Viswa
-
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లోని ఫంక్షన్ హాలులో సోమవారం ఆ సంఘం రాష్ట్ర నాయకులు కుళ్లాయప్ప అధ్యక్షతన మత్స్యకారుల జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చేపలు పట్టి జీవించేవారికి కోస్తాలో మంచి ఉపాధి అవకాశాలున్నాయన్నారు. కరువు నేపథ్యంలో జిల్లాలోని చెరువు ఎండిపోయి జీవనవృత్తిని కోల్పోయిన మత్స్యకారులు పేదరికంలో మగ్గుతున్నారని విచారం వ్యక్తం చేశారు. దివంగత రాజశేఖరరెడ్డి ప్రయత్నం వల్లే హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు జీడిపల్లికి చేరుకున్నాయన్నారు. ప్రస్తుతం నీటి వనరులు వృద్ధి చెందుతున్న దృష్ట్యా మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. నీళ్లు పుష్కలంగా ఉంటేనే మత్స్యకారులు సంతృప్తిగా జీవిస్తారన్నారు. జిల్లా మత్స్యకారుల డిమాండ్ల సాధనకు తమ మద్దతు ఉంటుందన్నారు. బెస్తలను ఎస్టీల్లో చేరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం నాయకులు కుళ్లాయప్ప మాట్లాడుతూ మత్స్యకారుల సహకార సంఘాలకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు నాగరాజు, మత్స్య సంఘం నాయకులు రవి, వెంగముని, చిన్ననారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గోపాల మిత్రలకు అండగా ఉంటాం
ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం రూరల్ : కరువు జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న గోపాలమిత్రలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. కలెక్టరేట్ ఎదుట 15 రోజులుగా గోపాల మిత్రలు చేస్తున్న దీక్షలకు సోమవారం ఆయన మద్దతు తెలిపారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగమని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఈ రెండేళ్ల టీడీపీ పాలనలో 1.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగాలలో పని చేస్తున్న 40 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వ్యాక్సినేటర్లు, పశుమిత్రుల నియామకాల పేరుతో 16ఏళ్లుగా నిస్వార్థంగా పాడిరైతులకు సేవలు అందిస్తున్న గోపాల మిత్రలను తొలగించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించే విధంగా ఒక్కో పాడి రైతుకు రూ.2లక్షల చొప్పున రుణాలు అందజేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాల మిత్రులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు పెద్ద ఎత్తున రైతులు గోపాల మిత్రలు పాల్గొన్నారు. అంధుల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : 2014 డీఎస్సీ నోటిఫికేషన్లో ఖాళీగా ఉన్న అంధుల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట విభిన్న ప్రతిభావంతులు చేపట్టిన ధర్నాకు మద్దతు ప్రకటించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2014 నోటిఫికేషన్లో జిల్లా వ్యాప్తంగా 30 అంధ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా క్వాలిఫై మార్కుల పేరిట కేవలం 9పోస్టులను మాత్రమే భర్తీ చేసి మిగిలిన పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
తాగునీటిపైనే దృష్టి
అనంతపురం సెంట్రల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాగునీటిని అందించడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తోందని రాష్ట్ర పౌరసంబందాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్‌హాలులో చెర్మైన్ చమన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 22.7 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. బోర్లు మరమ్మతులు, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, డీపెనింగ్ పనులు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే శ్రీరామిరెడ్డి తాగునీటి, జేసీ నాగిరెడ్డి, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాకు సాగు,తాగునీటిని అందించి సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, వడదెబ్బ బారిన పడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడదెబ్బకు గురై చనిపోయిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. తహశీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ నేతృత్వంలో కమిటీ నిర్దారణ చేసిన తర్వాత ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. జిల్లా పరిషత్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను తీసుకురావడానికి చెర్మైన్‌తో కలిసి కృషి చేస్తానన్నారు. రైతు రుణాలను కొన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేయడం లేదని సభ్యులు ఫిర్యాదు చేయగా వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేయాలని ఎల్డీఎంను మంత్రి ఆదేశించారు. రానున్న ఖరీఫ్‌లో 3.25 లక్షల విత్తన వేరుశనగ అవసరమని, ప్రస్తుతానికి రూ. 18 వేల క్వింటాళ్లు సేకరించామని వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి వివరించారు. మంత్రి మాట్లాడుతూ... రానున్న జూన్2, 3 తేదీల్లో విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని, ఆలోగా లక్ష క్వింటాళ్ల విత్తన వేరుశనగ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. నాణ ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, నాశిరకం విత్తనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీరు- చెట్టు కార్యక్రమంలో పూడికమట్టిని ప్రభుత్వ ఖర్చులతో రైతులు తమ పొలంలోకి తరలించుకోవచ్చునని, చిన్న, సన్న కారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే సభ్యులు 3 కిలోమీటర్లకే పరిమితం చేశారని ఫిర్యాదు చేయడంతో ఇందులో మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాకు వివిద పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద సెంట్రల్యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు వచ్చాయని, త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ... జిల్లాలో లక్ష మరుగుదొడ్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేగవంతంగా మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు ఆర్డీటీ సంస్థకు 34వేలు నిర్మించాలని కోరామన్నారు. మిగిలిన ఎన్జీఓల ద్వారా లక్ష సాధనకు మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉన్న వనరులను ఉపయోగించుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. తాగునీటి సమస్యలోనూ రాజకీయం: విశ్వ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ‘ఉరవకొండ నియోజకవర్గం జె.రాంపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలను కాపాడేందుకు బోరు వే యగా రాజకీయం చేసి అడ్డుకున్నారన్నారు. కలెక్టర్ ఆదేశాలను సైతం తహశీల్దార్ బేఖాతర్ చేస్తున్నాడని ఆరోపించారు. అలాగే బ్యాంకుల నుంచి రైతులకందే సాయంపై దృష్టి సారించాలని కోరారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ రుణాలు తీసుకునేందుకు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని అంటున్నా ఆ దిశగా పనులు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కేవలం రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇలాగైతే ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఏడాదికైనా జిల్లాలో 1.18 లక్షల ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను అవమానిస్తున్నారు కదిరి నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీరు-చెట్టు ప్రొగాం నియోజకవర్గంలో జరుగుతున్నా స్థానిక శాసనసభ్యునిగా తనకు కనీస ఆహ్వానం లేదని, ఇంతకన్నా దౌర్బాగ్యముంటుందా అని ప్రశ్నించారు. వెంటనే అధికారులతో ప్రొటోకాల్ విషయంపై సమీక్ష సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడి నివారణకు తన కృషితో మంజూరైన రూ.42 లక్షలు ఎక్కడికిపోయాయో తెలియడం లేదన్నారు. నియోజకవర్గంలోని తాగునీటి ఇబ్బందులపై చర్చించాలని అధికారులు ఆహ్వానిస్తే సార్.. మీ దగ్గరుకు వస్తే మా ఉద్యోగాలు పోతాయి అని అంటున్నారు. నేనేమైనా ఉగ్రవాదినా? అసాంఘిక కార్యకలపాలు ఏమైనా చేస్తున్నానా? ప్రశ్నించారు. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతానాథ్ మాట్లాడుతూ.. గతంలోనే పనులు మంజూరు చేయడం వలన ఎమ్మెల్యే సిఫారుస చేసిన పనులు చేపట్టలేకపోయామని సంజాయిషీ ఇచ్చారు. తాగునీటి ఎద్దడి నివారణకు నిధులున్నాయని, వెంటనే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్‌ను తూచతప్పకుండా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ యామనిబాల, జెడ్పీ వైఎస్ చైర్మన్ సుబాషిణమ్మ, ఎమ్మెల్సీ గేయానంద్, జెడ్పీ సీఈఓ రామచంద్ర, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాటల్లో స్వాతంత్ర్యం!
-
సంభాషణం: అదే జరిగితే.. పాట రాయడం మానేస్తా!
ప్రతిభకు కొలమానం లేదు అన్న మాట విశ్వ విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అతడు పాట రాస్తాడు, కంపోజ్ చేస్తాడు, పాడతాడు... పాటకు సంబంధించిన ప్రతి అంశం మీద తన ముద్ర వేయాలని తపిస్తాడు. మిగతావన్నీ ఎలా ఉన్నా... గీత రచయితగా అతడిదో ప్రత్యేక శైలి. వెస్టర్న్ సాంగ్‌కి సైతం తెలుగు సువాసనని అద్దే అతడిది ఓ వైవిధ్యభరితమైన దారి. పాటల పూబాటలో తన పయనం గురించి విశ్వ చెబుతోన్న విశేషాలు... మణిశర్మగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు ఓ సినిమాలో టైటిల్సాంగ్ రాసి, పాడే చాన్సిచ్చారాయన. నా పర్ఫార్మెన్స్ నచ్చి... ‘నీలో మంచి గాయకుడే కాదు, రచయిత కూడా ఉన్నాడు’ అన్నారు. నేను పాట రాస్తాను, కంపోజ్ చేస్తాను, పాడతాను, కీబోర్డ్ వాయిస్తాను, రికార్డ్ చేస్తాను, మిక్సింగ్ కూడా చేస్తాను. ఇప్పటివరకూ ఎన్ని పాటలు రాశారు, ఎన్ని కంపోజ్ చేశారు, ఎన్ని పాడారు? ‘రేసుగుర్రం’లో రాసిన ‘డౌన్ డౌన్’ పాటతో నూట యాభై పూర్తయ్యాయి. హైదరాబాద్ నవాబ్స్, మంగళ, నేను నా రాక్షసి, పోలీస్ పోలీస్, క్షత్రియ చిత్రాలకు సంగీతాన్ని అందించాను. చాలా పాటలు పాడాను. ‘సంతోషం’లో మెహబూబా మెహబూబా, ‘అతడు’ టైటిల్సాంగ్, ‘నేను నా రాక్షసి’లో పడితినమ్మో మొదలైనవి పేరు తెచ్చాయి. అయితే రచయితగానే ఎక్కువ సక్సెస్ అయ్యాను. అసలు సంగీత, సాహిత్యాల మీద ఇంత ప్రీతి ఎలా ఏర్పడింది? నాన్న హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో ఉద్యోగి. ఆయనకు సాహిత్యమంటే చాలా మక్కువ. అమ్మకు శాస్త్రీయ సంగీతం మీద అవగాహన ఉంది. వాళ్లిద్దరి అభిరుచులూ కలిపి నాకు వచ్చాయి. బీహెచ్ఈఎల్లో ‘శ్రీకళా నిలయం’ అనే ఆర్ట్ అసోసియేషన్ ఉంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నేను వాటిలో పాల్గొనేవాడిని. నెమలికంటి రాధాకృష్ణమూర్తిగారని యద్దనపూడి సులోచనారాణిగారి సోదరుడు... ఆయన ప్రోత్సాహంతో చిన్ననాటనే పలు నాటకాల్లో నటించాను. ఏడో యేటనే ఆంధ్ర నాటక కళా పరిషత్తు అవార్డును అందుకున్నాను. ఆ అనుభవం నాకు సంగీత, సాహిత్యాల పట్ల మక్కువను పెంచింది. ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసేనాటికి ఆ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అందుకే ఇటు వచ్చేశాను. మరి మీ టాలెంట్‌కి తగిన సక్సెస్ వచ్చిందంటారా? నేనెప్పుడూ సక్సెస్‌ని ప్రామాణికంగా తీసుకోను. చేతి నిండా అవకాశాలు ఉంటే అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది! మీరు ఆచితూచి పాటలు ఎంపిక చేసుకుంటారట... నిజమేనా? నిజమే. పాటకి ఓ స్థాయి ఉండాలనుకుంటాను. దిగజారి రాయలేను. అలా చేయలేక పెద్ద పెద్ద సంగీత దర్శకులిచ్చిన అవకాశాలు వదిలేసుకున్నాను. వారి దగ్గర పొగరుబోతుననిపించుకున్నాను. అంటే... దిగజారి రాయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? కచ్చితంగా ఉన్నాయి. ‘నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ’ అంటూ రాసిన వేటూరికే ‘ఆకు చాటు పిందె తడిసె’ అంటూ రాయాల్సి వచ్చింది. తన స్థాయికి తగని పాటలు రాయాల్సి వచ్చినందుకు వేటూరి గారు కూడా ఎన్నోసార్లు బాధపడటం మనం చూశాం కదా! అలా ఎందుకు జరుగుతోందంటారు? కొందరు సంగీత దర్శకులకు సాహిత్యం పట్ల అవగాహన ఉండదు. అయినా జోక్యం చేసుకుంటారు. కొన్ని పదాలు తీసేస్తారు. తమకు నచ్చినవి చేర్చేస్తారు. రచయితలకి స్వాతంత్య్రం లేదు. వారి అభిరుచికి విలువా లేదు. ఇది పాటకి శ్రేయస్కరం కూడా కాదు. మరి ఈ పరిస్థితి మారేదెలా? అది నేను చెప్పలేను. కానీ పాటకి నావంతు న్యాయం నేను చేస్తానని మాత్రం చెప్తాను. అందుకే నా పాటల్లో అశ్లీలత, అసభ్యత లేకుండా చూసుకుంటాను. మోడర్న్ సాంగ్స్ రాసినా కూడా అచ్చ తెలుగు పదాలనే వాడుతుంటాను. మంచి పాటను గుర్తించగలిగే విజ్ఞత ఉన్న శ్రోతలు... మంచి అభిరుచి ఉన్న దర్శకులు, సంగీత దర్శకులు కూడా మనకింకా ఉన్నారు కాబట్టి కాస్త ఫర్వాలేదు. మీరూ ప్రయోగాలు చేస్తారుగా? అవును. కానీ ఆ ప్రయోగం ప్రయోజనకరంగానే ఉండేలా చూసుకుంటాను. ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాటలు రాస్తుంటే ఏఎన్నార్ వచ్చారు. ‘‘కొత్త పంథాలో పాటలు బాగానే రాస్తున్నావు’’ అంటూ కాళిదాసు శ్లోకం ఒకటి చెప్పారు. దాని భావమేమిటంటే... ‘‘కొత్త ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే కొత్తవన్నీ గొప్పవని కాదు, పాతవన్నీ తీసి పారేసేవీ కాదు. తెలివైన రచయిత పాతదనంలోని మంచిని తీసుకుని కొత్త ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాల పేరిట వింత పోకడలు పోకూడదు.’’ ఆయన చెప్పిన ఈ మాట ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఎన్ని ప్రయోగాలు చేసినా భాషను పాడు చేయను. ఎప్పటికీ ఈ మాట మీదే నిలబడతారా? కచ్చితంగా. దిగజారి రాయాల్సి వచ్చిన రోజున పాట రాయడం మానుకుంటాను. పాచిపని చేసుకుని అయినా బతుకుతాను గానీ కళకు ద్రోహం చేయను. - సమీర నేలపూడి -
వేదమంత్రంలాంటి పల్లెపాట!
‘విశ్వ శ్రేయస్సే కావ్యం’ అనేది అపురూపమైన అమృతమయమైన నానుడి. ఈ ప్రపంచంలో ఏ కవిత్వమైనా ప్రజలకు... ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాన్ని నవరసభరితంగా వివరించి సార్థకమౌతుంది. అనాదిగా ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న లెక్కలేనన్ని సమస్యల్లో అన్నిటికన్నా అతిముఖ్యమైనది స్త్రీపురుషుల నడుమ నడుస్తున్న ‘ప్రేమ-పెళ్లి’ అని నా అభిప్రాయం. శకుంతల దుష్యంతుల కాలం నుండి, నేటి వరకు ఈ సమస్య అంతటా ఉన్నదే. స్త్రీపురుష సంబంధాలను, సక్రమమార్గంలో నడిపించే పంథాలో కొసరాజుగారు రచించిన ‘మంచిమనసులు’ చిత్రంలోని ‘మావా... మావా...’ అనే పాట ఇందుకు మంచి ఉదాహరణ. ‘తప్పు... తప్పు...’ అనే రెండక్షరాలతో ప్రారంభమయ్యే ఈ పాట, ‘ప్రేమ’ అనే రెండక్షరాలకు మార్గనిర్దేశం చేస్తూ, మంచిచెడులను తెలియజెబుతుంది. మావా! మావా! మావా!... ఏమే ఏమే భామా... అనే పల్లవిలోని పిలుపులు... పల్లె వాతావరణానికి చెందిన యువతీయువకులలో అల్లుకున్న అనురాగానికి అద్దం పడతాయి. పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదంటె/చుట్టు చుట్టు తిరుగుతారు మరియాదా... అనే వాక్యాలలో అలతి అలతి పదాలతో సాగిన కొసరాజుగారి రచన అమ్మచాటున ఉన్న అమ్మాయి మనసులోని భావాలను అభివ్యక్తం చేస్తుంది. అలాగే తాళి కట్టకుండ ముట్టుకుంటె తప్పుకాదా... అనే వాక్యంలో అమ్మాయికి, అబ్బాయికి మధ్య ఉండవలసిన హద్దును నిర్దేశిస్తుంది. నీవాళ్లు మావాళ్లు రాకనే/ మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే/ సిగ్గుమాని ఒకరినొకరు సిగలు పూలు పెట్టుకుని/ టింగురంగమంటు ఊరు తిరగవచ్చునా/ లోకం తెలుసుకోక మగవాళ్లు మసలొచ్చునా... అనే చరణం... వైవాహిక సంబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. పడుచుపిల్ల కంటబడితె వెంటపడుదురు/ అబ్బో వలపంతా ఒలకబోసి ఆశపెడుదురు/ పువ్వు పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి మగవాళ్ల జిత్తులన్ని తెలుసులేవయ్యా/ మీ పుట్టు పూర్వపు కథలన్ని విన్నామయ్యా... అనే వాక్యాలలో అబ్బాయిలను తేనెటీగలుగా, అమ్మాయిలను పువ్వులుగా పోల్చడం... కవికుల గురువు కాళిదాసు కవిత్వ ప్రభావం ఉందనే విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అభినవ మధులోలుపస్త్వం తథా పరిచుంబ్యచూతమంజరీం కమల వసతిమాత్ర నిర్వృతో మధుకర విస్మృతోస్యేనాం కథం! ఈ శ్లోకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే నాటకంలోనిది. ఓ మధుకరమా! కొత్త కొత్త తేనె కోసం అంగలార్చే నీవు అప్పుడు తియ్యమావిడి మొగ్గను అలా ఆస్వాదించి పువ్వు మోజులో పడి ఎలా మరిచిపోయావు. ఈ భావాలను ప్రతిబింబించేలా ఈ పాట సాగింది. పై చరణంలో మాటలలో ఎంత నిజం దాగి ఉందో, ఎవ్వరికీ తెలియనిది కాదు. అవి అక్షరసత్యాలు. ఈ చరణం చివరిలో వ చ్చే మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అతఃపరీక్ష్య కర్తవ్యం విశేషాత్ సంగతం రహః! అజ్ఞాత హృదయేష్వేవం వైరీభముసౌహృదం! ‘అభిజ్ఞాన శాకుంతలం’లో దుష్యంతుడు శకుంతలను గర్భవతిని చేసి, ఆ తరవాత ఆమె ఎవరో తెలియదని నిరాకరించినప్పుడు, గుండెలు పగిలేలా ఏడ్చే శకుంతలను చూచి, కణ్వముని చెప్పే మాటలవి. ‘ఏడువు... ఇంకా బాగా ఏడువు... ముందే ముందు వెనుకలు బాగా ఆలోచించి ప్రేమించాలి. అందులో స్త్రీ పురుషులు ఏకాంతంలో ఒకటయ్యే విషయాన్ని ఇంకా ఇంకా బాగా ఆలోచించాలి. హృదయాలను తెలియకుండా ప్రేమిస్తే ఆ ప్రేమే శత్రువు అవుతుంది’ అని భావం. ఎంతో హృద్యంగా, గంభీరంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో సాగే ఈ పాట, కొసరాజుగారి కవితాజ్యోత్స్న కమనీయం. కళ్యాణ రమణీయం. కొత్త కొత్త మోజుల్ని కోరువారు/ రోజూ చిత్రంగ వేషాలు మార్చువారు/ టక్కరోళ్లుంటారు టక్కులు చేస్తుంటారు/ నీవు చెప్పే మాట కూడ నిజమేనులే/ స్నేహం దూరంగా ఉన్నపుడే జోరౌనులే ... అనే మాటలు ఈ పాటలో పురుషుని అతి వేగానికి కళ్లెం వేసేవిగా పెంచి పెద్దజేసే ఒక పెద్ద దిక్కులా ఉన్నాయి. కట్టుబాటు ఉండాలి గౌరవంగ బ్రతకాలి/ఆత్రపడక కొంతకాలమాగుదామయ్యా... ఎంత గొప్పగా ఉన్నది వేదమంత్రంలా ఈ పాట. ‘భళ్లున పెళ్లయితే ఇద్దరికీ అడ్డులేదయ్యా’ అనే ఈ వాక్యం స్త్రీ పురుషులకు రెండు కళ్లుగా వందేళ్లు మంచిదారిలో నడిపే విధంగా ఉన్నాయి. ఇటువంటి పాట ఎటువంటి ప్రేమికులనైనా ఒక ఇంటి వాళ్లను చేసేదాకా విశ్రమించదు కదా! - సంభాషణ: నాగేష్