతోందన్నారు. టీఎస్ ఐపాస్లాగా కేంద్ర సింగిల్ విండో తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే రైతులకు 24 గంటల కరెంట్ అందుతోందన్నారు. 👉బీజేపీ నేతలు ఆత్మనిర్భర్ భారత్ అంటారనీ.. కానీ బతుకు దుర్భర్ భారత్ అయ్యిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆకలి సూచీల్లో మనం ఎక్కడో ఉన్నామనీ.. పాక్, బంగ్లాదేశ్ మనకన్నా ముందన్నాయనీ.. ఇది బీజేపీ పాలనా తీరని ధ్వజమెత్తారు. 👉బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్ పూల్‌లోకి తేవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నిలపారన్నారు. ► టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు భోజన విరామం. లంచ్ అనంతరం తిరిగి ప్రారంభం కానున్న సమావేశం. ► హరీశ్ రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని.. చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు మన్య రంజిత్ రెడ్డి తీర్మానాన్ని బలపరిచారు. ► కేంద్రంలో ఉంది సంకుచిత ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వచ్చాక పన్నులు పెరిగాయి. అప్పుల విషయంలోనూ కేంద్రానికో నీతి, రాష్ట్రానికో నీతి ఉంటుందా? ఆంక్షలు ఎందుకు? బీజేపీకి రాజకీయమే తప్ప ప్రజాసంక్షేమం పట్టదు. ఈ అంశాలపై పోరాడాల్సిన అవసరం ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ► కేంద్రం బాగుపడాలి.. రాష్ట్రాలు నష్టపోవాలి అన్నట్లుంది కేంద్రం తీరు: టీఆర్ఎస్ నేత హరీష్ రావు ► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని మంత్రి హరీశ్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ► ధాన్యం కొనుగోలు తీర్మానాన్ని బలపర్చిన మంత్రి గంగుల కమలాకర్. ► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారు. ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం ► దేశ పరిస్థితిని గాడిన పెట్టే శక్తులు తప్పకుండా వస్తాయి. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టుకురాలేదా? అలాగే దేశానికి అవసరమైనప్పుడు.. దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇందుకోసం టీఆర్ఎస్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్. ► పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్స్, కశ్మీర్ ఫైల్స్ అంటూ.. మానిన గాయాలను మళ్లీ రేపుతున్నారు. ► దేశ రాజధాని దేవుడి పేరుతో మారణాయుధాలతో ఉరేగింపా? .. ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. దేశానికి మంచి మార్గం చూపించొద్దా? ► దేశం ఉజ్వలమైన భవిష్యత్ కోసం మన పాత్ర పోషించాలి. ► జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తినే దుర్భాషలాడుతారా? ఆయన్ని చంపిన హంతకులను పూజిస్తారా? ఏ దేశమైన ఇలా చేస్తుందా? ఇదేం పెడ ధోరణి? ఇదేం సంస్కృతి. ► ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ రావాలి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి దేశం కోసం ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. దేశ స్థితిని, గతిని మార్చేలా హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా రూపొందితే.. అది మనకే గర్వకారణం. ► ప్రధాని సొంత రాష్ట్రం సహా దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయని అన్నారు. ► వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి అని తెలిపారు. ► తెలంగాణ రాష్ట్రం పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కరెంట్ దగ్గరి నుంచి ప్రతీదాంట్లోనూ పురోగతి ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మాట కాగ్, ఆర్థిక నిపుణులు సహా పలు నివేదికలు చెప్తున్న మాట. ► ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు నెలవు. ఇప్పుడు జలధారకు నెలవు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ► అన్నింట్లోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. ► ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు సాధించాం. ► తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు. ► డబ్బాలు కొట్టుకోవడం, అతిగా పొగుడుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదు. దేశంలో పది ఉత్తమమైన గ్రామాలు తెలంగాణావే. కేంద్రం ఇచ్చిన ఈ సర్టిఫికెట్టే అందుకు నిదర్శనం. ► దేశానికి తెలంగాణ పాలన రోల్ మోడల్. సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుకుంటున్నాం. ► తెలంగాణకు టీఆర్ఎస్ కంచుకోట.. ఎవరూ బద్దలు కొట్టలేని రక్షణ కవచం. టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆస్తి. ► అనుకున్న లక్ష్యాలను ముద్దాడి, రాష్ట్ర కాంక్షను సాధించుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి. ► 60 లక్షల మంది పార్టీ సభ్యులతో.. వెయ్యి కోట్ల ఆస్తులున్న పార్టీ టీఆర్ఎస్. ► ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుని 21వ ఏట అడుగుపెడుతోంది టీఆర్ఎస్ పార్టీ. ► టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రసంగం ప్రారంభం. ► టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు గౌరవ స్వాగతోపన్యాసంతో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం. ► హెచ్ఐసీసీకి చేరిన సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. వేదికపైకి చేరిక. ► ప్రగతి భవన్ నుంచి ప్లీనరీ ప్రాంగణానికి బయలుదేరిన టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ► టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలతో పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో జరిగే ప్లీనరీ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది TRS ప్రతినిధులు హాజరుకానున్నారు. ► ఒకప్పుడు బెంగాల్లో ఏది జరిగితే.. దేశమంతా అదే జరిగేదని చెప్పేవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో ఏది జరిగితే.. దేశమంతా అదే జరుగుతోంది. తెలంగాణలో ఒకప్పుడు కరువు, వలసలు ఉండేవి. ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచింది: మంత్రి హరీష్‌రావు ► టీఆర్ఎస్లో జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు. కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత నియామకం. ► తెలంగాణ భవన్లో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ప్లీనరీ సమావేశంలో జాతీయ రాజకీయాలపై తీర్మానం ప్రవేశపెట్టనున్న కేటీఆర్. ► హైదరాబాద్ మాదాపూర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా బుధవారం జరగనున్న వేడుకల్లో.. పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ► తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. -
జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం సుమారు పది రోజుల క్రితం ప్రారంభమైన ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తికాగా, వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం భోజనాల ఏర్పాట్లు మంగళవారం రాత్రి నుంచే ప్రారంభించారు. అందరి దృష్టీ ‘జాతీయ రాజకీయాలపైనే’ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గమ్యాన్ని చేరడమే కాకుండా వరుసగా రెండు పర్యాయాలు అధికార పగ్గాలు చేపట్టింది. 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తమ పార్టీ మేజర్ అయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ప్లీనరీలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనుండగా, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన వైఫల్యాలు ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని పార్టీ నేతలు వెల్లడించారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానం ఆమోదించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా తీర్మానాలు చేయనున్నారు. ఇప్పటికే తీర్మానాల వారీగా వక్తల పేర్లను ఖరారు చేశారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ రాక సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు గులాబీరంగు దుస్తులను ధరించి రావాలని ఆదేశించారు. ప్రతినిధులందరికీ ప్రత్యేక కిట్‌లో తీర్మానాల ప్రతులు, పెన్నులు, ప్యాడ్లు, పార్టీ జెండాలు తదితరాలు అందజేస్తారు. హెచ్ఐసీసీ ప్రాంగణంలో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ప్రతినిధుల పేర్లు నమోదు చేసి, పాస్‌ను పరిశీలించి లోని కి అనుమతిస్తారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. కేసీఆర్ ప్రా రంభోపన్యాసం తర్వాత తీర్మానాలపై చర్చ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ తీర్మానాలు ఇవే.. ► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం ► దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం ► ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం ► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం ► బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం ► నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్వహించాలని ఈమేరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం ► తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ఊరూరా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో జెండా పండుగ నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగలో పాల్గొనాలని, గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఉదయం 9 గంటలకు తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించాలన్నారు. బార్కోడ్ పాస్‌తో ప్రవేశం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని మొత్తం 22 కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది ప్రజా ప్రతినిధులు, నాయకులకు మాత్రమే పార్టీ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 65 లక్షల మంది పార్టీ సభ్యులు ఉన్నా.. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపించామని, ఆహ్వానాలు అందని వారు మన్నించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీల ద్వారా ఆహ్వానాలు వెళ్లగా తొలిసారిగా ‘బార్కోడ్’తో కూడిన పాస్‌ను ఉపయోగించి సమావేశ ప్రాంగణంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో ప్రధాన వేదికతో పాటు మరో ఐదు డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. 33 రకాల వంటకాలు సమావేశ ప్రాంగణమంతా కేసీఆర్ భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో గులాబీమయం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ నగరానికి దారితీసే ప్రధాన మార్గాలతో పాటు నగరంలోని ముఖ్య కూడళ్లలో పార్టీ నేతలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రతినిధుల కోసం 33 రకాల వంటకాలు సిద్ధం చేయడంతోపాటు హెచ్ఐసీసీలో వేర్వేరు చోట్ల భోజన వసతి కల్పిస్తున్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగంతో పార్టీ నేతలు సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన గద్వాల, భద్రాచలం, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన నేతలు మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. -
సంస్కరణలకే స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదని.. కే అంటే కాలువలు.. సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్లు అనేది రాష్ట్రంలోని లక్షలాది రైతుల మాట అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ‘ఇన్క్రెడిబుల్ తెలంగాణ’ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతమైన సంస్కరణలను అమల్లోకి తెచ్చా రని ప్రశంసించారు. అసలు మీకు పరిపాలన చేతనవుతుందా అని ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నిం చిన గొంతులే.. ఇప్పుడు రాష్ట్ర పరిపాలన, సంస్కరణలను ప్రశంసిస్తున్నాయని పేర్కొ న్నారు. సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ‘రాష్ట్రంలో పాలనా సంస్కరణలు– విద్యుత్– ఐటీ– పారిశ్రామిక అభివృద్ధి’పై కేటీ ఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. అద్భుత విజయాలు సాధిస్తున్నాం ‘‘ఉమ్మడి ఏపీలో నీటి వనరులంటేనే చిన్న చూపు చూసే పరిస్థితి. బడ్జెట్లో కేటాయిం పులు అంతంతే. చిన్ననీటి వనరులకు కేసీఆర్ పెద్దపీట వేశారు. చిన్న, పెద్ద నీటివనరులు అనే వ్యత్యాసం లేకుండా రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలను కాల్వలు, చెరువులు, చెక్‌డ్యాంలు, ఆనకట్టలు, లిఫ్ట్ స్కీమ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. సంస్కరణ లంటే అతుకుల బొంతలు కాదు. అలాంటి సంస్కరణలను కొత్తపుంతలు తొక్కేలా చేసిన ఘనత కేసీఆర్‌దే. ప్రతీ సంస్కరణకు కేంద్ర బిందువు ప్రజలే. అందుకే ఈ అద్భుత విజయాలు, అసాధారణ ఫలితాలు సాధి స్తున్నాం. సమైక్య రాష్ట్రంలో కరెంట్ అంటేనే సంక్షోభం, అది నేడు తెలంగాణలో సంతో షంగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిన తెలంగాణ ఉద్యమంలో.. యువతరం ముందుండి పోరాడింది. వారి ప్రయోజనాలే పరమావధిగా కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటైంది. తద్వారా 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే వీలు ఏర్పడింది. ఇది సంస్కరణలకే స్వర్ణ యుగం ఒకే సమయంలో సంక్షేమ, సంస్కరణల ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఈ ఏడున్నరేళ్ల పాలన పాలన సంస్కరణలకే స్వర్ణయుగం. అధికార వికేంద్రీకరణతో 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసుకున్నాం. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల సంఖ్యను పెంచి స్వయం పరిపాలన అందించాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చాక అమల్లోకి వచ్చిన సంస్కరణలతో, పల్లెప్రగతి కార్య క్రమంతో రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శపల్లెగా రూపుదిద్దుకుంటోంది. కేంద్రం సైతం దీనిని గుర్తించి అవార్డుల మీద అవార్డులు ఇస్తోంది. మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని కొత్త మున్సిపల్ చట్టం ద్వారా కేసీఆర్ కడిగిపారేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆచరణాత్మకంగా నిరూపించింది. దేశంలో ఏ రాష్ట్రం తలపెట్టని భూరికార్డుల ప్రక్షాళన ఇక్కడ చేపట్టాం. యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. ధరణి పోర్టల్ సంస్కరణల శకంలోనే ఒక సంచలనం. ఇది భూమిచుట్టూ అల్లుకున్న చిక్కుముడులను విప్పేసింది. ఇప్పుడు స్పష్టమైన హద్దులతో సమగ్ర భూరికార్డులను నిర్ధారించి పాస్ పుస్తకాలు అందించనున్నాం. ఇకపై భూరికా ర్డులను ట్యాంపర్ చేసే అవకాశం లేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంస్కరణల పర్వంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వివిధ సంద ర్భాల్లో దేశంలోని ప్రముఖులను కలిసినపుడు వారంతా అంటున్నది ఒకటే మాట. ఒకప్పుడు ‘నేడు బెంగాల్ ఆలోచించేది.. రేపు దేశం ఆలోచిస్తుంది’ అన్న నానుడి ఉండేది. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని ‘తెలంగాణలో నేడు ఏం జరుగుతుందో, రేపు యావత్ భారత్‌లో జరుగుతుంది’ అనే విధంగా ప్రశంసలు అందు తున్నాయి.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఇన్క్రెడిబుల్ తెలంగాణ..’లక్ష్యం రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకెళుతోంది. ఐటీ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదు.. ‘ఇన్క్రెడిబుల్ తెలంగాణ’అనే మాదిరిగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. కఠోర పరిశ్రమతో, అవినీతి రహిత క్లియరెన్సులకు మార్గం కల్పిస్తూ, రెడ్ కార్పెట్ స్వాగతం చెప్తే తప్ప ఆషామాషీగా పెట్టుబడులు రావు. కేసీఆర్ రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. అది పూర్తయ్యాక కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక కారిడార్లు, పార్కులు, క్లస్టర్లతో భారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు బహుముఖ ప్రయోజనాలు సమకూరుతాయి. రాష్ట్రంలో స్టార్టప్‌లకు పెద్దపీట వేసి, కొత్త పరిశ్రమలకు ప్రాణం పోస్తుంటే.. కేంద్రంలో మాత్రం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఉసురుతీసి ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. -
20 Years of TRS: టీఆర్ఎస్ ప్లీనరీ ఫొటోలు
-
ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం
-
అధ్యక్షుడికి విస్తృతాధికారాలు...
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల ఏర్పాటులో పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుకు విస్తృత అధికారాలు అప్పగిస్తూ సోమవారం జరిగిన ప్లీనరీ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నియమావళిని సవరించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు కలిగి ఉంటారు. అలాగే జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలకు కార్యవర్గాలను నియమించే అధికారాన్ని కూడా అధ్యక్షుడికి అప్పగించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీలకు కార్యవర్గాలు ఏర్పాటయ్యాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీనీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలా ఉండగా పార్టీ అధ్యక్షుడు అందుబాటు లో లేని సమయంలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కట్టబెడుతూ నియమావళిని సవరించారు. వేదికపై కేసీఆర్‌తో మాట్లాడుతున్న కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సభ్యత్వ నమోదు, పార్టీ కార్యాలయాల నిర్మాణం, సంస్థాగత కమిటీల ఏర్పాటు వంటి పనులను ఇప్పటికే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సన్నాహక సమావేశాలకు సంబంధించి ఇటీవల 103 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఇలా ఇప్పటికే పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న కేటీఆర్‌కు ప్రస్తుత సవరణ ద్వారా మరిన్ని అధికారాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉప ఎన్నిక తర్వాత కమిటీలపై దృష్టి ప్రస్తుతం పార్టీ నియమావళికి చేసిన సవరణ మేరకు, హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కమిటీల ఏర్పాటుపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. జిల్లా అధ్యక్ష పదవులతో పాటు పార్టీ కార్యవర్గంలో చోటు ఆశిస్తున్న ఔత్సాహిక నేతల జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శులు ఇప్పటికే అధినేతకు అప్పగించారు. వచ్చే 9 నెలల పాటు పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసే యోచనలో ఉన్న కేసీఆర్.. అసెంబ్లీ నియోజకర్గ స్థాయిలోనూ కమిటీల ఏర్పాటు పకడ్బందీగా ఉండాలని భావిస్తున్నారు. -
నాడు ఆగమాగం.. నేడు బంగారం: టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఒకనాడు ఆగమైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, వరి ధాన్యం ఉత్పత్తి.. ఇలా ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23లక్షల కోట్లు ఖర్చు పెడతాం. ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందులో భాగంగా అట్టడుగున ఉన్న దళితుల కోసం మొదట దళితబంధు కార్యక్రమం చేపట్టాం. ఈ పథకాన్ని వందశాతం అమలు చేసి తీరుతాం. కేవలం దళితబంధుతోనే ఆగిపోబోం. వారితోపాటు గిరిజనులు, బీసీ, ఎంబీసీ, రెడ్డి, బ్రాహ్మణ, వెలమ మొదలైన అన్నివర్గాల పేదలకు మేలు చేస్తాం..’’ అని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మార్చినాటికి ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళితబంధు అందిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ఉద్యమకాలం నుంచీ ఎదుర్కొన్న ఆటుపోట్లను, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన వివరించారు. కొందరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. దళితబంధుతో సంపద సృష్టి దళితబంధుపై పెట్టే పెట్టుబడి వృథా కాదు. రాష్ట్రంలోని 17లక్షలకుపైగా కుటుంబాలకు దళితబంధు సాయంతో రూ.1.70 లక్షల కోట్లు పెట్టుబడిగా పెడితే రూ.10 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతుంది. దళితబంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటు అందిస్తుంది. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు కింద నవంబర్ 4 తర్వాత పూర్తి స్థాయిలో అమలవుతుంది. దానితోపాటు రాష్ట్రం నలుదిక్కులా నాలుగు మండలాల్లోనూ అమలు చేస్తున్నాం. తర్వాత అన్ని నియోజకవర్గాల్లో 100 కుటుంబాల చొప్పున పథకాన్ని అమలు చేస్తాం. ఇది 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొనే స్కీం కాదు. ఆ 10 లక్షలతో ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. ముగ్గురు కలిసి 30 లక్షలతో ఒకే వ్యాపారం చేసుకోవచ్చు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే వైన్‌షాపులు, మెడికల్, ఫెర్టిలైజర్ షాపులతో పాటు కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్ ఇస్తాం. దళితులకు ఏ ఆపద వచ్చినా కాపాడేలా రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నాం. వారు ఢిల్లీకి గులాములు కాంగ్రెస్, బీజేపీలతో దళితబంధు వంటి పథకం సాధ్యమవుతుందా? వాళ్లకు ఢిల్లీ పర్మిషన్ ఇస్తదా? కిరికిరిగాళ్లు, కిరాయిగాళ్లు, ఢిల్లీ గులాములు దీన్ని చేయలేరు. ఈ గులాములు అధికారంలోకి వస్తే.. హైకమాండ్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టే ఈ పథకం వచ్చింది. టీఆర్ఎస్కు హైకమాండ్ లేదు. శాసించేవాళ్లు లేరు. ప్రజలే అధిష్టానం. వారే దిశానిర్దేశం చేస్తరు. మన సంపదను మనమే ఖర్చు చేసుకుంటాం. ఎవరికి భయపడం. అందుకే దళితబంధు వంటి గొప్ప పథకాన్ని తీసుకురాగలిగాం. స్వాతంత్య్ర పోరాటంలా తెలంగాణ ఉద్యమం తెలంగాణ పోరాటాన్ని ఎందరో హేళన చేశారు. ఎక్కడి తెలంగాణ అన్నరు. క్యాదుకాన్ లగాయా భాయ్ అన్నరు. 20 ఏళ్ల కింద జలదృశ్యంలో గులాబీ పతాకాన్ని ఆవిష్కరించినప్పుడు విపరీతమైన అపనమ్మక, అగమ్య గోచర పరిస్థితి. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సిపాయిల తిరుగుబాటు విఫలమైనా, జలియన్ వాలా భాగ్ వంటి మారణకాండలు సాగినా ఆగకుండా స్వాతంత్య్రం సాధించుకున్నట్టుగానే.. తెలంగాణ ఉద్యమం సాగించి విజయతీరాలకు చేరాం. గాంధేయ మార్గంలో సాగిన తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకు కొత్త బాటను చూపింది. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఇప్పటికీ చేతకాని, చేవలేని కొందరు అదెట్లా, ఇదెట్లా అని మాట్లాడుతున్నారు. రైతుబంధు పెట్టిననాడు కూడా ఇలాగే విమర్శలు చేశారు. ఇప్పుడు రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమైంది. దళితబంధు కూడా గొప్ప కార్యక్రమంగా మారుతది. తెలంగాణ వస్తే చీకటి అయిపోతదని శాపనార్థాలు పెట్టిన్రు. మనం 24 గంటల కరెంటు ఇస్తున్నం. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల మీద కేసులు, యాదాద్రి కడతామంటే కేసులు, సచివాలయ నిర్మాణం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్నింటి మీదా కేసులే. వాటన్నింటినీ ఛేదించుకొని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాం. ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నం. అద్భుతంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. మనం విడిపోయిన ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.35 లక్షలకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో మనమే టాప్. తలసరి ఆదాయంలో కూడా దేశంలోని మొదటి రెండు స్థానాల్లో ఉన్నాం. వరిసాగులో పంజాబ్‌ను దాటేశాం. నేడు 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంటే.. అంత పంటను మేం కొనలేమని ఎఫ్‌సీఐ చేతులెత్తేస్తోంది. ప్రజల మేలు కోసం సాహసోపేత నిర్ణయాలు ఏవైనా పనులు చేయాలంటే, కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే సాహసం కావాలి. నాడు పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ తీసేసినట్లే.. ఇప్పుడు ప్రజలకు భారంగా మారిన వీఆర్వో వ్యవస్ధను రద్ధు చేశాం. ధరణిని తీసుకొచ్చాం. ఐదు నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ధరణిలో పేరు నమోదైతే.. తీసేసే హక్కు ఎవరికీ ఉండదు. నాందేడ్, రాయచూర్‌లను తెలంగాణలో కలపాలంటున్నరు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో మంచి పథకాలు అమలవుతున్నాయని, వాటిని తమవద్దా అమలు చేయాలని, లేదంటే తెలంగాణలో కలపాలని నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చాయి. రాయచూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే అయితే బహిరంగంగానే ఈ డిమాండ్ చేశారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడిస్తోంది. ఆంధ్రాలో కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల సంఘం చిల్లర రాజకీయాలు కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి ప్రవర్తిస్తోంది. దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నా.. భారత ఎన్నికల సంఘం చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్న. కేసీఆర్ సభ పెట్టొద్దా? ఏం కత? ఇదో పద్ధతా? కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు సీఎం సభ పెట్టొద్దంటూ కొందరు హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్‌లో సభ నిర్వహించొద్దని ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా హుజూరాబాద్ దళితులు అదృష్టవంతులు. ఎన్నికల సంఘం ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి, దళిత బంధును ముందుకు తీసుకెళ్తడు. అనాథ ఆడపిల్లల కోసం రాత్రంతా ఏడ్చిన.. ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ఆవేదనకు గురయ్యారు. ‘‘గతంలో నేను ఓ సమావేశానికి వెళ్లినప్పుడు ఇద్దరు బాలికలు నా వద్దకు వచ్చారు. మేం అనాథ పిల్లలం. కేజీబీవీలో చదువుతున్నం. టెన్త్ అయిపోతుంది. తర్వాత మేం ఎక్కడికి పోవాలో తెలుస్తలేదన్నరు. వారికి తల్లిదండ్రులు లేరు. ఆదరించే బంధువులు లేరు. ఇది క్రూరమైన సమాజం. ఎదిగిన ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలె. ఏం చేయాలె. ఆ రోజు నిద్ర పోలేదు. మనసులో బాగా ఏడ్చిన. నిజంగా మన బిడ్డకే ఆ పరిస్థితి వస్తే.. మనం ఆ పరిస్థితిలో ఉంటే అని ఆలోచించిన. ఈ క్రమంలోనే అనాథ పిల్లల కోసం త్వరలో మంచి కార్యాచరణ ప్రకటించినం. కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశాం. హాస్టళ్లను పెంచుతున్నాం. అనాథ పిల్లలు స్టేట్ చిల్డ్రన్ కింద ఉండాలి. అనాథ బిడ్డలు కనిపిస్తే చేరదీసి, కడుపులో పెట్టుకుని సాదుకోవాల్సిన అవసరం ఉంది’’ అని కేసీఆర్ తెలిపారు. 2028లో మన బడ్జెట్ రూ.4.28 లక్షల కోట్లు వచ్చే ఏడేళ్లలో రాష్ట్రంలో 23లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నం. 2028 నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 4.28 లక్షల కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం రూ.2.28 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2028 నాటికి 7.76 లక్షలకు చేరుతుంది. తలమాసినోళ్లు బెదిరిస్తే బెదరం.. ఎవరో హరాకిరి గాళ్లు, తలమాసిన వెధవలు, పనికిమాలిన వాళ్లు అవగాహన రాహిత్యంతో, తెలివి తక్కువతనంతో అడ్డంపొడుగు మాట్లాడితే.. టీఆర్ఎస్ పార్టీ బెదిరిపోదు. 60లక్షల సభ్యులు కలిగిన పార్టీ టీఆర్ఎస్. సభ్యుల బీమాకే రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నం. తాను గెలిచి నిలవడమే కాదు, గెలిపించిన సమాజం తలకెత్తుకొని తిరిగేలా అండగా నిలిచిన పార్టీ టీఆర్ఎస్. కుక్కలను, మేకలను ఎక్కడ కట్టేయాలో ప్రజలే నిర్ణయిస్తరు. టీఆర్ఎస్ వద్ద రూ.425 కోట్లు టీఆర్ఎస్ ఆర్థికంగా కూడా శక్తివంతంగా తయారైంది. దేశంలోని ముఖ్యమైన పార్టీలతోపాటు టీఆర్ఎస్కు కూడా గణనీయంగా విరాళాలు సమకూరాయి. రూ.425 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ మొత్తంపై వడ్డీ రూపంలో నెలకు రూ.2 కోట్లు వస్తుంది. ఆ డబ్బులతోనే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కూడా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం. 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందాం. కత్తి పట్టిన కేసీఆర్.. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించాక.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అభిమానులు ఇచ్చిన కరవాలాన్ని పైకెత్తారు. ఒక్కసారిగా పార్టీ నేతలు, కార్యకర్తలు కరతాళ ధ్వనులు చేశారు. ఎటు చూసినా గులాబీనే.. ప్లీనరీ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలతో నిండిపోయాయి. ప్లీనరీకి వెళ్లే దారులు అయితే మొత్తం గులాబీమయం అయిపోయాయి. సభలో కూడా గులాబీ చీరలు ధరించిన పార్టీ మహిళా ప్రతినిధులు, గులాబీ చొక్కాలు, పార్టీ కండువాలు ధరించిన నేతలు, కార్యకర్తలతో హెచ్ఐసీసీ ప్రాంగణం గులాబీ వనంలా కనిపించింది. సెల్ఫీ టైమ్.. కేసీఆర్, కేటీఆర్‌ల దృష్టిలో పడేందుకు పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సభావేదిక సమీపంలో సందడి చేశారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఎమ్మెల్యేలు, మంత్రులతో సెల్ఫీలు దిగారు. -
ఎమ్మెల్యేలకు చెక్.. రాష్ట్ర కార్యవర్గానికి కొత్తరూపు..!
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఏకపక్ష పోకడలకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వారిని, పార్టీకి అంకితమైన, నిరంతరం ప్రజల్లో ఉంటున్నవారిని గుర్తించి వారి సేవలకు తగిన ‘గుర్తింపు’నిచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతి దానికీ ఎమ్మెల్యే ‘ప్రాపకం’పై ఆధారపడే పరిస్థితి పార్టీకి వ్యవస్థాగతంగా మంచిది కాదని భావిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కేడర్ మీద ఎమ్మెల్యేలు చెలాయిస్తున్న అపరిమిత పెత్తనానికి కత్తెర వేస్తూ పార్టీ యంత్రాంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సంస్థాగతంగా బలోపేతమవుతూ దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వడంతో టీఆర్ఎస్ను అన్ని స్థాయిల్లోనూ పటిష్టం చేయా లనే నిర్ణయానికి పార్టీ అధినేత వచ్చినట్లు సమాచారం. పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ, సంస్థాగత శిక్షణ, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం వంటి సంస్థాగత విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. చదవండి: (టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ.. రేపే సమావేశం) తెరమీదకు జిల్లా కమిటీల ఏర్పాటు పార్టీపరంగా గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్యవర్గం మాత్రమే ఉంటుందని గతంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గం, అనుబంధ సంఘాలను రద్దు చేయడంతో పాటు నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 2019 జూలైలో పార్టీ సభ్యత్వ నమోదు అనంతరం గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటైనా కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయలేదు. దీంతో పార్టీ కార్యకలాపాల్లో ఎమ్మెల్యేలకు ఎదురులేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో నేతల నడుమ అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వివిధ పార్టీల నుంచి చేరిన నేతలు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి నడుమ ఆధిపత్య పోరు సాగుతుండగా ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే వారికే వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల కేడర్ గ్రూపులుగా విడిపోవడం... విభేదాల పరిష్కారం, పనిచేసే కేడర్‌కు గుర్తింపు వంటి అంశాలపై దృష్టి పెట్టే యంత్రాంగమంటూ ప్రత్యేకంగా ఏదీ లేకపోవడంతో నష్టం జరుగుతున్నట్లు పార్టీ అధినేత గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడి నియామకంతో పాటు పార్టీ జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. భారీగా ప్లీనరీ... 2019 జూన్, జూలై మాసాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా 65 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. పార్టీ సభ్యత్వం కాల పరిమితి రెండేళ్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీ ప్లీనరీ తర్వాత సభ్యత్వ పునరుద్దరణ చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా 28 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయాన్ని గత ఏడాది డిసెంబర్లో కేసీఆర్ ప్రారంభించగా, మిగతా చోట్ల కూడా ఏప్రిల్‌లోగా ప్రారంభించి సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 27నాటికి టీఆర్ఎస్ 20వ వసంతంలోకి అడుగు పెట్టగా కరోనా నేపథ్యంలో సాదాసీదాగా కార్యక్రమం జరిగిపోయింది. కాబట్టి ఈ ఏడాది ప్లీనరీని ఆర్భాటంగా నిర్వహించాలనే యోచనలో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. దీంతో ఆదివారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంస్థాగత నిర్మాణం, బలోపేతానికి సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గానికి కొత్తరూపు.. సుమారు మూడున్నరేళ్ల క్రితం 2017 అక్టోబర్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రస్థాయిలో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది డిప్యూటీ కార్యదర్శులతో ఏర్పాటైన రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికల సమయంలోనే క్రియాశీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గంలోని సత్య వతి రాథోడ్‌కు మంత్రి పదవి దక్కగా, పి.రాములు, బండా ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కగా, భూపతిరెడ్డి, సపాన్‌దేవ్ వంటి నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పార్టీని బలో పేతం చేయాలని భావిస్తున్న కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్ని స్థాయిల్లో పార్టీలో చేరడంతో అధికారిక పదవులు దక్కని వారికి పార్టీ కమిటీల్లో చోటు కల్పించడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు. -
రేవంత్‌రెడ్డి ఫిర్యాదు అందిందా? లేదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరీ నిమిత్తం పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’పేరుతో పెద్ద మొత్తాల్లో డబ్బు వసూలు చేసి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అందిందో? లేదో? చెప్పాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫిర్యాదు అందితే, అది ఎప్పుడు అందింది.. దానిని జనరల్ డైరీ (జీడీ)లో ఎప్పుడు నమోదు చేశారు.. అసలు నమోదు చేశారో? లేదో? చెప్పాలంది. ఒకవేళ జీడీ డైరీలో కూడా నమోదు చేసి ఉంటే ఆ ఫిర్యాదుపై ఏం చేశారో తెలియజేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా డబ్బు వసూలు చేయడం అవినీతి కిందకే వస్తుందని, దీనిపై ఫిర్యాదు చేసినా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఎస్.వి.భట్ విచారణ జరిపారు. -
24 న టీఆర్ఎస్ తొలి ’ప్లీనరీ సమావేశం’
-
11, 12 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ?
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11, 12 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రతీ నియోజకవర్గానికి 200-250 మంది చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది ముఖ్యులను ఈ ప్లీనరీ సమావేశాలకు ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా ప్రవేశపెట్టబోయే ముఖ్య కార్యక్రమాలు, వాటి ఉద్దేశాలు, పార్టీ శ్రేణులు వ్యవహరించాల్సిన తీరుపై 2 రోజులపాటు వివరించాలని నిర్ణయించారు. సమావేశానికి రాష్ట్ర, జిల్లా పార్టీ ముఖ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులను ఆహ్వానించనున్నారు. ఉపన్యాసకులుగా రిటైర్డు ఐఏఎస్‌లు, పార్టీ సీనియర్లు వ్యవహరించనున్నారు.