Unique cards
-
ప్రతి దివ్యాంగుడికి విశిష్ట గుర్తింపుకార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రతి దివ్యాంగుడికి విశిష్ట వికలత్వ ధ్రువీకరణకార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి పౌరుడికి ఆధార్‌కార్డు ఇస్తున్నట్లుగా దేశంలోని దివ్యాంగులకు యూనిక్ డిజెబులిటీ ఐడీ(యూడీఐ) జారీచేస్తోంది. ఈ కార్డుల జారీ నేపథ్యంలో రాష్ట్రంలోని వికలాంగులకు ప్రకత్యేక పరీక్షలు లేకుండా సదరం(వికలత్వ ధ్రువీకరణ) సర్టిఫికెట్లతో వీటిని అనుసంధానం చేయాలని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ స్వయంచాలిక(ఆటోమెటిక్) పద్ధతిలో వీటిని జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సదరం సర్వర్‌ను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌కు అనుసంధానం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకం కోసం సదరం సర్టిఫికెట్లను జారీచేస్తోంది. ఈ ధ్రువీకరణపత్రం ఆధారంగానే పింఛన్లు జారీచేస్తున్నారు. కనీసం 50 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,98,656 మంది సదరం సర్టిఫికెట్లు తీసుకున్నట్లు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది చివరికల్లా నూరు శాతం కార్డులు జారీ యాభై శాతం కంటే తక్కువ వికలత్వం ఉన్నవారికి ఈ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది దివ్యాంగులు ఈ జాబితాలోకి రాలేదని దివ్యాంగుల సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సదరం సర్టిఫికెట్లు పొందిన ప్రతిఒక్కరికీ యూడీఐ కార్డులు జారీ చేయనున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ చెబుతోంది. ఇప్పటికే పలువురికి కార్డులు జారీ చేయగా, ఈ ఏడాది చివరికల్లా నూరు శాతం కార్డులు జారీ చేసేలా ఆ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేస్తున్న యూడీఐ కార్డులను దేశంలో ఎక్కడైనా గుర్తింపుకార్డు కింద పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ కార్డుకు ఆధార్ నంబర్‌ను కూడా అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం అమలు చేసే పథకాలకు ఈ కార్డులే ప్రామాణికం కానున్నాయి. -
రాజధాని వానరాలకు ఐడీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వానరాలకు ఇక విశిష్ట గుర్తింపు కార్డులు రానున్నాయి. కోతుల జనాభా విచ్చలవిడిగా పెరగడాన్ని నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. కోతుల స్టెరిలైజేషన్ ఎలా చేపట్టాలనే దానిపై కసరత్తు చేయాలని ఎన్జీవో వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్, మున్సిపల్ కార్పొరేషన్, అటవీ శాఖలను కోరింది. కోతుల సంఖ్యను నిరోధించేందుకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్‌లో భాగంగా వాటికి శాశ్వత, విశిష్ట గుర్తింపు సంఖ్యలను (ఐడీ) ఇవ్వాలని ఎన్జీవో వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ సూచించింది. ఈ సంస్థ గతంలో ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీతో కలిసి ఈ తరహా ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ ప్రాజెక్టును ఢిల్లీలో అమలు చేసేలా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. -
టీ ప్రభుత్వ ఉద్యోగులకు యూనిక్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూనిక్ (ప్రత్యేక) కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. ఆర్థిక శాఖ ఇటీవల రూపొం దించిన సమీకృత ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్ఎంఎస్)లో భాగంగా వీటిని కేటాయించనున్నారు. దీని ఆధారంగా ఒక ఉద్యోగి సర్వీసులో చేరినప్పటి నుంచి రిటైరయ్యే వరకు పూర్తి వివరాలన్నీ ఎక్కడున్నా సీఎఫ్ఎంఎస్ ఆన్లైన్లో తెలుసుకునే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల వివరాలతోపాటు ప్రతి నెలా రిటైరయ్యే ఉద్యోగుల సంఖ్య, ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నాయి.