women candidates in elecitons
-
మహిళలకు మళ్లీ మొండిచెయ్యే
అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారన్న అంచనాలు తారుమారయ్యాయి. 2016 తర్వాత మరోసారి ఓ మహిళకు అత్యున్నత పీఠం త్రుటిలో చేజారింది. హారిస్ మాదిరిగానే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కూడా హోరీహోరీ తలపడ్డారు. అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన తొలి మహిళగా నిలిచారు. హిల్లరీ కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫునే పోటీ చేయడం విశేషం. అప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే. ఆయనతో డిబేట్లలో హిల్లరీ తడబడ్డా ఆద్యంతం గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించారు. అంతేగాక ఆ ఎన్నికల్లో పాపులర్ ఓట్ కూడా సాధించారు. అంటే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఆమెకే ఎక్కువ పడ్డాయి. ట్రంప్ కంటే హిల్లరీ ఏకంగా 28 లక్షల పై చిలుకు అధిక ఓట్లు సాధించారు. కానీ ఎలక్టోరల్ కాలేజీ విధానం వల్ల ట్రంప్ చేతిలో 76 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో డెమొక్రాట్ల రాష్ట్రాలుగా పేరుబడ్డ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటమి కూడా హిల్లరీ కొంప ముంచింది. హిల్లరీ 2008లో కూడా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం విఫలయత్నం చేశారు. భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న 1993–2001 మధ్య కాలంలో ఆమె ఫస్ట్ లేడీగా వ్యవహరించారు. ఆమెకు ముందు 1968లోనే చార్లెన్ మిషెల్ అనే మహిళ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచిపోయారు. మిషెల్ పేరు కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్యాలెట్ పత్రాలపై చోటుచేసుకుంది. 150 ఏళ్ల క్రితమే తొలి పోటీ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఉదంతం 150 ఏళ్ల క్రితమే చోటుచేసుకుంది. ఆమె పేరు విక్టోరియా వుడ్హల్. 1872లో ఈక్వల్ రైట్స్ పార్టీ తరఫున ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మహిళలకు పురుషులతో సమాన హక్కుల కోసం ఉద్యమించిన నేతగా వుడ్హల్కు పేరుంది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కే ఉండని రోజుల్లో ఆమె ఏకంగా అధ్యక్ష పదవికే పోటీపడటం సంచలనంగా నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. కానీ పోటీ చేసేనాటికి వుడ్హల్కు 33 ఏళ్లు మాత్రమే. ఎన్నికల్లో ఆమె ఒక్క ఎలక్టోరల్ ఓటు కూడా సాధించలేకపోయారు. తర్వాత 1884, 1888ల్లో బెల్వా ఆన్ లాక్వుడ్ అనే మహిళను ఈక్వల్ రైట్స్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దింపింది. తర్వాత చాలాకాలానికి 1964లో మార్గరెట్ చేజ్ స్మిత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీ పడ్డారు. తద్వారా ఒక ప్రధాన పార్టీ అభ్యరి్థత్వ రేసులో దిగిన తొలి మహిళగా నిలిచారు. 1972లో షిర్లీ చిషోమ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం ప్రయత్నించారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలిచిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు. ఇక ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ తొలి మహిళగా గెరాల్డిన్ ఫెరారో. ఆమె 1984లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాల్టర్ మాండలేకు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. 2004లో సారా పాలిన్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. ఆమె జాన్ మెక్కెయిన్కు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. గత 30 ఏళ్లుగా పలు చిన్న పార్టీల తరఫున కూడా ఎందరో మహిళలు అధ్యక్ష రేసులో నిలిచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
తొలి నాలుగు విడతల మాదిరే లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలోనూ మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వీరిలో మహిళలు 82 మందే! అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మొదటి, రెండో విడతలో 8 శాతం చొప్పున, మూడో విడతలో 9 శాతం, నాలుగో విడతలో 10 శాతం మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఐదో విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 18 శాతం మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి తీవ్ర అభియోగాలకు సంబంధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పారీ్టలవారీగా చూస్తే మజ్లిస్‌లో 50 శాతం, సమాజ్‌వాదీలో 40 శాతం, కాంగ్రెస్‌లో 39 శాతం, శివసేనలో 33 శాతం, బీజేపీలో 30 శాతం, టీఎంసీలో 29 శాతం, ఆర్జేడీలో 25 శాతం, శివసేన (ఉద్ధవ్)లో 13 శాతం మంది అభ్యర్థులపై తీవ్ర క్రిమినల్ కేసులున్నాయి. మొత్తమ్మీద 29 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 33 శాతం కోటీశ్వరులు ఐదో విడత అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వరులని ఏడీఆర్ నివేదిక తెలిపింది. యూపీలోని ఝాన్సీ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అనురాగ్ శర్మ అత్యధికంగా రూ.212 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మహారాష్ట్రలోని బివాండీ స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ భగవాన్ సాంబ్రే రూ.116 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత రూ.110 కోట్లతో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (మహారాష్ట్ర ముంబై నార్త్) మూడో స్థానంలో ఉన్నారు. సురేష్ గోపీనాథ్ మాత్రే (ఎన్సీపీ–ఎస్పీ) రూ.107 కోట్లు, కృష్ణానంద్ త్రిపాఠీ (కాంగ్రెస్)రూ.70 కోట్లు, సంగీత కుమారీ సింగ్‌దేవ్ (బీజేపీ) రూ.67 కోట్లు, రవీంద్ర దత్తారాం వైఖర్ (శివసేన) రూ.54 కోట్లు, కపిల్ మోరేశ్వర్ పాటిల్ (బీజేపీ) రూ.49 కోట్లు, కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ) రూ.49 కోట్లు, సంజయ్ మఫత్‌లాల్ మొరాఖియా (స్వతంత్ర) రూ.48 కోట్లతో టాప్ 10లో ఉన్నారు. విద్యార్హతలు 42 శాతం మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి పన్నెండో తరగతిలోపే. వీరిలో 21 మంది ఐదో తరగతి వరకే చదివారు. 64 మంది ఎనిమిదో తరగతి, 97 మంది పదో తరగతి గట్టెక్కారు. 50 శాతం మందికి గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యార్హతలున్నాయి. 26 శాతం మంది డిప్లోమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: రెండో విడతలో... నారీ శక్తి 8 శాతమే!
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 26న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది (మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలావి మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది). రెండో దశలో 1,210 మంది పోటీలో ఉన్నారు. వీరి ఎన్నికల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడార్) విశ్లేíÙంచగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి...► రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8 శాతమే ఉన్నారు!► పట్టభద్రులు, ఆపై చదువులు చదివిన వారు 43 శాతం.► 21 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 167 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ (35), తర్వాత బీజేపీ (31), సీపీఎం (14) టాప్‌లో ఉన్నాయి.► 390 మంది కోటీశ్వరులున్నారు. వీరిలో 105 మంది ఇండిపెండెంట్లు. తర్వాతి స్థానాల్లో బీజేపీ (64), కాంగ్రెస్ (62), బీఎస్పీ (24) నిలిచాయి. ఇద్దరికి 500 కోట్ల పైగా ఆస్తి ఉంది!► టాప్–10 సంపన్న అభ్యర్థుల్లో కర్నాటక టాప్‌లో ఉంది. మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంటకరమణే గౌడ రూ.623 కోట్లతో ‘టాప్’ లేపారు. బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. హేమమాలినికి రూ.279 కోట్ల ఆస్తులున్నాయి. మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మ (రూ.233 కోట్లు), మండ్యలో జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామి (రూ.217 కోట్లు), యూపీలో అమ్రోహా బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ (రూ.215 కోట్లు) టాప్–10లో నిలిచారు.► రెండో విడత అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.2 కోట్లు. ఆరుగురు తమకు చిల్లిగవ్వ కూడా లేదని ప్రకటించడం విశేషం!► అభ్యర్థుల్లో ఎక్కువ మంది 40–50 ఏళ్ల మధ్యవారే. సగటు వయసు 49 ఏళ్లు. 70–80 ఏళ్ల మధ్య వయసు్కలు 49 మంది ఉండగా ఇద్దరు 80 ఏళ్లు పైబడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: నాన్‌లోకల్ నాయిక
దిగ్గజాల వంటి లోకల్ నేతలు ఎందరో ఉండొచ్చు. మేం మాత్రం పక్కా నాన్ ‘లోకల్’! పుట్టి పెరిగింది ఎక్కడన్నది మాకనవసరం. మేమెక్కడ ల్యాండైతే అదే మాకు ‘లోకల్’! ‘తగ్గేదే లే...’ అంటున్నారు మహిళా రాజకీయ వలస పక్షులు. వీరిలో చాలామంది ఉత్తరప్రదేశ్‌ను తమ రాజకీయ కర్మభూమిగా మార్చుకోవడం విశేషం. అతి పెద్ద రాష్ట్రమైన యూపీకి అత్యధిక సంఖ్యలో నాన్ లోకల్ నాయికలకు రాజకీయ భిక్ష పెట్టిన రికార్డు కూడా ఉంది. అలా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ రాజకీయ అరంగేట్రం చేసినవారిలో ఏకంగా రాష్ట్రాన్నే ఏలిన వారొకరు. కేంద్రంలో చక్రం తిప్పినవారు ఇంకొకరు. ఈ వలస పక్షుల్లో సినీ తారలూ ఉన్నారు... డింపుల్ ‘భాభీ’... డింపుల్ యాదవ్ స్వస్థలం ఉత్తరాఖండ్. సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్యగా యూపీలో అడుగుపెట్టారు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి చవిచూశారు. 2012లో కనౌజ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2019లో మళ్లీ ఓడినా 2022లో ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత మెయిన్‌పురి ఉప ఎన్నికలో గెలుపొందారు. ‘వికాస్ కీ చాబీ.. డింపుల్ భాభీ..’ అంటూ సమాజ్‌వాదీ కార్యకర్తల నినాదాల నడుమ రెట్టించిన ఉత్సాహంతో ఈసారీ మళ్లీ మెయిన్‌పురిలో బీజేపీతో తలపడుతున్నారు. మీరా.. షీలా.. సుచేతా... బిహార్‌కు చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కూడా యూపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో బిజ్నోర్ ఉప ఎన్నికలో విజయంతో ఆమె ప్రస్థానం ఆరంభమైంది. కానీ తర్వాత ఆమె యూపీ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. 2017లో యూపీఏ రాష్ట్రపతి అభ్యరి్థగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవిద్ చేతిలో ఓడారు. ఢిల్లీ సీఎంగా సుదీర్ఘకాలం చక్రం తిప్పిన పంజాబ్ పుత్రి షీలా దీక్షిత్ కూడా కాంగ్రెస్ తరఫున 1994లో తొలిసారి యూపీలోని కనౌజ్ నుంచే గెలిచారు. యూపీ తొలి మహిళా సీఎంగా చరిత్రకెక్కిన ప్రముఖ స్వాతంత్య్ర యోధురాలు సుచేతా కృపలానీ స్వస్థలం పంజాబ్! రాజకీయాల్లోనూ జయప్రదం రాజమండ్రిలో పుట్టిన తెలుగుతేజం జయప్రద. అసలు పేరు లలితారాణి. తెలుగు సినిమాల్లో వెలుగు వెలగడమే గాక బాలీవుడ్‌లోనూ రాణించారు. ఏడెనిమిది భాషల్లో నటించి ఎనలేని స్టార్డం సొంతం చేసుకున్నారు. ఎనీ్టఆర్ ప్రోద్బలంతో 1994లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. పారీ్టతో విభేదించి సమాజ్‌వాదీ పారీ్టలో చేరడం ద్వారా యూపీలో అడుగు పెట్టారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి విజయం సాధించారు. అనంతరం సమాజ్‌వాదీతోనూ పొసగక రా్రïÙ్టయ లోక్‌మంచ్ పేరిట సొంత పార్టీ పెట్టి విఫలమయ్యారు. చివరికి 2019లో బీజేపీ గూటికి చేరారు. మాయావతి.. యూపీ క్వీన్ ఈ ‘బెహన్ జీ’ పుట్టింది, చదివింది ఢిల్లీలో అయినా దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది మాత్రం యూపీ నుంచే. 1984లో కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో వ్యవస్థాపక సభ్యురాలిగా చేరిన మాయావతి 1989లో తొలిసారి యూపీ నుంచే ఎంపీగా గెలిచారు. తర్వాత ఆమె రాజకీయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. రాష్ట్రంలోనే గాక దేశ రాజకీయాల్లోనూ తిరుగులేని దళిత నేతగా ఎదిగారు. 1995లో కాన్షీరాం ఆశీస్సులతో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దేశంలో తొలి దళిత మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. నాలుగుసార్లు యూపీ సీఎంగా చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రజాస్వామ్య సంచలనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అభివరి్ణంచారు. స్మృతీ ఇరానీ.. జెయింట్ కిల్లర్ ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సీరియల్ ‘క్వీన్’ బుల్లితెర నటిగా దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచారు. 2003లో బీజేపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో పోటీ చేసిన ఓడినా వెనకడుగు వేయలేదు. రాజ్యసభకు నామినేటయ్యారు. 2014లో అమేథీలో రాహుల్‌తో పోటీ పడటం ద్వారా యూపీ గడ్డపై కాలుమోపారు. తొలి ప్రయత్నంలో ఓడినా 2019లో రాహుల్‌ను ఓడించడంతో జెయింట్ కిల్లర్‌గా ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. తనను ‘అమేథీ కీ బిటియా (అమేథీ బిడ్డ)’గా అభివరి్ణంచుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. ఈసారీ అమేథీ బరిలో నిలచి, దమ్ముంటే తనతో తలపడాలంటూ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు. హేమమాలిని... మథుర ‘గోపిక’ అందం, నటనతో దేశాన్ని ఉర్రూతలూపిన బాలీవుడ్ డ్రీమ్‌గాళ్ హేమమాలిని స్వస్థలం తమిళనాడు. తమిళ సినిమాల నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టి బంపర్హిట్లతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముంబైలో స్థిరపడిన హేమ 2011లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరి యూపీ బాట పట్టారు. 2014లో మథుర నుంచి 3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ అక్కడి నుంచే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తన స్థానికతపై విపక్షాల విమర్శలను, ‘‘కృష్టుడిని ఆరాధించే గోపికగా మథురను నా స్వస్థలంగా మార్చుకున్నాను. పదేళ్లుగా ఇక్కడి ప్రజలకు సేవలందిస్తూ వారి మనసు గెలిచా. మళ్లీ గెలుపు నాదే’ అంటూ దీటుగా తిప్పికొడుతున్నారీ ‘బసంతి’! ధీశాలి... మేనక ఇందిర చిన్న కొడుకు సంజయ్ భార్యగా గాం«దీల కుటుంబంలో అడుగుపెట్టిన మేనక భర్త మరణాంతరం ఆ కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. ఆమె స్వస్థలం ఢిల్లీ. 26 ఏళ్ల వయసులో రా్రïÙ్టయ సంజయ్ మంచ్ పేరుతో పార్టీ స్థాపించి 1984లో యూపీలోని అమేథీ నుంచి ఏకంగా రాజీవ్‌నే ఢీకొట్టి ఓడారు. 1989లో పిలిభిత్ నుంచి లోక్‌సభకు వెళ్లారు. 2004లో బీజేపీలో చేరారు. పిలిభిత్ నుంచి ఆరుసార్లు గెలిచారు. కేంద్ర మంత్రిగా రాణించారు. గత ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలిచిన ఈ జంతు ప్రేమికురాలు ఈసారీ అక్కడి నుంచే బరిలో ఉన్నారు. ఇటలీ టు ఢిల్లీ.. వయా యూపీ యూపీకి రాజకీయంగా వలస వచ్చి దేశంలోనే పవర్ఫుల్ పొలిటీషియన్‌గా ఎదిగిన మహిళల్లో అగ్రతాంబూలం సోనియా గాం«దీదే. ఇటలీలో పుట్టి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పెళ్లాడి, భారత్‌ను మెట్టినింటిగా చేసుకున్న సోనియా రాజకీయ రంగప్రవేశం చేసింది యూపీ నుంచే. గాం«దీల కంచుకోటైన అమేథీ నుంచే 1999 లోక్‌సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. 2004లో రాయ్ బరేలీ నుంచి గెలిచి దేశ రాజకీయాల్లో సూపర్‌స్టార్‌గా మారారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా పదేళ్లు సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. 2019 దాకా రాయ్‌బరేలీ నుంచే లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా సోనియా రాజ్యసభకు వెళ్లడంతో ఈసారి కూతురు ప్రియాంక బరిలో దిగొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్‌సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్‌స్టా అకౌంట్‌ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్‌లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్‌రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్‌కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్‌చైర్‌లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్‌తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్‌మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్‌లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కూతురు వెన్నెల
హైదరాబాద్: కంటోన్మెంట్ శాసనసభా నియోజకవర్గంలో వారసురాళ్లు కదన భేరికి సంసిద్ధులవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణంతో అధికార బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యరి్థగా ఆయన కుమార్తె లాస్యను ప్రకటించింది. దీంతో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం మహిళా అభ్యర్థుల వైపే మొగ్గు చూపే పరిస్థితులు ఎదురయ్యాయి. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆ వర్గం ఓటర్లపై దృష్టిపెట్టిన బీజేపీ.. ఈ ఎన్నికల్లోనే అధిక సంఖ్యలో అతివలకు టికెట్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ► ఇక కాంగ్రెస్ సైతం తమ పార్టీ తరఫున మహిళనే రంగంలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఇద్దరు మహిళా అభ్యర్థులు సుషి్మత శంకర్రావు, రజని ప్రధానంగా పోటీ పడుతుండగా, అధిష్టానం సుషి్మతకే టికెట్ కేటాయించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యరి్థగా దాదాపు ఖరారు చేసిందని తెలుస్తోంది. దీంతో కంటోన్మెంట్లో వారసురాళ్ల పోటీ అనివార్యం కానుంది. సుషి్మత తండ్రి శంకర్రావు 2009–14 మధ్య కాలంలో కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. సాయన్న 1994 నుంచి 2009లో ఒక్కసారి మినహా అయిదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గద్దర్ కుటుంబం కంటోన్మెంట్‌ను ఆనుకుని ఉండే అల్వాల్‌లో నివాసముంటోంది. బీజేపీ నుంచి సుస్మిత.. బీజేపీ నుంచి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉద్యోగి పరశురామ్, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న కపిల్ బరాబరి టికెట్ కోసం తీవ్రంగానే ప్రయతి్నస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కుమార్తె సుషి్మతకు టికెట్ ఇప్పించడంలో ఆమె మామ వివేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అధిష్టానం తీరుపై అసహనంతో ఉన్న వివేక్‌ను ఒప్పించే క్రమంలో బీజేపీ పెద్దలు ఆయన మేనకోడలు సుషి్మతకు టికెట్ ఖరారు చేయొచ్చనే అంచనాలున్నాయి. కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్.. కాంగ్రెస్ నుంచి స్థానిక నేతలు డీబీ దేవేందర్, నర్సింహతో పాటు పొంగులేటి అనుచరుడు పిడమర్తి, అల్వాల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జీవక పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమర్పణకు వెళ్తూ అట్టహాసంగా ర్యాలీ నిర్వహించిన సర్వే ఆ తర్వాత సైలెంటయ్యారు. తాజా సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం గద్దర్ కుమార్తె వెన్నెల వైపు మొగ్గు చూపినట్లు సంకేతాలు అందుతున్నాయి. తొలి మహిళా ఎమ్మెల్యే మంకమ్మ 1957లో ఏర్పడిన కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బీవీ గురుమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 1967లో ఈ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో వి. రామారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడాదిలోనే ఈయన మరణించడంతో ఉపఎన్నికల్లో ఆయన సతీమణి మంకమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తిరిగి 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. కంటోన్మెంట్ తొలి, ఏకైక మహిళా ఎమ్మెల్యేగా రికార్డు ఆమె పేరిటే ఉంది. -
తమిళనాడు: అప్పుడు 32 మంది, కానీ ఇప్పుడు 12 మంది
సాక్షి, చెన్నై: అసెంబ్లీకి మహిళల ప్రాతినిథ్యం క్రమంగా తగ్గుతోంది. ఈ దఫా ఎన్నికల్లో 12 మంది మహిళలు మాత్రమే గెలుపొందారు. ఇందులో డీఎంకే పార్టీ నుంచి 6, అన్నాడీఎంకే నుంచి 3, బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీకి 1957 నుంచి మహిళల ప్రాతినిథ్యం ఉంటూ వస్తోంది. పది మందికి తగ్గుకుండా గెలుపొందేవారు. 1991లో అత్యధికంగా 32 మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2001లో 25 మంది, 2006లో 22 మంది అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 2011లో 17 మంది, 2016లో 21 మంది గెలిచారు. అయితే తాజాగా ఆ సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సహా అన్ని పార్టీల నుంచి మొత్తం 411 మంది మహిళలు బరిలోకి దిగారు. వీరిలో కేవలం 12 మంది మాత్రమే గెలుపొందారు. 12 మంది మహిళలు ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన వారిలో డీఎంకే నుంచి వరలక్ష్మి మదుసూదన్ (చెంగల్పట్టు), అమ్ములు (గుడియాత్తం), గీతా జీవన్(తూత్తుకుడి), కయల్వెలి సెల్వరాజ్( తారాపురం), శివగామ సుందరి(కృష్ణరాయపురం), తమిళరసి (మానామదురై)లు ఉన్నారు. ఇక అన్నాడీఎంకే నుంచి మరగదం కుమరవేల్ ( మదురాంతకం), చిత్ర ( ఏర్కాడు), తేన్మొళి (నీలకోటై) గెలిచారు. బీజేపీ నుంచి సరస్వతి (మోడకురిచ్చి), వానతీ శ్రీనివాసన్ (కోవై దక్షిణం), కాంగ్రెస్ నుంచి విజయథారణి (విలవన్ కోడ్) నుంచి గెలుపొందారు. డీఎంకే నుంచి విజయం సాధించిన గీతా జీవన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. చదవండి: ఎన్నికలు ఫలితాలు.. రణరంగాన్ని తలపిస్తున్న వెస్ట్ బెంగాల్ -
ఫిన్‌ల్యాండ్ కేబినెట్లో 12 మంది మహిళలు
హెల్సింకి: ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ తన కేబినెట్లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30–35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఆమె కేబినెట్లో ఏడుగురు పురుషులు కూడా ఉన్నారు. ఆర్థికం, విద్య, అంతర్గత వ్యవహారాలు వంటి ముఖ్యశాఖలన్నీ మహిళలకే అప్పగించారు. 34 ఏళ్ల వయసున్న సన్నా మారిన్ మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కొని నెగ్గారు. మారిన్‌కు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి. ఫిన్‌ల్యాండ్‌లో అధికారంలో ఉన్న సెంటర్ లెఫ్ట్ సంకీర్ణ సర్కార్‌ను నడపడం ఆమె ముందున్న అతి పెద్ద సవాల్. ‘‘మర్యాద మన్ననల మధ్య ప్రతీ చిన్నారి ఎదుగుదల ఉండాలి. ఎవరైనా ఏదైనా సాధించేలా సమాజాన్ని నిర్మించడమే నా ధ్యేయం‘‘అని మారిన్ ట్వీట్ చేశారు. దేశంలో పోస్టల్ సమ్మెను ఎదుర్కోవడంలో విఫలమైనందుకు గతవారంలో అంటి రిన్నె ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మారిన్ పగ్గాలు తీసుకున్నారు. సెంటర్ పార్టీకి చెందిన కత్రి కులుమణి (32)కి ఆర్థిక శాఖ, గ్రీన్ పార్టీ నాయకురాలు మారియా ఒహిశాలో (34)కు అంతర్గత వ్యవహారాలు, లెఫ్ట్ కూటమి చైర్‌వుమెన్ లీ అండెర్సన్ (32)కు విద్యాశాఖ అప్పగించారు. కార్మికుల అసంతృప్తి జ్వాలలు, ఎటు చూసినా సమ్మెలు నడుస్తున్న వేళ ప్రధానిగా మారిన్ తన ఎదుట ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. -
225 మంది కోటీశ్వరులేనట..!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు ఏడో దశ ఎన్నికల పోలింగ్‌తో ఓట్ల పండుగ సమాప్తం కానుంది. మరో మూడు రోజులు ఎదురు చూస్తే.. మే 23న రాజు ఎవరో బంటు ఎవరో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు కేవలం 724 మంది మాత్రమే. చిన్న రాజకీయ పార్టీలు మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించగా.. జాతీయ పార్టీలు మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడ్డాయి. బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలను విశ్లేషించిన నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థలు అభ్యర్థుల నేర చరిత్ర, విద్య, ఆర్థిక అంశాల గురించి సంయుక్తంగా ఓ రిపోర్డును విడుదల చేశాయి. మొత్తం 724 మంది బరిలో నిలవగా.. 716 మంది అఫిడవిట్లును పరిశీలించిన మీదట ఈ రిపోర్టును విడుదల చేసినట్లు సదరు సంస్థలు వెల్లడించాయి. వివరాలు సరిగా లేనందువల్ల మిగతా ఎనిమిది మంది అఫిడవిట్లను పరిశీలించలేదని పేర్కొన్నాయి. రిపోర్టులోని వివరాలు.. నేర చరితులు.. మొత్తం 724 మంది మహిళలు బరిలో నిలవగా.. వీరిలో 110 మంది మీద క్రిమినల్ కేసులుండగా.. వీరిలో 78 మంది సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు సదరు రిపోర్టు వెల్లడించింది. ఇక పార్టీలపరంగా నేరచరితుల వివరాలు.. కాంగ్రెస్ పార్టీ నుంచి 54 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 14 మంది మీద కేసులుండగా.. 10 మీద సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు తెలిపింది. ఇక అధికార బీజేపీ నుంచి 53 మంది పోటీ చేయగా.. 18 మంది క్రిమినల్ కేసులుండగా.. 10 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీఎస్పీ నుంచి 24 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇద్దరి మీద, తృణమూల్ నుంచి 23 మంది పోటీ చేయగా.. ఆరుగురు నేర చరితులుండగా.. వారిలో నలుగురి మీద తీవ్ర క్రిమినల్ కేసులున్నట్లు తెలిసింది. ఇక 222 మంది స్వతంత్య్ర అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో అత్యల్పంగా కేవలం 22 మంది నేర చరితులుండగా.. 21 మంది మీద తీవ్ర నేరారోపణలు ఉండటం గమనార్హం. ఆర్థిక నేపథ్యం.. ఈ 716 మందిలో 255 మంది కోటీశ్వరులే కావడం విశేషం. అభ్యర్థుల సగటు ఆస్తి రూ.5.63 కోట్లుగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మథుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న హేమమాలిని రూ.250 కోట్ల ఆస్తులతో కోటీశ్వరులైన మహిళా అభ్యర్థుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించారు. రూ.220 కోట్ల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేట టీడీపీ అభ్యర్థి డీఏ సత్యప్రభ రెండో స్థానంలో ఉండగా.. శిరోమణి అకాళీ దళ్ పార్టీ తరఫున పంజాబ్ బఠిండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రూ. 217 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఎనిమిది మంది మాత్రం తమ పేరిట అసలు ఆస్తులు లేవని వెల్లడించారు. విద్యావంతులు.. ఇక 724 మందిలో 232 మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి ఇంటర్ లోపే. 396 మంది డిగ్రీ ఉత్తీర్ణులయినట్లు వెల్లడించగా.. 37 మంది అక్షరాస్యులు(రాయడం, చదవడం వరకే పరిమితం) కాగా 26 మంది నిరాక్షరాస్యులుగా ప్రకటించుకున్నారు. ఇక పోటీ చేసిన వారిలో 25 - 50 ఏళ్ల వయసు వారు 531 మంది ఉండగా.. 50 - 81 ఏళ్ల లోపు వారు 180 మంది కాగా.. ఒక్కరు మాత్రం తన వయసు 80 ఏళ్ల కన్నా ఎక్కువే అన్నారు. మరో ముగ్గురు అభ్యర్థులు తమ వయసు వివారాలు వెల్లడించకపోగా.. ఒక అభ్యర్థి తన వయసు 25 కంటే తక్కువగా ప్రకటించారు. -
పార్లమెంట్ గడప తొక్కని..జిల్లా ‘మహిళ’!
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలున్నా.. స్వతంత్ర భారతంలో 1952 నుంచి మొదలై ఇప్పటి దాకా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఇక్కడి నుంచి ఎంపీగా గెలవలేదు.. పార్లమెంట్ గడప తొక్కలేదు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు పదిహేడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్, కాంగ్రెస్, సీపీఐ, టీపీఎస్, టీడీపీలు ప్రాతినిథ్యం వహించాయి. కానీ, ఈ పార్టీల నుంచి ఇప్పటి దాకా ఒక్క మహిళ కూడా ఎంపీలుగా పోటీ చేసింది లేదు. మరోవైపు 2004 వరకు ఉనికిలో ఉన్న మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం 1962 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం రద్దయ్యే వరకు 12 సార్లు ఎన్నికలు జరగగా.. ఒక్క మహిళ కూడా ఎంపీగా గెలిచింది లేదు. ఇక్కడి నుంచి సీపీఎం 1996 ఎన్నికల్లో ఒక్కసారి మల్లు స్వరాజ్యాన్ని పోటీకి నిలబెట్టింది. అసెంబ్లీకి వెళ్లినా... దక్కని పార్లమెంట్ యోగం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించిన వారు, మంత్రులుగా పనిచేసిన మహిళలు ఉన్నా.. ఎంపీలుగా మాత్రం వారికి అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యేలుగా... ఆరుట్ల కమలా దేవి, మల్లు స్వరాజ్యం, కమలమ్మ, గడ్డం రుద్రమదేవి, ఉమా మాధవరెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, ఉత్తమ్‌పద్మావతి... వంటి వారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఆరుట్ల కమలాదేవి, ఉమా మాధవరెడ్డి మూడేసి సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఉమా మాధవరెడ్డి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో విప్‌గా పనిచేసిన సునీతామహేందర్ రెడ్డి ఆలేరు నుంచి రెండో సారి కూడా విజయం సాధించారు. శాసన సభలో జిల్లా మహిళకు చోటు దక్కినా.. వారికి పార్లమెంట్ యోగం మాత్రం దక్కలేదు. వాస్తవానికి వారిని అభ్యర్థులుగా నిలబెట్టడంలో ఆయా పార్టీలు విఫలమయ్యాయన్న అభిప్రాయం బలంగా ఉంది. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 1996 పోటీ సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డి చేతిలో ఆమె 43,876 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జిల్లా పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో సీపీఎం మాత్రమే తన అభ్యర్థిగా మహిళను బరిలోకి దింపింది. -
రాజకీయ రంగంలో 'ఆమె'కు అన్యాయమే!
అవనిలో సగభాగమైన అతివలకు రాజకీయ రంగంలో ప్రధాన పార్టీలు మొండి చేయి చూపిస్తున్నాయి.మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది కనుక కచ్చితంగా మహిళలకు 50శాతం స్థానాలు కేటాయిస్తారు. తప్పని పరిస్థితుల్లో భర్తలు తమ భార్యలను రంగంలోకి దింపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రధాన పార్టీలు మహిళలను నిర్లక్ష్యం చేశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 202మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో కేవలం 13 మంది మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు. సాక్షి, ఆలేరు : ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున గొంగిడి సునీత, ఇండిపెండెంట్ అభ్యర్థిగా జన్నె సరిత పోటీ చేస్తుండగా కోదాడ నుంచి నల్లమాద పద్మావతి కాంగ్రెస్ తరఫున, నాగార్జునసాగర్‌లో నివేదితారెడ్డి (బీజేపీ), సౌజన్య బీఎల్ఎఫ్ తరఫున పోటీల్లో ఉన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పర్వీన్, సూర్యాపేటలో ప్రజాబంధు పార్టీ తరఫున పాల్వయి వనజ, హుజూర్‌నగర్‌లో ఇండిపెండెంట్‌గా బానోతు పద్మ, నకిరేకల్‌లో ఎన్సీపీ అభ్యర్థిగా స్వరూపరాణి, తుంగతుర్తిలో టీపీపీఐ అభ్యర్థిగా ఇందిరా, ఎన్జేపీఐ అభ్యర్థిగా పాల్వయి పద్మ, ఇండిపెండెంట్లుగా సృజన, శిల్పలు ఎన్నికల బరిలో నిలిచారు. ఓటర్లుగా మహిళలే అధికం ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. పురుషులు 12,80,959 స్త్రీలు 12,85,194 ఇతరులు 112 మంది ఉన్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పురుషుల కన్న మహిళలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొ త్తం ఓట్లు 25,66,265 ఓట్లు ఉన్నాయి. నాటినుంచి ఎనిమిది మంది మహిళలే .. 1952 నుంచి 2014 వరకు ఉమ్మడి జిల్లాలో 8 మంది మహిళలు మాత్రమే శాసన సభకు ఎన్నికయ్యారు. వీరిలో ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి, నకిరేకల్ నుంచి మూసాపేట కమలమ్మ, తుంగతుర్తి నుంచి మల్లుస్వరాజ్యం, నల్లగొండ నుంచి గడ్డం రుద్రమాదేవి, భువనగిరి నుంచి ఉమామాధవరెడ్డి, దేవరకొండ నుంచి భారతిరాగ్యానాయక్, ఆలేరు నుంచి గొంగిడి సునీత, కోదాడ నుంచి పద్మావతిలు ఎన్నికయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదమేదీ..? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ప్రశ్న : మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: చంద్రబాబునా యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేస్తున్న తన భర్త ఎలిమినేటి మాధవరెడ్డి 2000 సంవత్సరంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చిన సంఘటనలో మృ తిచెందారు. దీంతో రాజకీయంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. ప్రశ్న : ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎలా వచ్చింది? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: 2000 సంవత్సరంలో తన భర్త మాధవరెడ్డి మృతి అనంతరం ప్రజల కోరిక మేరకు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ప్రశ్న : మీ పదవీ కాలంలో ఏయే కార్యక్రమాలు నిర్వహించారు? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: తాను మూడుసార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాను. నా పదవీకాలంలో నియోజకవర్గంలోని చౌటుప్పల్, బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయాలను నిర్మించబడింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని శివారెడ్డిగూడెం, గోసుకొండ గ్రామాలకు మూసీ నీటి కాల్వను నిర్మించబడింది. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వ నిర్మాణానికి సర్వే చేసి ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వేలిమినేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంతోపాటు మరి రెండు ప్రాంతాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశాం. రోడ్లు, పాఠశాల భవనాలను నిర్మించాం. ప్రశ్న : అప్పటి పరిస్థితుల్లో మహిళలకు ఎలాంటి అవకాశాలు లభించాయి? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: అప్పటి పరిస్థితుల్లో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించారు. మహిళలకు పెద్దపీట వేశారు. ప్రశ్న : ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా యి, మహిళలకు అవకాశాలు ఉన్నాయా లేవా? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: ప్రస్తుతం రాజకీయాల్లో అలాగే ఉన్నాయి. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. కానీ ఇంత వరకు అది జరగడం లేదు. జనాభాలో 50శాతం ఉన్న మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి. ప్రస్తుతం మాత్రం ఫర్వాలేదు. ప్రశ్న : అప్పటికి ఇప్పటికీ ప్రచార శైలి తేడా ఎలా ఉంది? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: అప్పటికి ఇప్పటికీ ప్రచార శైలిలో చాలా తేడా ఉంది. అప్పట్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చేవారు. రాజకీయాల్లో మనస్ఫూర్తిగా పని చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మరిన్ని వార్తాలు... -
తొలిసారి ఎన్నికల బరిలో మహిళలు
సౌదీ అరేబియాలోని మహిళలు తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తూ, ప్రచార పర్వం మొదలుపెట్టారు. మహిళలకు సమాన హక్కులు కలగా మిగిలిన సౌదీలో క్రమంగా సంస్కరణల పర్వం ప్రారంభం అవుతోంది. డిసెంబర్ 12న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు అవకాశం కల్పించడంతో సుమారు 900 మంది వరకు మహిళలు పోటీ చేస్తున్నారు. వాస్తవానికి ఇంతవరకు అక్కడి మహిళలకు ఓటుహక్కు కూడా లేదు. సౌదీలో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు 2005లో జరిగాయి. తర్వాత 2011లో జరిగాయి. కానీ రెండుసార్లూ వాటిలో కేవలం పురుషులే పోటీ చేశారు. పోటీ చేస్తున్నవాళ్లలో మహిళలుంటే చాలని, తాము వాళ్లకే ఓటేస్తామని, వారి గురించి తమకు ఏమీ తెలియకపోయినా పర్వాలేదని ఓటుహక్కు లభించిన ఓ ఉపాధ్యాయిని చెప్పారు. మొత్తం 284 మున్సిపల్ స్థానాలకు పోటీ జరుగుతుండగా వాటిలో 7వేల మంది పోటీ పడుతున్నారు. సౌదీ జనాభా సుమారు 2.1 కోట్లు ఉండగా, అందులో కేవలం 1.31 లక్షల మంది మహిళలకు మాత్రమే ఇప్పటివరకు ఓటుహక్కు వచ్చింది. అదే పురుష ఓటర్లు మాత్రం 13.5 లక్షల మంది ఉన్నారు. దూరాలు వెళ్లి ఓటు నమోదు చేయించుకోవాల్సి రావడం, అధికారులు ఇబ్బంది పెట్టడం, అవగాహన లేమి తదితర కారణాల వల్లే ఓటర్లుగా నమోదు తగ్గిందని మహిళలు చెబుతున్నారు.