vedire Sriram
-
మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్‌దే!
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ బరాజ్ నిర్మించాలన్న ఆలోచన నాటి సీఎం కేసీఆర్‌దేనని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) లేఖ ఇవ్వడం, మహారాష్ట్రతో ముంపుపై వివా దం ఏర్పడడంతోనే మేడిగడ్డకు మార్చామని కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఎన్నో లేఖలు రాసిందని, సంప్రదింపులతో మహారాష్ట్రతో ముంపు సమస్యను పరిష్కారానికి అవకాశం ఉండేదన్నారు. రాజకీయ, ‘ఇతర’కారణాలతోనే మేడిగడ్డ బరాజ్ నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు వెదిరె శ్రీరామ్ హాజరై సమాధానాలిచ్చారు. వ్యక్తిగత హోదాలోనే సాక్ష్యం... వ్యక్తిగత హోదాలోనే కమిషన్ ముందు సాక్షిగా హాజరైనట్టు వెదిరే శ్రీరామ్ స్పష్టత ఇచ్చారు. కాళేశ్వ రం ప్రాజెక్టుకు అనుమతుల కోరుతూ సీడబ్ల్యూసీకి నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ రాసిన లేఖను సాక్ష్యంగా ఆయన గతంలో కమిషన్‌కు సమరి్పంచగా, ఆ లేఖలో వ్యత్యాసాలున్నట్టు కమిషన్ ఎత్తిచూపింది. ఈ లేఖను తాను సీడబ్ల్యూసీ నుంచే స్వీకరించానని, సీడీఓ సీఈ లేఖను మార్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అధికారికంగా తీసుకోనందున వాటిని సాక్ష్యంగా పరిగణించబోమని కమిషన్ తేల్చి చెప్పింది. అన్నారం, సుందిళ్ల కుంగిపోవచ్చు.. మేడిగడ్డ బరాజ్ తరహాలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లూ కుంగిపోవచ్చని వెదిరె శ్రీరామ్ అన్నారు. బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటని కమిషన్ ప్రశ్నించగా, సరైన ఇన్వెస్టిగేషన్లు జరపకుండానే డిజైన్ల రూపకల్పన, డిజైన్లు, మాడల్ స్టడీస్‌కు విరుద్ధంగా నిర్మాణం, నిర్వహణ జరగడమేనన్నారు. ప్లాన్ తయారీకి ముందే పనులు ప్రారంభించారా అని కమిషన్ అడగ్గా, అవునని బదులిచ్చారు. 2016 ఏప్రిల్/మేలో బరాజ్‌లు నిర్మించాలని నిర్ణయించి 2019లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అత్యాశే అన్నారు.డీపీఆర్ తయారీకి ఏడాది అవసరం కాగా, 4 నెలల్లోనే పూర్తి చేయాలని వ్యాప్కోస్ను కోరారన్నారు. డీపీఆర్‌కు ఆమోదం లభించకముందే టెండర్లు పిలిచి పనులు అప్పగించారని, నాటికి ఇంకా డిజైన్లు సైతం సిద్ధం కాలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను మార్చడంతో అప్పటికే నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లు వృథా అయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఆమోదించిందా అని కమిషన్ అడగగా, లేదని బదులిచ్చారు. తొందరపాటుతో క్షేత్రస్థాయిలోని ఈఈ నుంచి ఈఎన్సీ వరకు అందరూ తప్పిదాలు చేశారన్నారు. నిర్వహణ విభాగం ఈఎన్సీ జాప్యం చేశారు బరాజ్‌లలో సీపేజీతో నీరు లీకైనప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సలహా కోరడంలో నిర్వహణ విభాగం ఈఎన్సీ(నాగేంద్రరావు) జాప్యం చేయడంతో నష్టం తీవ్రత పెరిగిందా అని కమిషన్ ప్రశ్నించగా, అవునని వెదిరె బదులిచ్చారు. బరాజ్ కుంగే వరకు ఎన్డీఎస్ఏకు సమాచారం లేదని, కుంగిన 5 రోజులకు ఎన్డీఎస్ఏ బృందం పరిశీలనకు వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ 20 రకాల సమాచారం కోరితే సకాలంలో ఆ ఈఎన్సీ ఇవ్వలేదని, దీంతో బరాజ్‌ల వైఫల్యానికి కారణాలను గుర్తించడం ఎన్డీఎస్ఏకి క్లిష్టంగా మారిందన్నారు. మళ్లీ గడువు పొడిగించలేం ..కోదండరామ్‌కు కమిషన్ స్పష్టీకరణ మీరు సమరి్పంచిన పత్రాలకు ఆధారాలు ఏమిటని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్‌ను కమిషన్ ప్రశ్నించగా, మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించి మీకు అవకాశం ఇచ్చామని, మళ్లీ పొడిగించడం సాధ్యం కాదని కమిషన్ స్పష్టం చేసింది. అఫిడవిట్‌పై చేసిన సంతకం మీదేనా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని కోదండరామ్ ధ్రువీకరించారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన వికాస్‌రాజ్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిలేదని తెలపడంతో ఆయనకు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. -
మేడిగడ్డలో సాక్ష్యాధారాలు ధ్వంసం!
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి వరుస క్రమంలో నిర్వ హించాల్సిన పరీక్షలపై నిపుణుల కమిటీ చేసిన సి ఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చే యకుండా నీరుగార్చింది..’అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ శాఖ నిర్వాకంతో బరాజ్‌లు దెబ్బతినడానికి దారితీసిన కారణాల విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి..’అని తెలిపింది. నీటిపారుదల శాఖ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరో సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆ శాఖ నిర్వహించిన మరమ్మతులు.. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి..’అని పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) గత నెల 11న ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ సల హాదారు వెదిరే శ్రీరామ్ బుధవారం కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ లేఖను మీడియాకు విడుదల చేశారు. బుంగల పూడ్చివేతతో స్థితిగతుల్లో మార్పులు ‘మేడిగడ్డ బరాజ్ ప్లింత్ శ్లాబుకి ఎగువ, దిగువన గ్రౌటింగ్ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చి వేయడంతో సికెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్స్ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బరాజ్ కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, స్థితిగతుల్లో మార్పులతో ఆ అవకాశం లేకుండా పోయింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బరాజ్‌లలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది. బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బరాజ్‌లలో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించక పోవడాన్ని ఎన్డీఎస్ఏ తప్పుబట్టింది. ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా..‘అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సికెంట్ పైల్స్ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కరై్టన్ గ్రౌటింగ్ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారు. పునాదుల (ర్యాఫ్ట్‌లు) కింద బుంగలను పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్‌కు ముందే జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అలా చేయలేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఎస్ఏ కమిటీకి అవసరమైన వాస్తవ సమాచారం లభించదు. దీనివల్ల ఎన్డీఎస్ఏ కమిటీ పని ప్రణాళికకు విఘాతం కలిగింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ తాజాగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన పరీక్షలను సిఫారసు చేసింది. 160 టీఎంసీల లభ్యత లేదనడం అవాస్తవం: వెదిరే శ్రీరామ్ ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 డిపెండబిలిటీ ఆధారంగా 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించిందని వెదిరే శ్రీరామ్ చెప్పారు. నీటి లభ్యత లేదని చెప్పి ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను చేపట్టారని విమర్శించారు. వ్యాస్కోస్ వ్యాపార సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి రూ.32 వేల కోట్లతో మొత్తం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 16.4 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుండగా, కేవలం రూ.2 లక్షల అదనపు ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ప్రస్తుతం దీని అంచనాలు రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకాయన్నారు. -
ప్రాణహిత–చేవెళ్లను పక్కనపెట్టడం పెద్ద తప్పిదం!
సాక్షి, హైదరాబాద్: కొందరి నిర్దిష్ట ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ స్థలం ఎంపిక పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. చిన్న కారణాలు చూపి ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని పక్కనపెట్టి.. దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను ఆమోదించినది కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) అని, దీనికి కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంగళవారం వెదిరె శ్రీరామ్ కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణం, లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన ఫిర్యాదుకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం వెదిరె శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని రీడిజైన్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం వెనుక ఎన్నో తప్పులు ఉన్నాయని ఆరోపించారు.సీడబ్ల్యూసీ నీటి లభ్యత ఉందనే చెప్పింది!గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని నాలుగు కారణా లతో పక్కనపెట్టిందని.. అక్కడ నీటి లభ్యత లేదన డం అందులో ఒకటని వెదిరె శ్రీరామ్ చెప్పారు. కానీ 75 శాతం లభ్యత (డిపెండబిలిటీ/నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లు వచ్చే వరద) ఆధారంగా 165 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని సీడబ్ల్యూసీ పేర్కొందని తెలిపారు. ఇక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రిజర్వాయర్ల సంఖ్యను పెంచాల ని సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిందని గత ప్రభుత్వం మరో కారణంగా చూపిందని.. కానీ ప్రాణహిత– చేవెళ్ల పథకం కింద కూడా అలా కట్టేందుకు అవకా శం ఉండేదని వివరించారు. దీనికితోడు తుమ్మిడి హెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 3,600 ఎక రాల ముంపు ఉంటుందని, ఆ రాష్ట్రం ఒప్పుకోదని మూడో కారణంగా చూపారన్నారు. అయితే ఎప్పుడైనా భారీ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య ఉంటుందని.. సేకరించాలనే తపన ఉంటే మహా రాష్ట్రలో 3 వేల ఎకరాలు సేకరించడం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు కోసం 2015 సంవత్సరం నాటికి రూ.11,917 కోట్లు ఖర్చ య్యాయని.. ఆ దశలో ప్రాజెక్టును పక్కనపెట్టడం సహేతుకం కాదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి ఉంటే గ్రావిటీతో నీరు అందేదని.. అదే మేడిగడ్డ వద్ద కట్టడంతో ఏటా నీటి పంపింగ్కే రూ.11 వేల కోట్ల అనవసర వ్యయం అవుతుందని వివరించారు.బ్యారేజీల వద్ద పరీక్షల వివరాలు రావాలి..కాళేశ్వరం బరాజ్ వైఫల్యాలపై గత ఏడాది నవంబర్‌లో ఒక నివేదిక, తర్వాత మేలో మరో నివేదికను ఎన్డీఎస్ఏ ఇచ్చిందని వెదిరె శ్రీరామ్ చెప్పారు. బరాజ్‌ల వద్ద జియో టెక్నికల్, జియో ఫిజికల్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరీక్షలు పూర్తి చేసి, వివరాలను ఎన్డీఎస్ఏకు నివేదిస్తే.. ఎన్డీఎస్ఏ బరాజ్‌ల పరిస్థితి, భవిష్యత్తు చర్యలపై తుది నివేదికను అందించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.డీపీఆర్ ఆమోదానికి ముందే నిర్మాణంకాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదానికి ముందే బరాజ్‌ల నిర్మాణం సగానికిపైగా పూర్తయిందని వెదిరే శ్రీరామ్ పేర్కొన్నారు. బరాజ్‌ల నిర్మాణంలో పలు లోపాలు ఉన్నట్టు ఎన్డీఎస్ఏ గుర్తించిందన్నా రు. గేట్ల నిర్వహణలోనూ వైఫల్యాలు ఉన్నాయన్నా రు. 2019లోనే బరాజ్‌లలో సమస్యలు వచ్చినా పరిష్కరించలేదన్నారు. డిజైన్ ఒక విధంగా ఉంటే, నిర్మాణం మరో విధంగా జరిగిందని పేర్కొన్నారు. నీటిని నిల్వ చేయడమే ముఖ్యమైతే.. రిజర్వాయర్లు కట్టి ఉండాల్సిందని.. బరాజ్‌లు కట్టి, రిజర్వాయ ర్లుగా వాడుకోవడం తప్పేనని స్పష్టం చేశారు.వైఫల్యానికి కారణాలు అనేకంకాళేశ్వరం బరాజ్‌ల వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, బ్యారేజీలు కట్టడానికి ముందు తగిన సాంకేతిక పరీక్షలు చేయకపోవడమే కారణమని వెదిరె శ్రీరామ్ ఆరోపించారు. డీపీఆర్ తయారీలో సాంకేతిక అంశాలు పట్టించుకోలేదని.. బరాజ్‌ల ఎంపిక ప్రదేశా ల్లో లోపాలున్నాయని పేర్కొన్నారు. డిజైన్ల తయారీ కోసం నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో)కు తగి నంత సమయం ఇవ్వలేదని.. ఉన్నత స్థాయిలో ఒత్తిడి చేసి, డిజైన్లకు ఆమోదం తీసుకున్నారని చెప్పారు. తాను నివేదించిన అంశాలతో వారంలో అఫిడవిట్ దాఖలు చే యాలని కమిషన్ ఆదేశించిందని, అఫిడవిట్ అందిస్తానని తెలిపారు. -
డయాఫ్రమ్ వాల్‌పై ఎన్‌హెచ్‌పీసీతో అధ్యయనం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్–ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ పటిష్ఠతపై జాతీయ జల విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్‌హెచ్‌పీసీ)తో అధ్యయనం చేయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదా దెబ్బతిన్న భాగంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. ఇప్పటికే ఉన్న డయాఫ్రమ్ వాల్‌తో అనుసంధానం చేయాలా? అన్నది తేలుస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను శనివారం శ్రీరాం నేతృత్వంలో పరిశీలించిన సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్, సీడబ్ల్యూసీ రిటైర్డ్ సభ్యులు గోపాలకృష్ణన్, పీపీఏ, డీడీఆర్పీ, సీఎస్‌ఆర్‌ఎంస్, వ్యాప్కోస్ సంస్థల అధికారుల బృందం ఆదివారం కూడా మరోసారి పరిశీలించింది. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. దౌలిగంగా నదిపై ఎన్‌హెచ్‌పీసీ చేపట్టిన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఆ సంస్థ అధ్యయనం చేసిందని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ భార్గవ సమావేశంలో గుర్తుచేశారు. దాంతో ఆ సంస్థతోనే పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై కూడా అధ్యయనం చేయించాలని శ్రీరాం అధికారులకు సూచించారు. వరద వచ్చేలోగా రక్షిత స్థాయికి పనులు గోదావరికి వరద ఉద్ధృతి వచ్చేలోపు అంటే జూలైలోగా దిగువ కాఫర్ డ్యామ్‌ను రక్షిత స్థాయికి పూర్తిచేయాలని శ్రీరాం ఆదేశించారు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతంలో తొమ్మిది రకాల పరీక్షలను చేసి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వాలని.. వాటి ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తుందన్నారు. ఇక కోతకు గురైన ప్రాంతం పూడ్చే పనులకయ్యే వ్యయాన్ని సీడబ్ల్యూసీ అంచనా వేస్తుందని.. దాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు. అలాగే, కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత.. డయాఫ్రమ్ వాల్‌పై స్పష్టత వచ్చాక ఈసీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించి.. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలన్నారు. ఈసీఆర్ఎఫ్ పనుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేసేందుకు సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) సంస్థ అధికారులతో పోలవరం ప్రాజెక్టు వద్దే లాబ్‌ను ఏర్పాటుచేయాలని శ్రీరామ్ ఆదేశించారు. దీనివల్ల పరీక్షల నివేదికలు ఎప్పటికప్పుడు వస్తాయని.. పనులు నిర్విఘ్నంగా చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టు పూర్తిపై కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు ఇక రాష్ట్ర జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థ, పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, సీఎస్ఎంఆర్ఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, వ్యాప్కోస్, కేంద్ర జల్‌శక్తి శాఖ సమన్వయంతో పనిచేయడం ద్వారా పోలవరాన్ని వేగంగా పూర్తిచేయాలని వెదిరె శ్రీరాం చెప్పారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతోపాటు ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తిచేయడానికి అవసరమైన నిధుల మంజూరుపై కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మేరకు నిధులు మంజూరుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చారిత్రక తప్పిదమే పోలవరం రూరల్: కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడమే గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆదివారం జరిగిన సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడంవల్లే భారీ వరదలవల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, ఇందులో ఎలాంటి సందేహంలేదని ఆయన స్పష్టంచేశారు. డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నదీ పరిశీలించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర, రాష్ట్ర జలవనరుల నిపుణులు, కేంద్ర బృందం సభ్యులు శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇటువంటి సమస్య రావడం ప్రపంచంలోనే ఇది మొదటిసారన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కానీ, గత ప్రభుత్వం చేసిన అసమర్థ నిర్ణయమే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. దీని కారణంగా భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ 1.7 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నదని ప్రాథమికంగా అంచనా వేశారని, అంతేగాక పెద్ద అగాధాలు ఏర్పడ్డాయని అంబటి రాంబాబు తెలిపారు. సమస్యను పరిశీలించి, ఏ విధంగా అధిగమించాలన్న విషయంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారన్నారు. -
పోలవరంపై కీలక సమావేశం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం బృందం శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆదివారం మరోసారి తనిఖీ చేస్తుంది. అనంతరం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ప్రాజెక్టు డిజైన్లు, పూర్తి చేయడానికి అవసరమయ్యే నిధులపై వెదిరె శ్రీరాం కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై ఈనెల 17న వెదిరె శ్రీరాం, నిధుల మంజూరుపై 18న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశాలను కేంద్రం నిర్వహించింది. గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి.. వాటిని యథాస్థితికి తేవడానికి చేయాల్సిన పనులకు అయ్యే వ్యయం, ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి అయ్యే వ్యయంపై నివేదిక ఇవ్వాలని వెదిరె శ్రీరాంకు ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సూచించారు. దాంతో శనివారం వెదిరె శ్రీరాం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డిజైన్స్ విభాగం డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్, డిప్యూటీ డైరెక్టర్ అశ్వనీకుమార్ వర్మ, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తదితరులతో కూడిన బృందం పోలవరానికి వచ్చింది. వారు దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనులను పరిశీలించారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ సూచనల మేరకు ఇసుక నాణ్యతతోపాటు 11 రకాల పరీక్షలు చేయించి.. జూలై 15లోగా నివేదిక ఇస్తామని ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు వెదిరె శ్రీరాంకు వివరించారు. ఆ తర్వాత స్పిల్ వే, స్పిల్ చానల్, స్పిల్ వే గైడ్ బండ్ పనులను పరిశీలించారు. ఆదివారం ప్రాజెక్టు పనులను మరోసారి పరిశీలించి.. ఆ తర్వాత సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. -
పోలవరానికి నిధులపై కేంద్రం సానుకూలం
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ నిధుల మంజూరుకు సిఫార్సు చేస్తూ కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపుతామని బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ చెప్పారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన అంచనా వ్యయం మేరకు నిధులిస్తామని వెల్లడించారు. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలోని అధికారుల బృందం ఈనెల 22న ప్రాజెక్టును పరిశీలించి తొలి దశ, రెండో దశ పనుల పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమో నిర్ధారిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్కే గుప్తా, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అదనపు పనులకు ఓకే ఇసుక నాణ్యతతో సహా 11 రకాల పరీక్షలు చేసి జూలై 15లోగా నివేదిక ఇస్తే ఏ విధానంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలో తేలుస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని హైడ్రాలిక్ శాండ్ ఫిల్లింగ్‌తో పూడ్చాలా లేక డ్రెడ్జింగ్ చేస్తూ ఇసుకను పోస్తూ పూడ్చాలా అన్నది తేలుస్తామన్నారు. వీటి డిజైన్లను సెప్టెంబర్‌లోగా ఖరారు చేసి అక్టోబర్ 1 నుంచి పూడ్చివేత ప్రారంభిస్తామన్నారు. ఈలోగా డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై సమగ్రంగా అధ్యయనం చేస్తామన్నారు. కొత్తగా మరో వాల్ నిర్మించాలా లేక దెబ్బతిన్న ప్రాంతం వరకు కొత్తది నిర్మించి, ప్రస్తుత వాల్‌తో అనుసంధానం చేయాలా అన్నది తేలుస్తామన్నారు. ఆ పనులకు అదనపు నిధులు అవసరమవుతాయని చెప్పారు. ఈ అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని మార్చి 4న సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని ఈఎన్సీ నారాయణరెడ్డి గుర్తు చేశారు. దాంతో అదనపు నిధుల మంజూరుపై కూడా పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టి, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)ను పూర్తి చేస్తామని, ఆయకట్టుకు నీళ్లందించేలా ప్రణాళిక రూపొందించామని పీపీఏ, రాష్ట్ర అధికారులు వివరించారు. రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తి ప్రాజెక్టు పూర్తయినా ఒకేసారి నీటిని నిల్వ చేయడం సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు విరుద్ధం. డ్యామ్ భద్రత దృష్ట్యా తొలి ఏడాది 41.15 మీటర్లలో, ఆ తర్వాత ఏటా 30 శాతం చొప్పున నీటి నిల్వను పెంచుతూ చివరకు 194.6 టీఎంసీలు నిల్వ చేస్తారు. ఆలోగా 45.72 మీటర్ల పరిధిలో పునరావాసం కల్పిస్తారు. పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ రూ.55,656.87 కోట్లుగా ఆమోదిస్తే.. ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) రూ.47,727.87 కోట్లుగా ఖరారు చేసింది. అదనపు పనులతో ఆ వ్యయం మరింత పెరుగుతుంది. ఆ క్రమంలోనే అదనపు పనులతో సహా రెండు దశల పనులు పూర్తి చేయడానికి ఏ మేరకు నిధులు అవసరమో వెదిరె శ్రీరాం నేతృత్వంలోని బృందం నివేదిక ఇస్తుందని పంకజ్‌కుమార్ తెలిపారు. -
కోతకు గురైన ప్రాంతం పూడ్చటంపై స్పష్టత
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ దాదాపుగా ఖరారు చేసింది. ఇసుక నాణ్యతతోసహా 11 రకాల పరీక్షలు చేసి జూలై 15లోగా కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) నివేదిక ఇస్తే.. జూలై 31లోగా హైడ్రాలిక్ శాండ్ ఫిల్లింగ్ (కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ వైబ్రో కాంపాక్షన్ చేయడం) లేదా డ్రెడ్జింగ్ (ఇసుకను తవ్వుతూ కోతకు గురైన ప్రాంతంలోకి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా పోసి.. వైబ్రో కాంపాక్షన్ చేయడం) ద్వారా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలా అన్నది నిర్ణయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. దానికి అనుగుణంగా ఆగస్టులోగా డిజైన్లు ఇస్తే.. సెప్టెంబర్‌లోగా ఆమోదిస్తామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పునాది డయాఫ్రమ్ వాల్ నాణ్యతపై పూర్తిస్థాయిలో పరీక్షలు చేశాక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేక దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదనంగా చేపట్టాల్సిన ఈ పనులకు అయ్యే వ్యయాన్ని మంజూరు చేయడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో చర్చిస్తానని, బుధవారం నిర్వహించే సమావేశంలో దీనిపై స్పష్టత ఇస్తామని తెలిపారు. ఈనెల 22న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అడ్డంకులను అధిగమించే మార్గాలను అన్వేషిస్తానని చెప్పారు. డీవాటరింగ్‌కు నో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన నిల్వ ఉన్న నీటిని తోడివేసి (డీవాటరింగ్).. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతంలో(–12 మీటర్ల నుంచి +15 మీటర్ల వరకు) ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ.. వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానంలో పనులు చేయాలంటే రూ.3,200 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఆ విధానం ప్రకారం పనులు చేయడం కష్టమని సమావేశం నిర్ణయించింది. నిల్వ ఉన్న నీటిలోనే.. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ.. వైబ్రో కాంపాక్షన్ చేయడం(హైడ్రాలిక్ ఫిల్లింగ్), పురుషోత్తపట్నం వద్ద డ్రెజ్జింగ్ చేస్తూ అందులో నుంచి వచ్చే ఇసుకను ప్రత్యేక పైపులైన్ ద్వారా కోతకు గురైన ప్రాంతంలో పోసి, వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా పూడ్చే విధానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇసుక నాణ్యతసహా 11 రకాల పరీక్షలు చేశాక.. అందులో ఏ విధానంపై పనులు చేయాలన్నది తేల్చాలని సమావేశం నిర్ణయించింది. డయాఫ్రమ్ వాల్‌పై ఎలా? ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను సగటున –30 మీటర్ల నుంచి –90 మీటర్ల లోతు నుంచి నిర్మించారు. గోదావరి వరద ఉధృతికి డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతింది? ఏ మేరకు పటిష్ఠంగా ఉంది? అన్నది తేల్చడానికి శాస్త్రీయమైన పరీక్ష ఏదీలేదని నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే డిజైన్ల తయారీకి రెండునెలల సమయం ఉందని, ఆలోగా డయాఫ్రమ్ వాల్ నాణ్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని వెదిరె శ్రీరాం అధికారులను ఆదేశించారు. ఆ అధ్యయనం ఆధారంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? ఇప్పుడున్న డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అన్నది నిర్ణయిస్తామని చెప్పారు. ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్.కె.గుప్తా, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, పీపీఏ, సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్‌ఆర్‌ఎంస్ అధికారులు, ఢిల్లీ, చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. నిధుల మంజూరుపై నేడు సమావేశం పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేయడానికి, అదనంగా చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుపై బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నిధుల మంజూరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘శ్రీరామ్ పుస్తకం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది’
ఢిల్లీ: రాజస్థాన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ జల ఉద్యమాన్ని.. జన ఉద్యమంగా మార్చారని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గురువారం శ్రీరామ్ రచించిన ‘విలక్షణమైన నీటి నిర్వహణ గాథ’ పుస్తకాన్ని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్‌లు ఆవిష్కరించించారు. ఈ కర్యక్రమంలో మంత్రులు ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి, సంజయ్ దొత్రేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘రాజస్థాన్‌లో 99.7 శాతం నీటి సంరక్షణ ప్రాజెక్టు విజయవంతమైంది. నాలుగున్నర అడుగుల మేర నీరు పైకి వచ్చింది. ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెరగాల్సి ఉంది. దేశంలో జల్ క్రాంతి రావాలి. ప్రధానమంత్రి నీటి నిర్వహణపై ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాంకేతికత ఆధారంగా నీటి నిర్వహణ, సంరక్షణ చేయాలి. వెదిరే శ్రీరామ్ పుస్తకం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది. నాడు ఉపవాసం ఉన్న దేశం నేడు సమృద్ధిగా ఆహారదేశంగా మారింద’న్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. శ్రీరామ్ జల ఉద్యమాన్ని జన ఉద్యమంగా మార్చారన్నారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో నీటి వనరులు సృష్టించారని తెలిపారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో తాను నిర్వహించిన ముఖ్యమంత్రి జలశక్తి స్వావలంబన ద్వారా ఆరు అడుగుల మేర నీటి నిల్వలు పెరిగాయని తెలిపారు. ఈ పథకం విజయవంతం కావడం వల్ల 50 శాతం నీటి ట్యాంకర్ల అవసరం తగ్గిపోయిందని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకం విజయవంతమైందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ నదులు తెలుగు రాష్ట్రాలకు జీవధారలుగా ఉన్నాయన్నారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. సముద్రంలోకి గోదావరి వృధాగా పోతోందని.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యతో తల్లడిల్లుతోందని తెలిపారు. కేంద్ర ఐటీ సహాయ మంత్రి సంజయ్ దోత్రే.. ‘జలమే జీవనం, ప్రకృతిని నాశనం చేయడం వల్లే ఈ కరువు కాటకాల పరిస్థితి ఏర్పడింది. వాన నీటి సంరక్షణకు అందరూ నడుం కట్టాలి. నీటి నిర్వహణలో అద్భుతాలను సృష్టించారు. ఇది దేశమంతటికీ ఒక మోడల్‌గా నిలుస్తుంద’న్నారు. కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ .. ‘ దేశానికి వెదిరే శ్రీరామ్ వంటి వారు అవసరం.. ఆయన చేసిన కార్యక్రమానికి అధికారులు సైతం అభినందించాలి. సుమారు 50వేల కోట్ల రూపాయలతో నీటి సంరక్షణ అడవులు పెంపకానికి కేటాయించామని తెలిపారు. -
పక్కా ప్రణాళికతోనే ఫలితాలు
హన్మకొండ: పక్కా ప్రణాళికతో, పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను రూపొందించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరాం అన్నారు. హన్మకొండలో సోమవారం ‘గోదావరి జలాలు సమగ్ర వినియోగం–సమస్యలు–పరిష్కారం’ అంశంపై తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సులో వెదిరె శ్రీరాం ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడుతూ పూర్తిస్థాయి నివేదిక లేకుండా ప్రాజెక్టులను నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా చూపిస్తూ రూ.లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. అయిదు తరాల ప్రజలు తీర్చినా తీరలేనంత అప్పును రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్పులు చేసేందుకు ఉత్సాహం చూపుతుందని మండిపడ్డారు. నదులు లేనిచోట ప్రాజెక్టులు నిర్మించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. దేవాదుల, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక తయారు చేయకుండానే పనులు చేపట్టారన్నారు. రిజర్వాయర్ లేకుండా ప్రవహిస్తున్న నీటితో అనుకున్న మేరకు నీటిని ఎలా తోడుకోగలమని ప్రశ్నించారు. రిజర్వాయర్ నిర్మిస్తే నీరు నిల్వ ఉండి కావాల్సిన మేరకు సులువుగా నీటిని తోడుకోగలమన్నారు. ఇప్పటికై నా దేవాదుల, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులకు కావాల్సిన నీటి లభ్యతకు రిజర్వాయర్లు నిర్మి ంచాల్సిన అవసరముందన్నారు. నదులపై ఒక దాని కింద ఒకటి ఆనకట్ట నిర్మించడం ద్వారా అధిక నీటిని నిల్వ చేసుకోవచ్చని, తద్వారా నౌకాయానం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం మాట్లాడుతూ సాగునీటి జలాల వినియోగంపై విస్తృత చర్చ జరగాలని తెలిపారు. -
కేంద్ర కేబినెట్: రేసులోకి తెలుగు వ్యక్తి
న్యూఢిల్లీ: తాజాగా చేపట్టనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిద్దరికి ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రేసులోకి జలవనరుల నిపుణుడు వెదిరె శ్రీరామ్ రెడ్డి వచ్చినట్టు సమాచారం. భువనగిరికి చెందిన వెదిరె శ్రీరామ్‌రెడ్డి కేంద్ర జలవనరులశాఖ సలహాదారుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. పవిత్ర గంగానది పునరుజ్జీవనం కోసం పనిచేస్తున్నారు. 15 ఏళ్ల పాటు అమెరికాలోని బహుళజాతి కంపెనీ (ఎమ్మెన్సీ)లో పనిచేసిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రిపదవికి దత్తాత్రేయ రాజీనామా చేయడంతో సెంట్రల్ కేబినెట్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేనట్టయింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మురళీధర్‌రావు పేరు ప్రముఖంగా వినిపించినా.. తాజాగా రేసులోకి వెదిరె శ్రీరామ్ రెడ్డి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరిబాబుకు కేంద్ర కేబినెట్లో చాన్స్ ఇవ్వడంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. -
కేంద్ర కేబినెట్: రేసులోకి తెలుగు వ్యక్తి
-
గోదావరి జలాల వినియోగంపై అధ్యయనం
నిట్ డైరెక్టర్ జి.రామచంద్రారెడ్డి హన్మకొండ: గోదావరి జలాలపై వరంగల్‌లోని నిట్ అధ్యయనం చేసిందని నిట్ ఇన్ చార్జి డైరెక్టర్ జి.రామ చంద్రారెడ్డి అన్నారు. నిట్ సివిల్ విభాగం ఎంతో సాంకేతిక నైపుణ్యం కలిగి ఉందని, దీనిని ఇప్పటి వరకు ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. కేంద్ర జలవనరుల మం త్రిత్వ శాఖ సలహాదారుడు, తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం రచించిన ‘గోదావరి జలాల సమగ్ర వినియో గం–జాతీయ, తెలంగాణ రాష్ట్ర దృక్పథాలు’ పుస్తకంపై శనివారం వరంగల్‌లోని నిట్‌లో జరిగిన చర్చా కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. భూగర్భ జలాల పెంపున కు, నదుల్లో నీటి నిల్వలకు, నీటి ఎద్దడి నివారణకు వరంగల్ నిట్ విద్యార్థులు, అధ్యాపకులు అనేక పరిశో ధనలు చేశారని తెలిపారు. నీటిసాంద్రత పెంపుదల ప్రాజెక్ట్ రూపకల్పనకు నిట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఉపయెగిం చుకోవాలని కోరారు. వెదిరె శ్రీరాం రచించిన పుస్తకంలో పొందుపరిచిన అంశాలతో తెలం గాణ రాష్ట్రానికి నేషనల్ ప్రాజెక్ట్ హోదాను పొందే అవకాశంపై చర్చించారు. -
సమాఖ్య స్ఫూర్తితోనే ‘సంధానం’
ఇంటర్వ్యూ / వెదిరె శ్రీరాం వెదిరె శ్రీరాం... తెలంగాణ, నల్లగొండ వాసి. అమెరికాలో పదహారేళ్లు ఇంజనీర్‌గా పనిచేసి స్వదేశంలో సేవలందించాలని 2008లో వచ్చారు. నీళ్ల సద్వినియోగం గురించి ‘ఆంధ్రప్రదేశ్ వాటర్ గ్రిడ్’ పేరుతో ఒక పుస్తకం రాశారు. తండ్రి వెంకటరెడ్డితో కలసి ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ మీద కూడా పుస్తకం రాశారు. శ్రీరాం 2009లో బీజేపీ అభ్యర్థిగా నల్లగొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. తర్వాత వాటర్ మేనేజ్మెంట్ నేషనల్ కన్వీనర్‌గా పూర్తి సేవలందించడం మొదలుపెట్టారు. ఇప్పుడు నదుల అనుసంధాన కార్యదళం సభ్యుడిగా నియమితులయ్యారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి జరుగుతున్న నదుల అనుసంధాన యత్నం, ఉపయోగాలు, సమస్యల గురించి శ్రీరాం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ... నదుల అనుసంధానం వెనుక భావన ఏమిటి? ఉపయోగాలు ఏమిటి? దేశంలో వర్షాభావ పరిస్థితులు ఒకచోట, వరదలు ఇంకో చోట. ఈ రెండు సమస్య లను ఏకకాలంలో పరిష్కరించేదే నదుల అనుసంధానం. ఉత్తర భారత ప్రాంత జీవనదులు బ్రహ్మపుత్ర, గంగలకు తరచూ వరదలొస్తుంటాయి. ఆ వరద నీటిని దక్షిణాది నదులలో కలపడమే నదుల అనుసంధానం. దీనివల్ల ఉత్తరాది నదుల వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలు సురక్షితమవుతాయి. కరువు పీడిత ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి. ఆ వరదనీటి కోసం ఏర్పాటు చేసే రిజర్వాయర్లతో నేలలో నీటిమట్టం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు అందుతుంది. విద్యుత్తునూ ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనివల్ల రాష్ట్రాల మధ్య తగాదాలు రావా? అంటే సహజ న్యాయసూత్రాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండొచ్చు కదా? కావేరి జలాల గురించి తమిళనాడు, కర్ణాటక మధ్య; కృష్ణాజలాల గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య గొడవలు ఉండనే ఉన్నాయి. అనుసంధానంతో అలాంటి గొడవలు ఎక్కువవుతాయేమో? కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలన్నీ కేటా యించిన నీటికి సంబంధించినవే. నదుల అనుసంధానమేమో వరదనీటి గురించి. ఆ వరదనీరు అలా సముద్రంలో కలసిపోకుండా ఎక్కడికక్కడ ఒడిసిపట్టుకొని ఆయా నదుల్లోకి మళ్లించి నిల్వ చేస్తాం. ఈ అదనపు నీటి మీద నదిని పంచు కుంటున్న అన్ని రాష్ట్రాలకు సమాన హక్కు ఉంటుంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి.. హరీశ్‌రావు, ఉమామహేశ్వరరావులిద్దరూ స్పష్టం చేశారు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగే సమావేశంలో- ‘కేటాయించిన నీటిలో చుక్క కూడా ఇవ్వలేం. మిగులు జలాలు మీ ఇష్టమ’ని. అయినా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయకుండా జాతీయ స్ఫూర్తితోనే ఉపయోగించుకుంటాం కాబట్టి గొడవలూ, తగాదాలూ ఉండవనే అనుకుంటున్నా. నదుల అనుసంధానం అంటే భారీ ప్రాజెక్టులు కట్టాల్సివస్తుంది... దీనివల్ల పర్యావర ణం మొదలు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం.. ఇవన్నీ మళ్లీ సమస్యలే కదా. వీటన్నిటి దృష్ట్యా పర్యావరణవేత్తలు చెక్ డ్యామ్స్నే సూచిస్తున్నారు. దీనికి మీరిచ్చే వివరణ ఏమిటి? నిజమే. ఈ వాదనను నేను తప్పుపట్టట్లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో నిర్మించిన భాక్రానంగల్ ప్రాజెక్ట్ నిర్వాసితులకే ఇప్పటిదాకా పరిహారం, పరిష్కారం దొరక లేదు. ఇప్పుడు మళ్లీ ఇంత పెద్ద ప్రక్రియంటే నష్టం ఇంకెంత తీవ్రంగా ఉంటుందో అనే ఆందోళన ఉంటుంది. అలాగే ‘ఎకోలాజికల్ ఫ్లో’ అనేది నది హక్కు. దాన్ని డిస్టర్బ్ చేయకుండా, అదే సమయంలో ఈ ప్రక్రియ వల్ల భారీ నష్టం వాటిల్లకుండా దీన్ని విజయవంతం చేసే దిశగా ఉన్నాం. అంటే పెద్దపెద్ద లింక్స్ ఉన్నచోట రెండు మూడు బ్యారేజ్‌లు నిర్మించడం ద్వారా ముంపు ప్రాంతం పరిధినీ, ఇతరత్రా జరిగే నష్టాలనూ తగ్గించవచ్చు. ఉదాహరణకు.. ఒడిశాలో మహానది బేసిన్ నుంచి గోదా వరికి మళ్లే ప్లేస్‌లో మణిభద్ర ఉంది. అక్కడ ప్రాజెక్ట్ కట్టాలంటే చాలా ప్రాంతం ముంపునకు గురవుతుంది కాబట్టి ఒడిశా ఒప్పుకోవట్లేదు. ప్రాజెక్ట్‌కి ప్రత్యామ్నాయ పద్ధతి అయిన బ్యారేజెస్ గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. మా ఈ ప్రతి పాదనకు ఒడిశా అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఇలా చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తాం. అయితే అసలు నష్టం లేకుండా మాత్రం సాగదు. ఇక్కడ ఒక విషయం.. తాగునీరు, సాగునీరు బేసిక్ హ్యుమన్‌రైట్స్. మంచినీటిని కొనుక్కోవడం, రుణమాఫీ ఈ రెండూ ఆ రెండిటికీ ప్రత్యామ్నాయం కావు. నదుల అనుసంధానంతో తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ఈ రెండు పెద్ద ప్రయోజనాల కోసం కొంత నష్టాన్ని భరించవచ్చు అంటాను. అదీగాక ముంపునకు గురయ్యే ప్రాంతంలోని ప్రజలకు ముందు పునరావాసం చూపిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు చేపట్టాలనుకుంటున్నాం. నదుల అనుసంధానానికి బీజేపీ తప్ప ఇంకే పార్టీ ప్రభుత్వాలూ అనుకూలంగా ఉన్న ట్టు కనిపించడంలేదు. రాజకీయపరమైన ఆ అడ్డంకులను ఎలా అధిగమించబో తున్నారు? నదుల అనుసంధానం, దాని ఉపయోగాలన్నీ ప్రజల ముందు పెడ్తాం. దీని గురించి వాళ్లకు అవేర్నెస్ కల్పిస్తూ .. ఇటు నాయకులతోనూ చర్చిస్తాం. ఇలా దీని మీద అందరికీ ఏకాభిప్రాయం కుదిరేలా ప్రయత్నిస్తూ వాళ్ల అంగీ కారంతోనే ఈ ప్రాజెక్ట్‌ను విజయంతం చేయాలనుకుంటున్నాం. నదుల అనుసంధానం ఎప్పుడు మొదలై ఎప్పటికి పూర్తవ్వచ్చు? 2002లోనే దీనికి సంబంధించిన 30 లింక్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఆ 30లో ఫస్ట్ లింక్ మధ్యప్రదేశ్‌లోని కెన్, బెత్వా నదుల మీద, సెకండ్ లింక్ దమన్‌గంగా, పింజాల్ నదుల మీద, థర్డ్ లింక్ పార్, తాపీ, నర్మద నదుల మీద నిర్మాణం మొదలవబో తోంది. ఇట్లా మిగిలినవి త్వరగానే మొదలుపెట్టి త్వరగానే పూర్తిచేయాలనే సంక ల్పంతో ఉన్నాం. నిజానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది కూడా ఈ పనిని వేగవంతం చేయడానికే! చివరిగా- ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ గురించి చెప్తారా? దీనికి నదుల అనుసం ధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఇవి రెండు వేర్వేరు ప్రాజెక్టులు. నదులు అనుసంధానం నీటిపారుదల శాఖకు చెం దింది, ఇన్‌ల్యాండ్ షిప్‌యార్డ్ మంత్రిత్వ శాఖది. ఈ రెండు శాఖల సమన్వయంతో ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ జరుగుతుంది. నదీపరీవాహక ప్రాంతాల్లో బ్యారేజ్‌లు కట్టుకుంటూ ఆ నదులను జీవనదులుగా మార్చడం, తద్వారా వాటిని నౌకాయా నానికి అనుకూలంగా తయారుచేయడమే ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్. ఉదాహ రణకు.. బంగాళాఖాతం నుంచి నదుల మీదుగా గోదావరి సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ కట్టుకుంటూ ఆ నీటి మీద తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (పోచంపాడు) వరకు నౌకలను తేవచ్చు. ఇంకా చెప్పాలంటే ధవళేశ్వ రం నుంచి పోచంపాడు దాటి మహారాష్ట్రలోని గైక్వాడ్ డ్యామ్ వరకు, అంటే ఈ తీరం నుంచి ఆ తీరందాకా అన్నమాట. శబరి మీద ఒడిశాలో, మంజీర మీద కర్ణాటకలో బ్యారేజెస్ నిర్మించి ఈ ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ను సాధించవచ్చు. ఈ నౌకాయానం వల్ల ఓడల ద్వారా వర్తకం, వ్యాపారం జరుగుతుంది. దీనివల్ల ఆయా తీరప్రాంతాల్లో మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు వెలుస్తాయి. టూరిజం వృద్ధి చెందుతుంది. లోకల్ మార్కెట్ పెరుగుతుంది. వీటన్నిటి ద్వారా దాదాపు కోటి మం దికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఇట్లా ఇంతపెద్ద ఎకానమీని బూమ్ చేయొచ్చు. మా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అదే. - సరస్వతి రమ నదుల అనుసంధానం మళ్లీ రంగం మీదకు వచ్చింది. దీనితో పాటు ఇన్‌ల్యాండ్ వాటర్ నేవిగేషన్ మీద కూడా ఎన్డీయే కసరత్తును పునఃప్రారంభించింది. ఆ పథకం, దాని చుట్టూ ఉన్న వివాదాలు రెండూ పాతవే. వాటిని ఎలా అధిగమిస్తారు? ఇంత పెద్ద పథకం ఎప్పటికి పూర్తి చేస్తారు? -
అబ్బురపడేలా తీర్చిదిద్దటమే మోదీ లక్ష్యం
# దేశాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా కృషి # కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ # నదుల్లో రవాణా పథకానికి గోదావరి ఎంపిక దిశగా కేంద్రం యోచన # టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శ # మోదీ ప్రభుత్వ పనితీరుపై ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు. ప్రపంచం అబ్బురపడేలా దేశాన్ని తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారని చెప్పారు. ఏడు నెలల కేంద్ర ప్రభుత్వ పనితీరుపై బీజేపీ తెలంగాణ శాఖ హైదరాబాద్‌లో ఆదివారం ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్న వెదిరె శ్రీరామ్.. శాఖల వారీగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న పథకాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అవినీతికి అడ్డుకట్ట వేస్తూనే... కాలం చెల్లిన నిబంధనలకు స్వస్తి పలికి, పారదర్శక విధానాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తొలి ఆరు మాసాల కాలంలో కొత్త విధానాలకు రూ పకల్పన చేసిన మోదీ ప్రభుత్వం... ఇప్పుడు వాటిని అమలుచేస్తూ శరవేగంగా ఫలితాలు సాధిస్తోందని శ్రీరాం చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ‘ప్రధాని కృషి సించయ్ యోజన ’ చేపట్టారన్నారు. దీని కింద మట్టి నమూనాలు పరిశీలించి పంటలు వేసే విధానం, జిల్లాల వారీగా పంట లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిం చటం వంటివి మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నా రు.‘స్వచ్ఛ భారత్’తో ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం పట్ల భారీ కసరత్తు జరుగుతోందని, ఇది తెలంగాణకు ఉపయోగపడేలా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన ప్రణాళిక రూపొందించనున్నామని శ్రీరాం తెలిపారు. నదులను కూడా రవాణాకు వినియోగించే ఆలోచనను కార్యరూపంలోకి తేనున్నట్టు వెల్లడించారు. ఈ పథకానికి తొలుత గోదావరి నదినే ఎంపిక చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నా... దీనిపై తెలంగాణ ప్రభుత్వం అంతగా స్పందించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా నియమితులైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో... శ్రీరాం వెదిరెను పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. గంగా ప్రక్షాళన, నదుల అనుసంధానంలో శ్రీరామ్‌దే కీలక పాత్ర అని కేంద్రమంత్రి దత్తాత్రేయ కొనియాడారు. అంకితభావంతో పనిచేయటమే శ్రీరామ్ విజయ రహస్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభినందించారు. కేంద్రంతో సామరస్యంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేఎల్పీ నేత లక్ష్మణ్ సూచించారు. కథలు చెప్పి కాలయాపన చేయటం రాష్ట్రప్రభుత్వానికి అలవాటుగా మారిందని నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. -
మళ్లీ కృష్ణాజలాల కేటాయింపులు
* ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది * ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం * అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తాం * నీటి ఎద్దడి ప్రాంతాల్లో తాగునీటి కోసం కొత్త పథకం * చతుర్విధ, సమీకృత విధానాల ద్వారా జల వనరుల అభివృద్ధి * నవంబర్ రెండో వారంలో ‘జల్ మంథన్’ సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి తిరిగి అన్ని రాష్ట్రాలకు కేటాయిం పులు జరిపే అంశాన్ని కేంద్రప్రభుత్వం పరి శీలిస్తోందని కేంద్ర జలవనరుల శాఖ సలహా దారు వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం ఇటీవలే సలహాదారుగా నియమితులయ్యారు. జల వనరులపై విస్తృతంగా అధ్యయనం చేసిన ఆయన.. నదుల అనుసంధానం, సమీకృత పద్ధతుల్లో నదుల అభివృద్ధి అనేవే అన్ని సమస్యలకు పరి ష్కారమని చెబుతున్నారు. వెదిరె శ్రీరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు.. సాక్షి: తెలంగాణ వారికి జాతీయ స్థాయిలో కీలకమైన పదవి దక్కింది. రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం ఉంటుందని ఆశించవచ్చు? శ్రీరాం: తెలంగాణ సమస్యల్లో జలవనరుల్లో వెనకబాటుతనం కూడా ఒకటి. గోదావరి జలాలు తెలంగాణకు ప్రాణ ప్రదమైనవి. వీటిని తెలంగాణకు, సీమాంధ్రకు వినియోగించుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తాం. కృష్ణా నది నీటి కేటాయింపులను మళ్లీ కొత్త చేపట్టాలనే డిమాండ్‌పై మీరేమంటారు? బ్రిజేష్ ట్రిబ్యునల్ పరిధి ఎలా ఉండాలన్న అం శంపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అది పరి శీలనలో ఉంది. అవార్డు నోటిఫై చేసే ప్రక్రియ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడింది. అందరికీ న్యాయం జరిగేలా ట్రిబ్యునల్ పరిధి ఏమిటనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. తిరిగి కేటాయింపులు జరిపేలా ట్రిబ్యునల్ పరిధిని నిర్వచించే అవకాశం ఉందా? అవును.. పరిశీలనలో ఉంది. పోలవరంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ఉద్యమం నిర్వహిస్తామంటోంది కదా..? ఇదొక ప్రహసనంలా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా చూడడం సరికాదు. పోలవరం డిజైన్ మార్చే అవకాశం ఉందా? ఆ రాష్ట్రంతో మాట్లాడాల్సి ఉంటుంది. మార్చేం దుకు పోలవరం అథారిటీకి అధికారం ఉంటుంది. అది చూసుకుంటుంది. డిజైన్ మారిస్తే లాభం ఎక్కువగా ఉంటుందని అనుకున్నప్పుడు, ఆ రాష్ట్రం అంగీకరించినప్పుడు.. మార్చేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఇంకా పోలవరం అథారిటీ ఏర్పాటు చేయలేదు. నిధులు కేటాయించలేదు కదా..? అలాంటిదేం లేదు. ఏడు ముంపు మండలాలను బదిలీచేశాం. ఒక ప్రక్రియలో ఒకదాని తరువాత ఇంకొకటి జరుగుతుంది. విధివిధానాలు అన్నీ తయారయ్యాయి. అథారిటీ ఏర్పాటవుతుంది. నదుల అనుసంధానం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎంతవరకు మేలు జరుగుతుంది? ఎన్డీయే ఇంతకుముందు ప్రతిపాదించిన ప్రణాళికలో భాగంగా మూడు లింకులు ఉన్నాయి. ఒక్కటి ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు, ఇచ్చంపల్లి నుంచి టెయిల్‌పాండ్‌కు, మూడోది పోలవరం నుంచి కృష్ణా బ్యారేజీకి.. మూడోది ప్రారంభమైంది. కానీ మొదటి రెండు కాలేదు. దానికి కారణం ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడం. దానికి బదులు గోదావరి మీద సూరారం వద్ద మేజర్ డ్యాం కట్టుకోవచ్చు. అక్క డ్నుంచి సాగర్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇది మేజర్లింక్ అవుతుంది. 300 టీఎంసీలను వాడుకోవచ్చు. తెలంగాణకు వాడుకొని సీమాం ధ్రకు తీసుకెళ్లొచ్చు. సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీలను వినియోగించుకోవచ్చు. ఎస్సారెస్పీ రెండో దశకు పరిష్కారమెలా? ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం 130 టీఎంసీల నుంచి పూడిక కారణంగా ఇప్పుడు 70 టీఎంసీలకు పడిపోయింది. 15లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సింది. వీటి పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. ఎస్సారెస్పీ నుంచి గ్రావిటీ వాటర్ వస్తుంది కాబట్టి అదొక వరం. రాష్ట్రాలను ఎలా భాగస్వాములను చేస్తారు? నవంబర్‌లో ‘జల్‌మంథన్’ అనే కార్యక్రమం కింద మూడురోజుల సదస్సు ఏర్పాటుచేస్తున్నాం. దీనిలో అన్ని రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. సలహాలను నివేదిక రూపొందించి కేబినెట్ నోట్ రూపొందించి పాలసీ రూపకల్పన చేస్తాం.