ప్రజలను హింసించొద్దు
► వాల్తేరులో వంతెన నిర్మించకుంటే ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధం
► రాజకీయ కక్షతోనే వంతెన నిర్మాణం అడ్డుకుంటున్నారు
► ఎమ్మెల్యే రవి, సీఎంకు బుద్ధిచెప్పాలి
► సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
► నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అధికారులు ఉండే ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు, టీడీపీ నాయకుల జాగీరులు కావని, అవన్నీ ప్రజల కోసం ఏర్పడిన సంస్థలని, వాటిలోకి ప్రజలు ప్రవేశించే హక్కును పోలీసులు, అధికారులు కాలరాస్తున్నారని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సంతకవిటి మండలంలో నాగావళి నదిపై వాల్తేరు గ్రామంలో బలసలరేవు వద్ద వంతెన నిర్మాణం కోరుతూ కలెక్టర్‌ను కలిసేందుకు ర్యాలీగా వచ్చిన నారాయణతో పాటు ప్రజలను కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, అధికారుల తీరుపై నారాయణ మండిపడ్డారు.
ఆమదాలవలస, సంతకవిటి మండలాల మధ్య నాగావళి నదిపై వాల్తేరు గ్రామంలో బలసలరేవు వద్ద వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చి అక్కడ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ టీడీపీ నాయకులు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రజల ప్రయోజనాలు మర చి, రాజకీయం చేస్తున్నారన్నారు. సంతకవిటి మండలం లో అధికంగా ఇతర పార్టీల అభిమానులు ఉన్నందున వారి ప్రయోజనాలకు పాలకులు అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలను హింసించడం, వారిని అవసరాలకు వాడుకోవడం చంద్రబాబునాయుడికి అలవాటేనన్నారు. ఎమ్మెల్యే రవికి, సీఎంకు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. త్వరలో వంతెన నిర్మాణం ప్రారంభించకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం తీసుకువచ్చి, కలెక్టరేట్, తహసీ ల్దార్ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామ ని ప్రభుత్వానికి హెచ్చరించారు.
అనంత రం బలసలరేవు వంతెన సాధన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 50 గ్రామాల ప్రజల చిరకాల వాంఛ ఈ వంతెన నిర్మాణ మని అన్నారు. ఈ వంతెన నిర్మాణంతో రెండు నియోజకవర్గాల ప్రజలకు రవాణా మార్గం కలుగుతుందన్నారు. 1999లో వం తెన పనులు ప్రారంభిస్తామని నాటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటివరకు అతీ గతి లేదని వారు ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపరాణి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు విమల, బలసలరేవు వంతెన సాధన కమిటీ ప్రతినిధులు గురుగుబెల్లి నారాయణరా వు, జి.స్వామినాయుడు, సిరిపురం జగన్నాథరావు, రవీంద్రనాయుడు, జి.గోపాలరావు, ఎం.మోహనరావు, సీపీఐ నాయకులు చాపర సుందర్‌లాల్, వెంకటరమణ, సీపీఎం నేత తిరుపతిరావు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.