Udayagiri constituency
-
ఉదయగిరిలో ఫ్యాన్ ప్రభంజనమే
జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎనిమిది మండలాలతో అతి పెద్ద వైశాల్యం గల ప్రాంతంగా పేరు గడించింది. విలక్షణ తీర్పునివ్వడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. గడిచిన ఆరు ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇక్కడి ఓటర్లు ఎక్కువగా మేకపాటి కుటుంబం వైపే మొగ్గు చూపారు. నాటి నుంచి 2019 ఎన్నికల వరకు కేవలం రెండుసార్లే టీడీపీ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎంగా జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి పాలన.. మేకపాటి కుటుంబానికి ఉన్న ఆదరణతో ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.ఉదయగిరి: ఈ ఎన్నికల్లోనూ ఉదయగిరిధారణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమర్థ పాలన.. పేదల ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చర్యలు.. పదవుల్లో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట.. ఇలా సీఎం జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనను సాగించారు. మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో 40 ఏళ్లుగా మేకపాటి కుటుంబానికి పట్టుంది. పై రెండు కారణాలతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డికే విజయం వరించే అవకాశాలు మెండుగా మారాయి.సైకిల్‌కు అన్నీ మైనస్సులే..ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కాకర్ల సురేష్ ఎన్నారై. రాజకీయ అనుభవలేమి.. పార్టీ నేతల మధ్య కొరవడిన సఖ్యత.. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించకపోవడం.. గ్రూపు తగాదాలు.. వెరసి కాకర్లకు మైనస్సుగా మారాయి. కేవలం డబ్బునే నమ్ముకొని విజయ తీరాలకు చేరాలని ఆయన చేస్తున్న యత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. కాకర్ల ట్రస్ట్ పేరిట కొన్ని కార్యక్రమాలను చేపట్టినా.. టికెట్ వచ్చేంత వరకు ప్రజలతో సత్సంబంధాల్లేకపోవడం ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. టీడీపీ టికెట్ ఖరారయ్యాక సైతం ప్రజల్లో తిరిగేందుకు తగిన సమయం లేకపోవడంతో సుడిగాలి పర్యటనలకే పరిమితమయ్యారు.మేకపాటి కుటుంబానికి సడలని పట్టుఉదయగిరి రాజకీయ ముఖచిత్రంలో మేకపాటి కుటుంబానికి దీర్ఘకాలంగా మంచి పట్టుంది. మేకపాటి కుటుంబానికి చెందిన రాజమోహన్‌రెడ్డి 1982లో రాజకీయ ప్రవేశం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఉదయగిరి ప్రజల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారు. 1985లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. తదుపరి 2004, 2009లో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం అనంతరం తన ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన 2012 ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఉదయగిరి ప్రజలతో నిత్యం సత్సంబంధాలను కొనసాగిస్తుండటంతో మేకపాటి కుటుంబీకులు మన్ననలను పొందగలిగారు.16 ఎన్నికల్లో రెండు సార్లే..1955లో ఉదయగిరి నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 16 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి జనతా పార్టీ, మరోసారి బీజేపీ, రెండుసార్లు స్వతంత్రులు, రెండుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్, వైఎస్సార్సీపీకే విజయాలే దక్కాయి. 1999లో కంభం విజయరామిరెడ్డి.. 2014లో బొల్లినేని వెంకటరామారావు స్వల్ప మెజార్టీతో టీడీపీ తరపున విజయం సాధించారు. దీన్ని బట్టి వైఎస్సార్సీపీ విజయం నల్లేరుపై నడకేననే సంకేతాలు వెలువడుతున్నాయి.ఫ్యాన్‌కే జై..ఉదయగిరి బరిలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ కొత్తవారే కావడం విశేషం. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి కుటుంబ బలం, ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉండటంతో విజయావకాశాలు ఆయనకే మెండుగా కనిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా జరిగిన సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే నియోజకవర్గంలోని ఉదయగిరి, వింజమూరు, జలదంకి, కలిగిరి మండలాలు టీడీపీయేతర పార్టీలకే అనుకూలంగా ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు మండలాలతో పాటు సీతారామపురంలోనూ వైఎస్సార్సీపీకే స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో హోరాహోరీ తప్పేలా లేదు. ఉదయగిరి కోటలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నిరంతరం మమేకంతొమ్మిది నెలలుగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి ఊరు, గడపకూ వెళ్లి సీఎం జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. తమ పార్టీకి అండగా ఉండాలంటూ విస్తృత ప్రచారం చేయడం.. ప్రజలతో మమేకమవ్వడం ఆయనకు కలిసొచ్చే అంశం. -
ఉదయగిరిలో గెలిస్తే.. ఏపీలో అధికారం
ఉదయగిరి: గిరిలో గెలిస్తే.. ఏపీలో అధికారమా.. ఇదేంది.. ఇలా ఎలా అనే అనుమానం కలగక మానదు. అయితే గడిచిన ఐదు ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇదే ఆనవాయతీ కొనసాగుతోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో 1999 ఎన్నికలు మొదలుకొని 2019 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. ఉదయగిరి కోటపై జెండా ఎగురవేసే పార్టీయే రాష్ట్రంలో అధికార పగ్గాలు దక్కించుకుంటుందనే విశ్వాసం ఈ ప్రాంత ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో బలంగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో.. ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆనవాయతీ నిజమవుతుందా లేక సెంటిమెంట్‌కు తెరపడుతుందాననే అంశం ఫలితాల్లో తేటతెల్లం కానుంది.ఇదీ తీరు..👉 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున కంభం విజయరామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేయగా, టీడీపీ విజయం సాధించింది. ఆ సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.👉 2004లో కాంగ్రెస్ తరఫున మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కంభం విజయరామిరెడ్డి బరిలో నిలవగా, మేకపాటికే విజయం వరించింది. అప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేజిక్కించుకుంది.👉 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ తరఫున వీరే బరిలో నిలవగా, మేకపాటికే విజయం చేకూరింది. అప్పుడూ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంది.👉 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బొల్లినేని రామారావు, వైఎస్సార్సీపీ తరఫున మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోటీపడగా, టీడీపీ విజయం సాధించింది. రాష్ట్రంలోనూ టీడీపీ అధికారం చేపట్టింది.👉 2019 ఎన్నికల్లో వీరే పోటీపడగా, భారీ మెజార్టీతో చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ సమయంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
ఉదయగిరి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. కారణం ఇదేనట!
డబ్బులు ఉన్నాయి కదా అని ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కొనుక్కుంటే సరిపోతుందా? ఛస్తే సరిపోదు. ఆ విషయమే పాపం ఓ ఎన్.ఆర్.ఐ. కి ఆలస్యంగా తెలిసొచ్చింది. ఇపుడు వెనక్కి వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫండ్ కింద కొంత..టికెట్ కోసం కొంత చొప్పున ఈ ఎన్.ఆర్.ఐ. నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బానే లాగేశారట. విదేశాల్లో సంపాదించుకున్నది జన్మభూమిలో ఉట్టి పుణ్యాన పోగొట్టుకోవలసి వచ్చిందని ఇపుడా నేత భోరు మంటున్నారు. ఎవరా నేత? ఏమా ఏడుపు కథ? టీడీపీ స్థాపించిన కొత్తలో చాలా మంది డాక్టర్లు, న్యాయవాదులను రాజకీయాల్లోకి తెచ్చారు. వారిలో చాలా మంది తమకున్న అద్భుతమైన ప్రాక్టీసులు వదులుకుని రాజకీయాల్లో అడుగు పెట్టి ఆ తర్వాత ఫెయిల్ అయ్యి రాజకీయాలకూ.. తమ వృత్తులకూ పనికిరాకుండా పోయారు.ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్.ఆర్.ఐ.లపై పగ బట్టినట్లు కనిపిస్తోంది. ప్రవాస భారతీయులను పిలిచి అరచేతిలో రాజకీయ వైకుంఠం చూపించిన చంద్రబాబు కోట్లకు కోట్లు గుంజి టికెట్లు అంటగట్టారు. రాజకీయాల్లో అదరగొట్టేద్దామని వచ్చిన ఎన్.ఆర్.ఐ.లకు ప్రచారం మొదలైన తర్వాత అసలు పిక్చర్ కనిపిస్తోంది. తాము అనవసరంగా టికెట్లు కొన్నామని వారు చిందులు తొక్కుతున్నారు. అటువంటి కొద్ది మంది అభాగ్యుల్లో ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గం టికెట్‌ను కోట్లు పోసి కొనుక్కున్న ఎన్.ఆర్.ఐ. కాకర్ల సురేష్ అనవసరంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని తన అనుచరులతో చెప్పుకుని పెడబొబ్బలు పెడుతున్నారు.ఉదయగిరి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోస్తూ వస్తోన్న మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావుకు టికెట్ ఇస్తామని చివరి నిముషం దాకా ఊరించిన చంద్రబాబు చివర్లో సూట్ కేసులతో వచ్చిన ఎన్.ఆర్.ఐ. సురేష్‌కు టికెట్ ప్రకటించారు. దీంతో బొలినేని వర్గం ఆగ్రహంగా ఉంది. సురేష్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదు. సురేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు బొలిననేని రావడం లేదు. తన వర్గీయులను కూడా వెళ్లద్దని చెబుతున్నారట. నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి ఉదయగిరిలో ప్రచారానికి వచ్చినపుడు సురేష్‌తో కలిసి తిరిగారు. ఎక్కడా జనం లేకపోవడంతో వేమిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.రోజులు గడుస్తోన్న కొద్దీ ఉదయగిరిలో గెలిచే పరిస్థితులు కనపడకపోవడంతో సురేష్‌లో టెన్షన్ మొదలైందంటున్నారు. ఓడిపోయే సీటును ఎందుకు కొనుక్కున్నామా అని కాకర్ల సురేష్ తలపట్టుకుంటున్నారట. ఇపుడు టికెట్ వద్దంటే డబ్బులు వెనక్కి రావు. గోడకి కొట్టిన సున్నంలా టీడీపీకి చదివించుకున్న కోట్ల రూపాయలకు రెక్కలు వచ్చినట్లే. -
ఇప్పుడు బాబును కలవడానికి కుదరదయ్యా..!
ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లినేని వెంకటరామారావును కాదని చంద్రబాబు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కు ఇవ్వడంతో బొల్లినేని, అతని వర్గీయులు గత పది రోజులుగా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధిష్టానం తన ప్రకటనను వెనక్కి తీసుకుని టికెట్ మార్చకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని, కాకర్లకు సహకరించేది లేదని బొల్లినేని బహిరంగంగా ప్రకటించారు. దీంతో పార్టీలో రాజుకున్న వివాదం, క్యాడర్లో తీవ్ర ఆందోళన ఇంకా కొనసాగుతున్నాయి. బొల్లినేని పంచాయితీ తేలకపోవడం, నెల్లూరులో చంద్రబాబు సభకు బొల్లినేని వర్గీయులు డుమ్మా కొట్టడంతో ఆయన తీరుపై అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బొల్లినేనికి దొరకని అపాయింట్మెంట్ గత వారం రోజులుగా చంద్రబాబును కలిసేందుకు బొల్లినేని చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఉదయగిరిలో అనుచరుల సమావేశం తర్వాత చంద్రబాబును కలిసి టికెట్ ఓకే చేసుకుని వస్తానని చెప్పిన 12 గంటల లోపే కాకర్ల పేరు ప్రకటించడంతో బొల్లినేని షాక్‌కు గురయ్యారు. అనంతరం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చంద్రబాబే బొల్లినేనికి ఫోన్ చేసి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పినా ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బొల్లినేని కలిగిరిలో గత నెల 28వ తేదీన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని కార్యకర్తలకు వివరించి చంద్రబాబును కలిసి తాడోపేడో తెల్చుకుని వస్తానని ప్రకటించారు. తర్వాత తమ అధినేతను కలిసే ప్రయత్నం చేస్తున్నా అవకాశం రావడం లేదు. ఉద్దేశపూర్వకంగా అపాయింట్మెంట్ లేట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాడర్లో ఉన్న ఆగ్రహావేశాలను తగ్గించి బొల్లినేనిని తన దారిలోకి తెచ్చుకోవాలని చంద్రబాబు వ్యూహంగా ఉన్నట్లు కొంతమంది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సోమ, మంగళ వారాల్లో బాబు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని బొల్లినేని వర్గీయులు చెబుతున్నారు. నెల్లూరులో జరిగిన చంద్రబాబు సభకు బొల్లినేని తన అనుచరులు రాకుండా అడ్డువేయడంపై కూడా అధినేత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మొత్తమ్మీద ఉదయగిరి టీడీపీ టికెట్ వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ వివాదం ఏ పరిణామాలకు దారితీస్తోందోననే భయం కూడా టీడీపీ క్యాడర్లో నెలకొంది. -
సామాజిక విప్లవ సారథి జగన్‌కు జేజేలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, బాపట్ల/సాక్షి, కడప: సామాజిక విప్లవ సారథి వైఎస్ జగన్ పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు మూడో రోజు శనివారం ప్రజలు నీరాజనం పలికారు. గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర శనివారం విశాఖ జిల్లా భీమిలి, బాపట్ల జిల్లా బాపట్ల, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ బస్సు యాత్ర సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాల్లో జరగనుంది. బాపట్లలో అపూర్వ స్పందన బాపట్ల నియోజకవర్గంలో బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. యాత్రకు ప్రజలు పూల తివాచీలతో ఘనస్వాగతం పలికారు. బస్సు యాత్ర నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, సంగుపాలెం కోడూరు గ్రామాల మీదుగా మధ్యాహ్నం 1.10 గంటలకు చందోలులోని శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరింది. అక్కడ అమ్మవారికి నేతలు పూజలు చేశారు. పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చందోలులోని నీలి బంగారయ్య ఉన్నత పాఠశాలలో పూర్తి చేసిన నాడు–నేడు పనులను పరిశీలించారు. విద్య, వైద్యం తదితర విభాగాల్లో జరిగిన అభివృద్ధిని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు వివరించారు. యాత్ర రెడ్డిపాలెం, కర్లపాలెం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల చేరుకుంది. నియోజకవర్గంలోని యువకులు అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ చేశారు. అంబేడ్కర్ సెంటర్లో సభ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేస్తున్న మేలును మంత్రులు వివరించిన సమయంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జనసంద్రంగా మారిన పసిడిపురి పసిడిపురి ప్రొద్దుటూరులో సామాజిక సాధికార యాత్ర జనజాతరలా సాగింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వైవీఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్ రోడ్డు మీదుగా రామేశ్వరం వైపు సాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నియోజకవర్గ నేతలతో కలిసి బస్సు ముందు నడుస్తుండగా మహిళలు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. యువత భారీ బైక్ ర్యాలీ చేశారు. రామేశ్వరంలోకి బస్సు చేరుకోగానే బాణాసంచా కాల్చారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. రాజీవ్ సర్కిల్ వద్ద ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. శివాలయం సెంటర్లో అసంఖ్యాక జనం మధ్య బహిరంగ సభ జరిగింది. దసరా ఉత్సవాలకు పసిడిపురి పెట్టింది పేరు. భారీ స్థాయిలో ప్రజానీకం వీటిని వీక్షిస్తుంటారు. శనివారం సామాజిక సాధికార యాత్ర కూడా ఇదే ఉత్సవాలను తలపించింది. శివాలయం సెంటర్ నుంచి కనుచూపు మేర రోడ్డుకు ఇరువైపులా ప్రజానీకం నిల్చొని నేతల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. భీమిలిలో 2వేల బైక్‌లతో భారీ ర్యాలీ భీమిలిలో స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను ఎండాడలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగా ర్జున, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అక్కడ నుంచి చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘నాడు–నేడు’ పనులను నాయకులు పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఆనందపురం మండలం బోయిపాలెం కూడలి నుంచి 2 వేలకు పైగా బైక్‌లు, వందకు పైగా కార్లతో ర్యాలీగా యాత్ర ప్రారంభమై హైవే మీదుగా తగరపువలస చిట్టివలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభాస్థలి వద్దకు చేరింది. అక్కడ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి బహిరంగ సభ వద్ద వైఎస్సార్ విగ్రహాలకు నివాళర్పించి మంత్రులు ప్రసంగించారు. -
‘చంద్రశేఖర్‌రెడ్డి.. మా దెబ్బేంటో చూపిస్తాం ఆగు’
సాక్షి, నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గంలో తాజా పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వంచనపై వైఎస్సార్సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ధర్నా చేపట్టారు. పార్టీ ద్రోహి చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గం వదిలివెళ్లిపో, వైఎస్సార్సీపీ దెబ్బేంటో రుచి చూపిస్తామంటూ అంటూ ఫ్లకార్డులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించారు. చంద్రశేఖర్‌రెడ్డి వర్సెస్ వైఎస్సార్సీపీతో ఉదయగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు చంద్రశేఖర్‌రెడ్డిపై పార్టీ నేత మూల వినయ్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రశేఖర్‌రెడ్డి చరిత్ర అంతా అవినీతిమయమేనని అన్నారు. మరో నేత చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్‌రెడ్డికి పది ఓట్లు కూడా రావన్నారు. ఇక జిల్లా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ముందా? అంటూ చంద్రశేఖర్‌రెడ్డిని నిలదీశారు. -
బొల్లినేనికి ఓట్లు అడిగే హక్కు లేదు
సాక్షి, ఉదయగిరి: ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గత ఎన్నికల సమయంలో ఉదయగిరి ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ప్రస్తుత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటు అడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, ప్రజలను ఓటు అడిగే హక్కు ఎమ్మెల్యే బొల్లినేనికి లేదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఉదయగిరిలోని బీసీ కాలనీ, చాకలివీధి, పూసలకాలనీ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం చాకలివీధిలో ఏర్పాటు చేసిన సభలో మేకపాటి మాట్లాడుతూ ప్రచారానికి వచ్చే టీడీపీ నాయకులను ఏం అభివృద్ధి చేశారని ప్రజలు ప్రశ్నించాలన్నారు. గత ఎన్నికల సమయంలో బొల్లినేని అండర్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తానని, నీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు తీర్చలేదన్నారు. టీడీపీని సాగనంపేందుకు ఓటర్లు నడుం బిగించాలన్నారు. తాను అధికారంలోకొచ్చిన వెంటనే వెలుగొండ, సోమశిల జలాలను ఉదయగిరి ప్రాంతానికి తీసుకొచ్చి సాగు, తాగునీటి సమస్య లేకుండా తనవంతు కృషి చేస్తానన్నారు. టీడీపీ పాలనలో నాయకులు, కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచుకుని దాచుకోవడమే అలవాటై పోయిందన్నారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఉదయగిరి ప్రాంతం తమ సోదరుల హయాంలోనే అభివృద్ధి చెందిందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని మేకపాటి కోరారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీగా ఎక్కువ అబద్ధాలు చెప్పింది బొల్లినేనినే అని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు ఇంతవరకు ఎమ్మెల్యే బొల్లినేని తమ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదని చెప్పారని, తాము ప్రచారానికి వెళ్లిన పలు గ్రామాల్లో ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని మేకపాటి తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అందుబాటులో ఉండే సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు మహిళలు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, నాయకలు మూలె సుబ్బారెడ్డి, అక్కుల్‌రెడ్డి, షంషీర్, మట్ల లక్ష్మయ్య, వెంగళరెడ్డి, మధు, హరి, సలీం, జబ్బార్, లియాఖత్‌అలీ, ముర్తుజా హుస్సేన్, యు.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేలటూరులో.. ఉదయగిరి మండలంలోని నేలటూరుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు పెండేల లక్ష్మీనరసయ్య ఆధ్వర్యం లో ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెండేల రవీంద్ర, మోహనరావు, సుబ్బారావు, బూరగ లక్ష్మీనరసయ్య, మాల్యాద్రి, పతకమూరి రాములు, జానకిరాం, మేడేపల్లి సుబ్బారావుతోపాటు 30 కుటుంబాల వారు ఉన్నారు. కార్యక్రమంలో రమణయ్య, రత్నం, శ్రీనివాసులు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి’రాజు ఎవరో...!
సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): ఉదయగిరి నియోజకవర్గ ఓటర్లు తీర్పు భిన్నంగా ఉంటుంది. ఎన్ని ప్రభంజనాలు వచ్చినా ప్రజలు తిప్పికొడుతూ ఇంతవరకు స్థానిక నాయకత్వాలకే బ్రహ్మరథం పట్టారు. 2012 ఉప ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజలు పట్టంగట్టారు. 1983లో టీడీపీ ఆవిర్భావంలో రాష్ట్రమంతా ఆ పార్టీ ప్రభంజనం సృష్టించగా, ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గణపం బాలకృష్ణారెడ్డి మాత్రం ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేనప్పటికీ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బొల్లినేని రామారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై విజయం సాధించారు. మరోమారు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ అభిమానులు, క్యాడర్ బలంతో బరిలోకి దిగారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 15 అసెంబ్లీ ఎన్నికల్లో(ఉప ఎన్నికతో కలిపి) కాంగ్రెస్ ఏడు సార్లు, బీజేపీ, జనతా, ప్రజాపార్టీ, స్వతంత్ర, వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందగా, టీడీపీ రెండుసార్లు విజయం సాధించింది. ఎందరో ఉద్దండులకు ఉదయగిరి ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారు. 60 ఏళ్ల క్రితం నియోజకవర్గ స్వరూపం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో నందిపాడు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బెజవాడ గోపాలరెడ్డి, ప్రజాపార్టీ నుంచి కోవి రామయ్య, సీపీఐ నుంచి కేజీ రెడ్డి తలపడ్డారు. ప్రజాపార్టీ అభ్యర్థి కోవి రామయ్య 2,379 ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత రెండు ఎన్నికలు నందిపాడు నియోజకవర్గం పేరుతోనే జరగ్గా.. ఈ రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. 1965లో పునర్విభజన చోటుచేసుకుని ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉదయగిరి అసెంబ్లీ కేంద్రంగా ఉంది. ఈ నియోజకవర్గ కేంద్రానికి 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోవి రామయ్య, స్వతంత్ర అభ్యర్థిగా ధనేంకుల నరసింహులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నరసింహులు 9,674 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కంభం విజయరామిరెడ్డి రెండుసార్లు గెలుపొందారు. (అయితే ఒకసారి మాత్రం టీడీపీకి బి–ఫారం రాకపోవడంతో ఆ పార్టీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు). ఉద్దండులను అందించిన ఘనత ‘గిరి’దే ఉదయగిరి ఓటర్లు జాతీయ, రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన ఎందరో ఉద్దండులకు రాజకీయ భిక్ష పెట్టారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అలాగే వైఎస్సార్సీపీలో కీలకపాత్ర నిర్వహిస్తున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డికి రాజకీయ ప్రస్థానం అందించింది ఇక్కడి ఓటర్లే. అలాగే బెజవాడ గోపాలరెడ్డి, పులి వెంకటరెడ్డి, దనేంకుల నరసింహులు, మాదాల జానకిరాం, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వంటి రాజకీయ నేతలు ఇక్కడి నుంచే తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుని సఫలీకృతులయ్యారు. నిలకడ లేని ఓటర్ల సంఖ్య 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలకు విస్తరించింది. ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, సీతారామపురం, వరికుంటపాడు మండలాలతో పాటు అదనంగా కొండాపురం, కలిగిరి, జలదంకి మండలాలు చేరాయి. అంతకుముందు ఈ నియోజకవర్గంలో ఉన్న మర్రిపాడు మాత్రం ఆత్మకూరులో కలిసింది. 2004లో ఈ నియోజకవర్గంలో 1.2 లక్షల మంది ఓటర్లుండగా, 2009 పునర్విభజన అనంతరం ఆ సంఖ్య రెండు లక్షలకు చేరింది. ప్రస్తుతం 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోనే అత్యంత పెద్ద నియోజకవర్గంగా ఉదయగిరి మారింది. వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చుట్టూ అవినీతి ఆరోపణలు, విదర్భ ఇరిగేషన్ బోర్డులో చేసిన అవినీతి పనులకు సంబంధించి ఏసీబీ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈయన సిటింగ్ స్థానం నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి బరిలో నిలిచారు. రామారావుతో పాటు నియోజకవర్గంలో ముఖ్య నేతల అవినీతి తారస్థాయికి చేరటం, ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవటం, క్యాడర్లో గందరగోళాలు తదితర ఇబ్బందులతో టీడీపీ సతమతమవుతోంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి మాత్రం రెట్టించిన ఉత్సాహంతో నూతన చేరికలతో అదనపు బలం పెంచుకుని ప్రచారం చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయం మేకపాటిదే నియోజకవర్గ చరిత్రలో హ్యాట్రిక్ విజయాన్ని చేజిక్కించుకున్న ఘనత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ఈయన ఇక్కడి నుంచి ఐదుసార్లు పోటీ చేయగా మూడుసార్లు విజయం సాధించారు. 2004, 2009, 2012(ఉపఎన్నిక)లో వరుసగా మేకపాటి విజయదుందుభి మోగించి హ్యట్రిక్ కొట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఏడుసార్లు పోటీచేసిన ఘనత కంభం విజయరామిరెడ్డికి దక్కుతుంది. ఈయన రెండు పర్యాయాలు మాత్రమే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం బొల్లినేని వెంకటరామారావు టీడీపీ తరఫున విజయం సాధించారు. ఇక్కడి ఓటర్లు అనేక సార్లు రాష్ట్ర పరిస్థితులకన్నా స్థానిక అంశాల ప్రాతిపదికనే తమ తీర్పును వెలువరించారు. ఎప్పుడు కూడా ఈ ప్రాంత ఓటర్లు భిన్నమైన తీర్పు చెప్పేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వలస ఓటర్లు కావడంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ ఈ నియోజకవర్గ కేంద్రంపై స్పష్టంగా కనిపిస్తాయి. సంవత్సరం గెలిచిన అభ్యర్థి సమీప అభ్యర్థి గెలిచిన పార్టీ ఓట్ల ఆధిక్యత 1952 కోవి రామయ్య చౌదరి బెజవాడ గోపాల్‌రెడ్డి ప్రజాపార్టీ 2,379 1955 షేక్ మౌలాసాహెబ్ కె.గురుస్వామిరెడ్డి కాంగ్రెస్ 571 1962 పులి వెంకటరెడ్డి ఎస్.పి.రెడ్డి కాంగ్రెస్ 6,394 1967 ధనేంకుల నరసింహులు కోవి రామయ్యచౌదరి ఇండిపెండెంట్ 9,674 1972 పి.చెంచురామయ్య ఎం.తిమ్మయ్య కాంగ్రెస్ 14,214 1978 ఎం.వెంకయ్యనాయుడు మాదాల జానకిరాం జనతా 20,500 1983 ఎం.వెంకయ్యనాయుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బీజేపీ 20,500 1985 మేకపాటి రాజమోహన్‌రెడ్డి కంభం విజయరామిరెడ్డి కాంగ్రెస్ 15,513 1989 మాదాల జానకిరాం కంభం విజయరామిరెడ్డి కాంగ్రెస్ 3,760 1994 కంభం విజయరామిరెడ్డి మాదాల జానకిరాం ఇండి 24,919 1999 కంభం విజయరామిరెడ్డి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ 4775 2004 మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కంభం విజయరామిరెడ్డి కాంగ్రెస్ 23,075 2009 మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కంభం విజయరామిరెడ్డి కాంగ్రెస్ 13,482 2012 మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బొల్లినేని రామారావు వైఎస్సార్సీపీ 30,598 2014 బొల్లినేని రామారావు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ 3,622 -
ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నామినేషన్
-
దండుకో.. దోచుకో
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో కొందరు సీడీపీఓలు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వారిలో కోవూరు నియోజకవర్గంలోని ఓ సీడీపీఓ టాప్‌మోస్ట్‌గా నిలిచిన వైనంపై కథనం. జీతాలు పెరిగినప్పుడు, సమావేశాలకు, జనవరి ఫస్ట్ తదితరాలకు ఒక్కో అంగన్వాడీ కేంద్రం నుంచి రూ.1000 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోడిగుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదల్లేదు. నెలకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా కమీషన్లకు తమ కార్యాలయాలను అడ్డాగా మార్చుకుని సీడీపీఓలు కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని సీడీపీఓ టాప్‌మోస్ట్ కోవూరు నియోజకవర్గంలోని ఓ సీడీపీఓ టాప్‌మోస్ట్ అవినీతి పరురాలిగా సోషల్ మీడియాలో, ప్రజల్లో హల్చల్ జరుగుతోంది. సూపర్వైజర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని ఈమె చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. ప్రతి విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వద్ద కూడా మామూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తనకు రాష్ట్రస్థాయిలో పరపతి ఉందని, విచారణ జరిగినా ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగా చెబుతున్నట్లు సమాచారం. బయటడినవి కొన్ని మాత్రమే.. వెంకటగిరి మండలంలో డక్కిలిలో అంగన్వాడీ సరుకులను నిల్వ ఉంచి, అవినీతికి పాల్పడటంతో అక్కడి సీడీపీఓ, సూపర్వైజర్ను గతంలో సస్పెండ్ చేశారు. కోవూరు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఉన్న సీడీపీఓలు భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అంగన్వాడీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనన్న భయంతో చెప్పరని ఆయా సీడీపీఓలు భావిస్తున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడుతాయని అంటున్నారు. సీడీపీఓల బండారంపై ఏసీబీకి ఫిర్యాదు కోవూరు నియోజకవర్గంలోని అవినీతి సీడీపీఓల భాగోతంపై కొందరు ఏసీబీకి లిఖిత పూర్వక సమాచారంతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్రమ వసూళ్లు ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, ఉదయగిరి ప్రాజెక్ట్‌ల పరిధిలో పనిచేస్తున్న ముఖ్య అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందించడంలో శ్రద్ధచూపని అధికారులు మామూళ్ల వసూళ్లపై ఆసక్తి కనపరుస్తున్నారు. నియోజకవర్గంలో 446 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో సుమారు 900మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలకు సంబంధించి టీఏ, డీఏ బిల్లుల్లో, కేంద్రాల అద్దె బిల్లుల చెల్లింపుల్లో ట్రెజరీ పేరుతో పర్సంటేజీలు వసూలుచేస్తున్నారు. 2017లో ఉదయగిరిలో పనిచేసిన సీడీపీఓ అంగన్వాడీ కేంద్రాలకు పంపాల్సిన సరుకుల్లో అవకతవకలకు పాల్పడటంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఉదయగిరి ప్రాజెక్ట్‌లో పనిచేసే ఓ సూపర్వైజర్ కార్యకర్తల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ప్రాజెక్ట్ పరిధిలో వేరే మండలంలో బదిలీ చేశారు. అక్కడ కూడా ఆమె వ్యవహార శైలిలో ఎలాంటిమార్పులు రాలేదనే ఆరోపణలున్నాయి. -
అకాల వర్షం..అపార నష్టం
ఆరుగాలం శ్రమించి రేపోమాపో ఫలితం చేతికందుతున్న తరుణంలో ఊహించని విధంగా వచ్చిన వడగండ్లతో కూడిన అకాలవర్షంతో వరి పంట కళ్లముందే పాడవడంతో అన్నదాతల వేదన వర్ణనాతీతంగా మారింది. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం మండలాల్లో వరితోపాటు వందల ఎకరాల్లో పలు పంటలు దెబ్బతినడంతో రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. ఉదయగిరి: అసలే కరువుతో సాధారణ విస్తీర్ణంలో మూడోవంతు కూడా ఈ ఏడాది రబీలో పైర్లు సాగు చేయలేదు. సాగుచేసిన పైర్లు కూడా భూగర్భ జలమట్టం అడుగంటి చాలా మేరకు ఎండుముఖం పట్టాయి. ఈ క్రమంలో రైతులు భగీరథ ప్రయత్నం చేసి కాపాడుకున్న పైర్లు మొత్తం అరగంట వ్యవధిలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఏడాది శ్రమ, పెట్టుబడి కళ్ల ముందే చెదిరిపోవడంతో దిక్కుతోచక అయోమయంలో పడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో సుమారు 400 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో బత్తాయి, 100 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో బొప్పాయితోపాటు మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.4 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. వరికుంటపాడు మండలంలో గణేశ్వరపురం, నారసింహాపురం, తూర్పురొంపిదొడ్ల గ్రామాల్లో రెండు మూడు రోజుల్లో కోతకోసే 1010రకం వరిపైరు వడగండ్లు, గాలులతో పూర్తిగా దెబ్బతింది. సుమారు 50 ఎకరాల్లో పూర్తిగా పంట దెబ్బతిన్నదని, రూ.కోటి మేర నష్టం సంభవించినట్లు వ్యవసాయా«ధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా మొక్కజొన్న, బత్తాయి, మినుము, మిరప తదతర పంటలకు కూడా నష్టం వాటిల్లింది. వింజమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లి, జనార్దనపురం, గోళ్లవారిపల్లి, ఊటుకూరు, వింజమూరు, తమిదపాడు, కాటేపల్లి తదితర ప్రాంతాల్లో వరి, బత్తాయి, బొప్పాయి, మిరప, అరటి, తమలపాకు, మొక్కజొన్న తదితర పైర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారుగా రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కొండాపురం మండలంలోని గరిమనపెంట, చల్లవారిపల్లి ప్రాంతాల్లో కూడా పంటలకు నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు అసలే కరువుతో అప్పులు తెచ్చి పైర్లు సాగు చేయగా నోటికి వచ్చే సమయంలో ఊహించని విధంగా వచ్చిన వర్షం బతుకులు అతలాకుతలం అవడంతో ప్రభుత్వ సాయం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చొరవ తీసుకుని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం మంజూరు చేయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వడ్లన్నీ నేలపాలు భూమి కౌలుకు తీసుకుని వరిసాగు చేశాను. కోత కూడా కోశాం. ఇంతలో వడగండ్ల వాన కురవడంతో వడ్లన్నీ తడిసి పోయాయి. మొత్తం కష్టం, పెట్టుబడి నేలపాలైంది. – సయ్యద్ ఆశా, బత్తినవారిపల్లి, వింజమూరు రూ.20 లక్షలు నష్టపోయా బొప్పాయి, నిమ్మ, బత్తాయి తోటలను సాగు చేస్తూ ఇప్పటికి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో నెలరోజుల్లో బత్తాయి కాపునకు వస్తుం ది. అకాల వర్షానికి బొప్పాయి తోట పూర్తిగా దెబ్బతింది. సుమారు రూ.20 లక్షల పంట నష్టపోయాను. –గడ్డం రమణారెడ్డి,మాజీ సర్పంచ్, చాకలికొండ, వింజమూరు