The US Geological Survey
-
ఇండోనేసియాలో భూకంపం
జకార్తా : ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు అయిందని ఇండోనేసియా ఉన్నతాధికారి వెల్లడించారు. భూకంపం సంభవించగానే నివాసాల నుంచి ప్రజుల బయటకు పరుగులు తీశారని చెప్పారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం ఇప్పటి వరకు అందలేదని చెప్పారు. అలోర్ ద్వీపంలోని తూర్పు నుష్టంగ్గర్ ప్రావిన్స్‌లోని భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వివరించింది. సునామీ వచ్చే అవకాశాలు కూడా లేవని పేర్కొంది. -
అర్జెంటైనాలో భూకంపం: ఒకరు మృతి
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటైనా ఉత్తర ప్రాంతం సాల్టాలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం దాటికి ఓ మహిళ మృతి చెందిందని తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు పేర్కొంది. కాగా సాల్టాలో ఈ రోజు వచ్చిన భూకంపం బలంగా వచ్చిందని... అర్జెంటైనా నేషనల్ సెసిమిక్ ప్రివెన్షన్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.