శ్రీరామ్ సిటీ ఫైనాన్స్‌లో భారీ మోసం
హైదరాబాద్: శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ లో ఉద్యోగులు భారీగా అవినీతి పాల్పడిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులే దాదాపు రూ. రెండు కోట్లకు టోకరా వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు బ్రాంచ్ మేనేజర్‌తో సహా మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 16 లక్షలను రికవరీ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీరామ్ సిటీలో పని చేస్తున్న ఉద్యోగులు భారీగా ధనాన్ని పక్కదోవ పట్టించారు. తీరా లెక్కలు ఆరా తీయగా ఆ సంస్థలో జరిగిన అవినీతి అంశం బయటపడిందన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, ఇప్పటి వరకూ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. దీనిపై దర్యాప్తును వేగవంతం చేశామన్నారు.