TS Series
-
ఇక నంబర్ ప్లేట్లపై టీఎస్ సిరీస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు ఇక ‘టీఎస్’ సిరీస్‌లోకి మారబోతున్నాయి. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించిన రాష్ట్ర ప్రభుత్వం నంబర్ ప్లేట్లపై ‘ఏపీ’ సిరీస్‌ను తుడిచేసేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వాహనాలకు టీఎస్ సిరీస్‌ను జారీ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన వాహనాలకు కూడా టీఎస్ సిరీస్‌ను కేటాయించబోతోంది. అలాంటి వాహనాలన్నింటికీ రవాణా శాఖ కొత్తగా ఆర్సీ కార్డులను జారీ చేస్తుంది. ఇందుకోసం ఒక్కో నంబర్ ప్లేట్ మార్పుపై రవాణా శాఖకు రూ.200 చొప్పున చెల్లించాలి. అలాగే వాహనదారులు కచ్చితంగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను మాత్రమే బిగించుకోవాలనే నిబంధన విధించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను రవాణా శాఖ సీఎంకు పంపింది. హైసెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరి సాధారణ నంబర్ ప్లేట్లను తీసేసి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకునేందుకు సుప్రీంకోర్టు డిసెంబర్ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వాహనాలు కూడా డిసెంబర్ నాటికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ నంబర్ ప్లేట్ల సరఫరా సరిగాలేక దీని అమలు ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నాటికి తెలంగాణలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. దీంతో నంబర్ ప్లేట్ల సరఫరా సంస్థపై రవాణా శాఖ ఒత్తిడి పెంచింది. అయినా సరే డిసెంబర్ నాటికి అన్ని వాహనాలకూ సరిపడా ప్లేట్ల సరఫరా అసాధ్యమని తాజాగా తేల్చారు. దీంతో తెలంగాణకు మరికొన్ని నెలల గడువు ఇవ్వాలని కోరుతూ త్వరలో ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది. అయితే దీనికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వని పక్షంలో డిసెంబర్ గడువను అమలు చేయాలి. అదే జరిగితే మరికొన్ని కంపెనీలకూ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల తయారీ బాధ్యత అప్పగించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 40 ల క్షల వాహనాలున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 24 లక్షల వాహనాలున్నాయి. తొలుత హైదరాబాద్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా కోడ్.. నంబర్ పాతదే.. తెలంగాణలో తొలి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే నంబర్ ప్లేట్ల మార్పునకు శ్రీకారం చుట్టింది. అన్ని వాహనాలూ టీఎస్ సిరీస్‌లోకి మార్చాల్సిందేనని హుకుం జారీ చేయటంతో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా ఆ అడ్డంకి తొలగిపోవటంతో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చేందుకు రవాణా శాఖ కసరత్తు మొదలుపెట్టి సీఎం అనుమతి కోరింది. కొత్త ఆర్సీల జారీకి ఛార్జీగా రూ.200 నిర్ధారించాలని ప్రతిపాదించింది. అన్ని వాహనాలకూ అదే వర్తిస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో.. కొత్త సిరీస్‌లోకి మారే వాహనాలన్నింటికీ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవటాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు కూడా అందులో పేర్కొంది. జిల్లాల కోడ్, వాహన నంబర్ పాతదే ఉంటుంది. ప్రస్తుతం ఏపీగా ఉన్న చోట టీఎస్ అన్న అక్షరాలు మాత్రమే కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. -
నంబర్ ప్లేట్లు మార్చుకోవాల్సిందే
-
వాహనాల సిరీస్ మార్పు షురూ!
హైదరాబాద్: తెలంగాణలో అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను టీఎస్ సిరీస్‌లోకి మార్చే కసరత్తు మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి సోమ, మంగళవారాల్లో మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఏపీ సిరీస్‌తో కొనసాగుతున్న పాత వాహనాల సిరీస్‌ను మార్చాలా వద్దా అన్న విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆదివారంతో ముగిసింది. ఏపీ సిరీస్‌తో ఉన్న అన్ని వాహనాలను నాలుగు నెలల్లో టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలంటూ జారీ చేసిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా ప్రజల నుంచి అభ్యంతరాలు అందని నేపథ్యంలో... ఆ ఉత్తర్వును అమలు చేయాలని ప్రభుత్వం భ్చవిస్తోంది. ఏకంగా 70 లక్షల వాహనాల సిరీస్ మార్చే అంశంపై న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంతకాలం కచ్చితమైన అభిప్రాయం వ్యక్తం చేయకుండా ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. దీనిపై ఇప్పటికీ స్పష్టత రానప్పటికీ.. గడువులోపు అభ్యంతరాలు పెద్దగా రానందున సిరీస్ మార్పు విషయంలో పాత ఉత్తర్వులకు కట్టుబడాలని ప్రభుత్వం భావిస్తోందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. సిరీస్ మార్చటానికి ఎలాంటి రుసుము అవసరం లేదని పాత ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసినా.. వాహనానికి సంబంధించిన అధికార పత్రాల మార్పునకు అయ్యే ఖర్చు మాత్రం వాహనదారులే భరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కార్లకు, ద్విచక్రవాహనాలకు ఇది విడివిడిగా ఉండనుంది. అయితే ఈ ఖర్చు రూ.200కు మించకుండా ఖరారు చేయనున్నట్టు సమాచారం. -
‘నంబర్’గేమ్ షురూ
సాక్షి, హైదరాబాద్: నంబర్ప్లేట్లు మార్చుకోవడానికి వాహనదారులకు చేతిచమురు వదలక తప్పేలా లేదు. పాత వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ప్లేట్ల విషయంలో ఎంతో కొంత రుసుము వసూలు చేసే దిశగా తెలంగాణ రవాణాశాఖ అడుగులేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సిరీస్ వచ్చిన నేపథ్యంలో వాహనాల నంబర్ ప్లేటుపై ఏపీ అక్షరాల బదులు టీఎస్ అక్షరాలు, జిల్లా పాత కోడ్ నంబరు బదులు కొత్త కోడ్‌ను మార్చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాటి ఆర్సీ కార్డులను కూడా మార్పించుకోవాలి. ఇందుకోసం ద్విచక్రవాహనాలకు రూ.100, కార్లు, అంతకంటే పెద్ద వాహనాలకు రూ.200 చొప్పున రుసుము వసూలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో విధివిధానాలు ఖరారు కానున్నాయి. తెలంగాణకు ఇటీవల కేంద్రప్రభుత్వం టీఎస్ సిరీస్‌ను కేటాయించిన నేపథ్యంలో.. ఇప్పటికే ఏపీ సిరీస్‌తో తిరుగుతున్న పాత వాహనాల నంబర్ల ప్లేట్లను కూడా టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన విధివిధానాల ఖరారులో జాప్యం జరుగుతుండటంతో వాహనదారుల్లో అయోమయం నెలకొంది. నంబర్ ప్లేట్లను మార్చాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ప్రజల అభ్యంతరాలను స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. మరో రెండుమూడు రోజుల్లో దీనిపై సమీక్షించి తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఉచితంగా చేయాలంటే కష్టమే... ప్రస్తుతం తెలంగాణలో 73 లక్షల వాహనాలున్నాయి. వీటన్నింటి నంబర్లను తెలంగాణ సిరీస్‌లోకి మార్చాలి. నంబర్ ప్లేటుపై ఏపీ బదులు టీఎస్, జిల్లా కోడ్ సంఖ్య స్థానంలో కొత్త సంఖ్య మార్పించటం పెద్ద సమస్య కాదు. అయితే నంబర్ ప్లేటుపై జరిగిన మార్పునకు తగ్గట్టుగా అధికారిక పత్రాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆర్సీ బుక్కుకు సంబంధించి మార్పు చేయాలి. ఆమేరకు వాహనదారులకు కొత్త కార్డును జారీ చేయాల్సి ఉంటుంది. 73 లక్షల వాహనదారులకు కొత్త కార్డులు జారీ చేయటం ఖర్చుతో కూడుకున్న పని అయినందున దానికి తగిన రుసుము విధించకతప్పదని అధికారులు భావిస్తున్నారు. అయితే మొత్తం భారం వాహనదారుడిపై పడకుండా ఆ రుసుము తక్కువ ఉండేలా చూడాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ద్విచక్రవాహనాలకు రూ.100, మూడు చక్రాలు, కార్లు, అంతకంటే పెద్ద వాహనాలకు రూ.200 చొప్పున రుసుము విధించవచ్చని భావిస్తున్నారు. ఇక హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ఇప్పటికే రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఏడాది గడువు విధించింది. ప్రస్తుతం ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల వాహనాలకు ఎలాగూ ఈ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాల్సి ఉంది. ఆ మొత్తాన్ని వాహనదారులు భరించాల్సిందే. అందని అభ్యంతరాలు... ఏపీ సిరీస్‌లో ఉన్న వాహనాల నంబర్ప్లేట్లను టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలంటూ ఇటీవల ఆదేశించిన ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలుంటే తెలపాల్సిందిగా కూడా సూచించింది. అయితే ఈ విషయంపై సమాచారం ప్రజల్లోకి వెళ్లకపోవటంతో ఇప్పటి వరకు పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కొన్ని జిల్లాలకు సంబంధించిన లారీ అసోసియేషన్లు, కొంతమంది వ్యక్తులు మాత్రమే దీనిపై అభ్యంతరాలు అందజేశారు. సోమ, మంగళవారాల్లో ఈ తంతు కూడా ముగిసినట్టు ప్రకటించి తుది నిర్ణయం వెల్లడించాలని రవాణా శాఖ యోచిస్తోంది. అంటే సోమవారం వరకు ఎవరైనా అభ్యంతరాలుంటే వెల్లడించే అవకాశం ఉంది. రవాణాశాఖ అధికారులకు ఫోన్, లేఖలు, వినతిపత్రాల రూపంలో, లేదా నేరుగా కార్యాలయాలకు వెళ్లి మౌఖికంగా.. అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంది. -
వాహన రిజిస్ట్రేషన్లపై గందరగోళం
ఆదిలాబాద్ క్రైం : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాల వారీగా కోడ్ నంబర్లు కేటాయించడంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజులుగా జిల్లాలో కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఏపీ సిరీస్ టీఎస్ సిరీస్‌గా మారడంతో పాత వాహనదారులు అయోమయంలో పడ్డారు. టీఎస్ సిరీస్‌తో కొత్త రిజిస్ట్రేషన్లు సజావుగానే సాగుతున్నా పాత వాహనాల విషయంలోనే ఇంక స్పష్టత రాలేదు. ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను టీఎస్ సిరీస్‌తో మార్పు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి నాలుగు నెలలు మాత్రమే గడువు ఇచ్చింది. స్పష్టమైన విధివిధానాలేవి? పాత వాహనాల ఏపీ సిరీస్‌ను టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా దీనిపై స్పష్టమైన విధి విధానాలు అందకపోవడంతో రవాణా శాఖ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. పాత వాహనాలన్నింటినీ నాలుగు నెలల్లోగా కొత్త సిరీస్‌లోకి మార్చుకునేందుకు గడువు ఇచ్చారు. పాత వాహనాల నంబర్ల మార్పు విషయంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందా.. నంబర్ ప్లేట్ మారితే కొత్త ఆర్సీ బుక్కుకు రుసుము ఉంటుందా.. నంబరు ప్లేటు మార్చుకొని కొత్త నంబరు ప్లేటు తీసుకుంటే అయ్యే ఖర్చు ఎవరు భరించాలి..? అనే విషయాలపై అధికారులకు ఇంక స్పష్ట మైన ఆదేశాలు రాలేదు. దీంతో పాత వాహనాల నంబర్లు మార్చుకునేందుకు వస్తున్న వాహనదారులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది. పాత వాహనాల నంబర్ల మార్పుపై తమకేలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా... జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో సుమారు 300ల వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఫ్యాన్సీ నంబర్లపై 20 వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రవాణా వాహనాలకు టీఎస్ 01 యూఏ 0001, రవాణేతర వాహనాలకు టీఎస్ 01 ఈఏ0001 సంఖ్యతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక పాత వాహనాల విషయానికొస్తే జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1,30,016 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో ద్విచక్రవాహనాలు 95,437, ఆటోరిక్షాలు 7,780, గూడ్స్ క్యారేజ్‌లు 5,203, కార్లు 4,864, మోపెడ్లు 3, 714, ట్రాక్టర్లు(ప్రైవేట్ )2,554, ట్రాక్టర్లు కమర్షియల్ 2,134, జీపులు 575, మోటర్ క్యాబ్‌లు 1189 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఏపీ 01 సిరీస్ కోడ్‌పై కొనసాగుతుండగా, నాలుగు నెలల్లో టీఎస్‌గా మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. వాహనాల నంబ ర్లు కూడా మారుతుందనే ప్రచారం జరగడంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచకపోవడంతో ప్రసుత్తం పాత వాహనాల చార్జీలతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.400, కారులకు రూ. 625, మోటర్ క్యాబ్‌లకు రూ. 860, హెవీ గూడ్స్లకు రూ.1,360 చొప్పున రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి నెల రిజిస్ట్రేషన్లతో రూ.20 లక్షల ఆదాయం సహకూరుతోంది. -
వాహనదారులపై భారం వద్దు
* నంబర్ప్లేట్ల మార్పుపై ప్రభుత్వం * మార్చకపోవడమే మేలన్న అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాత వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు విషయంలో వాహనదారులపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వాహనాలకు టీఎస్ సిరీస్‌ను కేంద్రం కేటాయించిన నేపథ్యంలో ఏపీ సిరీస్‌తో ఉన్న పాత వాహనాల నంబర్లను కూడా టీఎస్ సిరీస్‌లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సి రావటం వల్ల వాహనదారుల జేబుకు చిల్లుపడటంతోపాటు వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున అది భారంగా పరిణమించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదే శించింది. పాత వాహనాలకు ఎలాగూ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండటంతో టీఎస్ సిరీస్ వివాదం తెరపైకి రాకున్నా... వాహనదారులు ఎలాగూ దానికయ్యే వ్యయాన్ని భరించాల్సి వచ్చేది. టీఎస్ సిరీస్‌తో కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తీసుకోవటం ద్వారా అదనంగా వారిపై భారం పడేదేమీ లేదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయితే రికార్డు పత్రాల్లో దాని నంబర్ మార్పు చేసుకోవటానికి అయ్యే వ్యయం వారిపై పడకుండా చూస్తే సరిపోతుందని, నామమాత్రపు రుసుముతో ఆ తంతు ముగించొచ్చని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. అయితే రాష్ట్రంలో వాహనాల సంఖ్య 73 లక్షల వరకు ఉన్నందున వాటి నంబర్ల మార్పు ప్రక్రియ తమకు తలకుమించిన భారమేనని, వీలైనంతవరకు ఆ కసరత్తు లేకుండా చూస్తేనే మంచిదంటూ అధికారులు మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం శనివారం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇక జిల్లా కోడ్ నంబర్లకు సంబంధించి అధికారులు ప్రాతిపదిక ఏమీ చెప్పలేదని సమాచారం. జిల్లాల వారీగా నంబర్లు కేటాయిస్తే సరిపోతుందని, అక్షరక్రమం ఆధారంగా మాత్రం ఇవ్వకపోవటమే మంచి దన్నారు. తమపరంగా కొన్ని నంబర్లను సూచి ంచారు. ఆదిలాబాద్ 01, కరీంనగర్ 02, వరంగల్ 03, ఖమ్మం 04, నల్గొండ 05, మహబూబ్‌నగర్ 06, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు 7 నుంచి 14 వరకు, మెదక్ 15, నిజామాబాద్ 16గా పేర్కొన్నట్టు తెలిసింది. నంబర్లు మార్చినా ఇబ్బందే ఉండదని, ఎవరికివారుగా నంబర్‌ప్లేట్లపై టీఎస్ అని రాసుకుంటే సరిపోతుందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ పేర్కొనటం విశేషం.