వరంగల్ టు బల్లార్షా..
రైళ్లలో చిన్నారులకు పోలియో చుక్కలు
వరంగల్ రైల్వేస్టేషన్ ఆరోగ్యాధికారి మీనా వెల్లడి
రైల్వేగేట్ : పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా వరంగల్ రైల్వే ఆరోగ్యాధికారి(హెల్త్ ఇన్స్పెక్టర్) బబ్లూరాం మీనా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వరంగల్ స్టేషన్ మీదుగా వెళ్తున్న రైళ్లలోని ప్రయాణికుల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించారు.
దీనికోసం ఆదివారం ఉదయం వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చిన అలహాబాద్ - త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ రైలులో వరంగల్ నుంచి బల్లార్షా వరకు తన బృందంతో వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతీ బోగీలోని ఐదేళ్ల లోపు పిల్లలకు చుక్కలు వేసినట్లు బబ్లూరాం తెలిపారు.