కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడి హత్య
వీణవంక(కరీంనగర్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన యువకుడు బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తపెల్లి గ్రామానికి చెందిన కుమార్ గౌడ్(22)ను గుర్తు తెలియని వ్యక్తులు ఉరివేసి చంపారు. మృతదేహాన్ని అతని టాటాఏస్ వాహనంలోనే ఉంచి అతని అత్తగారి ఊరైన ఘన్ముకుల శివారులో వదిలేసి వెళ్లిపోయారు.
కుమార్ వివాహం ఘన్ముకుల గ్రామానికి చెందిన కోమలతో ఆరేళ్ల క్రితం అయింది. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, కుమార్ హత్యకు కుటుంబకలహాలే కారణమని గ్రామస్తులు అంటున్నారు.