Vineet Nayyar
-
టెక్ మహీంద్రా మాజీ చీఫ్ వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా లిమిటెడ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. వినీత్ నయ్యర్ మృతిపై పలువురు ప్రముఖలు తమ సంతాపాన్ని తెలియజేశారు."భారత్ ఈరోజు అత్యుత్తమ నాయకుడిని కోల్పోయింది" అని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ నయ్యర్ మరణానికి సంతాపాన్ని తెలియజ్తేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా నయ్యర్ మృతికి ‘ఎక్స్’ పోస్ట్‌లో సంతాపం తెలిపారు. "భారతీయ వ్యాపార రంగంలో వినీత్ అతి పెద్ద వ్యక్తి" అని పేర్కొన్నారు. టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ‘ఎక్స్’లో వినీత్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది.1939లో జన్మించిన నయ్యర్ మసాచుసెట్స్‌లోని విలియమ్స్ కళాశాల నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఐఏఎస్ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన 40 ఏళ్ల కెరీర్లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో పనిచేశారు. పదేళ్లకుపైగా ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఆయన పలు కీలక పదవులను నిర్వహించారు. 2009లో కుప్పకూలిన కంప్యూటర్ సేవల సంస్థ సత్యం పునరుద్ధరణలో నయ్యర్ కీలక పాత్ర పోషించారు.It saddens me to share the news of the passing of Vineet Nayyar this morning.Vineet was a larger than life figure in the Indian Business landscape. A distinguished IAS officer, who then served with the World Bank, he became the first Chairman of GAILHe then made a hugely… pic.twitter.com/ZLlfzNXJ2K— anand mahindra (@anandmahindra) May 16, 2024 -
వినీత్ నయ్యర్ పారితోషికం రూ.182 కోట్లు
2015-16లో టెక్‌మహీంద్రా వైస్ చైర్మన్ అత్యధిక ఆర్జన న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ 2015-16 సంవత్సరంలో అందుకున్న ప్యాకేజీ అక్షరాలా రూ.181.74కోట్లు. దేశంలో అత్యధికంగా పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఈ వేతన ప్యాకేజీలో స్టాక్ ఆప్షన్లను నగదుగా మార్చుకున్న మొత్తం కూడా కలిపి ఉంది. వేతనం రూపంలో రూ.1.27 కోట్లు రాగా... మిగిలిన మొత్తం స్టాక్ ఆప్షన్లను విక్రయించడం వల్ల సమకూరినట్టు కంపెనీ వార్షిక నివేదిక తెలియజేసింది. టెక్‌మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నయ్యర్ 2015 ఆగస్ట్ 9న పదవీ విరమణ చేయగా... ఆయనకున్న అనుభవం దృష్ట్యా తిరిగి అడిషనల్ డైరక్టర్‌గా నియమించి వైస్ చైర్మన్ హోదా కట్టబెట్టారు. కాగా, టెక్ మహీంద్రా ఎండీగా ఉన్న సీపీ గుర్నానీ సైతం గత ఆర్థిక సంవత్సరంలో రూ.45.27 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. -
2016-17 నాటికి 5 బిలియన్ డాలర్లు..
టెక్ మహీంద్రా ఆదాయ లక్ష్యం ఇది ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ హైదరాబాద్: సాఫ్ట్వేర్ సేవల సంస్థ టెక్ మహీంద్రా 2016-17 నాటికి 5 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా చేసుకుంది. రానున్న రోజుల్లో తమ కంపెనీతోపాటు పరిశ్రమకూ సాఫ్ట్వేర్ రంగంలో సానుకూల ఫలితాలు ఉంటాయని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. ఇది మంచి సంకేతమని, సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సమీపంలోని బహదూర్‌పల్లి వద్ద ఏర్పాటైన మహీంద్రా గ్రూప్‌కు చెందిన ప్రీమియర్ ఇంజనీరింగ్ కళాశాల మహీంద్రా ఇకోల్ సెంట్రల్ క్యాంపస్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 3 బిలియన్ డాలర్ల ఆదాయంపై సుమారు 50 కోట్ల డాలర్ల నికర లాభం నమోదు చేసింది. భారీ కాంట్రాక్టుల మూలంగానే ఇంత మొత్తంలో ఆదాయం ఆర్జించగలిగామని ఆయన చెప్పారు. 4-5 బిలియన్లకు చేరుకోవడం అంత సులువేం కాదన్నారు. సత్యం కంప్యూటర్ స్కాంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నాం. సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. మాలాగే ప్రభుత్వం కూడా యోచిస్తే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మాపై న్యాయపరమైన కేసు ఉండదని భావిస్తున్నాం. ఒకవేళ ఉంటే సవాల్ చేస్తాం’ అని స్పష్టం చేశారు. -
టెక్ మహీంద్రా లాభం రూ. 614 కోట్లు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా జనవరి-మార్చి(క్యూ4) కాలానికి దాదాపు 4% తక్కువగా రూ. 614 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 638 కోట్లను ఆర్జిం చింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఇదే కాలానికి కంపెనీ ఆదాయం మాత్రం 34%పైగా పుంజుకుని రూ. 5,058 కోట్లయ్యింది. అంతక్రితం రూ. 3,767 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీలో సత్యం కంప్యూటర్స్ విలీనమైన సంగతి తెలిసిందే. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 10.1 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం 18%పైగా ఎగసి 82.5 కోట్ల డాలర్లను తాకింది. వేగంగా మారుతున్న ప్రపంచంలో కస్టమర్ల నుంచి డీల్స్ పొందడం, వృద్ధిని అందుకోవడం వంటి అంశాలలో పటిష్ట పనితీరును చూపుతున్నామని, ఈ విషయాన్ని ఫలితాలు వెల్లడిస్తున్నాయని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ వ్యాఖ్యానించారు. వాటాదారులకు షేరుకి రూ. 10 డివిడెండ్‌ను చెల్లించనుంది. పూర్తి ఏడాదికి పూర్తి ఏడాదికి(2013-14) మాత్రం కంపెనీ నికర లాభం దాదాపు 55% జంప్‌చేసి రూ. 3,029 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ. 1,956 కోట్ల లాభం నమోదైంది. ఇదే కాలానికి ఆదాయం కూడా 31%పైగా ఎగసి రూ. 18,831 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 14,332 కోట్ల ఆదాయాన్ని సాధించింది. డాలర్ల రూపేణా నికర లాభం 49.8 కోట్ల డాలర్లుకాగా, ఆదాయం దాదాపు 18% పుంజుకుని 309 కోట్ల డాలర్లుగా నమోదైంది. దేశీయంగా అతిపెద్ద విలీనాన్ని పూర్తిచేయడం ద్వారా సమీకృత కంపెనీగా ఎదిగినట్లు కంపెనీ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. కొత్తగా 6,333 మందికి ఉద్యోగాలివ్వడం ద్వారా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 89,441ను చేరింది. దీనిలో సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య 60,997కాగా, బీపీవో విభాగంలో 21,830 మంది పనిచేస్తున్నారు. మార్చి చివరికల్లా రూ. 363 కోట్లమేర రుణాలు నమోదుకాగా, నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 3,599 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% లాభపడి రూ. 1,838 వద్ద ముగిసింది. -
టెక్ మహీంద్రా లాభం 3 రెట్ల వృద్ధి
చెన్నై: ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 1,010 కోట్లకు చేరింది. టెలికం, ఫైనాన్షియల్, తయారీ రంగ విభాగాలలో సాధించిన వృద్ధి ఇందుకు దోహదపడినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు.గతేడాది(2012-13) ఇదే కాల ంలో కేవలం రూ. 322 కోట్ల లాభాన్ని ఆర్జి ంచింది. ఇక ఈ కాలంలో ఆదాయం సైతం దాదాపు 34% పుంజుకుని రూ. 4,898 కోట్లను అధిగమించింది. అంతక్రితం రూ. 3,668 కోట్ల ఆదాయం నమోదైంది. డాలర్లలోనూ...: డాలర్ల ప్రాతిపదికన కూడా కంపెనీ ఆదాయం 17%పైగా వృద్ధితో 79.1 కోట్ల డాలర్లను తాకింది. నికర లాభం 16.31 కోట్ల డాలర్ల నుంచి 17.57 కోట్ల డాలర్లకు చేరింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వ్యూహాలను, పెట్టుబడులను వినియోగిస్తున్నట్లు కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ చెప్పారు. డిజిటల్ ఎంటర్ప్రెజెస్కు అవసరమైన సొల్యూషన్లు అందించడంపై దృష్టిపెట్టడం ద్వారా వృద్ధిని సాధిస్తున్నట్లు వివరించారు. మరిన్ని విశేషాలివీ... క్యూ3లో నికరంగా 2,165 మందికి ఉద్యోగాలిచ్చింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 87,399కు చేరింది. ఉద్యోగుల్లో 57,601 మంది సాఫ్ట్వేర్ సేవల్లోనూ, 23,213 మంది బీపీవో కార్యకలాపాల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.