vanke srinivas
-
వలంటీచర్స్
రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తారు. మరికొందరు కృష్ణారామా అంటూ తీర్థయాత్రలు చేస్తారు. కానీ.. అడవికొలను కనకరాజు అందుకు భిన్నం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసినా.. వాలంటరీ టీచర్‌గా మారారు. విశ్రాంత జీవితం గడపాల్సిన సమయంలో పాఠశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆ సరస్వతీ నిలయం గురించి... - వాంకె శ్రీనివాస్ అడవికొలను కనకరాజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 1992లో పదవీ విరమణ చేశారు. ఆ రోజు అక్షరాలకు దూరమవుతున్నానన్న ఆవేదనతో వచ్చిన ఆయన కన్నీళ్లను ఆపడం ఎవరితరం కాలేదు. నాలుగు అక్షరాలను నలుగురికీ పంచాలనే తృష్ణ ఉంటే టీచర్ ఉద్యోగమే ఉండాలా? తానెందుకు ఓ పాఠశాల నడిపించగూడదు? అనుకున్న కనకరాజ్ ఎస్ఈఎస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గర విశ్రాంత జీవితం గడిపేందుకు గ్రీన్ కార్డు ఉన్నా.. అక్కడికి వెళ్లడం కంటే పిల్లలకు అక్షరాలు నేర్పడంలోనే అసలైన సంతోషం ఉంటుంది అంటున్నారు కనకరాజు. ఈ ప్రయాణంలో ఆయనకు తోడుగా నిలిచింది భార్య సుందరీ ఇందిర. రిటైర్డ్ టీచరైన ఆమె కూడా ఈ అక్షర యజ్ఞంలో పాలుపంచుకుంటోంది. కాలిఫోర్నియాలో ఉంటున్న ఇద్దరు కొడుకులు వీళ్ల ఆశయానికి అండగా నిలిచారు. నాన్న స్ఫూర్తితో... ‘ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సంపాదించి.. 40 ఏళ్ల కెరీర్లో సిటీలోని వివిధ స్కూళ్లలో సేవలందించా. రిటైర్మెంట్ తరువాత పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యనందించేందుకే పాఠశాలను ప్రారంభించా. చాలా ఏళ్ల క్రితం మా నాన్న దివంగత శేషగిరిరావు ఏర్పాటు చేసిన ఎస్‌వీఈఎస్ తెలుగు మీడియం స్కూల్... తరువాత డిగ్రీ కాలేజీగా మారింది. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దింది. నా ఈ స్కూల్ ఏర్పాటు వెనుక ఆయన స్ఫూర్తి ఉంది’ అని గర్వంగా చెబుతారు కనకరాజు. కులమతాలతో సంబంధం లేకుండా... పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించలేని పేద పిల్లలను స్కూల్లో చేర్చుకుంటున్నారు. 2001లో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ పాఠశాల ప్రస్తుతం 250 మంది విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తోంది. డొనేషన్లు లేకుండా... తొలినాళ్లలో నెలకు రూ.50 ఫీజు మాత్రమే తీసుకునేవారు. 2006 నుంచి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నారు. ‘మొదట పేరెంట్స్‌ను కన్విన్స్ చేయడం కష్టమైంది. వాళ్లను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. అయితే ఫైనల్‌గా వారు పాజిటివ్‌గా స్పందించి పిల్లలను బడికి పంపించారు. అలా ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు ఎంతోమంది విద్యార్థులు చదవుతుండడం సంతోషంగా ఉంది. నా ఇద్దరు కుమారులు కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అక్కడికెళ్లినప్పుడు ఆశా ఎస్వీ వాళ్లతో ఏర్పడిన పరిచయం మా స్కూల్‌కు ఆర్థిక సహాయం చేసే వరకు వచ్చింది. అలా మా సేవను హైదరాబాద్‌కు వచ్చి ప్రత్యేకంగా వీక్షించిన వారు ఫండింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం లోకల్ మెంబర్స్ సహకారాన్ని తీసుకుంటున్నామ’ని చెబుతున్నారు కనకరాజు దంపతులు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న మరికొంత మంది రిటైర్డ్ టీచర్స్ మీనాక్షి, రాణి ప్రమీల, కె.రాజ్‌గోపాల్, వాసుదేవరావులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ స్కూల్లో భాగస్వామయినందుకు సంతోషంగా ఉందంటున్నారు వాలంటరీగా పనిచేస్తున్న సాయిలత. అన్నింటిపై దృష్టి... ‘ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెడతాం. వారు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌లను గుర్తించి ప్రత్యేక తరగతులు తీసుకుంటాం. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి నెలా పేరెంట్, స్టాఫ్ మెంబర్స్‌తో ఇంటారాక్టివ్ సెషన్ నిర్వహిస్తాం. ఇలా చేయడం వల్ల విద్య ప్రాధాన్యతని పేరెంట్స్‌కి చెబుతూనే... వారి నుంచి ఏమైనా సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. మాణిక్యాల్లాంటి విద్యార్థులను వెలికి తీసేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం’ అని అంటున్నారు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ దేవులపల్లి విజయ్. -
ఎకో పంథా
సిటీలోని బడా హోటళ్లు నయా పంథాలో నడుస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్‌కు ఓటేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మంగళవారం ‘ప్లానెట్ 21’ పేరుతో ‘నోవాటెల్’ వార్షికోత్సవాన్ని పర్యావరణ హితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహారం, పర్యావరణం, పచ్చదనం ప్రాధాన్యతను ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాము టేస్ట్ అండ్ హెల్తీ మెనూను సిద్ధం చేస్తున్నట్టు కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు. కాగా, కస్టమర్లు సైతం ఈ తరహా ఫుడ్‌కే ఓటేస్తుండటంతో బడా హోటళ్ల దారిలోనే మధ్య, చిన్నస్థాయి హోటళ్లూ నడుస్తున్నాయి. సేంద్రియ ఆహార ఉత్పత్తులను కాస్త ఎక్కువ రేటైనా పెట్టి కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని హోటళ్లయితే ఏకంగా రైతులతోనే అగ్రిమెంట్ చేసుకొని రసాయనిక మందులు వాడని కూరగాయలు, బియ్యం తెప్పించుకుంటున్నాయి. రైతులకు కూడా బాగానే గిట్టుబాటు అవుతుండటంతో హోటళ్లకు తమ ఉత్పత్తులు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ‘గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, కదిరి, మిర్యాలగూడ నుంచి రాగులు, కొర్రలు, జొన్నలు, అరికెలు, పప్పు, జొన్న ధాన్యాలు తెప్పిస్తున్నాం. మిల్లెట్ దోశ, రాగులు, జొన్న ఇడ్లీలు, చిరుధాన్యాల వడ, రాగులతో అటుకులు, జొన్న, సజ్జలతో అటుకులు (పోహ) చేస్తున్నాం, సిటీవాసుల నుంచి వీటికి మంచి రెస్పాన్స్ ఉంద’ని అంటున్నారు బంజారాహిల్స్ ఆహార్ బిస్ట్రో నిర్వాహకురాలు అర్చన. మా వద్దకు వచ్చే కస్టమర్లు టిఫిన్స్, లంచ్, డిన్నర్‌కు వాడే ఐటమ్స్ సేంద్రియ ఆహార పదార్థాలేనా అని అడుగుతున్నారంటే ఆహారం విషయంలో సిటీవాసులు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ట్రైడెంట్ హోటల్ ఉద్యోగి మోనిక. ‘ఒక్క ఆహారం విషయంలోనే కాదు మా హోటల్లో కస్టమర్లు వాడిన శీతలపానీయ బాటిళ్లను పారేయడం లేదు. వాటిని శుభ్రం చేసి అందులో ఇసుక నింపి ఇటుకల మధ్యలో వాడుతున్నాం. అలాగే ఉద్యోగులందరూ సైకిల్‌పై రావాలని కోరాం. తప్పనిసరై బైక్, కార్లపై వచ్చిన ఉద్యోగుల కోసం పొల్యూషన్ చెక్ వెహికల్ అందుబాటులో ఉంచాం. హోటల్‌కు వచ్చిన కస్టమర్ల వెహికల్‌కు కూడా ఫ్రీగానే చెక్ చేస్తున్నాం’ అంటున్నారు నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ జనరల్ మేనేజర్ నీల్ పీటర్సన్. ఈ సందర్భంగా వృథా అనుకునే ప్రతి వస్తువును తిరిగి ఏదో రకంగా ఎలా ఉపయోగించవచ్చో వివరించారు. - వాంకె శ్రీనివాస్ -
అన్నీ అనుకోకుండానే..
ఎయిర్ హోస్టెస్‌గా అనుకున్న ఉద్యోగం సంపాదించింది. అదే ఉద్యోగం ఆమెను హీరోయిన్గా టాలీవుడ్లో ల్యాండ్ అయ్యేలా చేసింది. హిందీ, ఇంగ్లిష్ తప్ప మరో భాషరాని ఈ అమ్మాయి ఇప్పుడు తెలుగులో అదరగొడుతోంది. సినిమా తెరపై నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న కెనీష చంద్రన్ ఇటీవల బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. తన కెరీర్ ముచ్చట్లను సిటీప్లస్‌తో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే. - వాంకె శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి విమానంలో ప్రయాణించాలనే కాదు.. ఫ్లయిట్లోనే ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది. నేను పుట్టింది కేరళలో అయినా.. పెరిగిందంతా ఢిల్లీలోనే. బీఎస్సీ సైకాలజీ చేశాను. తర్వాత ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల కిందట డ్యూటీలో ఉండగా.. విమానంలో ఓ ప్రయాణికుడు నన్ను చూసి యూనినార్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తావా అని అడిగారు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తర్వాత తేరుకుని ఓకే చెప్పాను. అలా యూనినార్ ప్రచార చిత్రాల్లో నటించాను. చాలా ఇబ్బందిపడ్డా.. యాడ్స్ మూడ్ ఎంజాయ్ చేస్తుండగానే ఒకరోజు అనుకోకుండా టాలీవుడ్ నుంచి ఫోన్ వచ్చింది. గణపతి బప్పా మోరియాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. షూటింగ్ మొదట్లో తెలుగు అస్సలు వచ్చేది కాదు. సహ నటులతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిపడ్డా. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో ప్రయత్నించా. ఇప్పుడు తెలుగులో గలగలా మాట్లాడేస్తున్నా. తాజాగా జగన్నాటకం సినిమాలో కూడా నటించాను. కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఓల్డ్ సిటీ చాలా ఇష్టం... కెరీర్‌పరంగా నాకు లైఫ్‌నిచ్చిన హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడి ప్రజలు ఆత్మీయంగా పలకరిస్తారు. ఓల్డ్ సిటీలో చక్కర్లు కొట్టడం అంటే భలే సరదా. షూట్స్ లేని సమయాల్లో.. ఫ్రెండ్స్‌తో కలసి పాతబస్తీని చుట్టేస్తుంటా. ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ చూసి ఎంతో మురిసిపోయాను. ఇక దక్కన్ స్పెషల్.. స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఢిల్లీకి వెళ్లినప్పుడు మా పేరెంట్స్ దగ్గర హైదరాబాదీ బిర్యానీ గురించి ఎంతో గొప్పగా చెప్పా. వారు సిటీకి వచ్చినప్పుడు.. బిర్యానీ టేస్ట్ కూడా చూపించాను. -
గోపాల గోపాల
మణిపూర్ వైభవానికి ప్రతీకగా నిలిచిన నృత్యరీతులు ‘వసంత్‌రాస్.. పుంగ్ చోలమ్’. ఈ జంట నృత్యాల సవ్వడిలో శిల్పారామంలోని అంఫీథియేటర్ ఆదివారం మార్మోగింది. ఇంఫాల్‌కు చెందిన జవహర్లాల్ నెహ్రూ మణిపురీ డ్యాన్స్ అకాడమీకి చెందిన కళాకారులు ప్రదర్శించిన నాట్యం ఆహూతులను ఆద్యంతం అలరించింది. ఈ సందర్భంగా డ్యాన్స్ అకాడమీ డెరైక్టర్ ఉపేంద్రశర్మ సిటీప్లస్ తో పంచుకున్న విశేషాలు .. - వాంకె శ్రీనివాస్ వసంత్‌రాస్.. రాధాకృష్ణుల రాసలీలను కళ్లకుకడుతుంది. వసంత రాస్.. మణిపూర్‌కు వరంగా దొరకడం వెనుక పౌరాణిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. బృందావనంలో గోపికల సమేతంగా రాధాకృష్ణులు రసరమ్య కేళిని.. పార్వతీదేవి చూడాలనుకుంటుంది. ఆమె కోరిక మేరకు శివుడు పార్వతితో కలసి మణిపూర్‌లోని ఓ అందమైన ప్రాంతంలో ఆనందలాస్యం చేశాడని ప్రతీతి. ఆనాటి నుంచి వసంత రాస్.. మణిపురీల సొంతమైంది. పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం పొందిన వసంత్‌రాస్ నాట్యం మణిపూర్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. హైదరాబాదీలు కూడా వసంత్‌రాస్ నాట్యం అభ్యసించడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. నాట్య గోవిందం.. ఈ నాట్యంలో రాధాకృష్ణుల ఆనందకేళి, గోపాలుడితో గోపికల అల్లరి.. కళ్లకు కట్టడమే వసంతరాస్ నాట్యంలో ప్రధానాంశం. తరతరాలుగా ఎందరో మహానుభావులు ఈ నృత్యరీతికి తమ ప్రతిభతో అదనపు సొబగులు అద్దుతున్నారు. ఈ నృత్యంలో నర్తకిలు చేతివేళ్లతో ప్రదర్శించే ముద్రలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గోపికలంతా శ్రీ కృష్ణుడి చుట్టూ చేరి.. ఆరాధన భావనతో అతనివైపే చూస్తూ నాట్యంలో లీనమైపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆనాడు యమునా తీరంలో కృష్ణుడి వైభోగాన్ని ఈ కళాకారులు మన కళ్లముందుంచుతారు. మృదంగలాస్యం.. ఇక మణిపురి నట సంకీర్తన పుంగ్ చోలమ్కు విశేష ఆదరణ ఉంది. పుంగ్ అంటే మృదంగం వాయించడం.. చోలమ్ అంటే కదలికలు అని అర్థం. కళాకారులు మృదంగాలు వాయిస్తూ.. పాదాలు చకచకా కదుపుతూ.. గాలిలో ఎగురుతూ చేసే నృత్యం అద్భుతంగా కనిపిస్తుంది. 600 ఏళ్ల క్రితం దీనికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. మణిపూర్‌లోని పల్లెల్లో హోలీ సందర్భంగా ఈ నృత్యం చేసేవారు. కాలక్రమంలో పల్లె దాటిన ఈ నృత్యం.. ప్రపంచ వేదికపై కూడా తన వైభవాన్ని చాటింది. -
బ్రెయిన్ గెయిన్
అంతా గుర్తున్నట్టే ఉంటుంది.. తీరా ఎగ్జామ్కెళ్లాక పెన్ను కదలదు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈక్వేషన్ గుర్తుండదు. టీచర్ చెప్పిన కొండగుర్తు ఎప్పుడో కొండెక్కితే, బట్టీ పట్టిన సైన్స్ థియరీ... మైండ్ దాటి బయటికి రాదు. స్టూడెంట్స్‌కి ఈ శ్రమ తప్పిస్తోంది బ్రెయిన్ జిమ్. నగరానికి కొత్తగా వచ్చిన ఈ యాక్టివిటీస్‌ను నేర్చుకునేందుకు ‘మిడ్ బ్రెయిన్ మాస్టర్స్ (ఎంబీఎం)’ సెంటర్స్‌కి క్యూ కడుతున్నారు పిల్లలు!. - వాంకె శ్రీనివాస్ పువ్వుల్లా తమ పిల్లలూ.. పుట్టిన నాటి నుంచే పరిమళించాలని కోరుకుంటున్నారు నేటి తల్లిదండ్రులు. ర్యాంక్స్ కోసం వేట ఎల్కేజీ నుంచే మొదలవుతుంది. ఏ ఇద్దరు మనుషులూ ఒకేలా ఉండరు. మరి పిల్లలందరూ యాక్టివ్‌గా ఉండాలంటే సాధ్యమవుతుందా? కొందరు ఫస్ట్ బెంచ్, ఇంకొందరు లాస్ట్. అయితే లాస్ట్ బెంచ్ విద్యార్థులను సైతం ఫస్ట్ ర్యాంకర్స్లా తీర్చిదిద్దడానికే పుట్టుకొచ్చింది బ్రెయిన్ జిమ్. పిల్లల మెదడుకు పదును పెట్టి... చురుకుగా పనిచేసే కిటుకులను నేర్పిస్తోంది. మలేసియాలో అంకురించిన ఈ బ్రెయిన్ జిమ్ కాన్సెప్ట్ ఇప్పుడు హైదరాబాద్‌కు చేరింది. దీన్ని సిటీవాసులకు పరిచయం చేసిన ఎంబీఎం సెంటర్.. మెమరీ గేమ్స్, డ్యాన్స్, ఫన్ యాక్టివిటీస్, రిలాక్సేషన్ ఎక్సర్‌సైజులతో పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతోంది. ఏకాగ్రతలో ఏకలవ్యులను మించేలా చేస్తుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి, గ్రాహక శక్తితోపాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతోంది. భిన్నమైన వ్యాయామాలు... పిల్లలను అన్ని పనుల్లో చురుగ్గా ఉంచేందుకు దోహదం చేసే ఈ బ్రెయిన్ జిమ్‌లో డిఫరెంట్ వ్యాయామాలు ఉన్నాయి. నిపుణుల మార్గదర్శనంలో ఐదేళ్ల నుంచి పదహారేళ్ల వరకు పిల్లలతో విభిన్నమైన ఆసనాలు వేయిస్తారు. సాధారణంగా మెడిటేషన్ మానసిక ప్రశాంత తతోపాటు ఏకాగ్రతను పెంచుతుంది. ‘మేం చెప్పే ఎక్సర్‌సెజైస్ చేస్తే.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేయగలుగుతారు. ఒక్కముక్కలో చెప్పాలంటే అన్ని విషయాల్లో పిల్లలు చాకచాక్యంగా ఉంటారు’ అని చెబుతున్నారు బ్రెయిన్జిమ్ ఎక్స్పర్ట్స్, మలేషియాకు చెందిన హెడ్ట్రైనర్ మాథ్యూ. బ్రెయిన్జిమ్లో కుడి, ఎడమ చేతులు ఒకేసారి పనిచేసేలా ఎక్సర్సైజులు ఉంటాయి. హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ కోసం ప్రత్యేక వ్యాయామాలు ఉంటాయి. అయితే రెగ్యులర్ వ్యాయామాలకు భిన్నంగా ఉండటంతో వీటిని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు పిల్లలు. క్రేజీ డ్యాన్స్... మైండ్ రిలాక్స్ కోసం చేయించే డ్యాన్స్‌కు పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్కూల్లో పుస్తకాలు, ఇంటికొచ్చాక వీడియోగేమ్స్, లేదంటే కంప్యూటర్ ముందు కాలం వెళ్లదీస్తున్న సిటీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఉండటం లేదు. అందుకే ఎంబీఎం నేర్పిస్తున్న మలేషియా డ్యాన్స్ స్టెప్పులపై ఆసక్తి కనబరుస్తున్నారు సిటీ కిడ్స్. మెమరీ గేమ్స్ కూడా పిల్లల్లో ఆలోచనాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. ‘20 మంది పిల్లలకు మెమరీ గేమ్‌ను చూపెడతాం. పది మందిని గుర్తుపెట్టుకోమంటాం. ఏ పోజిషన్లో ఏమున్నాయో గుర్తు పెట్టుకుని వాళ్లు మళ్లీ చెప్పాలి. ఇలా ట్రయాంగిల్, సబ్ ట్రయాంగిల్లో నంబర్స్‌ను చూపిస్తాం. ఇలా చేయడం వల్ల పిల్లలు చూసింది చూసినట్టు గుర్తుపెట్టుకోవడానికి అవకాశముంటుంది. దీన్ని ఫొటోగ్రాఫిక్ మెమరీ అని కూడా అంటార’ని చెబుతున్నారు ఎంబీఎం ఇన్స్ట్రక్టర్ సపర్ణ. ఇవేకాకుండా మ్యూజిక్, డిస్కషన్స్, ఆలోచనలు పంచుకోవడం వంటివి కూడా నేర్పిస్తారు. కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హబ్సిగూడలో ఎంబీఎం కేంద్రాలున్నాయి. ఈ సెంటర్స్‌లో కేవలం చిన్నపిల్లలకే కాదు.. పదహారేళ్ల నుంచి అరవై ఏళ్లవయసు వారికి కూడా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్, సెల్ఫ్ మోటివేటింగ్, క్రియేటివేట్ ఇంట్రెస్ట్ వంటివి కూడా నేర్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు http://www.midbrainmasterindia.com వెబ్‌సైట్‌ని చూడవచ్చు. -
పశు క్రాంతి
లీటర్లకొద్దీ పాలిచ్చే గేదెలు.. ట్రాక్టర్‌కు తీసిపోకుండా నాగలి దున్నగలిగే దున్నపోతులు.. కళ్లు తిప్పుకోనివ్వని జెర్సీ ఆవుల అందాలు! ఇవన్నీ ఎక్కడో కాదు... నగరం నడిబొడ్డునే. నగరంలోని నార్సింగికి పల్లె కదిలొచ్చింది. పండుగ కళ తెచ్చింది... ప్రతి ఏటా సంక్రాంతి తర్వాతి రెండో శుక్రవారం లంగర్‌హౌస్ సమీపంలోని నార్సింగ్ మార్కెట్ కమిటీలో జరిగే పశువుల సంతలో పండుగ కళ కనబడుతోంది. పంటలు చేతికొచ్చి, డబ్బులు సమకూరాక రైతులు పశువులు కొనడం అనవాయితీగా వస్తోంది. నిజాం కాలం నుంచి కొనసాగుతున్న ఈ అంగడిలో హర్యానాకు చెందిన ముర్రా, మహారాష్ట్రలోని ఘోడేగావ్, గుజరాత్‌లోని ధుళియా, ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా గుజ్జరి గేదెలు, దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈఏడు సంతలో నేపాల్ పశువులు కూడా అడుగిడుతున్నాయి. సెలబ్రిటీలు కూడా తమకిష్టమైన పశువులు కొనుగోలు చేసే ఈ సంతలో ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ముర్రానా మాజాకా... నల్లటి రంగు. భారీ దేహం. చెక్కినట్టుగా మెలితిరిగిన కొమ్ములు, జిగేల్మనిపించే పెద్ద కళ్లు.. ముర్రా జాతి బర్రెలు చూడగానే కట్టిపడేస్తున్నాయి. రోజుకు బకెట్ల కొద్దీ పాలు ఇచ్చే ఈ బర్రెల ధర లక్ష నుంచి రెండు లక్షలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వ్యాపారులు. హర్యానా, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన ఈ పశువులకు డిమాండ్ ఎక్కువ ఉందని హర్యానా వాసి ఉమాశంకర్ చెబుతున్నాడు. ఆవాల నూనె, బెల్లం, చక్కెరలను నీటిలో కలిపి ఈ బర్రెలకు ఇవ్వడం వల్ల కాల్షియం మోతాదు పెరిగి పాలు ఎక్కువగా ఇస్తాయని తెలిపారు. భళా ధుళియా... గుజరాత్ పోరుబందర్ నుంచి తీసుకొచ్చిన ధుళియా జాతి బర్రెలు కూడా ముర్రా, మిన్ని జాతి కంటే ఏమాత్రం తీసిపోవడం లేదు. మంచి దేహ దారుఢ్యం కలిగిన ఈ బర్రెలను జాఫ్రి ధుళియా అని కూడా పిలుస్తుంటారు. ఇవి రోజు పొద్దున, సాయంత్రం కలిసి 20 లీటర్ల పాలు ఇస్తాయని పశువుల విక్రేత డి.నవీన్ కుమార్ తెలిపారు. పత్తి పిండి, కంది పొట్టు, వరిగడ్డి, పచ్చిగడ్డి, గోధుమ, కంది, శనగ పొట్టులను కలిపి ఈ ధుళియాలకు పెడతామంటున్నారు. కరిష్మా కేక... బర్రెలంటే మాకు ప్రాణం. పశువులను దేవతతో సమానంగా చూస్తాం. నాకు నచ్చిన ధుళియా జాతికి చెందిన ఈ బర్రెకు కరిష్మా అని పేరు పెట్టుకున్నా. 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కరిష్మాను అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటున్నారు అబ్దుల్ అజ్మద్. హర్యానా నుంచి తీసుకొచ్చిన జెర్సీ ఆవుల అందాలు కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ‘ఇవి 50వేల వరకు పలకొచ్చు. రోజుకు పది లీటర్ల పాలు ఇస్తాయ’ని రైతు లతికా శర్మ తెలిపారు. - వాంకె శ్రీనివాస్ -
ఆక్రోయోగా
ఉరుకులు, పరుగుల జీవితం... ఆదరాబాదరగా ఆహారం... వెరసి యువతపై తీవ్ర దుష్ర్పభావం చూపుతున్నాయి. ఫలితంగా స్థూలకాయంతో అవస్థలు... రోగాలు సాధారణమైపోయాయి. ఇవి శారీరక, మానసికోల్లాసాన్ని దూరం చేస్తున్నాయి. వీటి నుంచి రక్షించే ఏకైక ప్రత్యామ్నాయం యోగా అంటున్నారు నిపుణులు. దీంతో అందానికి అందం, ఆనందానికి ఆనందం. ఈ క్రమంలో యోగాను మరింత ఆసక్తిగా మార్చి యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయ యోగాకు ఆధునికతను జోడించి... సరికొత్త యోగాను పరిచయం చేస్తున్నారు. అలాంటివే ఆక్రోయోగా, ఇన్ యోగా. జంటగా చేసే ఈ యోగాసనాలపై నగరవాసులు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. శారీరక, మానసికోల్లాసం కోసం యోగా చేయడం సర్వసాధారణం. యువత కోసం సంప్రదాయ యోగాసనాలకు సరికొత్త రూపం కల్పించిన ఆక్రో యోగా రూపుదిద్దుకుంది. పార్ట్నర్ యోగాకు మరికొన్ని సొబగులు అద్దుకొని మనముందుకు వచ్చిందే ఆక్రోయోగా. ఇద్దరు వ్యక్తులు కలసి ఈ యోగాసనాలు చేస్తుంటారు. కింద ఉన్న వ్యక్తిని బేసర్ అని, పైన ఉన్నవారిని ఫ్లయర్ అని, వీరికి అవసరమున్నప్పుడల్లా సహకారమందించే వారిని సపోర్టర్ అని అంటారు. భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్నేహితులు... ఇలా ఏ ఇద్దరైనా కలసి ఈ యోగాసనాలు చేయవచ్చు. ఇలా జంటగా చేసే యోగాసనాలతో ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు సోమాజిగూడలోని ‘ఎనర్జీయర్ యోగా’ వ్యవస్థాపకుడు కమల్ మలిరమణి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలతో నిత్యం తలమునకలై ఒత్తిడికి గురవుతున్న నగరవాసులకు ఈ సరికొత్త యోగా శారీరక ఉపశమనంతో పాటు మానసికోల్లాసాన్ని అందిస్తుందంటున్నారు. అనుబంధాన్ని పెంచేలా... స్నేహితుల మధ్య ఆక్రో యోగా అనుబంధాన్ని పెంచుతోంది. కొన్ని రకాల ఆసనాలు చేయడం చాలా కష్టం. ఒకరికొకరుగా చేసే ఆక్రో యోగాతో శరీరంలోని అవయవాలు తేలిగ్గా కదులుతాయి. కండరాలు పటిష్టం కావడంతోపాటు.. బ్యాలెన్స్డ్గా ఆసనాలు చేయడం వల్ల ఏకాగ్రత, అనుబంధం పెరుగుతోందంటున్నారు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వప్న. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో గడిపి తిరిగి వచ్చాక ఆక్రో యోగా చేయడం వల్ల ఫిట్నెస్తో పాటు ఉల్లాసాన్నిస్తుందంటున్నారు. ఒత్తిడి దూరమై, జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు వీలవుతుందనేది యువత మాట. ఇన్ యోగాకూ క్రేజ్... అమెరికాలో పుట్టి పెరిగిన ఇన్ యోగా ఇప్పుడు సిటీలోనూ జోరందుకుంది. మన హఠ యోగాకు దగ్గరగా ఉండే ఈ యోగాను నేర్చుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఒకరే వివిధ భంగిమల్లో ఆసనాలు వేయడం ద్వారా ఒత్తిడి దూరమవుతుంది. డైనమిక్ మూమెంట్స్ వల్ల శరీరంలోని అన్ని అవయవాలూ చురుగ్గా పనిచేస్తాయి. మంచి శక్తి కూడా వస్తుందని అనహిత యోగా జోన్ వ్యవస్థాపకురాలు ప్రతిభా అగర్వాల్ చెబుతున్నారు. - వాంకె శ్రీనివాస్ -
‘గిటార్’ మ్యూజిక్
భక్తి లేని సంగీతం జ్ఞానం, ముక్తినొసగదని వాగ్గేయకారుడు త్యాగరాజు చెప్పారు. ఇదే సూత్రాన్ని కాస్త మార్చి మానవ సేవకు సంగీతాన్ని ఎంచుకుంటున్నాయి బడా ఆస్పత్రులు. రోగులకు, వారి బంధువులకు వీనుల విందైన సంగీతాన్ని అందిస్తూ వాళ్లను టెన్షన్ ఫ్రీ చేస్తున్నాయి. వైద్యంతో పాటు సరిగమలు వినిపిస్తూ రోగులకు స్వస్తత చేకూరుస్తున్నాయి. గిటార్ మ్యూజిక్ థెరపీ ద్వారా ఆస్పత్రిపాలైన వారికి కాస్తంత రిలీఫ్ అందిస్తున్నాయి. - వాంకె శ్రీనివాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి డబుల్ హ్యాపీని అందించే ‘గిటార్’ మ్యూజిక్.. ఇప్పుడు ఆస్పత్రుల్లో కూడా వినిపిస్తోంది. బడా హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, ప్రత్యేక విందుల్లో మాత్రమే వినిపించే ఈ సాఫ్ట్ మ్యూజిక్.. బాధతో ఆస్పత్రికి వచ్చేవారికి ఉపశమనం కలిగిస్తోంది. రోగులతో పాటు వారి వెంట వచ్చిన వారికి కూడా గిటార్ మ్యూజిక్ వినిపిస్తున్నారు. తమవారికి ఏమవుతుందోనన్న బాధ, టెన్షన్‌ను తగ్గించడానికి గిటార్ ప్లే చేస్తున్నందుకు సంతోషంగా ఉందని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో గిటార్ మ్యుజీషియన్ విజయ్ రాజ్ అంటున్నారు. అందుకే లైవ్ మ్యూజిక్... విదేశాల్లో ఆస్పత్రుల్లో గిటార్ మ్యూజిక్ సాధారణం. కొన్ని ఆస్పత్రుల్లోనైతే రోగుల వద్దకు వెళ్లి వారికి నచ్చిన మ్యూజిక్ వినిపిస్తుంటారు. అదే ట్రెండ్ ఇప్పుడు సిటీలో మొదలైంది. నెలన్నర కిందట అపోలో ఆస్పత్రి గిటార్ ప్లేకు శ్రీకారం చుట్టింది. ‘మొదట్లో లైట్ మ్యూజిక్‌ను స్పీకర్ల ద్వారా వినిపించినా రోగుల వెంట వచ్చినవారి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయకుండా ఎవరి బిజీలో వారు ఉండటం కనిపించింది. దీంతో లైవ్ మ్యూజిక్ వినిపించాలని నిర్ణయించాం. దీని కోసం ‘బ్లూ కీ ప్రొడక్షన్’ మ్యుజీషియన్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. వాళ్లు రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య గిటార్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు’ అని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపించింది. మ్యుజీషియన్ కళ్లెదుటే గిటార్ ప్లే చేస్తుండటంతో అందరూ ఆసక్తిగా వింటున్నారు. మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్‌తో.. ఒత్తిడిలో ఉన్న వారి మూడ్‌ను మారుస్తూ బాధతో భారంగా ఉన్న హృదయాలను తేలికపరుస్తున్నారు. -
నను బ్రోవమని..
రామ వీరేశ్‌బాబు cel: 98496 89896 email: Veeresh_blue@yahoo.com లేన్స్ & లైఫ్ జనజాతరలో ప్రతి నిమిషం భక్తజయధ్వానాలు వినిపిస్తాయి. జాతరలోని జానపదాన్ని కెమెరాలో బంధిస్తే ఆ ఫ్రేమ్ నిర్మలమైన భక్తికి నిర్వచనంలా నిలుస్తుంది. ఈ సత్యం తెలిసిన ఫొటోగ్రాఫర్ రామ వీరేశ్‌బాబు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్‌పై ఉన్న ఆయన ఆసక్తి పెద్దయ్యేసరికి లెన్స్ వైపు మళ్లింది. డాక్యుమెంటరీల కోసం ఆయన పట్టిన కెమెరా తెలంగాణకు తలమానికమైన మేడారం, ఐనవోలు జాతరలను అన్ని కోణాల్లో స్పృశించింది. తపాలా శాఖలో ఉద్యోగం వచ్చినా ఆ హాబీని మాత్రం వీడలేదు. ఐనవోలు జాతరలో సంతానం కోసం జంగమదేవుడికి ఓ భక్తురాలు వరం పడుతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఆ ఛాయా చిత్రం గురించే ఈవారం లెన్స్ అండ్ లైఫ్. పుట్టి పెరిగింది వరంగల్. ప్రాథమిక, ఉన్నత, ఇంటర్, డిగ్రీ చదువు అంతా అక్కడే. చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడమంటే ఆసక్తి. అలా ఎన్నో గ్రామీణ చిత్రాలు, జాతర దృశ్యాలను కాన్వాస్‌పై ప్రతిష్ఠించాను. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్‌భూషణ్‌తో పరిచయం నన్ను కెమెరా వైపు మళ్లించింది. 1977 నుంచే ఫొటోలు తీస్తున్నా. 1980లో వరంగల్‌లోనే తపాలా శాఖలో ఉద్యోగం వచ్చింది. అయినా నా ప్రవృత్తిని విడిచిపెట్టలేదు. 1987 నుంచి ఫొటోగ్రఫీని సీరియస్‌గా తీసుకున్నాను. డాక్యుమెంటరీల కోసం ఎన్నో జాతరలకు వెళ్లి ఫొటోలు తీశాను. లంబాడాల జీవన విధానాన్ని కెమెరా నేత్రంతో చూశాను. ఉద్యోగం పనిపై తరచూ హైదరాబాద్ వస్తుండేవాణ్ని. సిటీలో పాత గడియారాలు, చెట్లను పూజించే విధానం, వాటిని పెంచే తీరుపై లెక్కలేనన్ని ఫొటోలు తీశా. ఇదే సమయంలో ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డెరైక్టర్ సి.పటేల్‌తో పరిచయం నా జీవితంలో గొప్ప మలుపు. ఒక్కో సబ్జెక్ట్‌ను ఎంచుకుని ఫొటోలు తీయమని ఆయన సూచించారు. 2003లో మధురైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో మేడారం జాతర ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాను. మంచి స్పందన వచ్చింది. వివిధ నగరాల్లో పలు షోలు నిర్వహించాను. హైదరాబాద్ గడియారాల ఫొటోలకు ఇంగ్లండ్‌లోని అసోసియేషన్షిప్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వాళ్ల గుర్తింపు లభించింది. ఇవీ బెస్ట్... సుమారు 25 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలోని ఐనవోలు జాతరకు వెళ్లా. ఎటు చూసినా జనమే. ఈ జాతరలో పిల్లల కోసం వరం పట్టడం సంప్రదాయంగా కనబడుతుంది. ఓ మహిళ స్నానం చేసి తడిదుస్తులతోనే పరమశివుడి పటం దగ్గరకు వచ్చి వరం పడుతున్న దృశ్యాన్ని వెంటనే లెన్స్‌లో బంధించా. ఆ ఫొటోకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. నేను తీసిన ఎన్నో మంచి ఫొటోల్లో ఇదీ ఒకటి. టెక్నికల్ యాంగిల్... నేను కెనాన్ ఏవన్ కెమెరా వాడా. నా లెన్స్‌లో క్లిక్ అయిన దాదాపు 80 శాతం ఫొటోలకు ఈ కెమెరానే వాడా. గతంలో జరిగిన జాతరలకు, ఇప్పుడు జరుగుతున్న జాతరలకు చాలా తేడాలు వస్తున్నాయి. అప్పుడు నేను తీసిన డాక్యుమెంటరీలు భవిష్యత్ వాళ్లు గతంలో జాతర ఇలా జరిగేదే అని తెలుసుకునేందుకు చక్కగా ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్ -
మాతృ మయూరి..
మాది మచిలీపట్నం. చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై ఆసక్తి. 1967 నుంచి అమ్మ కొనిచ్చిన యాషిక టీఎల్పీ కెమెరాతో ఫొటోలు తీసేవాడిని. 1968లో మచిలీపట్నంలోని హిందూ కాలేజీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కందుబాయీ కసాంజీ దేశాయి వచ్చారు. ఏడో తరగతి చదువుతున్న నేను అప్పుడా దృశ్యాన్ని కెమెరాలో బంధించా. పల్లె అందాలను నా కెమెరా నేత్రంతో చూసేవాణ్ని. 1974లో జేఎన్టీయూ నుంచి డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ సర్టిఫికెట్ అందుకున్నాను. ఏటా వనవాసం.. 1980 నుంచి నా మనసు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై మళ్లింది. ఏటా రాజస్థాన్‌లోని భరత్‌పుర అడవుల్లోకి వెళ్లేవాణ్ని. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఫొటోగ్రఫీ మీద నాకున్న ఆసక్తి వాటిని అధిగమించేలా చేసింది. రాజస్థాన్‌లోని రన్థమ్బోర్ అడవులు, కర్ణాటకలోని బండిపూర్ అడవుల్లో కలియ తిరిగాను. రన్థమ్బోర్ అడవిలో తీసిన చిరుత ఫొటోకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఎర్రగడ్డలోని మెడికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే ఏడాదిలో కొన్ని రోజులు అడవుల బాట పట్టేవాణ్ని. మరిచిపోలేని క్లిక్.. 1980 అక్టోబర్ లో రాజస్థాన్‌లోని భరత్‌పుర అడవులకు వెళ్లా. ఒకరోజు తోటి మిత్రులతో కలసి మధ్యాహ్నం లంచ్ చేసి ముందుకు కదిలాను. కొంత దూరం వెళ్లాక పిల్ల నెమళ్లతో ఉన్న నెమలి కనిపించింది. ముందుగా నీటి కాలువ. తన పిల్లలు నీటిలో కొట్టుకుపోతాయేమోనని కాలువ దాటకుండా నెమలి బిక్కముఖంతో దిక్కులు చూస్తోంది. ఆ దృశ్యం కంటపడగానే.. నేను బ్యాగ్‌లో నుంచి కెమెరా బయటకు తీశాను. రెప్పపాటు వ్యవధిలో ఆ నెమలిని, పిల్లల కదలికలను నా కెమెరాలో బంధించా. నేను తీసిన ఫొటోల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్స్ అని చెప్తాను. టెక్నికల్ యాంగిల్... వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే జంతువు హావభావాలే కాదు.. చుట్టూ ఉన్న ప్రకృతి ప్రతిబింబించాలి. ఫొటోగ్రఫీపై పట్టు, వైల్డ్‌లైఫ్ మీద ఆసక్తి ఉన్నప్పుడే ఇందులో రాణించగలం. ఫొటోలు తీసేందుకు నికోన్ ఎఫ్ఈ 300 ఎంఎం టెలిఫొటో వాడాను. ఫిక్స్డ్ లెన్స్ 300 ఎంఎం, 400 ఎంఎం వాడేది. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పూర్తిగా నేచురల్ లైటింగ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్ -
తాధిమి తకధిమి తోలుబొమ్మ..
తోలుబొమ్మలాట చూడటానికి తమాషాగా ఉంటుంది. తాతల నాడు నాలుగు దిక్కుల నడిమి సంతలో ఆడిపాడిన ఈ జానపద కళారూపం.. మళ్లీ పట్నంలో తైతక్కలాడుతోంది. మరమనుషులు ముస్తాబవుతున్న ఈ రోజుల్లో.. మళ్లీ తెరమీదకు వస్తున్నాయి తోలుబొమ్మలు. సాంకేతికత కలబోసుకున్న సినిమాలు ఇవ్వని సందేశాన్ని.. కళాత్మక తోలు బొమ్మలాట అందిస్తోంది.. ఆలోచింపచేస్తోంది. సినిమాలు, పబ్‌లు, మ్యూజిక్ నైట్స్.. ఆటవిడుపనుకునే సిటీవాసులకు అసలైన వినోదాన్ని అందిస్తున్నాయిపప్పెట్ షోలు. నీతి కథలు, కుటుంబంతో వ్యవహరించాల్సిన తీరు, సామాజిక సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి.. ఇలా అనేక సందేశాత్మక ప్రదర్శనలతో అదరహో అనిపించుకుంటున్నాయి. సలామ్ పప్పెట్స్.. పప్పెట్ షోస్‌కు సిటీ సలామ్ చేస్తోంది. పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు చదువు ప్రాముఖ్యాన్ని తెలిపేలా ‘తోలు బొమ్మలాట’ ద్వారా అవగాహన కల్పించే ట్రెండ్ ఈ మధ్యే సిటీలో మొదలైంది. వినోదం, సాంకేతికత, హాస్యం, నృత్యం, సందేశం.. ఇలా అన్నీ కలగలసిన ఈ కళ ద్వారా శ్రోతలకు సరైన ఆనందంతో పాటు మానసిక వికాసానికీ దోహదం చేస్తుంది. లెదర్ షాడో పప్పెట్, రాడ్ పప్పెట్, స్ట్రింగ్ పప్పెట్, హ్యాండ్ పప్పెట్ వంటి షోలు పాతతరం ట్రెండ్‌కు కొత్త సొబగులు అద్దుతున్నాయి. ఇంకా ప్రోత్సాహం కావాలి... ‘పప్పెట్ షోలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. అందరూ నయా టెక్నాలజీ వైపే పరుగులు తీస్తుండటంతో వీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియడం లేదు. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపై ఉంద’ని అంటున్నారు నోరీ ఆర్ట్ అండ్ పప్పెట్రీ సెంటర్ (ఎన్‌ఏపీసీ) వ్యవస్థాపకురాలు రత్నమాల నోరీ. ద లేడీ ఇన్ ద మిర్రర్.. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో శనివారం ఏఆర్డీఎస్ఐ హైదరాబాద్ డెక్కన్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ‘ద లేడీ ఇన్ ద మిర్రర్’ పప్పెట్ షో ఆద్యంతం హాస్యభరితంగా సాగింది. కథాంశంలోకి వెళ్తే అల్జీమర్స్ (మతిమరుపు) ఉండే ఓ పెద్దావిడ ఇంటికి పెళ్లి ఆహ్వానం అందుతుంది. ఆమెకు అద్దం ముందు నిలబడి మాట్లాడే అలవాటు ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎలాగైనా ఆమెని పెళ్లికి తీసుకురావాలని అనుకుంటారు. అప్పటి నుంచి ఆ పెద్దావిడ తనకింకా పెళ్లికాలేదని, ఆ పెళ్లి తనకేనని అనుకుంటుంది. ఆ గ్రాండ్‌మాను కుటుంబసభ్యులు ఎదుర్కొన్న తీరును కళ్ల ముందుంచింది ఈ షో. అల్జీమర్‌తో బాధపడుతున్న వారిని ప్రేమగా చూసుకోవాలన్న సందేశాన్ని ఇలా కళాత్మకంగా వివరించారు. ..:: వాంకె శ్రీనివాస్ -
మడ్ రన్
రోడ్లపై పరుగు, కొలనుల్లో ఈత.. ఎప్పుడూ ఉండేదే. కాస్త కొత్తగా, ఇంకాస్త విభిన్నంగా.. అదీ వీకెండ్‌ల్లో అయితే.. ఆ మజానే వేరు. అటు స్విమ్మింగ్‌ను తలపిస్తూ, ఇటు పరుగును మరిపిస్తూ.. చిన్నప్పడు పాకిన రోజులను గుర్తు చేసుకుంటూ.. అబ్బో అబ్బో.. వింటుంటేనే భలేగా ఉంది కదూ..! ఇక చూస్తే... పార్టిసిపేట్ చేస్తే.. వారానికి సరిపడా రీఫ్రెష్.. ఎప్పటికీ మరిచిపోలేని థ్రిల్! నగరవాసులకు ఇలాంటి వినూత్న అనుభూతిని అందించింది ‘గ్రేటర్ హైదరాబాద్ ఎడ్వంచర్ క్లబ్’. పటాన్చెరు లహరి రిసార్ట్స్‌లో ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన ‘మడ్ రన్’ను సీనియర్ సిటిజన్స్ నుంచి బుడతల వరకు తెగ ఎంజాయ్ చేశారు. సిటీజనులే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారు కూడా బురదలో మునిగి తేలారు. బురదతో నిండిన రెండు కిలోమీటర్ల ట్రాక్‌లో నీటి గుంతలు దాటి.. సొరంగాలు చేధించి.. గోడలు దూకేసి.. వంతెనలు ఎక్కేసి.. పాకేసి... ఎన్నెన్నో చిత్ర విచిత్రాలతో కుటుంబ సమేతంగా ఆస్వాదించేసి అలసిపోయారు. టార్జన్ స్వింగ్, బెల్లీ క్రాల్, కమెండో నెట్, రోప్, టైర్ ఫీల్డ్ వంటి పాతికకు పైగా అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యం వైపు దూసుకుపోయారు. పతకాలు, ప్రశంశాపత్రాలు అందుకున్నారు. ఆ మజానే వేరు.. ‘బురదలో పడుతూ లేస్తూ పరుగులు. ఒళ్లంతా బురదే. ఏదేమైనా రొటీన్‌కు భిన్నంగా తెగ ఎంజాయ్ చేశాం’ అంటున్నారు అమెరికాకు చెందిన టబోలోవ్, మారియా. వాంకె శ్రీనివాస్ -
పవర్ ఆఫ్ యూత్
చదువు ఇచ్చిన మేధస్సు పదిమందికీ పంచితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. సాయుపడే గుణం విద్యార్థి దశలోనే మొగ్గ తొడిగితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. జేబీ గ్రూప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బీటెక్ సెకండ్ ఇయుర్ విద్యార్థులు ఇదే బాటలో నడుస్తున్నారు. రెండేళ్లుగా ‘మై షెల్టర్ ఫౌండేషన్ ఇండియా’ సంస్థ తరఫున వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. మురికివాడల్లోని జనాలకు వెలుగు ప్రసాదించే కాంతిపుంజాన్ని అందిస్తున్నారు. కరెంట్ కోతలు.. బిల్లుల వాతలు.. లేకుండా డే లైట్, నైట్ లైట్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడితో తమ పనైపోయిందని అనుకోకుండా.. వాటి మెయింటనెన్స్, రిపేర్లపై కూడా పేదలకు అవగాహన కల్పిస్తూ.. యూత్ పవర్ ఏంటో చూపిస్తున్నారు. - వాంకె శ్రీనివాస్ ఇంజనీరింగ్ విద్యార్థులనగానే.. న్యూ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటారంతా. వుంచి ఫ్యూచర్ కోసం వురికొందరు పుస్తకాలతోనే నాలుగేళ్లు గడిపేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విద్యార్థులు వూత్రం వీరికి భిన్నం. కాలేజి ఏజ్‌లో, టీనేజ్ మోజులో పడిపోకుండా కెరీర్‌ను నిర్మించుకుంటూనే సేవా కార్యక్రవూలు నిర్వహిస్తున్నారు. మురికివాడల్లోని పేదల గుడిసెల్లో డే లైట్ అండ్ నైట్ లైట్ తో వెలుగులు నింపుతున్నారు. అలా మొదలు ‘ఇంటర్లో ఉండగా డే లైట్, నైట్ లైట్ కాన్సెప్ట్‌పై ‘మై షెల్టర్ ఫౌండేషన్ ఇండియా’ సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్ నన్నెంతో ఇన్స్పైర్ చేసింది. ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత.. ఆ ఆలోచనను నా స్నేహితులతో పంచుకున్నాను. వారికీ నచ్చింది. అలా వూ కాలేజీ నుంచి 30 వుందిమి ఒక టీమ్‌గా తయూరయ్యూం. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌లో డే లైట్ వినియోగించుకుంటున్న ప్రాంతాలను చూశాం. తర్వాత మేవుంతా కలసి ఎస్.ఆర్.నగర్‌లోని ఓ మురికివాడలో ఈ పనికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు సికింద్రాబాద్ సమీపంలోని వుడ్‌ఫోర్డ్ వుురికివాడలో వర్క్ చేస్తున్నాం’ అంటూ వాళ్ల టీం స్పిరిట్ వునవుుందుంచారు టీం మెంబర్స్ ప్రదీప్, ప్రీతమ్. మేడ్ ఎడ్యుకేట్.. తాము చేపట్టిన కార్యాన్ని మెరుగుపరిచే ఆలోచన ఈ మిత్రబృందానికి కలిగింది. లైట్లు బిగించడమే కాదు, వీటిని ఎలా తయూరు చేయూలి.. ఎలా బిగించాలనే దానిపై ప్రజలకు వివరించాలని నిర్ణరుుంచుకున్నారు. డే లైట్, నైట్ లైట్ తయూరీపై ప్రెజెంటేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వుురికి వాడల్లోని ప్రజలకే కాదు.. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఈ డే లైట్ తయూరీపై అవగాహన కల్పిస్తున్నారు. ముంబై ఐఐటీ విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించారు. వారితో కలసి వుుంబైలోని ధారవి మురికివాడలో డే లైట్లను ఏర్పాటు చేశారు. తయూరీ ఇలా.. ప్లెయిన్ వాటర్ బాటిల్. గాల్వానో షీట్, సికాగ్లూ గమ్ అవసరం. మొదట గాల్వానో షీట్ తీసుకొని బాటిల్ చుట్టు కొలతకు సరిపడా కత్తిరించాలి. దానిని బాటిల్ నాలుగో వంతు దగ్గర ఏర్పాటు చేయూలి. సికాగ్లూ గమ్ తీసుకుని బాటిల్‌కు, గాల్వానో షీట్‌కు మధ్య పూయాలి. అప్పుడు అది గట్టిపడుతుంది. ఆ తర్వాత వాటర్ బాటిల్లో నీళ్లు పోయాలి. వాటర్‌లో ఫంగస్ రాకుండా అందులో చిటికెడు బ్లీచింగ్ పౌడర్ కలపాలి. ఇలా గుడిసె పైభాగంలో బాటిల్ సెట్ అయ్యేలా రంధ్రం చేసి.. అందులో బాటిల్ ఉంచి సికాగ్లూ గమ్ పూయూలి. ఇలా అవుర్చిన బాటిల్‌పై సూర్యకిరణాలు పడితే.. బాటిల్ గుండా గుడిసెలోనికి వెలుగు ప్రసరిస్తుంది. సూర్యాస్తవుయుం వరకు వూత్రమే డే లైట్ వెలుతురు ఉంటుంది. ఇక నైట్ లైట్ విషయానికొస్తే డే లైట్ మాదిరిగానే తయారుచేసి వాటర్ బాటిల్ మూత భాగంలో చిన్న బల్బును అమరుస్తారు. దానిపైన సోలార్ సెట్‌ను అమరుస్తారు. సౌరశక్తితో చార్జింగ్ అయిన బ్యాటరీ ద్వారా రాత్రి పూట కూడా వెలుతురు ఉంటుంది. ఖర్చు తక్కువ.. వెలుతురు ఎక్కువ లైట్ల ఏర్పాటుకు వందల్లోనే ఖర్చవుతుందని చెబుతున్నారు ఆ విద్యార్థులు. అవి కూడా తామే భరిస్తూ మురికివాడల్లో వెలుగులు నింపుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొస్తే.. తవు సేవలు వురిన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తాం అంటున్నారు ఈ యువకులు. మాతో పంచుకోండి సావూజిక బాధ్యతను విద్యార్థి దశలోనే స్వాగతించిన వారికిదే వూ ఆహ్వానం. మీ సృజన తోటివారికి సాయుపడితే అది పది వుందికి తెలియూలి. మీ సేవాభావం వురెందరికో స్ఫూర్తికావాలి. మీ సావూజిక స్పృహ భావితరాలకు ఆదర్శం అవుతుంది. మీరు చేపట్టిన సావూజిక కార్యక్రవూల వివరాలు వూకు పంపించండి. మెయిల్ టు sakshicityplus@gmail.com -
బూతుల పండుగ భలే ఇష్టం
జ్ఞాపకం చింతలతోపు భయంతో బడికి వెళ్లాలంటే గాభరా.. కాముని దహనం నాడు కోపమున్నవాళ్లను ఇష్టంగా తిట్టడం.. నూర్మహల్ థియేటర్‌కు వచ్చిన సినిమాను వదలకుండా చూడటం.. వీహెచ్‌తో గొడవ, స్నేహితులతో కలిసి ఆట.. బతుకమ్మ పూలకోసం వేట.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భూపాల్‌రెడ్డికి నగరం మిగిల్చిన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. నేను పుట్టి పెరిగింది అంబర్‌పేటలోనే. 1963 సంవత్సరం.. అప్పటికి నాకు పదేళ్లనుకుంటా. స్నేహితులతో కలిసి కాముడి దహనంలో పాల్గొనేది. అందరం కలిసి తీసుకొచ్చిన కట్టెలను ఒకచోట పోగేసి కాముడికి నిప్పు పెట్టి దహనం చేసేవాళ్లం. ఆ రోజును కాముడి దహనం అనే కంటే బూతుల పండుగ అంటే సరిగ్గా నప్పుతుంది. ఆ రోజు ఎవరినైనా నోటికి వచ్చిన బూతులు తిట్టేవాళ్లం. మస్తు మజాగా అనిపించేది. నేనైతే నాకు పడని వాళ్లను ఇష్టమొచ్చినట్టు తిట్టడాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకుంటాను. అంబర్‌పేట ప్లే గ్రౌండ్, చిన్తోట, గుంటంలో చార్పత్తార్, ఫుట్‌బాల్, కింగ్ ఆట, లోన్పాట, తుండుం ఆట, క్రికెట్, గిల్లిదండ చిన్ననాటి మిత్రులతో కలిసి ఆడటం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిది. మూసీ కట్టను ఆనుకొని ఉన్న నూర్మహల్ థియేటర్‌కు వచ్చిన ప్రతి సినిమాను చూసేవాణ్ని. భయపడేవాడిని అబిడ్స్‌లోని చాదర్‌ఘాట్ హైస్కూల్లో చదువు. రోజూ సైకిల్ మీదచింతలతోపు (ప్రస్తుత చిక్కడపల్లి) ప్రాంతం దాటి వెళ్లాలి. మొత్తం బురద. చింతచెట్లు ఎక్కువగా ఉండేవి. ఆ మార్గం నుంచి అబిడ్స్‌కు వెళ్లాలంటే చాలా భయమనిపించేది. ఇప్పుడు ఎంత వెదికినా చెట్లు కనవడవు. మరిచిపోలేనిదిఅంబర్పేటలోని నెహ్రూ పాల్టెక్నిక్ కళాశాలను ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వచ్చారు. ఆయనను దగ్గర నుంచి చూసి సంబరపడ్డా.అదో మరిచిపోలేని జ్ఞాపకం. మా నాన్న రామిరెడ్డి అవినీతి నిరోధక విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. అప్పట్లో వారు వ్యవహరించే తీరు. ఇప్పటితో పోల్చలేం.రూ.650కే పెళ్లి వంటసరుకులు1963 సంవత్సరంలో మా సోదరి పెళ్లి నిశ్చయమైంది. అప్పుడు ఇసామియా బజార్‌లోని ఓ కొట్టులో పెళ్లి వంటసామగ్రి తీసుకొన్నాం. వెయ్యి మంది వంటకు కావాల్సిన సామగ్రి 650 రూపాయలకే వచ్చాయి. బతుకమ్మ మస్తు అనిపించేది ఎంగిలిపువ్వు నుంచి సద్దుల బతుకమ్మ వరకు వేడుకలు ఘనంగా జరిగేవి. బతుకమ్మను తయారు చేసేందుకు పూలు తెచ్చేందుకు స్నేహితులతో కలిసి అంబర్‌పేటలో ఉన్న మూసీనది కట్ట మీదకు వెళ్లేవాడిని. తీగమల్లె, మల్లెపూలు, ఇప్పపువ్వు, కాడ పువ్వు, గుణుగు, తంగేడు పూలను కోసేవాళ్లం. అంబర్‌పేటలో మా బతుకమ్మే పెద్దదిగా ఉండాలని అందరికన్నా ఎక్కువపూలు తెచ్చేది నేను. వీటికి తోడు ఇంట్లో విరబూసిన బంతి పువ్వులు ఉండేవి. తెచ్చిన పువ్వులకు రంగు వేసి ఆకర్షణీయంగా తయారు చేసేది అమ్మ. బతుకమ్మకుంట మాయమైంది బతుకమ్మ పాటలు వింటుంటే తెలంగాణ సంస్కృతి కళ్లకు కట్టేది. పాటలు పాడేందుకు ఆడవాళ్లు పోటీపడేవారు. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలను కుంటలో నిమజ్జనం చేసేందుకు స్నేహితులతో పోటీ పడేవాడిని. అందరి కన్నా ఎక్కువ లోతులోకి తీసుకెళ్లి మా బతుకమ్మను నిమజ్జనం చేసిన రోజులు ఇప్పటికీ మదిలో మెదులుతుంటాయి. మూసీ పరీవాహక ప్రాంతాలు కబ్జా అయ్యాయి. బతుకమ్మ కుంట మాయమైపోయింది. ఎటు చూసినా కాంక్రీట్ భవనాలే! ..:: వాంకె శ్రీనివాస్ వీహెచ్‌తో గొడవ.. అంబర్‌పేటలోని హనుమాన్ వీధిలో మేం ఉండేవాళ్లం. 1975 సంవత్సరం అనుకుంటా. ఆ పక్క గల్లీలోనే జననాట్యమండలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడే వీహెచ్ కూడా హనుమాన్ వీధిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మా కార్యక్రమంలో గద్దర్‌తో పాటు జననాట్య మండలి సభ్యులు, జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. కాంగ్రెస్ సభకు అప్పటి ఆరోగ్యమంత్రి రాచమల్లు హాజరయ్యారు. అయితే వాళ్లు ఆశించిన స్థాయిలో ప్రజలు పోలే దు. దీంతో వీహెచ్ కోపంతో నాతో గొడవకు దిగారు. అయినా నేనేమీ బెదరలేదు.