UK elections
-
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది. సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్ఘోర పరాభవం నుంచి..2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వ్యతిరేకత ఇలా.. బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024 To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024 లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. ఎగ్జిట్‌పోల్స్ నిజమయ్యాయి!యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి. -
యూకే ఎన్నికలు: సతీసమేతంగా ఓటేసిన సునాక్
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7గం. పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం క్యూ కట్టారు. మరోవైపు భార్య అక్షతా మూర్తితో కలిసి ఓటేసిన ఆ దేశ ప్రధాని రిషి సునాక్.. ఆపై ఎక్స్ ద్వారా ఓటర్ల కోసం సందేశం ఇచ్చారు.పోలింగ్ ప్రారంభమైందని, లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక తరం మొత్తం పన్నుల మోతతో ఇబ్బంది ఎదుర్కుంటుందని, కాబట్టి కన్జర్వేటివ్పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారాయన.The polls are open. Vote Conservative to stop the Labour supermajority which would mean higher taxes for a generation. pic.twitter.com/NPH7lSeDFc— Rishi Sunak (@RishiSunak) July 4, 2024మరోవైపు దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ కోరుతున్నారు. దేశవ్యాప్తంగా 40 వేల పోలింగ్ బూత్‌లలో 4.6 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7గం. నుంచి రాత్రి 10గం. దాకా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాతే ఎగ్జిట్‌పోల్స్ వెలువడతాయి. మరో గంట వ్యవధి తర్వాత ఫలితాల లెక్కింపు మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రేపు ఉదయం 6గం.30 కల్లా..(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11గం.కల్లా) వెలువడే ఛాన్స్ ఉంది.పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉంది. యునైటెడ్ కింగ్ డమ్‌లో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గత 14 ఏళ్లలో అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ.. ఐదుగురు ప్రధానుల్ని మార్చింది. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది.మరోవైపు.. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పార్టీకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్ సైతం లేబర్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఇక.. 10 లక్షల మందికి పైగా భారతీయ మూలాలు ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 107 మంది బ్రిటీష్ ఇండియన్లు బరిలో దిగుతుండటం విశేషం. 2019లో ఆ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది గెలిచారు. -
కొనసాగుతున్న ఉత్కంఠ
లండన్: సాధారణ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. 318 ఎంపీ స్థానాలు దక్కించుకున్న కన్జర్వేటివ్ పార్టీతోపాటు 261 స్థానాల్లో గెలుపొందిన లేబర్ పార్టీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. కన్జర్వేటివ్ నాయకురాలు, ప్రస్తుత ప్రధాని థెరిస్సామే ఒక అడుగు ముందుకేసి డీయూపీతో చర్చలు జరిపారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో మ్యాజిక్ ఫిగర్(326)కు చేరుకోవాలంటే కన్జర్వేటివ్ పార్టీకి ఇంకా 8 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ మేరకు 10 మంది ఎంపీలున్న డెమోక్రటిక్ యూనియనిస్త్ పార్టీ(డీయూపీ)తో కన్జర్వేటివ్‌లు జరిపిన చర్చలు ఫలవంతం అయినట్లు తెలిసింది. థెరిస్సా మే.. శుక్రవారమే రాణి ఎలిజబెత్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాల్సిదిగా కోరనున్నారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అపాయింట్మెంట్ కూడా ఖరారయినట్లు తెలిసింది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: జెరెమీ కోర్బిన్ 261స్థానాల్లో విజయం సాధించిన తాము యూకేలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని లేబర్ పార్టీ అధినేత జెరెమీ కొర్బిన్ ప్రకటించారు. దేశ సుస్థిరత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. థెరెసా మే ప్రధాన మంత్రి పదవికి తక్షణమే రాజీనామాచేసి, నిజమైన ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఉత్కంఠగా సాగిన ఫలితాలు యూకే సార్వత్రిక ఎన్నికలు గురువారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగిశాయి. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా 318 స్థానాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందింది. గత(2015) ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి అనూహ్యంగా వెనుకబడిపోయింది. కౌంటింగ్ ప్రారంభంలోనే ప్రతిపక్ష లేబర్ పార్టీ దూసుకుపోవడంతో బంపర్ మెజారిటీ ఖాయమని అంతా భావించారు. కానీ లేబర్లు 261 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. స్కాటిష్ నేషనల్ పార్టీ 35 సీట్లు సాధించి మూడోఅతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాలలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(12 స్థానాలు), డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(10 స్థానాలు), ది గ్రీన్ పార్టీ(1 స్థానం)లు నిలిచాయి. ‘బ్రెగ్జిట్’ పార్టీకి చుక్కెదురు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని ఉద్యమాలు చేసి, విజయం సాధించిన యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) తాజా ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. ఉన్న ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేక సున్నాకు పరిమితమైంది. -
బ్రిటన్ ఫలితాలు: థెరిసా మే పదవికి ముప్పు
బ్రిటన్ ఎన్నికల ఫలితాలు కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మేకు షాకిచ్చాయి. మెజార్టి స్థానాలను గెలుపొందడంలో అధికార కన్జర్వేటివ్ పార్టీ విఫలమైంది. దీంతో థెరిసా మే ప్రధానమంత్రి పదవికి ముప్పు వచ్చిపడింది. ప్రధానమంత్రిగా ఆమె దిగిపోవాలని ఒత్తిడులు వస్తున్నాయి. అయితే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసే ఉద్దేశ్యమేమీ లేదని థెరిసా మే తేల్చిచెప్పినట్టు తెలిసింది. థెరిసా మేపై పోటీ చేసిన లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్, ప్రధానమంత్రిగా థెరిసాను రాజీనామా చేయాలని ఫలితాల ప్రకటన కంటే ముందే పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం దేశానికి స్థిరత్వం అవసరమని థెరిసా చెప్పారు. రాజీనామా చేసే ఉద్దేశ్యమే లేదని థెరిసా పేర్కొన్నట్టు బీబీసీ రిపోర్టు చేసింది. ప్రస్తుత ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 315 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీని చేరుకోలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి మెజార్టి 326 స్థానాలను దక్కించుకోవాల్సి ఉంది. మెజార్టీ సాధించలేకపోవడంతో కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటికే డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ)ని సంప్రదించిందని, ఆ పార్టీని సంకీర్ణ భాగస్వామిగా చేర్చుకునేందుకు చూస్తుందని స్కై న్యూస్ రిపోర్టు చేసింది. ఉత్తర ఐర్లాండ్ లో డీయూపీ 10 స్థానాలను సంపాదించుకుంది.