భావనపాడు బాధితుడు మృతి
శ్రీకాకుళం: భావనపాడులో నిర్మించనున్న పోర్టు నిర్మాణం వల్ల తన బోటు, వలలు కోల్పోతున్నానని మనస్తాపానికి గురై అన్న పానియాలు మానేసిన వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా భావనపాడులో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బై తులసీరాం అనే వ్యక్తి అప్పు చేసి ఒక మెకనైజ్డ్ బోటు, వలలు కొన్నాడు.
పోర్టు నిర్మాణంతో వీటితో పనిలేకుండా పోతుందని.. వాటి కోసం చేసిన అప్పు తీర్చే దారికానరాకపోవడంతో.. మూడురోజులుగా అన్నపానియాలు మానేసాడు దీంతో ఈ రోజు మృతిచెందాడు.