శ్రీనివాసుడికి రూ. రెండు కోట్లు విరాళం
తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకున్నాడు. టీటీడీ ఈవో డి.సాంబశివరావును టీవీఎస్ మోటార్స్ అధినేత శ్రీనివాసన్ శనివారం తిరుమలలో కలిశారు. అనంతరం ఆయకు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. ఈ నగదు మొత్తాన్ని టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టు కింద జమ చేయాలని ఈవోను శ్రీనివాసన్ కోరారు. అంతుకుముందు వీఐపీ బ్రేకు సమయంలో శ్రీవారిని శ్రీనివాసన్ దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.