Uma Maheswara rao
-
భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా
-
టీడీపీ శవ రాజకీయం
కంచికచర్ల: తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలకు తెరతీస్తోంది. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా రాజకీయ లబ్ది పొందడానికి అశుభ కార్యాలయాలను కూడా ఉపయోగించుకొంటున్నారు. మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ తమ్ముడు వైఎస్సార్సీపీ నేత దేవినేని చంద్రశేఖర్ (52) అనారోగ్యకారణంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మృతుని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించేందుకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల విచ్చేశారు. ఈ సమయంలో తమ నాయకుడు ఉమా మంచి వాడని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ జరుగుతున్న విషయం అర్ధంకాక భువనేశ్వరి కొన్ని నిముషాలు ఖిన్నులయ్యారు. చంద్రశేఖర్ మృతి చెంది రెండు రోజులయినప్పటికీ రాజకీయ రంగు అంటుకోవటం పట్ల కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శుక్రవారం, అమావాస్య రోజు పరామర్శించే కార్యక్రమం ఏర్పాటు చేయటం పట్ల కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడి మరణాన్ని కూడా ఉమా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం చూస్తుంటే సిగ్గేస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. మృతిచెందే వరకూ వైఎస్సార్సీపీలోనే దశాబ్దం క్రితం దేవినేని చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలో చేరి మరణించే వరకు పార్టీలో కొనసాగారు. పది రోజుల క్రితం ఆయన బతికి ఉన్న సమయంలోనూ తన సహచరులతో 2024లో తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కుర్చీలో కూర్చుంటారని అన్నట్టు అనుచరులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తన అన్న దేవినేని ఉమా మహేశ్వరరావు ఓటమి కోసం మైలవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్‌తో కలసి ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి నేత భౌతిక కాయానికి గురువారం టీడీపీ జెండా కప్పటం పట్ల ఆయన అభిమానులు, సహచరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం చంద్రశేఖర్ తన పిల్లల నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమానికి ఉమాను ఆహ్వానిస్తే ఆయన వెళ్లలేదు. పక్షం రోజుల క్రింత చంద్రశేఖర్‌ను టీడీపీ నాయకులు టీడీపీలోకి రావాలని ఆహ్వానించగా ఉమా మహేశ్వరరావు ఆ పార్టీలో ఉన్నంతకాలం రానని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అటువంటి చంద్రశేఖర్ భౌతికకాయంపై ఉమా మహేశ్వరరావు పచ్చ జెండా కప్పటంపై రాజకీయ ప్రయోజనం కాక మరొకటి లేదని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేని ప్రేమను తెచ్చుకుని రాజకీయ లబ్ది కోసం ఉమా చేస్తున్న ఉబలాటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
సారీ.. సారా
వెంకటనగరం వంటి ఆదర్శ గ్రామాలెన్నో.. ప్రభుత్వ యంత్రాంగం కృషితో రాజమండ్రి సమీపంలోని వెంకటనగరం గ్రామం పూర్తి సారా రహిత గ్రామంగా మారింది. ఈ గ్రామం ఒకప్పుడు నాటుసారాకు అడ్డాగా ఉండేది. 741 కుటుంబాలున్న ఆ గ్రామంలో 55 కుటుంబాలు నాటుసారా తయారీనే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయి. 30 ఏళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలు చేసిన వీరిలో మూడున్నరేళ్లుగా మార్పు మొదలైంది. ఎస్ఈబీ పరివర్తన–2 కార్యక్రమంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తోడుకావడంతో గతేడాది ఏప్రిల్ నుంచి సారా రహిత గ్రామంగా మార్పుచెందింది. నిజానికి.. రాష్ట్రంలో నాటుసారా స్థావరాలకు తూర్పుగోదావరి జిల్లా పెట్టింది పేరు. గోకవరం, రాజానగరం, గండేపల్లి, కాతేరు, రామవరం, శాటిలైట్ సిటీ, కోరుకొండ, సీతానగరం వంటి 240 గ్రామాల్లో నాటుసారా ఏరులై పారేది. దీని నియంత్రణకు ప్రభుత్వం ‘పరివర్తన 2.0’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేసింది. దీంతో పది గ్రామాలు మినహా 230 గ్రామాలు ఇప్పుడు సారాకు టాటా చెప్పి సంక్షేమబాట పట్టాయి. ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధి మరోవైపు.. సామాజిక రుగ్మతగా మారిన సారాపై ప్రభుత్వం సంధించిన సంక్షేమాస్త్రం మంచి ఫలితాలిస్తోంది. మూడు దశాబ్దాల పూర్వం నుంచి ‘తూర్పు’న సాగిన సారా ప్రవాహానికి మూడున్నరేళ్లలో అడ్డుకట్ట పడటంతో ఆ గ్రామాల్లో గణనీయమైన మార్పు కన్పిస్తోంది. సారా మహమ్మారి నుంచి బయటపడిన అనేక కుటుంబాల స్వయం ఉపాధికి ప్రభు త్వం ఊతమిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ‘నవరత్నాలు’ ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందుతున్నాయి. దీనికితోడు డీఆర్డీఏ, మెప్మా, పరిశ్రమల శాఖలు కూడా అనేక కార్యక్రమాల ద్వారా వారిని ఆదుకుంటున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పలు శాఖలను సమన్వయంతో వారి జీవనోపాధికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 128 కుటుంబాలకు రూ.1.47 కోట్ల సబ్సిడీ రుణాలు అందించారు. ఫలితంగా.. వారు గేదెలు, కోళ్ల పెంపకం, కిరాణా, పాన్‌షాప్, హోటల్ వంటి వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమల శాఖ ద్వారా చిన్న తరహా యూనిట్ల ఏర్పాటు నిమిత్తం 27 మంది లబ్ధిదారులకు రూ.1.01కోట్లు మంజూరు చేశారు. వారంతా పేపర్ప్లేట్లు, అప్పడాల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్, సెంట్రింగ్ వర్క్, టెంట్‌హౌస్, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో స్వీటు కొట్టు పెట్టుకున్నా.. ప్రభుత్వం నాకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఆ డబ్బుతో స్వీటు కొట్టు పెట్టుకుని పూతరేకులు విక్రయిస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా భార్య ప్రమోదకు ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ ఇస్తోంది. అమ్మఒడి కూడా వస్తోంది. నన్ను ఆర్థికంగా ఆదుకుని నా కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోం. – పల్లి అంబేడ్కర్, మద్దూరులంక గ్రామం కొంతమూరుకు చెందిన సాలా జోగమ్మ కుటుంబం పదేళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలపైనే ఆధారపడి బతికేది. ఆమె పెద్ద కొడుకు బలరామ్‌పై ఏడు కేసులు, చిన్న కొడుకు వెంకన్నపై నాలుగు కేసులు ఉండేవి. సారా తయారీపై వచ్చిన డబ్బులు కేసులు, బెయిల్ ఖర్చులకే సరిపోయేవి. చివరకు ఆ కుటుంబం అప్పులపాలైంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారుల కౌన్సెలింగ్‌లో సారాకు స్వస్తిపలికి చిన్నబడ్డీ పెట్టుకుని జోగమ్మ జీవిస్తోంది. భర్త శ్రీను, కొడుకు బలరామ్లు పందుల పెంపకంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిపై ఉన్న సారా కేసులను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారు. డ్వాక్రా ద్వారా సాయం అందింది. సారా విక్రయాలు ఆపేసిన తనకు బతుకుదెరువు కోసం అధికారులు రూ.3 లక్షల సాయం అందించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు జోగమ్మ చెప్పింది. కవలగొయ్యికి చెందిన తీగిరెడ్డి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి సారా విక్రయించేవాడు. చదువుకు స్వస్తిచెప్పి సారా తయారీనే ఉపాధిగా ఎంచుకున్నాడు. అతనిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పులేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సారాపై ప్రధాన దృష్టిసారించి ‘పరివర్తన’ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో సారా తయారీ, విక్రయాలకు శ్రీనివాస్ స్వస్తి పలికాడు. ప్రభుత్వం అందించిన రూ.50వేల సాయంతో టిఫిన్ బండి పెట్టుకుని గౌరవంగా జీవిస్తున్నాడు. అతని భార్య గంగాభవానీకి ప్రభుత్వం రూ.5 లక్షలు (రూ.1.50లక్షలు సబ్సిడీ) లోను ఇవ్వడంతో టైలరింగ్ చేసుకుంటోంది. అంతేకాదు.. డ్వాక్రాలో ఉన్న ఆమెకు ఏటా రూ.10వేలు ప్రభుత్వ సాయంతోపాటు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందుకుంటోంది. వీరి కుమారులకు జగనన్న విద్యా దీవెన, విద్యా కానుకలు మూడేళ్లుగా అందుతున్నాయి. ఇలా.. సర్కారు అందిస్తున్న సంక్షేమంతో శ్రీనివాస్ సారాకు సారీ చెప్పేశాడు. వీరే కాదు.. వెంకటనగరం గ్రామానికి చెందిన గుమ్మడి నాగరాజు (నాని) పది గేదెలను పెంచుతూ పాలవ్యాపారం చేస్తున్నాడు.. ♦ అదే గ్రామానికి చెందిన మగ్గం రాంబాబు తాపీ పనికి, వెళ్తున్నాడు.. ♦ రాజమండ్రి రాజీవ్ గృహకల్ప శాటిలైట్ సిటీకి చెందిన మార్గాని వీర్రాజు హోటల్ నిర్వహించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ♦ శాటిలైట్ సిటీ ‘బీ–బ్లాక్’కు చెందిన బచ్చు అంజిబాబు కిరాణా, కిళ్లీ షాపుతోపాటు కోళ్ల పెంపకం చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నాడు.. ♦ లాలా చెరువు కాలనీకి చెందిన గరుగుమిల్లి శ్రీనివాసరావు రెండు గేదెలు, ఆవులు, 40 కోళ్లను పెంచుతూ నెలకు దాదాపు రూ.40వేలు సంపాదిస్తున్నాడు.. ♦ రాజీవ్ గృహకల్ప నివాసి పసల సూర్యచంద్రరావు పాన్‌షాపు నిర్వహిస్తూ గౌరవంగా జీవిస్తున్నాడు. ♦ ఇలా అనేకమంది నాటుసారా విష వలయం నుంచి బయటకొచ్చి స్వయం ఉపాధితో ఆనందంగా జీవిస్తున్నారు. - తూర్పుగోదావరి నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు -
టీడీపీలో కుతకుతలు: నిన్న జేసీ, కాల్వకు.. నేడు ఉమా, ఉన్నం
కల్యాణదుర్గం రూరల్: కల్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాల్లోనే వర్గ విభేదాలు బయట పడుతుండడంతో ఆ పార్టీ పరువు పోతోంది. తాజాగా బీటీపీ పరిధిలోని హంద్రీ-నీవా కాలువ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు కాలువ వెంబడి పాదయాత్ర చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరితో పాటు పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం- ఒంటిమిద్ది మధ్యలో కార్యక్రమాన్ని చేపట్టారు. పాదయాత్ర ముందు వరుసలో మాజీ మంత్రులతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన తనయుడు మారుతీ చౌదరి తదితరులు కలిసి సాగుతుండగా... వెనుక ఉన్న టీడీపీ కల్యాణదుర్గం ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, అనుచరులు కల్పించుకున్నారు. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం ముందు వరసలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో వివాదం చెలరేగింది. ఒకానొక దశలో మారుతీ చౌదరి, ఉమా వర్గీయులు పరస్పరం బూతులతో విరుచుకుపడ్డారు. కొద్ది సేపు గందరగోళం నెలకొంది. చివరకు నాయకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత పాదయాత్ర కాస్త ముందుకు సాగగానే నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
ఇండియన్ టుబాకో అసోసియేషన్ అధ్యక్షునిగా మిట్టపల్లి ఉమామహేశ్వరరావు
సాక్షి,అమరావతి బ్యూరో: ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా మిట్టపల్లి ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులోని ఐటీఏ కన్వెన్షన్ హాలులో జరిగిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశం గురువారం రాత్రి జరిగింది. సమావేశంలో 2018, 2019 సంవత్సరాలకు అధ్యక్షునిగా మిట్టపల్లి ఉమామహేశ్వరరావును మూడోసారి అ«ధ్యక్షునిగా ఎన్నుకోవడం విశేషం. ఈ ఎన్నిక ప్రతి రెండేళ్లకొకసారి జరుగుతుంది. సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫాతోపాటు గద్దె మంగయ్య, పొలిశెట్టి వెంకటేశన్, తాడిశెట్టి మురళి, కేబీఎంఎం కృష్ణలను ఉఫాధ్యక్షులుగా ఎన్నుకొన్నారు. గౌరవ కార్యదర్శిగా కె.శాంతి భూషణ్, కోశాధికారిగా ఆర్.అయ్యవారయ్య, జాయింట్ సెక్రటరీలుగా లంక రామకృష్ణ ప్రసాద్, ఎస్.నాగేశ్వరరావు, రాయపాటి జగదీశ్, పి.కోటేశ్వరరావు, చుండూరి రవిబాబు ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మిట్టపల్లి ఉమమహేశ్వరరావు కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ కార్యవర్గం తీసుకొనే నిర్ణయాలు, రైతులకు మేలు చేసేవిధంగా ఉండాలని సూచించారు. -
యువతితో అసభ్య ప్రవర్తన, యువకుడి అరెస్టు
పేమించిన తనను కాకుండా వేరొకరితో పెళ్లికి సిద్ధమవుతావా అంటూ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు పెట్టి రిమాండ్‌కు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకసవరం గ్రామానికి చెందిన కాకి ఉమామహేశ్వర్రావు(27) అలియాస్ మహేష్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -43లో తన తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేసే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఎంసీఏ చదువుతున్న మహేష్ కొంత కాలం నుంచి ఆ పక్కనే ఉన్న భవనం వాచ్మెన్ కూతురు సరితతో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ లీగ్‌లో కూడా ఆడాడు. మంచి భవిష్యత్తు ఉన్న మహేష్ ప్రేమ మైకంలో క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసి ఆవారాగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలోనే సరిత పెద్దలు కుదుర్చిన యువకుడితో పెళ్లికి అంగీకరించింది. ఇది జీర్ణించుకోలేని మహేష్ రెండు రోజుల క్రితం యువతి సరిత జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10లో నడిచి వెళ్తుండగా మహేష్ ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు గుమిగూడి మహేష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మంత్రి ఉమా వ్యాఖ్యలు హాస్యాస్పదం: బుగ్గన
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నానంటూ ఉమా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లిలో తాను భూములు ఆక్రమిస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, ఆ భూముల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తే భూములు ఇవ్వడానికి తాము సిద్ధమని చెప్పారు. మంత్రి దేవినేని ఉమా అవినీతి గురించి గంటల కొద్దీ మాట్లాడొచ్చని.. ఒకవైపు ఆయన ప్రజల భూములు ఆక్రమిస్తూ తనపై ఆరోపణలు చేస్తారా అని నిలదీశారు. -
'అందుకే ఆ ప్రాజెక్ట్‌ల అంచనాలు పెంచాం'
విజయవాడ: హంద్రి-నీవా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే అంచనాలను పెంచామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో 6 వేల కోట్లు అవినీతి జరిగిందనడం అవాస్తమని అన్నారు. బుధవారం వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పనులు వేగవంతం చేసేందుకే గాలేరు- నగరి, బోరకల్లు.. హంద్రి-నీవా ప్రాజెక్టుల అంచనాలు పెంచామని చెప్పారు. ఏపీ కేబినెట్లో రెండు, మూడు సార్లు చర్చించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని వారు అన్నారు. ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిపై చర్చించారని తెలిపారు. సవరించిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లను త్వరలో పూర్తి చేస్తామని మంత్రులు పల్లె, దేవినేని ఉమ స్పష్టం చేశారు. -
పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(అర్బన్) : కృష్ణా నది నుంచి ప్రతి ఏడాది వృథాగా సముద్రంలో కలుస్తున్న 72 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఆయన గురువారం ఉదయం కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, అవుకు, గాలేరు-నగరి, బానకచెర్ల రిజర్వాయర్ల నుంచి గండికోట వరకు మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్బీసీ కాలువను వెడల్పు చేస్తున్నామన్నారు. అలాగే కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని రైతులకు ఉపయోగపడుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1, 2 పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తి అయితే ఆయా జిల్లాల్లోని రైతులకు సాగునీరు, తాగునీటి అవసరాలు తీరనున్నాయని తెలిపారు. తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువల్లో చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, జలవనరులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.17,969 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల రంగ నిపుణులు నివేదికలు అందించారని చెప్పారు. ఈ కమిటీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు నెలల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు అందించాయన్నారు. చెరువుల్లో పూడికతీతకు ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు - చెట్టు కార్యక్రమానికి సంబంధించి ప్రతి జిల్లాకు రూ.10 కోట్లను మంజూరు చేశామని మంత్రి దేవినేని చెప్పారు. ఇప్పటికే మొదటి విడతగా ప్రతి జిల్లాకు రూ.5 కోట్లను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమం కింద చెరువుల్లో పూడికతీత పనులు చేపడతారన్నారు. చెరువుల్లో తీసిన పూడిక మట్టిని రైతులు ఉచితంగా తమ పొలాలకు తీసుకువెళ్లవచ్చన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయితే ఆయా చెరువుల్లో ఎక్కువ మోతాదులో వర్షపు నీరు నిల్వ వుంటుందన్నారు. పనులు చేపట్టని పాత ఏజెన్సీలపై క్లాజ్-61 ప్రయోగం జిల్లాలో పలు ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో వున్న పనులకు సంబంధించి వివిధ కారణాల వల్ల పనులు చేయలేక చేతులెత్తేసిన ఆయా ఏజెన్సీలే పనులను పూర్తి చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం జీఓ నెంబర్‌ను 22ను విడుదల చేసిందని చెప్పారు. ఒకవేళ చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు ఆయా ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో క్లాజ్-61ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. అలాగే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయడంతో పాటు వెంటనే షార్ట్ టెండర్లను పిలిచి పనులను అప్పగిస్తామన్నారు. పెండింగ్‌లో వున్న పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆకె రవికృష్ణ, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సీఈ జీ చిట్టిబాబు, ఎస్ఈ కే శ్రీనివాసరావు, హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ జలంధర్, ఎస్ఈ శ్యాంసుందరం, తెలుగుగంగ ఎస్ఈ సన్యాసినాయుడుతో పాటు ఈఈ, డీఈఈలు పాల్గొన్నారు. -
వేగంగా విజయవాడకు...
-
వేగంగా విజయవాడకు..
తాత్కాలిక రాజధానికి కార్యాలయాల తరలింపునకు చర్యలు నాగార్జున వర్సిటీలో సచివాలయం, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖల ఏర్పాటుకు ప్రతిపాదనలు గుంటూరు లాంఫాంలో వ్యవసాయ శాఖ కార్యాలయం! సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ-గుంటూరు నడుమ రాజధాని నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్‌లు అజేయ్ కల్లం, శాంబాబ్, సాంబశివరావులతో కూడిన కమిటీ గుంటూరు, విజయవాడల్లో పర్యటించి తక్షణం కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను, ఉన్న సౌకర్యాలను పరిశీలించింది. నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు లాంఫాం, గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డు, కెనాల్ గెస్ట్‌హౌస్, మేథా టవర్, కానూరులోని నాలుగు అపార్టుమెంట్లను ఈ బృందం పరిశీలించింది. గొల్లపూడిలో మార్కెటింగ్ శాఖ, విజయవాడ కెనాల్ గెస్ట్‌హౌస్‌లో మరికొన్ని కీలక శాఖలు, మేధా టవర్‌లో ఐటీ విభాగం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. నాగార్జున వర్సిటీలో రాష్ట్ర సచివాలయం ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడికే రెవెన్యూ శాఖను కూడా తరలించాలన్న భావిస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక రాజధానిలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్న మంత్రులకు అధికారుల కమిటీ పర్యటన ఊతమిచ్చినట్టయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులకు వారున్న చోటనే కార్యాలయాల ఏర్పాటుకు అవకాశమేర్పడింది. కృష్ణా జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు తొలుత విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇరిగేషన్ ఈఎన్సీ కార్యాలయాన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ కార్యాలయాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించడంలేదు. గుంటూరు లాంఫాంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు మంత్రి ప్రతిపాటి పుల్లారావు యోచిస్తున్నారు. నాగార్జున వర్సిటీలో సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటుకు మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. -
ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: గడికోట
సాక్షి, హైదరాబాద్: మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదే పదే వైఎస్ రాజశేఖరరెడ్డిని దూషిస్తూ సాగిన మంత్రుల ప్రసంగంపై శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపణ తెలిపారు. 1994 నుంచి 2004 వరకూ మీ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో దానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రతి ప్రాజెక్టుపైనా తాము చర్చకు సిద్ధమని, దీనికి టీడీపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతును రాజుగా చూసేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారని, వైఎస్ హయాంలో రూ.47 వేల కోట్లు ఖర్చు చేస్తే మీరు లక్షకోట్లు అంటూ దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతలోనే మంత్రి ప్రత్తిపాటి... తల్లి కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ అని సంబోధించగానే, శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేస్తూ, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉందని, ఆ తర్వాత టీడీపీ అలయెన్స్ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు. రాజశేఖరరెడ్డి వారసులుగా ఐదేళ్ల ఆయన పదవీ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నామన్నారు. ఆయన మరణానంతరం అధికారంలో ఉన్న తెలుగు కాంగ్రెస్‌తోనే ప్రజ లకు కష్టాలు మొదలయ్యాయన్నారు. ఉమామహేశ్వరరావు పదే పదే తెలుగు గంగ ఎన్టీఆర్ హయాంలో చేపట్టారని చెబుతూండగా... టీడీపీ ఏదిచేసినా ఎన్టీఆర్ చేశారని చెప్పుకోవచ్చుగానీ, చంద్రబాబు ఏదైనా ప్రాజెక్టు కట్టారని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. మీరు రైతుల ప్రభుత్వమని మాట్లాడుతున్నారు... మీ ముఖ్యమంత్రే తిన్నది అరక్క రైతులు ధర్నాలు చేస్తున్నారని అన్నారని గుర్తుచేశారు. -
ఊటీ చేస్తామన్న బాబు లూటీకి సిద్ధం
పెద బయలు: విశాఖ మన్యాన్ని మరో ఊటీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు మన్యాన్ని లూటీ చేసే పనిలో ఉన్నారని ఎంపీపీ సల్లంగి ఉమా మహేశ్వరరావు, జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని ఆరోపించారు. పెదబయలులో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాక్సయిట్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ కూడలిలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధికి దూరమైన మన్యంలో గిరిజన యువతకు ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది పోయి బాక్సయిట్ తవ్వకాలతో గిరిజనులను నిరాశ్రయుల్ని చేయాలని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. బాక్సయిట్ జోలికొస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సయిట్‌కు వ్యతిరేకమని చెప్పి, అధికారంలో వచ్చాక తవ్వకాలు ప్రారంభిస్తామనడం విచారకరమన్నారు. బాక్సయిట్ తవ్వకాలతో లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఎన్నోమార్లు శాస్త్రవేత్తలు చెప్పినా తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని విమర్శించారు. 1/70 చట్టానికి తూట్లు పొడిచే బాక్సయిట్ తవ్వకాలు చేపడితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంతకు ముందు పెదబయలు జెడ్పీ అతిథి గృహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ అంబేద్కర్‌కు వినతి ప్రతం అందించారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్, మన్యం లూటీ బాబును తరిమి కొట్టాలని, బాక్సయిట్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు వంతాల శాంతి, మాజీ ఎంపీపీ బాలంనాయుడు, సూర్యనారాయణ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాంగి సింహాచలం, వైఎస్సార్ సీపీ నేతలు సందడి కొండబాబు, పద్మాకరరావు, వంతాల అప్పారావు, ఎంపీటీసీలు కృష్ణారావు, మాధవరావు, బోడిరాజ్, సర్పంచ్‌లు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
రూ.10లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఒకరు అరెస్టు, నలుగురు పరార్ 200 కిలోల గంజాయి, వ్యాను స్వాధీనం రోలుగుంట: పోలీసుల కళ్లు కప్పి ఆరటి గెలల చాటున గంజాయి తరలిస్తున్న వారిపై రోలుగుంట ఎస్ఐ బి.కృష్ణారావు సిబ్బందితో కలసి గురువారం వేకువజామున దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలించడానికి ఉపయోగించిన వ్యాన్ ను, పది బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి. మండలంలో చటర్జీపురం-సింగ రాజుపేట చింతపల్లి రూటులో వేనుతో గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీ సులు ఆ మార్గంలో తనిఖీలు చేపట్టారు. సింగరాజుపేట వద్ద ఉన్న అరటి తోట నుంచి గెలలు వ్యాన్‌కు లోడు అవుతున్నాయి. అక్కడకు వెళ్లి లోడును పరిశీలించగా గెలలు మాటున 10 గంజాయి బస్తా లు బయటపడ్డాయి. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రైవర్ నర్సీపట్నానికి చెందిన పరవాడ శ్రీను(38)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కాగా ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులు పరారయ్యారని, పట్టుబడ్డ గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని ఎస్ఐ విలేకరులకు తెలిపారు. ఏజెన్సీలో ముగ్గురు అరెస్టు చింతపల్లిరూరల్: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అన్నవరం ఎస్ఐ ఉమా మహేశ్వరరావు తెలిపారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా లోతుగెడ్డ బ్రిడ్జి కూడలి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై అనుమానంగా వెళుతున్న వారిని తనిఖీ చేశామన్నారు. వారి వద్ద 30 కిలోల గంజాయి బ్యాగులను గుర్తించామన్నారు. తమ్మంగుల పంచాయతీ బొడ్డజువ్వి గ్రామానికి చెందిన పాంగి బాబూరావు, కూతలపాలేనికి చెందిన సాగిన మత్స్యలింగం, జిరిడికి చెందిన వ్యాపారి యూసఫ్‌ల నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గంజాయి విలువ రూ.50 వేలు ఉంటుందన్నారు. -
సీనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య
జి.సిగడాం, న్యూస్‌లైన్ :జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గొర్లె ఉమామహేశ్వరరావు (45) సోమవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. జి.సిగడాంలో విధులు నిర్వహిస్తున్న ఈయన పొందూరులో కార్యాలయ పని నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పి వెళ్లారు. పొందూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద విషం తాగారు. అక్కడ నుంచి జి.సిగడాం మండల పరిధిలోని వాండ్రంగి సెంటర్ వద్దకు వచ్చి ఉమామహేశ్వరరావు కుప్పకూలిపోయినట్టు స్థానికులు తెలిపారు. బ్యాంకు పనిపై అటుగా వెళ్తున్న జి.సిగడాం ఎంఈవో ఎం.వి.ప్రసాదరావు ఉమామహేశ్వరరావును చూసి.. పరిస్థితిని గమనించి 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ పది నిమిషాలు చికిత్స పొందుతూ చనిపోయారు. ఉమామహేశ్వరరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఉమామహేశ్వరరావు విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో సమాచారం తెలుసుకున్న జి.సిగడాం పరిషత్ కార్యాలయ సిబ్బంది బాసూరి శంకరరావు, రాజశేఖరం, రమణ, తహశీల్దారు జె దుర్గారవీంద్రనాథ్, డిప్యూటీ తహశీల్దారు డి.రమేష్‌బాబు, కార్యదర్శులు, వీఆర్వోలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉమామహేశ్వరరావు మృతికి ఎచ్చెర్ల ఎంఎల్ఏ కిమిడి కళావెంకటరావు, మాజీ ఎంఎల్ఏ మీసాల నీలకంఠంనాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు టంకాల లక్ష్మి, మాజీ ఎంపీపీ మీసాల లక్ష్మి, స్థానిక సర్పంచ్ వెలది సాయిరాం సంతాపం వ్యక్తం చేశారు. స్వగ్రామంలో విషాదం రాజాం రూరల్: ఉమామహ్వేరరావు ఆత్మహత్యతో ఆయన స్వగ్రామమైన రాజాం మండలంలోని పొనుగుటివలసలో విషాదం నెలకొంది. అంబేద్కర్ కాలనీ సమీపంలో నివసిస్తున్న ఈయన గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవారని స్థానికులు తెలిపారు. ఈయన మృతిపై పోలీసులు సమగ్రమైన దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు కోరారు. -
మన నవలలు: అసందిగ్ధ జీవితపు అగమ్య ప్రయాణం
దేవుడికి లోబడిపోదాం. ఈశ్వరా... అంతా నువ్వే చూసుకో తండ్రీ. సంతోషంగా ఉంటున్నామా? అంతా అనుకున్నట్టుగా జరుగుతోందా? అంతా మంచే సంప్రాప్తిస్తోందా. లేదే! పోనీ ప్రకృతికి లోబడిపోదాం. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై... స్వచ్ఛంగా పవిత్రంగా హాయిగా... సంతోషంగా ఉన్నామా? పేదరికం... దరిద్రం... ఆకలి... విషజ్వరాలు. సరే. ఉద్యమానికి లోబడిపోదాం. చిత్రం. ఒక వీరుడు మంటల్లో. ఒక ఉపన్యాసకుడు అందలం మీద. సమానమైన ప్రతిఫలమేనా ఇది? మరి హేతువాదానికి లోబడటమే మేలు. దేవుడూ లేడూ దెయ్యమూ లేదు. మంచిదే. కాని ప్రతిదానికీ మనసు పీకుతూ ఉందే. ఏ నమ్మకమూ లేని బతుకు. మార్క్స్‌ను పట్టుకొని ఆ దారిలో? స్థిరం లేదు. హిట్లర్‌ను పట్టుకొని ఈ దారిలో? శాంతి లేదు. ఇంతకీ ఏ దారిలో వెళితే ఈ జీవితం సంతోషంగా ఉంటుంది? అసలు ఏ దారిలో వెళ్లినా సంతోషం దొరకని జీవితంలో అసందిగ్ధతను మోస్తూ బతకడం ఎట్లా? మధు కోరుకున్నదల్లా ఎంఏలో క్లాసు రావడం. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం. ఆ తర్వాత ఉన్నంతలో జీవితం. అతడు ఊహించింది ఇంత వరకే. అతని ఇంగితానికి దొరుకుతున్న జీవితమూ ఇంత వరకే. ఇంతకు మించి లేదు. ఎందుకంటే జీవితం గురించి ఆలోచించాలంటే అతడికి భయం. దాని గురించి ఆలోచించాలంటే ముందు అతడు తన తల్లి గురించి ఆలోచించాలి. ఆమె ఊళ్లో ఉంటుంది. తను హైదరాబాద్‌లో. ఊళ్లో ఉన్న తల్లి తను ఊహించిన తల్లిలానే ఉందా? ఏం లేదు. చిన్న వయసులోనే భర్త పోయాడని ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. అదీ అన్యకులం వాడితో. ఆమెకు వచ్చిన పరిస్థితులు అలాంటివి. ఆమె దృష్టిలో నుంచి చూసినప్పుడు సమర్థనీయం. తన దృష్టిలో నుంచి చూస్తే కాదు. కాని ఆమె జీవితాన్ని తను వ్యాఖ్యానించాల్సి రావడమే ఇబ్బంది కదా. మరి తను ఆమెకు పుట్టిన కొడుకు. ఇద్దరి జీవితాలకూ సంబంధం ఉంది. కాని విడివిడిగా చూస్తే ఎవరి జీవితం మీద వారికి హక్కు ఉండొద్దా? ఈ కలివిడి, విడివిడి పరిస్థితి మీద మధుకు అయోమయం ఉంది. అందుకే జీవితం వైపు కన్నెత్తి చూట్టానికి అతడికి భయం. సరే. పట్నంలో ఖాళీగా ఉండటం ఎందుకని చదువుకు నాలుగు డబ్బులు అక్కరకొస్తాయని జాగీర్దారు ఉమామహేశ్వరరావు ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఈ జాగీర్దారు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. ఎక్కడో తాగి తందనాలాడుతుంటాడట. అప్పటికే జాగీర్ పోయింది. కాని ఈలోపే ఆయన అక్కగారు మేలుకొని ఆ వచ్చే నష్టపరిహారం జాగ్రత్త చేయడంతో పరిస్థితికి కొదవ లేకుండా ఉంది. ఇంట్లో ఆ అక్కగారు. ఆమె కూతురు నళిని. జాగీర్దారు కూతురు కుసుమ, ఇంకా పసితనం వీడని కుమారుడు కిశోర్. ఈ కిశోర్‌కు నాలుగు పాఠాలు చెప్పి కాసింత కాలక్షేపం చేద్దామనుకొని ఆ ఇంట అడుగుపెట్టాడు మధు. కాని జరిగిందేమిటి? జీవితం అతణ్ణి చేర్చిన దరి ఏమిటి? మొదట కుసుమ ఆకర్షణలో పడ్డాడు. కుసుమ ఇతడి ఆకర్షణలో పడింది. ఇద్దరూ సికిందరాబాద్ ప్యారడైజ్ టాకీస్‌లో ‘నౌరంగ్’ సినిమాకు వెళ్లి బాక్స్‌లో కూచుని ఆ చీకటిలో ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు. నళిని ఇందుకు పరోక్షంగా సహకరించింది. అంతా కుదిరితే కుసుమకు, మధుకు వివాహం. ఇంతలో ఏదో జరిగింది. ఏం జరిగింది? ఒకరోజు సాయంత్రం కుసుమను మధు గట్టిగా కావలించుకున్నాడు. గాజులన్నీ పగిలిపోయాయి. ఒక గాజుముక్క గుచ్చుకుని మధు ఛాతీలో చిన్నబొట్టు చిమ్మింది. తలెత్తి చూస్తే ఆ ప్రణయచేష్టలో ఆమె బొట్టు చెరిగిపోయి ఉంది. వెల్లువలో పూచికపుల్లలు నవల: వెల్లువలో పూచికపుల్లలు; రచయిత: భాస్కరభట్ల కృష్ణారావు; తొలి ప్రచురణ: 1960 తెలుగులో అస్తిత్వవాదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నవల. పాఠకులను ఒక కొత్త ఎరుకలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన నవల. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన భాస్కరభట్ల కృష్ణారావు కథా రచయితగా, నవలా రచయితగా సుప్రసిద్ధులు. మధ్యలో ఆయన రచనలు కనుమరుగైనా ఇటీవల పుస్తకాలుగా వెలువడటం వల్ల ఆయన ప్రతిభ కొత్త తరాలకు పరిచయం చేయడం వీలవుతోంది. భాస్కరభట్ల చిన్న వయసులో మృతి చెందకపోయి ఉంటే మరిన్ని గొప్ప రచనలు చూసి ఉండేవాళ్లం. ఆయన రచనలు రెండు వాల్యూములు విశాలాంధ్రలో లభ్యం. ఆయన ‘యుగసంధి’ నవల తెలంగాణ జీవితానికి దర్పణం. బొట్టు చెరగడం... గాజులు పగలడం... దేనికి సంకేతం? ఇద్దరి మనసూ వికలమైంది. బుద్ధి- ఇది మామూలు ఘటన అంటోంది. హృదయం- దుశ్శకునాన్ని సూచిస్తోంది. ఇద్దరూ తాత్కాలికంగా దూరమయ్యారు. ఈలోపు అక్కగారు గుండెజబ్బుతో గుటుక్కుమంది. లంకంత కొంప. మగతోడు లేదు. తల్లి పోయిన దుఃఖంలో నళిని ఏడ్చి ఏడ్చి సున్నమవుతుంటే ఆ సాయంత్రం ఆమెను ఉపశమింపజేయడానికి మధు గండిపేట తీసుకెళ్లాడు. అప్పటికే చీకటయ్యింది. వెన్నెల పూస్తోంది. తోటలో పూలూ మకరందమూ మత్తెక్కించే గాలి తప్ప వేరే ఏం లేదు. ఒకవైపు ఏకాంతం. మరోవైపు యవ్వనం. జరగాల్సింది జరిగిపోయింది. మరో రెండు వారాలకు ఇద్దరికీ పెళ్లయిపోయింది! ఆశ్చర్యమే ఇది. ట్యూషన్ చెప్పడానికి వచ్చినవాడు ఆ ఇంటి అల్లుడయ్యాడు. కాకపోతే ఒకరిని అనుకొని మరొకరిని చేసుకున్నాడు. ఇందులో తన తప్పు ఉందా? తన తప్పు ఏం ఉంది? పరిస్థితులు అలా తోసుకొచ్చాయి. ఆ పరిస్థితులకు తగినట్టుగా తాను వ్యవహరించాడు. అంతే. అయితే జీవితం ఇలా ఉంటుందని కుసుమకు తెలియదు. తాను వలచినవాడు తన కళ్లెదురుగా మరొకరికి భర్త అవుతాడని ఆమె ఊహించలేదు. అందుకే స్తబ్దుగా అయిపోయింది. ఎంత స్తబ్దుగా అంటే మామూలు ప్రపంచం నుంచి దాదాపుగా విరమించుకుంది. మతిభ్రమణం! పిచ్చి! ఆమె వైపు నుంచి చూస్తే నళినికి, మధుకు గిల్ట్. కాని తమ వైపు నుంచి చూస్తే తామే తప్పూ చేయలేదు. మరికొన్నాళ్లకు తాగీ తాగీ జాగిర్దారు పోయాడు. లంకంత కొంప దెయ్యాల కొంపలా మారింది. అక్కగారు లేదు. అయ్యగారు లేడు. ఒక కూతురుకి పిచ్చిపట్టింది. కిశోర్ ఇంకా పసివాడే. ఈ పరిస్థితుల్లో నళినికి, మధుకి ఏం సంతోషం ఉంటుంది? ఒక బిడ్డ పుట్టాడు. జీవితం మళ్లీ వెలిగింది. అమ్మయ్య జీవితంలో ఏదో ఒక పద్ధతి ఉన్నట్టే ఉంది అనుకున్నాడు మధు. నాలుగు రోజులు గడిచాయి. ఈ ఇల్లు బాగలేదని కొత్త ఇంట్లోకి మారదామని భారీ ఇంటికి నళిని ప్రణాళిక వేసింది. అందమైన భవిష్యత్తు కోసం కలలు. ఇంతలో ఆమెకు మళ్లీ గర్భం వచ్చింది. కాని ఈసారి జీవితం వెలగలేదు. ఆరిపోయింది. ఆ గర్భమే నళినిని ఈలోకం నుంచి తీసుకెళ్లిపోయింది. చీకటి. మధు జీవితంలో కటిక చీకటి. అంతా చేసి మూడేళ్లు. మూడేళ్ల క్రితం అతడో మామూలు కుర్రవాడిగా ఒక ట్యూషన్ మాస్టారుగా ఆ ఇంట అడుగుపెట్టాడు. మూడేళ్లు ముగిసేసరికి కొన్ని సంయోగాలని కొన్ని వియోగాలని కొన్ని ఆనందాలని కొన్ని భయంకరమైన విషాదాలని కొన్ని తనకు నిమిత్తమైన సంగతులని కొన్ని తన ప్రమేయం లేకుండా జరిగిపోయిన సంఘటనలని అన్నీ చూసేశాడు. ఇంత చూశాక అతడికి మళ్లీ సందేహం వచ్చింది. ఇంతకీ జీవితం అంటే ఏమిటి? నవల ముగిసింది. ‘కేవలం నీ చర్యలకు నువ్వు బాధ్యత వహిస్తూ పర్యవసానం ఏమిటో తెలియకుండా గమ్యం ఎటో తెలియకుండా జీవితాన్ని నిర్వహించుకుంటూ వెళ్లడం ఏ మనిషికైనా చాలా బరువుతో కూడుకున్న పని’- అస్తిత్వవాదానికి ఒక వ్యాఖ్యానం ఇది. మనిషి ఒక ఉనికి అయితే అతడి జీవితం ఏ ఉనికి ఆధారంగా నడుస్తుంది? దైవం ఉంది అనుకుంటే అంతా మంచే జరగాలి. జరగడం లేదు. దైవం లేదు అనుకుంటే అంతా చెడే జరగాలి. అలా జరగడం లేదు. పోనీ జీవితం ఇలా ఉంటుందని ఊహిస్తే అలా ఉండటం లేదు. అసలేమీ ఊహించకుండా ఊరుకుంటే జడత్వం వల్ల కదలడం లేదు. చలనం కావాలి. కాని అది మనం కోరుకున్నట్టుగా కావాలి అనుకోవడం అసాధ్యం. అసంభవం. అంటే జీవిత గమనం, ప్రపంచ గమనం ఒక అసంబద్ధం. అబ్సర్డ్. అందువల్ల అది ఎలా ఎదురుపడితే అలా స్వీకరించడమే చేయదగ్గది. జీవితాన్ని జీవించడమే, నిండుగా ఎదుర్కొనడమే చేయదగ్గది. దాన్నుంచి ఆశించినా భంగమే. దానికి దూరంగా పారిపోయినా నష్టమే. దాంతో పాటు నడుస్తూ మన ఉనికికి, చేష్టలకు బాధ్యత వహిస్తూ ఫలితంగా వచ్చే ఇష్ట/అయిష్టమైన పర్యవసానాలను సమైక్య దృష్టితో చూస్తూ ముందుకు సాగితే కొంత నయం. ఇలాంటి భావజాలాన్ని ‘అస్తిత్వవాదం’ పేరుతో కిర్క్గార్డ్లాంటి తత్త్వవేత్తలు ప్రవేశపెడితే జీన్ పాల్ సార్త్,్ర ఆల్బర్ట్ కామూలాంటి వాళ్లు సాహిత్యంలో ప్రవేశపెట్టి జగద్విదితం అయ్యారు. తెలుగులో అలాంటి భావజాలాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టడం, అదీ ఒక శక్తిమంతమైన నవలగా తీర్చిదిద్దడం రచయిత భాస్కరభట్ల కృష్ణారావు సాధించిన ఘనత. ఈ నవలలో పాత్రలు అంతవరకూ వచ్చిన నవలల్లోలాగా కంట్రోల్డ్‌గా ఉండవు. తాము ఊహించినట్టుగా ఉంటూ జీవితాన్ని తాము ఊహించినట్టుగా ఉంచుకోవు. సహజంగా ఉంటాయి. పరిమితులకు బాహ్యంగా వ్యవహరిస్తాయి. పరిస్థితులు తోసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మల్లే వెల్లువలో పూచికపుల్లల్లా కొట్టుకుపోతాయి. ప్రతి వ్యక్తి ఒక ఇండివిడ్యువల్. అతని జీవనసూత్రాలకీ మరొకరి జీవనసూత్రాలకీ పోలిక లేదు. అంటే ఎవరినీ దేనినీ వ్యాఖ్యానించడానికి ఒక కచ్చితమైన కొలబద్ద ఉండదు. ఒక రకంగా చూస్తే మధు తల్లి చేసింది ఒప్పు. మరో రకంగా చూస్తే మధు అభ్యంతరపడటం కూడా ఒప్పు. కాని ఒక తప్పుకు రెండు ఒప్పులు ఎలా ఉంటాయ్? అది ఆలోచించాలి. దేనికైనా ఒక మోడల్ అంటూ ఉంటే ఆఖరుకు విజేతలు, శ్రీమంతులు, ప్రపంచాధిపతులు కూడా అశాంతితో ఎందుకు ఉన్నారు? అది ఆలోచించాలి. అంటే ఏమిటి? ప్రతి ఒక్కరిని పట్టి కుదేలు చేయడమే జీవితం పని. ఆ ఎరుక కలిగించే నవల ఇది. జీవితంలో డిస్టర్బెన్స్ ఉండటం గురించి కాకుండా అసలు డిస్టర్బెన్సే జీవితం అనే అవగాహన కలిగించి పాఠకులకు తమ జీవితాన్ని ఎదుర్కొనడం నేర్పే ఉత్కృష్టమైన నవల. అసలు సిసలు తెలుగు నవల.