ఫ్రైడే
సూర్య @ 42.3 డిగ్రీలు
శుక్రవారం ‘రికార్డు’ ఉష్ణోగ్రత
ఈ సీజన్లో ఇదే అత్యధికం
సాక్షి, సిటీబ్యూరో: రోహిణి కార్తె ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి నగరంలో వడదెబ్బతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం 42.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇదే అత్యధికం.
ఎండ వేడిమికి తోడు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. గాలిలో తేమ అనూహ్యంగా 16 శాతానికి పడిపోవడంతో మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి వెళ్లినవారి చర్మం ఎండకు వాడిపోయింది. కాగా మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.