Tumors
-
Cancer: కొత్తకొత్తగా, చెత్తచెత్తగా... తెలుసుకోవాల్సిన విషయాలు!
క్యాన్సర్ కూడా ఒక కణమే. అది కొత్తకొత్తగా, చెత్తచెత్తగా ప్రవర్తిస్తుంది. కొత్తగా ఎలా ఉన్నా ఇలా చెత్తగా ప్రవర్తించడమే దాన్ని మిగతా ఆరోగ్యకరమైన కణాల నుంచి వేరు చేస్తుంది. చెడ్డ లక్షణాలుగా ఆపాదిస్తున్న ఆ గుణాలు ఎనిమిది. అందుకే క్యాన్సర్‌ను ఎనిమిది వంకర్ల ‘అష్టావక్ర’ కణంగా చెప్పవచ్చు. ఆ ఎనిమిది గుణాలకు తోడుగా ఈ ఏడాది (2022లో) తాజాగా ఇప్పుడు మరిన్ని దుష్ట గుణాలను నిపుణులు కనుగొన్నారు. కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొనేందుకు ఇవి తోడ్పడుతున్నందున వీటిని గురించి తెలుసుకోవడం అవసరం కూడా. అవేమిటో తెలుసుకుందాం. 1. సస్టెయిన్డ్ ప్రోలిఫరేటివ్ సిగ్నలింగ్ : కణాలన్నీ తమలోని జీవరసాయనాలతో ఒకదానితో ఒకటి సంప్రదింపులు జరుపుకోవడం, ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉండటం చేస్తుంటాయి. క్యాన్సర్ కణాలు విచిత్రంగా తమ సొంత సిగ్నలింగ్ వ్యవస్థను కలిగి ఉండటమే కాదు... ఆరోగ్యకరమైన కణాలు సంభాషించుకున్నట్లుగా, ఒక క్రమబద్ధమైన రీతిలో అనుసంధానితమై ఉన్నట్లుగాను ఉండవు. పక్కవాటితో నిమిత్తం లేకుండా తాము స్వతంత్రంగా, ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ గుణాన్ని సస్టెయిన్డ్ ప్రోలిఫరేటివ్ సిగ్నలింగ్గా నిపుణులు పేర్కొంటుంటారు. 2. దేహపు సిగ్నల్స్ స్వీకరించకపోవడం : దేహంలో ఎక్కడైనా చెడు కణాలు ఉంటే వాటిని తుదముట్టించేందుకు శరీరం నుంచి ఆజ్ఞలు వెలువడతాయి. వాటి ఆధారంగా ఆ చెడు కణాలన్నీ మిగతా ఆరోగ్యకరమైన కణాలకు చేటు చేయకుండా తమను తాము ధ్వంసం చేసుకుని అంతర్గత అవయవాల ఆరోగ్యం కాపాడాలి. కానీ క్యాన్సర్ కణాలు ఈ సిగ్నల్స్‌ను లెక్క చేయవు. 3. రెసిస్టింగ్ సెల్ డెత్ : ప్రతి కణం ఒక నిర్ణీత సమయం తర్వాత మరణిస్తుంటుంది లేదా అంతమైపోతుంటుంది. కానీ క్యాన్సర్ కణం అలా మరణించడానికి ఇష్టపడదు. అందుకే చావు లేని వరం పొందిన రాక్షసుల్లా అది రెచ్చిపోతుంటుంది. 4. ఎనేబిలింగ్ రిప్లికేటివ్ ఇమ్మోర్టాలిటీ: ముందు పేర్కొన్న (‘రెసిస్టింగ్ సెల్ డెత్’) అంశంలో చెప్పినట్లుగా లోపభూయిష్టమైన కణం... ఇతర కణాలకు నష్టం చేయకుండా ఉండేందుకు అంతమైపోవాలి. కానీ క్యాన్సర్ కణం అలా అంతమైపోకుండా ఉండటమే కాదు... తనలాంటి లోపభూయిష్టమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. అది కూడా ఒకటి రెండుగానూ... రెండు నాలుగుగానూ కాకుండా... కణవిభజన నిబంధలను అతిక్రమించి ఒకటి నాలుగుగానూ... ఆ నాలుగు అరవై నాలుగుగా.. ఇలా ఇష్టం వచ్చినట్లు అపరిమితంగా పెరిగిపోతుంది. అందుకే క్యాన్సర్ గడ్డలు ఒక క్రమతతో కాకుండా... గడ్డల్లా (ట్యూమర్స్లా) అసహ్యం గా పెరుగుతాయి. 5. ఇండ్యూసింగ్ / యాక్సెసింగ్ వాస్క్యులేచర్ : అన్ని కణాలకు నిర్ణీతమైన రీతిలో ఆక్సిజన్ లేదా పోషకాలు అందాలి. కానీ క్యాన్సర్ గడ్డలు... కణాల నిబంధనలన్నీ తోసిరాజంటూ తాము స్వయంగా రూపొందించుకున్న మార్గాల ద్వారా ఆరోగ్యకరమైన కణాలకు అందనివ్వకుండా... అన్ని పోషకాలను తామే స్వీకరిస్తాయి. అందుకే క్యాన్సర్ వచ్చిన రోగి బలహీనంగా మారిపోతుంటాడు. ఇలా క్యాన్సర్ కణాలు సొంత రక్తప్రసరణ మార్గాలను ఏర్పాటు చేసుకోవడాన్నే ‘ఇండ్యూసింగ్ / యాక్సెసింగ్ వాస్క్యులేచర్’ అని నిపుణులు చెబుతుంటారు. 6. యాక్టివేటింగ్ ఇన్వేజన్ అండ్ మెటాస్టాసిస్: ఒక నిర్ణీత క్రమంలో కాకుండా... తానున్న ప్రాంతాన్ని వదిలి... వేరే అవయవాల కణాల్లోకి వలస వెళ్లి... అక్కడ స్థిరపడటం, అక్కడ మళ్లీ పెరిగిపోవడాన్నే ‘మెటాస్టాసిస్’ / ‘మెటస్టాటిక్ గ్రోత్’ అంటారు. ఉదాహరణకు కాలేయానికి క్యాన్సర్ వచ్చిందనుకుందాం. అది అక్కడికే పరిమితమై పోకుండా పక్కన ఉన్న అన్ని అవయవాలకు పాకడాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ పక్కకణాలపై దాడి చేసినట్లుగా అన్నిచోట్లకు పాకే ప్రక్రియను ‘యాక్టివేటింగ్ ఇన్వేషన్ అండ్ మెటాస్టాసిస్’ అంటారు. 7. రీ–ప్రోగ్రామింగ్ సెల్యులార్ మెటబాలిజమ్ : ఓ కణంలో క్రమబద్ధమైన రీతిలో జీవక్రియలు జరగడాన్ని మెటబాలిజమ్ అంటారు. ఈ కార్యక్రమాన్ని దెబ్బతీయడమే కాకుండా... తనకు ఇష్టమైన రీతిలో అక్కడి కార్యకలాపాలు జరిగేలా క్యాన్సర్ కణం జీవక్రియలను రీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఇది కణానికి తీవ్రనష్టం కలిగిస్తుంది. 8. అవాయిడింగ్ ఇమ్యూన్ డిస్ట్రక్షన్: మన దేహంలో చెడు కణం పుట్టగానే రోగనిరోధక వ్యవస్థ రంగంలోకి దిగి దాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. కానీ క్యాన్సర్ కణం ఈ ఇమ్యూన్ వ్యవస్థను తోసిరాజని పెరుగుతుంది. ఇమ్యూన్ వ్యవస్థ తనను నాశనం చేయకుండా మనుగడ సాగిస్తుంది. ఈ గుణాలను కనుగొన్న కారణంగా క్యాన్సర్‌ను తుదముట్టించేందుకు లేదా ఎదుర్కొనేందుకు ఇదివరలో మనకు తెలిసిన మార్గాలతో పాటు... ఇతర మార్గాలను కనుగొనేందుకు దారి సుగమమైంది. అయితే ఇంకా అదనం గా ఏవైనా గుణాలన్నాయా..? అనే అంశంతో పాటు... ఇదివరలో కనుగొన్న ఎనిమిది అంశాలపై మరింత అవగాహన కోసం పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. తద్వారా మరింత సమర్థమైన, మెరుగైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆశిస్తున్నారు. ఇక్కడ పేర్కొన్న ఎనిమిది గుణాలతో పాటు ఈ ఏడాది అంటే 2022లోనే మరిన్ని గుణాలను నిపుణులు కనుగొన్నారు. ఉదాహరణకు జన్యుపరమైన చంచల స్వభావంతో ప్రవర్తించడం (జీనోమ్ ఇన్‌స్టెబిలిటీ అండ్ మ్యూటేషన్స్), అన్ని నిబంధనలను తోసిరాజని తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం (అన్లాకింగ్ ఫీనోటైపిక్ ప్లాస్టిసిటీ), దేహపు ఆజ్ఞలను తనకు అనుగుణంగా వ్యాఖ్యానించుకుని అన్ని విధాల చెరుపుగా చేసేవిధంగా కార్యకలాపాలు నిర్వహించడం (నాన్ మ్యూటేషనల్ ఎపీజెనెటిక్ రీ–ప్రోగ్రామింగ్), చెడు కోసం పాటుపడటం (ట్యూమర్ ప్రమోషన్ ఇన్ఫ్లమేషన్), కాలం చెల్లిన కణాలూ ఇంకా జీవించే ఉండటమే కాకుండా మంచి కణాలను తమ కార్యకలాపాలు నిర్వహించనివ్వకుండా చేయడం (సెనెసెంట్ సెల్స్), మన దేహానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా చేసి, చెడు సావాసాలతో చెడు బ్యాక్టీరియా దేహంలో పెరిగిపోయేలా చేయడం (పాలీమార్ఫిక్ మైక్రోబయోమ్) వంటివి కొన్ని. -
కణుతులకు ఇంటి వైద్యం!
కొద్ది నెలలుగా పశువులకు అక్కడక్కడా లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్.ఎస్.డి.) సోకుతూ రైతులను బెంబేలెత్తిస్తోంది. ఇది క్యాప్రిపాక్స్ అనే వైరస్ కారణంగా సోకుతోంది. దోమలు, పిడుదులు, ఇతర కీటకాల ద్వారా బలహీనంగా ఉన్న పవువులకు సోకుతుంది. కలుషిత దాణా, నీరుతో పాటు.. సరిగ్గా శుభ్రం చేయిన పరికరాలతో భారీ స్థాయిలో వాక్సిన్లు వేయడం, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా ఈ అంటు వ్యాధి ప్రబలుతోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) పేర్కొంది. పశువు వంటిపైన అనేక భాగాల్లో బొబ్బలు, కణుతుల మాదిరిగా రావటం దీని ప్రధాన లక్షణం. కుంకుడు గింజ నుంచి చిన్న నిమ్మకాయ అంతటి కణుతులు వస్తాయి. వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల్లో జ్వరం, దురదలు, ముక్కులు, కళ్ల నుంచి స్రావాలు కారటం కనిపిస్తాయి. కనుగుడ్లు ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవటంతో పశువు నీరసిస్తుంది. తగిన చికిత్స అందకపోతే కణుతులు పగిలి పశువును బాధిస్తాయి. మందలలో 10–20 శాతం పశువులకు ఇది సోకుతున్నట్లు గుర్తించారు. అయితే, ఈ వైరస్ బారిన పడిన పశువుల్లో తగిన చికిత్స లభించని పక్షంలో 2 నుంచి 4 శాతం చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. పశువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకదని నిపుణులు చెబుతున్నారు. ఇది పాడి పశువులకు ఈ వైరస్ సోకితే పాల దిగుబడి తగ్గిపోతుంది. అయితే, దూడలకు ఎక్కువగా సోకుతుంది. సాధారణంగా పశువైద్యులు ఈ వ్యాధి వచ్చిన పశువులకు ఇంజక్షన్లు, యాంటిబయోటిక్స్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే, కేవలం ఇంటి వైద్యంతోనే ఈ వైరస్ వ్యాధిని 4–5 రోజుల్లో సంపూర్ణంగా నయం చేయవచ్చని, పశు మరణాల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని పశు వైద్య నిపుణులు డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు(99122 92229) తెలిపారు. ఔషధ మొక్కల ఆకులతో చేసిన కషాయం, పైపూత లేపనంతో లంపీ స్కిన్ డిసీజ్‌ను పారదోలవచ్చని ఘంటాపథంగా చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన గోసేవకుడు రవికి చెందిన గిర్ ఆవుకు ఈ వైరస్ సోకి వంటిపైన కణుతులు వచ్చాయి. డా. సాయి బుచ్చారావు సూచన మేరకు.. ఔషధ మొక్కలతో తయారు చేసిన ద్రావణం ఆవుకు తాగించి, ఔషధ మొక్కల ఆకులు నూరి ఆవు శరీరానికి పూయటంతో నాలుగైదు రోజుల్లో ఈ జబ్బు నుంచి ఆవు పూర్తిగా కోలుకుందని రవి (90007 00020) తెలిపారు. ఈ ఫలితం చూసి తొలుత ఇంజక్షన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారని అన్నారు. తనతోపాటు ఇతర రైతులు కూడా ఈ చికిత్సతో మంచి ఫలితాలు సాధించారన్నారు. కషాయం తయారు చేసే విధానం 100 గ్రాములు వేప ఆకులు, 100 గ్రాములు తులసి ఆకులు, 100 గ్రాములు పసుపు, 50 గ్రాములు మిరియాలను అర లీటరు (500 ఎం.ఎల్.) నీటిలో వేసి మరిగించాలి. రెండు పొంగులు వస్తే చాలు. ఇలా తయారు చేసిన 200 గ్రాముల కషాయాన్ని పశువుకు తాగించాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 నుంచి 5 రోజులు తాగించాలి. పైపూత మందు తయారు చేసే విధానం కలబంద ఆకుల గుజ్జు, పసుపు, గోరింటాకులను కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్దను పశువు వంటికి లేపనంగా పట్టించాలి. శరీరం అంతా రాస్తే మంచిది. ఒకవేళ వీలుకాకపోతే కణుతులు తేలిన ప్రాంతాల్లో రాసినా పర్వాలేదు. ఈ లేపనం పూయక ముందు 2 శాతం (వంద లీటర్ల నీటికి 2 కిలోల ఉప్పు) ఉప్పు ద్రావణంతో పశువును శుభ్రంగా కడగాలి. ఖర్చు లేకుండా రైతులు ఈ చికిత్స ద్వారా లంపీ స్కిన్ డిసీజ్ బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. -
కేన్సర్ కణితులను అడ్డుకునే వయాగ్రా?
జబ్బులకు కొత్త కొత్త మందులు కనుక్కోవడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. కేన్సర్ విషయాన్నే తీసుకుంటే ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు దాటిపోతుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఇతర సమస్యలకు వాడుతున్న మందుల్లోనే కేన్సర్‌ను ఎదుర్కొనే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ అన్వేషణలో శాస్త్రవేత్తలు గుర్తించిన సరికొత్త మందు.. వయాగ్రా! ఇందులోని రసాయనం పీడీఈ5 రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దపేవు, కాలేయ కేన్సర్ కణితుల పెరుగుదలను అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి వయగ్రాను శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తయారు చేయలేదు. గుండెజబ్బులకు సంబంధించి వచ్చే చాతినొప్పిని నివారించడం ఈ మందు ఉద్దేశం. పీడీఈ5 రసాయనం నాడుల్లో రక్తం వేగంగా ప్రసారమయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలోనే ఇతర అవయవాల్లోనూ రక్తప్రసరణ హెచ్చడంతో కంపెనీలు వయాగ్రాను ఇతర అవసరాల కోసం అమ్మడం మొదలుపెట్టి సొమ్ము చేసుకున్నాయి. అయితే పీడీఈ5ను నిశితంగా పరిశీలించినప్పుడు దీన్ని కేన్సర్ చికిత్సలోనూ వాడవచ్చునని స్పష్టమైంది. ఇప్పటికే దాదాపు 25 అధ్యయనాలు ఈ విషయాన్ని తెలిపాయి. ప్రస్తుతం దాదాపు 11 పరిశోధనలు కేన్సర్ విషయంలో వయాగ్రా పాత్ర ఏమిటన్నది పరిశీలిస్తున్నాయి. వీటన్నింటి ఫలితాల ఆధారంగా కేన్సర్ చికిత్సగా వయాగ్రా వాడకంపై ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే కేన్సర్ చికిత్స కోసం పీడీఈ5ను వాడేందుకు అనుమతులు లేవు. కాకపోతే భవిష్యత్తులో అందుబాటులోకి వస్తే మాత్రం చాలా చౌకగా కేన్సర్‌ను జయించేందుకు ఇదో మార్గమవుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. -
మహిళ గుండెలో 97 కణితులు
–విజయవంతంగా తొలగించిన పెద్దాసుపత్రి వైద్యులు –కూరగాయలు శుభ్రం చేయని ఫలితం కర్నూలు(హాస్పిటల్): కూరగాయలు, మాంసం కడగకుండా తినడంతోఓ మహిళ గుండెలో 97 కణితులు ఏర్పడ్డాయి. వాటిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించి ఊపిరిపోశారు. వివరాలను మంగళవారం ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. కల్లూరు మండలంలోని వెంగన్నబావి సమీపంలో నివసిస్తున్న పెద్దక్క(65) 10రోజుల క్రితం గుండెలో నొప్పి, గుండెదడతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరారు. కార్డియాలజి విభాగంలో ఆమెకు 2డీ ఎకో, సిటీస్కాన్ పరీక్షలు నిర్వహించగా ఆమె గుండెలో 97 కణితులు ఉన్నట్లు బయటపడింది. దీంతో మంగళవారం ఆ మహిళకు ఆపరేషన్ చేసి కణితులు తొలగించినట్లు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సాధారణంగా పొట్టేలు, మేకలు కడగని కూరగాయలను తింటాయి. కూరగాయలపై ఉండే క్రిములు వాటి జీర్ణాశయంలోకి వెళ్లి ఎకినోకోకస్ గ్రాన్యులోసస్ ఆర్గానిజం అనే క్రిమి తయారవుతుంది. అది పెరిగి పెద్దవై వాటి మలం ద్వారా బయటకు వస్తాయన్నారు. ఇవి ఇతర ఆహార పదార్థాలపై వాలుతాయన్నారు. ఇలాంటి కూరగాయలను ప్రజలు కడగకుండా తినడంతో అవి మానవశరీరంలోకి ప్రవేశించి కణితులను సృష్టిస్తాయ’ని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కణితులు 70 శాతం కాలేయంలో, 28 శాతం ఊపిరితిత్తుల్లో వస్తాయని, కానీ పెద్దక్కకు గుండె మధ్యలో వచ్చాయన్నారు. ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. -
ఫైబ్రాయిడ్స్ పూర్తిగా నయమవుతాయి!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నేను గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సిందిగా సూచించారు. శస్త్రచికిత్సానంతరం కూడా భవిష్యత్తులో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని వైద్యుడు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందా? - సునీత, విజయవాడ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. దాదాపు 20 - 50 శాతం వరకు ఇవి పిల్లలను కనే వయసులో వస్తుంటాయి. అంటే ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులో ఏర్పడుతుంటాయి. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చాలావరకు ఇవి గర్భాశయాన్ని తొలగించాక వస్తుంటాయి. సాధారణంగా ఈ కణుతులు గర్భాశయపు కండర కణజాలంతో ఏర్పడతాయి. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్ధకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ అదేపనిగా పెయిన్కిలర్స్ వాడవద్దు... ఆర్థో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. రోజూ స్కూటర్ మీద ఆఫీసుకు వెళ్తాను. గత కొంతకాలంగా నేను కీళ్ల సమస్యతో బాధపడుతున్నాను. పెయిన్‌కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతున్నంతసేపు పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే ఇలాంటి మందులు ఎక్కువ రోజులు వాడితే కిడ్నీ, లివర్‌కు మంచిది కాదని స్నేహితులు, కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. స్కూటర్ స్టార్ట్ చేసేప్పుడు, స్టాండ్ వేసే సమయంలో నాకు నొప్పులు విపరీతంగా వస్తున్నాయి. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తోంది. దయచేసి నా బాధలకు శాశ్వత ఉపశమనం కలిగించే మార్గాన్ని సూచించండి. - నాగరాజు, హైదరాబాద్ మీరు ఎదుర్కొంటున్న సమస్యను వైద్యపరిభాషలో ‘ఆర్థరైటిస్’ అంటారు. గతంలో పెరిగే వయసు రీత్యా ఈ సమస్యలు వచ్చేవి. కానీ ఇటీవల 20 - 50 ఏళ్ల వయసు వారిలో సగానికిపైగా ఆర్థరైటిస్‌కు లోనవుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. ఇక మీ విషయానికి వస్తే... మీరు కూడా ఆర్థరైటిస్ సమస్యతోనే బాధపడుతున్నారని చెప్పాలి. ఎముకల మధ్య కుషన్‌లా కార్టిలేజ్ అనే పొర ఉంటుంది. ఇది అరిగిపోయినా, పూర్తిగా దెబ్బతిన్నా ఎముకలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నా, వాపు వచ్చినా ఈ కీళ్లనొప్పులు ఏర్పడతాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న వివరాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారికి మోకాళ్లు, మోచేతులు, కాలి వేళ్లు, మణికట్టు. భుజాలు, నడుము, వెన్నెముక భాగాల వాపుతో నొప్పి వస్తుంటుంది. కొన్నిసార్లు ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి జ్వరం రావడం, కదల్లేకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి ముఖ్య లక్షణాలు ఆధారంగా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించవచ్చు. ముందుగా మీరు పెయిన్‌కిల్లర్స్ వాడటం మానేయండి. అవి కిడ్నీ లాంటి అవయవాలకు చేటు చేస్తాయి. మీరు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. ఆయన మీ వ్యాధికి సంబంధించి ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, సీరమ్ యూరిక్ యాసిడ్, వీడీఆర్ఎల్, సీబీసీ, ఎక్స్‌రే (ఆయా కీళ్లకు సంబంధించినవి)లాంటి కొన్ని నిర్ధారణ పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇస్తారు. పరీక్ష ఫలితాలను బట్టి మీకు చికిత్సా విధానాన్ని అవలంబిస్తారు. కొన్ని సమస్యలు మందులతో పాటు ఫిజియోథెరపీ లాంటి వాటితో తగ్గిపోతాయి. కానీ కొన్నింటికి మాత్రం సర్జరీ తప్పనిసరి అవుతుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, శస్త్రచికిత్స విధానాల ద్వారా మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలకూ గురికానవసరం లేదు. ఈలోగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించండి. అవి... వంటలలో ఉప్పు, నూనె బాగా తగ్గించాలి అధిక బరువు లేకుండా చూసుకోండి. వ్యాయామం, యోగా లాంటివి చేయాలి క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు, తాజా కూరగాయలను తీసుకోండి పాలు, గుడ్లు, పెరుగు వంటివి అధికంగా తినాలి పాదరక్షలు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి మంచినీరు బాగా తాగాలి డయాబెటిస్ ఉంటే అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ బాధ మరీ ఎక్కువగా అనిపిస్తే ఫిజియోథెరపీతో కూడా ఉపశమనం పొందవచ్చు. అంతేగాని డాక్టర్ సలహా లేకుండా మాత్రం విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వాడటం చాలా ప్రమాదం. డాక్టర్ కీర్తి తలారీ బొమ్మకంటి సీనియర్ రుమటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
క్యాన్సర్ కౌన్సెలింగ్
అన్ని కణుతులూ క్యాన్సర్లు కావు! నా వయసు 20 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. ఇటీవల నేను నా రొమ్ములను పరీక్షించుకునే సమయంలో రెండు రొమ్ములలోనూ గట్టిగా గడ్డల్లాగా చేతికి తగిలాయి. అప్పట్నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. నా వయసులో ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా సమాధానం చెప్పండి. - ఒక సోదరి, ఈ-మెయిల్ రొమ్ముల్లో ఇలా చిన్న గడ్డలు కనిపించడం చాలా సాధారణం. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఇలా వచ్చే గడ్డల్లో చాలావరకు బినైన్ బ్రెస్ట్ డిసీజ్ వల్ల వచ్చేవి (హానికరం కానివి), క్యాన్సర్‌కు సంబంధం లేనివే ఎక్కువగా ఉంటాయి. ఇవి చేతికి మృదువుగా తగులుతూ అటు, ఇటు కదులుతూ కూడా ఉండవచ్చు. రొమ్ముల్లో వచ్చే కణుతులు చాలా కారణాల వల్ల వస్తుంటాయి. అవి... కొన్ని రకాల హార్మోన్ మార్పుల వల్ల (ఈ మార్పులు హానికరం కాదు). రొమ్ముల్లో ఏదో ఒక భాగంలో ఇన్ఫెక్షన్స్ రావడం లేదా లోపల ఏదైనా గాయం కావడం వల్ల కొన్ని రకాల మందులు వాడటం వల్ల. హానికరం కాని మార్పుల వల్ల వచ్చే గడ్డలు (బినైన్ బ్రెస్ట్ డిసీజ్-బీబీడీ): మహిళల శరీరంలో రుతుస్రావానికి సంబంధించిన మార్పులు జరుగుతుంటాయి. ఈ ప్రభావం రొమ్ముల్లో కూడా కనిపిస్తుంటుంది. ఈ కారణం వల్ల రొమ్ములలో ఏదో ద్రవం నిండినట్లుగా ఉండే తిత్తులు ఏర్పడతాయి. వీటిని ముట్టుకుంటేనే మంట, నొప్పి, ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. ముఖ్యంగా మరో వారంలో రుతుస్రావం జరగబోతుండగా ఇలాంటి కణుతులు వచ్చి, రుతుస్రావం తర్వాత వాటంతట అవే తగ్గిపోతుంటాయి.సింపుల్ సిస్ట్స్ అనే తరహా తిత్తులూ రెండు రొమ్ముల్లోనూ రావచ్చు. రుతుస్రావం సమయంలో వీటిని ముట్టుకుంటేనే చాలా మంట, నొప్పి అనిపించి ఇబ్బంది పెడుతుంటాయి. ఫైబ్రో ఎడినోమాస్: ఇవి కాస్తంత గట్టిగా ఉండే కణుతులు. గుండ్రగానూ, ముట్టుకోగానే లోపల జారిపోతున్నట్లుగాను కనిపిస్తాయి. ఇవి కూడా హానికరం కావు. సాధారణంగా మీ వయసు ఉన్నవారిలో ఇలా హానికరం కాని గడ్డలే ఎక్కువ. మీరు స్వయంపరీక్ష చేసుకుంటున్న తీరు చాలా మంచిది. మహిళలందరూ ఇలా పరీక్షించుకొని, ఏదైనా అసాధారణమైన అంశం కనిపించగానే మీ ఫ్యామిలీ డాక్టర్‌కు గానీ లేదా గైనకాలజిస్టుకు గానీ చూపింకోవడం మంచిది. ఒకవేళ అవి హానికరమైన గడ్డలే అయినా ఈ రోజుల్లో వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. తొలిదశలో గుర్తిస్తే హానికారక గడ్డలనూ పూర్తిగా తొలగించి, నయం చేసే పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. స్పైన్ కౌన్సెలింగ్ వెన్ను ఆపరేషన్‌తో ప్రయోజనం ఉంటుందా? నా వయసు 60 ఏళ్లు. నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగిని. మూడేళ్ల నుంచి నాకు వెన్నునొప్పి వస్తోంది. దానితోపాటు ఎడమకాలులో నొప్పి, తిమ్మిర్లు, మంటలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం వరకూ నేను ఒక కిలోమీటరు దూరాన్ని ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడిచేవాడిని. ఇప్పుడు కనీసం వంద మీటర్లు కూడా నడవలేకపోతున్నాను. కాస్త నడిచినా... వెంటనే కాళ్లలో తిమ్మిర్లు, కాళ్లు బరువెక్కడం జరుగుతోంది. రెండు, మూడు నిమిషాల పాటు విశ్రాంతిగా నిల్చుంటే... ఆ తర్వాత నొప్పి తగ్గి మళ్లీ నడవగలుగుతున్నాను. అలాగే రెండు మూడు నిమిషాల పాటు నిలుచున్నా కూడా కాళ్లు బరువెక్కుతున్నాయి. కనీసం నిలబడి షేవింగ్ కూడా చేసుకోలేకపోతున్నాను. మూడేళ్ల నుంచి మందులు వాడుతున్నా ఇబ్బంది తగ్గకపోగా ఇంకా పెరుగుతోంది. మా ఊళ్లో ఆర్థోపెడిక్ డాక్టర్‌కు చూపించుకున్నాను. నడుముకు ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్ చేసి నాకు వెన్నుపూసలు జారిపోతున్నాయనీ, దానివల్ల కాళ్లల్లోకి వచ్చే నరాలపై ఒత్తిడి పడటం వల్ల ఇలా జరుగుతోందనీ అన్నారు. ఇది వయసుతో వచ్చే సమస్య అనీ, దీనికి మెడికల్ ట్రీట్మెంట్ లేదనీ, స్పైన్ సర్జన్‌ను సంప్రదించి ఆపరేషన్ చేయించుకొమ్మని చెప్పారు. మరికొందరు ఈ వయసులో ఆపరేషన్ వద్దని భయపెడుతున్నారు. ఒకవేళ నేను ఆపరేషన్ చేయించుకుంటే నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతకంటే మెరుగవుతుందా? ఎన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి వివరంగా చెప్పండి. - నాగరాజు, కడప మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకున్న సమస్యను ‘స్పాండిలోలిస్థెసిస్’ అంటారు. దీన్నే తెలుగులో వెన్నుపూస జారడం అంటారు. వయసు పెరిగేకొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల మన వెన్నుపూసలు క్రమం తప్పి, కాళ్లలోకి వచ్చే నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నడవడం, నిలబడటం కష్టంగా ఉంటుంది. ఈ వయసులో వచ్చే మార్పులను మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మామూలుగా చేయలేం. అయితే ఆపరేషన్ వల్ల మీకు నడుము, కాళ్లనొప్పి తగ్గడమే కాకుండా కాకుండా మీ నడక కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు ఈ సమస్యకు అందుబాటులో ఉన్న ‘మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ’ (దీన్నే కీహోల్ సర్జరీ అని కూడా అంటారు) ద్వారా అధిక రక్తస్రావం లేకుండా శస్త్రచికిత్స చేయవచ్చు. దాంతో మీరు త్వరగా కోలుకుంటారు. ఆపరేషన్ తర్వాత మూడు లేదా నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో ఉంటే సరిపోతుంది. ఆపరేషన్ తర్వాత ప్రత్యేకంగా బెడ్‌రెస్ట్ వంటివి అవసరం లేదు. ఇంటికి వెళ్లాక వాకింగ్ వంటివి ప్రాక్టీస్ చేయమని సూచిస్తాం. ఈ ఆపరేషన్ విజయవంతంగా చేయవచ్చు. భయం, అపోహలు వీడి ఆపరేషన్ చేయించుకోండి. గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ ఛాతిలో మంట తగ్గేదెలా? నా వయసు 40 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతిలో మంటతో బాధపడుతున్నాను. చిన్న విషయమే కదా అని మెడికల్ షాపులో యాంటాసిడ్ సిరప్ తీసుకొని తాగాను. ఆ మందు తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? దయచేసి తగిన సలహా ఇవ్వగలరని ప్రార్థన. - విజయ్, తాడేపల్లి మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం.కాఫీ, టీలను పూర్తిగా మానేయడంపొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడంభోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 56 ఏళ్లు. కొద్దిరోజులుగా తరచూ మలద్వారం నుంచి రక్తం పడుతోంది. డాక్టర్‌ను కలిశాను. పైల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ రక్తం పడటం ఆగలేదు. నా సమస్యకు పరిష్కారం సూచించగలరని ప్రార్థన. - కుటుంబరావు, సూళ్లూరుపేట మీరు తెలిపిన వివరాల ప్రకారం మలద్వారం నుంచి రక్తం పడటానికి పైల్స్ కూడా ఒక కారణం కావచ్చు. కానీ రక్తం పడటానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయాలు ఏమిటంటే... పెద్దపేగులో క్యాన్సర్ వంటివి ఉన్నప్పుడు కూడా ఇదే లక్షణం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ/సిగ్మాయిడోస్కోపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. దీని వల్ల రక్తస్రావం ఎక్క డ్నుంచి అవుతోందో తెలుస్తుంది. కారణం తెలిస్తే సరైన చికిత్స చేయవచ్చు. కాబట్టి ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. డర్మటాలజీ కౌన్సెలింగ్ జుట్టు రాలడాన్ని అరికట్టడం ఎలా? నా వయసు 21 ఏళ్లు. నాకు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ కూడా క్రమంగా వెనక్కుపోతూ మాడు కనిపిస్తోంది. నేను డర్మటాజిస్ట్ను సంప్రదించాను. వారు నాకు ఫోలీహెయిర్ అనే టాబ్లెట్‌ను నెల రోజులు వాడమని చెప్పారు. ఇప్పుడు నేను డ్యాజిట్-ఎమ్ అనే టాబ్లెట్‌ను 30 రోజులుగా వాడుతున్నాను. ఇది అర్టికేరియా కోసం వాడుతున్నా. నా హిమోగ్లోబిన్ 10 శాతం మాత్రమే. నా ఉద్యోగంలో భాగంగా నేను చాలా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దయచేసి నా జుట్టు మరింత ఊడిపోకుండా ఏదైనా చికిత్స చెప్పండి. - మౌనిక, ఈ-మెయిల్ జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది పోషకాహార లోపం. పైగా మీ విషయంలో మీలో హిమోగ్లోబిన్ కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. బహుశా మీ రక్తహీతన కారణంగానే జుట్టు రాలిపోతూ ఉండవచ్చు. మీ వయసులో అంటే ఇరవైలలో ఉండే యువతలో ఇది చాలా సాధారణమైన విషయం. పైగా మీరు ప్రయాణాలు చాలా ఎక్కువగా చేసే ఉద్యోగంలో ఉన్నానని చెబుతున్నారు. ఇది మీలో ఒత్తిడిని మరింత ఎక్కువగా పెంచుతుండవచ్చు. మీ ప్రయాణాల్లో నిద్రలేమి కూడా ఉండే ఉంటుంది. బహుశా ఈ అంశాలన్నీ కలిసి మీలో జుట్టు రాలడం ఎక్కువయ్యేందుకు దోహదపడుతూ ఉండవచ్చు. మీరు చికిత్సలో భాగంగా ఈ కింది సూచనలు పాటించండి. ముందుగా మీలో రక్తహీనతను తగ్గించుకోండి. మీ హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 14% ఉండేలా చూసుకోండి. ఇందుకోసం ఫై సల్ఫేట్ 50 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున, విటమిన్-సి 500 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల పాటు వాడండి. ఇక మీ జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం బయోటిన్ 10 ఎంజీ, సాపాల్మెథో లేదా ఇతర అమైనోయాసిడ్లను రోజుకు ఒకసారి చొప్పున భోజనం తర్వాత మూడు నెలల పాటు తీసుకోండి. మీ జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మీరు రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి.పై సూచనలన్నీ పాటించాక కూడా మీ జుట్టు రాలడం తగ్గకపోతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స, మీసోథెరపీ వంటి ప్రక్రియలను అవలంబించి మీ జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు మీ మాడుపై జుట్టు పరిమాణాన్ని పెంచవచ్చు. -
ఆ లక్షణం కనిపించగానే..
డాక్టర్స్ కాలమ్ గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకనేది నానుడి. చాలారకాల జబ్బుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. బిజీలైఫ్‌లో కొట్టుమిట్టాడుతున్న నగరవాసులు ప్రాణం మీదికి వచ్చే వరకూ చాలా జబ్బులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగంలో అలసట, పర్సనల్ లైఫ్‌లో చికాకులు ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా చేస్తున్నాయి. కానీ కొన్ని జబ్బుల లక్షణాలు సాదాసీదాగా ఉండొచ్చు. కానీ అవి ముదిరితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కణితులు ( ట్యూమర్స్) ఈ కోవలోకే వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందే. చాలామంది తలనొప్పే కదా అని ఓ మాత్ర వేసుకుని అప్పటికప్పుడు రిలాక్స్ అవుతారు. ఇలా తరచూ వచ్చే తలనొప్పి వెనుక ట్యూమర్లు ఉండే ప్రమాదం లేకపోలేదని అంటారు కిమ్స్‌లో సీనియర్ న్యూరో సర్జన్ డా॥కుమార్. తరచూ తలనొప్పి, ఫిట్స్ రావడటం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలు తలెత్తితే.. న్యూరో సర్జన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. లేదంటే కేన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా శరీరం బయట కనిపించేవే ట్యూమర్లు కావు. ఇవి మెదడులోనూ ఏర్పడవచ్చని తగిన జాగ్రత్తలు తప్పనిసరని ఆయన సూచిస్తున్నారు. లక్షణాలు.. తరచూ విపరీతమైన తలనొప్పి రావొచ్చు. ఎక్కువగా ఫిట్స్ వస్తున్న వారిలోనూ ట్యూమర్స్ రావొచ్చు అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోవడాన్ని ప్రమాదంగా పరిగణించాలి నోరు వంకర పోవడానికి ఒక్కోసారి ట్యూమర్లు కారణం కావచ్చు. ఏదైనా ఆహారం మింగడానికి ఇబ్బందిగా ఉండటం లక్షణంగా భావించవచ్చు ఉన్నట్టుండి చూపులో తేడా రావడమూ ఒక లక్షణమే నిర్లక్ష్యం వద్దు.. ఎలాంటి ట్యూమర్లనైనా ప్రాథమిక దశలోనే కనిపెట్టే అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ట్యూమర్లలో అనప్లాసియాకు చెందినవైతే వేగంగా పెరుగుతూంటాయి. అదే బినైన్ ట్యూమర్లతో అంత పెద్ద సమస్య రాదు. సీటీస్కాన్, ఎంఆర్ఐ, న్యూరో నేవిగేషన్ వంటి పరీక్షలతో ట్యూమర్లను కనిపెట్టవచ్చు. ఎలాంటి ట్యూమర్నైనా ప్రాథమిక దశలోనే కనిపెడితే.. కేన్సర్‌ను నియంత్రించవచ్చు. ట్యూమర్లు రావడానికి వయసుతో పెద్దగా పనిలేదు. ఏ వయసులోని వారికైనా రావొచ్చు. డా॥సుజిత్‌కుమార్ విడియాల సీనియర్ న్యూరోసర్జన్ కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ ప్రెజెంటర్: జి.రామచంద్రారెడ్డి -
8 నిమిషాల్లోనే కణుతుల గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: వెన్నుపూసకు సోకే అత్యంత ప్రమాదకర వ్యాధుల నిర్ధ్ధారణలో మన వైద్యులు ముందడుగు వేశారు. ఇన్నాళ్లూ వెన్ను భాగంలో ఇన్ఫెక్షన్లు, కణుతుల్లో క్యాన్సర్, టీబీ లక్షణాలను నిర్ధారించడానికి అనేక దఫాలుగా పరీక్షలతో పాటు జాప్యం జరిగేది. వాటికి చెక్ పెడుతూ.. ఇన్ఫెక్షన్లు, కణుతుల స్వభావాన్ని, వాటి ప్రమాదాన్ని ఇట్టే పసిగట్టే ‘స్క్రేప్ సైటాలజీ’ అనే కొత్త వైద్య విధానాన్ని ప్రముఖ వెన్నుపూస వైద్య నిపుణులు డా.నరేష్‌బాబు(మెడిసిటీ) కనిపెట్టారు. దీనివల్ల క్యాన్సర్, టీబీ జబ్బుల నిర్ధారణ మరింత సులువవుతుంది. సుమారు రెండేళ్ల పాటు ఆయనీ పద్ధతిపై పరిశోధన సాగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది రోగుల వెన్నులో నుంచి కణజాలాన్ని తీసి.. స్క్రేప్ సైటాలజీ పద్ధతిలో నిర్ధారణ చేశారు. వందశాతం ఫలితాలను సాధించారు. ఇప్పటి వరకూ వెన్నులో ఏవైనా కణుతులు ఉంటే ముందుగా ఎంఆర్ఐ లేదా ఎక్స్‌రేల ద్వారా గుర్తించేవారు. దీని ఆధారంగా కణితి ఉన్న ప్రాంతంలో మత్తు ఇచ్చి, నీడిల్(సూది) ద్వారా కణుతుల్లో ఉండే కణజాలాన్ని తీసి ఆ ముక్కను బయాప్సీ కోసం నేరుగా పరిశోధనకు పంపించేవారు. కానీ ఈ కణజాలం చాలాసార్లు సరిగా రాకపోవడం వల్ల, జాప్యం కావడం వల్ల రోగ లక్షణాలు వెంటనే తేలేవి కాదు. దీంతో రోగి వెన్నుకు మళ్లీ మళ్లీ మత్తు ఇచ్చి బయాప్సీ చేయాల్సివచ్చేది. అయితే, తాజా పద్ధతిలో లోకల్ అనస్థీషియా(ఏ ప్రాంతంలో కణితి ఉందో ఆ ప్రాంతంలోనే మత్తుమందు) ఇచ్చి తీసిన కణాజాలాన్ని క్షణాల్లోనే స్క్రేప్(ముక్కను రాపిడి చేయడం) ద్వారా జబ్బుకు సంబంధించిన లక్షణాలున్నాయో లేదో తెలుసుకోవచ్చు. రాపిడ్ స్టెయినింగ్ టెక్నాలజీ పరీక్షల ద్వారా క్యాన్సర్ లేదా టీబీ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ 8 నిముషాల్లోనే పూర్తవుతుంది. ఈ చికిత్సా విధానం గురించి ఆదివారమిక్కడ డాక్టర్ నరేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ కొత్త చికిత్సా విధానం వల్ల వెన్నులో ఉండే కణుతుల స్వభావాన్ని, వాటి తీవ్రతను ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వ్యాధుల నిర్ధారణలో కచ్చితత్వం ఉంటుంది. ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పథాలజిస్ట్ డా.నీలిమతో పాటు గుంటూరులోని మల్లికా స్పయినల్ సెంటర్ వైద్యులతో కలిసి ఈ ప్రయోగం చేశాం. చాలాసార్లు వెన్నులో ఉండే క ణుతులను వదిలేయడం వల్ల అవి ప్రమాదకరంగా మారేవి. స్క్రేప్ సైటాలజీ వీటిని సులభంగా గుర్తించడం వల్ల ప్రాథమిక స్థాయిలోనే వైద్యం చేసుకునే వీలుంటుంది’ అని తెలిపారు.