the young man
-
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
పరిగి: గొల్లపల్లికి చెందిన చిన్న మల్లయ్యగారి మల్లికార్జున అలియాస్ సీఎం మల్లి (25) అప్పులు ఎక్కువై బయట తలెత్తుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ శరత్చంద్ర, బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లిలో మగ్గాలు నేస్తూ భార్య, కుమార్తెను పోషించేవాడు. గ్రామంలో చిట్టీలు వేసి.. పలువురికి పూచీ కూడా పడ్డాడు. ఈ క్రమంలో దాదాపు రూ.లక్ష వరకు అప్పయ్యింది. మద్యం, ఇతర వ్యసనాలకు అలవాటుపడటంతో మరో లక్ష రూపాయల వరకు చేతి బదుల రూపంలో పలువురి వద్ద అప్పు చేశాడు. వచ్చిన సంపాదనతో అప్పులు తీరకపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం అర్ధరాత్రి ఇంటి సమీపంలోని చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం వేకువజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఎస్ఐ శరత్చంద్ర తన పోలీసు బృందంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
హత్య చేసి.. కాల్చివేసి...
పావగడలో యువకుడి దారుణ హత్య హతుడు దేవరకొండ వాసిగా గుర్తింపు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు పావగడలోని మున్సిపల్ బస్టాండు సమీపంలో దేవరకొండకు చెందిన రంగనాథ్(35) దారుణ హత్యకు గురయ్యాడని ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి మంజునాథ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బస్టాండు సమీపంలోని ఎస్బీఐ సమీపంలో చరండీలో పడేశారన్నారు. అంతటితో ఆగక హతుడ్ని గుర్తు పట్టకుండా ఒంటిపై పెట్రోలు పోసి తగులబెట్టారన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఆత్మకూరు : వై.కొత్తపల్లి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రమణానాయక్ (35) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం తరగకుంట తండాకు చెందిన రమణా నాయక్ మరో నలుగురితో కలిసి సోమవారం బెళుగుప్ప మండలం కాలువపల్లి వద్ద ఆలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఇన్నోవా వాహనంలో వెళ్లారు. అదే రోజు రాత్రి తిరిగి అక్కడి నుంచి అనంతపురం వెళ్తుండగా ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి వద్దకు రాగానే ఇన్నోవా వాహనం టైరు పంక్చర్ కావడంతో అదుతుప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ చేస్తున్న రమణానాయక్‌కు తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు వెంటనే 108కు సమాచారం అందించగా రమణానాయక్ను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలో రమణానాయక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
పెద్దవడుగూరు(తాడిపత్రి): పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ముళ్ల పొదల్లో చిన్నవడుగూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ రమణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు శ్రీకాంత్ గుత్తిలో మందుల దుకాణంలో పనిచేసేవాడని తెలిపారు. మృతదేహంపై చిన్నపాటి గాయాలు, సమీపంలోనే ద్విచక్రవాహనం పడి ఉండటాన్ని గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా.. అనారోగ్య కారణాలతో మృతి చెందాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య శ్రీలత, 9 నెలల కుమార్తె ఉన్నారు. -
రైలు ఢీకొని యువకుడు..
పెనుకొండ: పట్టణంలోని దర్గాపేటకు చెందిన ముఫాసిర్ (25) రైలు ఢీకొని ఆదివారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు, బంధువుల కథనం మేరకు.. కొన్ని నెలలుగా ముఫాసిర్ మతి స్థిమితం సరిగా లేక ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఆదివారం రాత్రి మార్కెట్‌యార్డ్ సమీపంలో రైలు ఢీకొని మృత్యువాతపడ్డాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న తల్లిదండ్రులు నసీమున్నీసా, హుజూర్ అహ్మద్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
యువకుడి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
మట్టెవాడ(గూడూరు) : మండలంలోని మట్టెవాడ శివారులో ఉన్న కొంగరగిద్దలో శని వారం రాత్రి యువకుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన సంఘటన పలు సందేహాలకు తావిస్తోంది. కొంగరగిద్ద గ్రామ సమీపంలోని మెు క్కజొన్న చేనులో విద్యుత్ మోటార్ మెకానిక్ ఇరుప ఈశ్వర్(30) రక్తపు మడుగులో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం ఉదయం సీఐ బి.రమేష్‌నాయక్, ఎస్సై సతీష్‌లు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీ లించిన అనంతరం గ్రామస్తులతో మా ట్లాడి పలు వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం కారణమై ఉం డొచ్చని పలువురు పేర్కొనగా, విద్యు త్ మోటార్ల రిపేర్ వ్యాపారానికి గండి కొడుతున్నాడని ఎవరైనా తోటి మెకానిక్‌లు హతమార్చి ఉండొచ్చని ఇం కొందరు గ్రామస్తులు పోలీసులకు చె ప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మృ తుడి భార్య పద్మ తన భర్త ఈశ్వర్ హత్యకు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారకులై ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. అనంతరం ఈశ్వర్ భౌతికకాయానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టంకు తరలించారు. వెంటనే పోలీ సులు అనుమానితులుగా భావించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు, మరికొందరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
జఫర్‌గఢ్ : ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కొందరు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు వారు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక మనోవేదనకు గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఓబులాపూర్‌కు చెందిన వంగాల నరేష్ కొన్నేళ్ల క్రితం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తీగల కరుణాకర్‌రావు.. స్థానిక రైతు గార్లపాటి నీరజారెడ్డి భూమిని జేసీబీతో చదును చేయించాడు. అయితే జేసీబీ ద్వారా చేసిన పనిని ఉపాధిహామీ ద్వారా కూలీ లతో చేయించినట్లుగా రికార్డు చేయాలని కరుణాకర్‌రావు, నీరజారెడ్డిలు ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్‌పై ఒత్తిyì చేయగా ఆయన నిరాకరిం చాడు. దీంతో ఉపాధిహామీలో అవకతవకలు జరిగాయని, ఇందుకు బాధ్యుడైన ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్‌పై చర్యలు తీసుకోవాలని నీరజారెడ్డి, కరుణాకర్‌రావులు ఉపాధి హామీ పీడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడితో విచారణ చేపట్టిన అధికారులు నరేష్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే కొన్ని రోజుల తర్వాత తిరిగి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇప్పిస్తామంటూ సదరు ఫిర్యాదుదారులు నరేష్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు నరేష్ వారికి కొన్ని నెలల క్రితం రూ. 1.50 లక్షలు ముట్టజెప్పాడు. అయినప్పటికీ వారు ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన నరేష్ బుధవారం ఉదయం నీరజారెడ్డి, కరుణాకర్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనిం చిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలిచ్చారు. విష యం తెలుసుకున్న నరేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు కారకులైన వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కరుణాకర్‌రావు, నీరజారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితుడి భార్య వంగాల సుమలత ఫిర్యాదు మేరకు కరుణాకర్‌రావు, నీరజారెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు హెడ్ కాని స్టేబుల్ శ్యాంసుందర్ తెలిపారు. -
విషాదం నింపిన ప్రమాదం
- రోడ్డున పడిన రెండు కుటుంబాలు పుల్కల్: రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది. బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రెండు కుటుంబాల వారు సైతం కటిక నిరుపేదలు. రోడ్డు ప్రమాదంతో సింగూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. సింగూర్‌కు చెందిన కల్లపల్లి శేఖర్(28) తండ్రి కృష్ణ మేకలు కాస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం తమ బంధువులను చూసేందుకు బైక్ పై తన స్నేహితుడితో కలిసి శేఖర్ వెళ్లాడు. ఈ క్రమంలో చిల్వర గ్రామ శివారులో ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో శేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన యాదయ్య గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మృతుడు శేఖర్ ఒక్కడే కుమారుడు. తనకు తలకొర్వి పెడతాడనుకున్న కొడుకు తన ముందే చనిపోతే తాము బతికేది ఎలా అంటూ అతని తల్లిదండ్రులు రోదించడం అందరి కంటా కన్నీరు పెట్టించింది. ఇది ఇలా ఉంటే ఇదే ప్రమాదంలో గాయపడిన యాదయ్య పరిస్థితి మరీ దారణంగా ఉంది. అతడి తండ్రి మొగులయ్యకు రెండేళ్లుగా పక్షవాతంతో కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. దీంతో తల్లి సత్తమ్మపైనే కుటుంబం ఆధారపడింది. అంతలోనే తన కుమార్తెకు గతేడాది సుల్తాన్పూర్ చెందిన వ్యక్తితో వివాహం జరిపించగా ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుమార్తె సైతం ఇంటికి చేరింది. ఇప్పటికే కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంతలోనే రోడ్డు ప్రమాద సంఘటన వారిపై పెనుభారంగా పరిణమించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యాదయ్యను సోమవారం రాత్రి గాంధీకి తీసుకెళ్లాలని సంగారెడ్డి ఆసుపత్రి వైద్యులు సూచించారు. కానీ అంబులున్స్కు ఇచ్చేందుకు చిల్లిగవ్వలేని దీనస్థితి వారిది. యాదయ్య స్నేహితులు, నాయకులు తోచిన సహాయం చేయడంతో మంగళవారం ఆసుపత్రికి తరలించారు. కనీసం మందులు కొనలేని తాము హైదరాబాద్‌లో ఎలా ఉండి వైద్యం చేయించాలో తోచడం లేదన్నారు. ఆదుకుంటేనే బతుకుతాం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన తమ కుమారుడిని ప్రభుత్వం ఆదుకుంటేనే తాము బతుకుతామని యాదయ్య తల్లి సత్యమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. వ్యవసాయం చేసుకునేందుకు గుంట భూమి లేదు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి తమదన్నారు. ప్రభుత్వం కనికరిస్తేనే తన కుమారుడికి వైద్యం చేయించగలమన్నారు. నాయకులు, అధికారులు స్పదించి వైద్యం, మందులు అందించేందుకు కావాల్సిన సహాయం చేయాలని ఆమె కోరింది. -
ఎగతాళి
- బాలిక మెడలో తాళి కట్టిన యువకుడు - చదివిస్తానంటూ మాయమాటలు - పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు - నిందితుడ్ని విచారిస్తున్న పోలీసులు యలమంచిలి : మాయమాటలు చెప్పి బాలిక మెడలో పసుపుతాడు వేశాడో ప్రబుద్ధుడు. రెండు రోజులు తర్వాత విజయవాడ తీసుకు వెళ్తానని ..తాళిని భద్రంగా చూసుకోమని చెప్పాడు. ఈలోగా వ్యవహారం వెలుగుచూడటంతో తాళి కట్టిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా..యలమంచిలి పట్టణం సీపీపేట రెల్లివీధికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం సాయంత్రం స్నేహితురాళ్లతో శివాలయం వద్దకు వెళ్లింది. అక్కడ బొమ్మలపెళ్లి ఆట ఆడుకుంటోంది. ఇదేసమయంలో బంగారి అప్పన్న(22) అక్కడకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న పసుపు తాడును బాలిక మెడలో కట్టాడు. ఒకటిరెండు రోజుల్లో విజయవాడ తీసుకెళ్లి కాపురంపెట్టి చదివిస్తానని చెప్పాడు. తల్లిదండ్రులు చూస్తారన్న భయంతో బాలిక మెడలోని పసుపు తాడును స్కూల్ బ్యాగులో పెట్టింది. సోమవారం స్కూల్‌కు వెళ్లినప్పుడు తాళిబొట్టు మెడలో వేసుకుంది. తోటి విద్యార్ధినులు వెంటనే క్లాస్‌టీచర్ దృష్టికి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులకు కబురుపెట్టారు. తల్లిదండ్రులు వచ్చి తాము కులపెద్దలతో మాట్లాడి పరిష్కరించుకుంటామని, విషయాన్ని బయటపెట్టవద్దని చెప్పారు. ఒక టీచర్ ద్వారా విషయం బయటకు వ్యాపించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖాధికారులు విచారణ.. జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి సంఘటనపై విచారణ జరపాలని ఉప విద్యాశాఖాధికారి రేణుకను ఆదేశించారు. ఆమె మంగళవారం పాఠశాల సందర్శించారు. బాధిత బాలిక, ఆమె స్నేహితురాళ్లను విచారించారు. జరిగిన ఉదంతాన్ని మర్చిపోయి జాగ్రత్తగా చదువుకోవాలని బాలికకు చెప్పారు. బుద్దిగా చదువుకుంటానని, తల్లిదండ్రులను విడిచి వెళ్లనని బాలిక తనను కలిసిన విలేకరులకు చెప్పింది. నిందితుడు అప్పన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో సంయమనం.. గోప్యత పాటించలేదంటూ టీచరుపై దళితహక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంపాని చంద్రరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రేమ పేరుతో నగలు కాజేసిన ప్రబుద్ధుడు
తుర్కయంజాల్: ప్రేమ పేరుతో బాలికను అపహరించి, ఆమె వద్ద ఉన్న నగలు, నగదు కాజేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం బోవిన్పల్లి గ్రామానికి చెందిన మేడ అరుణ్‌రెడ్డి (24) అలియాస్ మహబూబ్‌బాషా అలియాస్ అర్జున్‌రెడ్డి నగరంలో ఆటో నడుకుంటూ జీవిస్తున్నాడు. బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. 2014 జులైలో ఆమె కళాశాలకు వెళ్లి వచ్చే సమయంలో అరుణ్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడు. ఫేస్బుక్, ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని ఆమెకు దగ్గరయ్యాడు. కొన్ని రోజుల తర్వాత తనకు కడుపులో పుండు ఏర్పడిందని, లేజర్ చికిత్స చేయించుకొనేందుకు డబ్బు ఇవ్వమని అరుణ్‌రెడ్డి బాలికను కోరాడు. ఆమె స్పందించకపోవడంతో మన మధ్య వివాహేతర సంబంధం ఉందని స్నేహితులకు, తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పి పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తల్లికి చెందిన సుమారు 30 తులాల బంగారు నగలతో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 3.50 లక్షలను ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసి అతనికి ఇచ్చింది. అరుణ్‌రెడ్డి ఆ నగల్లో కొన్నింటిని అమ్ముకొని, నగదు మొత్తం జల్సాలకు, ఆసుపత్రి ఖర్చులకు వాడుకున్నాడు. కాగా, అరుణ్‌రెడ్డికి నగలు, నగదు ఇచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఊరుకోరని భావించిన బాలిక 2 ఫ్రిబవరి 2015 రాత్రి దోపిడీ నాటకానికి తెరదీసింది. బెడ్రూమ్లో చదువుకుంటున్న తన వద్దకు దొంగలు వచ్చి... నోట్లో బట్టలు కుక్కి..చేతులు కట్టేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇది నిజమేనని నమ్మిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు పూర్తి విషయాలు బయటపడ్డాయి. మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న అరుణ్‌రెడ్డిని మంగళవారం వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 16 తులాల బంగారు నగలు రాబట్టగలిగారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అమ్మాయిలపై దృష్టి సారించాలని ఏసీపీ తెలిపారు. -
జావీద్‌కు ఐసీస్‌తో సంబంధం లేదని నిర్ధారణ..!
యువకుడితో పాటు కుటుంబ సభ్యులకు బెంగళూరు పోలీసుల కౌన్సెలింగ్ ఖమ్మం క్రైం: నగరానికి చెందిన యువకుడికి ఐసీస్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థతో సంబంధం లేదని పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది. నగరంలోని పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ జావీద్(25) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అతను తొమ్మిది మందితో కలిసి టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ వెళ్లగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా సిరియాలోని ఉగ్రవాద సంస్థలో చేరుందకు వెళుతున్నట్లు తెలియడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. దీంతో అక్కడి పోలీసులు వెంటనే జావీద్‌కు కుటుంబ వివరాలు తెలియజేయాలని ఆదేశించడంతో ఖమ్మం ఎస్బీ పోలీసులు రంగంలోకి దిగారు. జావీద్ బంధువులతో పాటు అతని కుటుంబ సభ్యులను విచారించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అంతకు ముందే జావీద్ తండ్రికి బెంగళూరు పోలీసులు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పడంతో ఆయన వెళ్లాడు. బెంగళూరులో ఉన్న చిన్న కుమారుడిని తీసుకుని అక్కడి పోలీసులను కలిశాడు. అదే సమయంలో ఖమ్మం పోలీసులు ఇక్కడ విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితమే ఖమ్మం వచ్చిన జావీద్ తనకు సౌదీలో ఉద్యోగం వచ్చిందని చెప్పివెళ్లిపోయాడు. కానీ అతను టర్కీలో పోలీసులకు పట్టుబడడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఆందోళనకు గురయ్యారు. సోమవారం అన్ని పత్రికల్లో నగరానికి చెందిన యువకుడికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు కథనాలు రావడం, అతని ఇంటికి ఎస్బీ, ఇంటిలిజెన్స్, త్రీటౌన్ పోలీసులు, మీడియా రావడంతో స్థానికంగా కలకలం రేగింది. సంబంధం లేదని నిర్ధారించిన పోలీసులు..! జావీద్‌కు ఐసీస్‌తో సంబంధాలు లేవని బెంగళూరు పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది. అతనితోపాటు తొమ్మిది మంది ఉగ్రవాద సంస్థ పట్ల ఫేస్ బుక్ ద్వారా ఆకర్షితులై అక్కడికి వెళ్లినట్లు అక్కడి పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జావీద్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా..? లేవా..? అనే కోణంలో పోలీసులు విచారించినట్లు తెలిసింది. పట్టుబడినవీరు సిరియా వెళ్లడానికి డబ్బులు ఎవరు సమకూర్చాలు అనే విషయంపై పోలీసులు సమాచారం సేకరించినట్లు తెలిసింది. వీరంతా ఉగ్రవాద సంస్థల పట్ల ఆకర్షితులుగా మారడానికి ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన సల్మాన్ ప్రారంభించిన ఫేస్బుక్ ఖాతా అని తెలిసినట్లు సమాచారం. కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు... జావీద్తో పాటు అతని తండ్రి, సోదరుడికి బెంగళూరు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఉగ్రవాదంలో చేరడం వల్ల కలిగే అనర్థాలు, చేరిన తర్వాత పరిస్థితుల గురించి అక్కడి కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు వివరించినట్లు సమాచారం.అలాగే వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులకు తప్పక సహకరించాలని కూడా వారికి చెప్పినట్లు సమాచారం. జావీద్‌ను ఒకటి రెండు రోజుల్లో కుటుంబ సభ్యులు ఖమ్మం తీసుకువస్తున్నట్లు తెలిసింది. -
ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద యువకుడు గల్లంతు
నీటిలో చిక్కుకున్న మరో యువకుడిని కాపాడిన పోలీసులు వల్లూరు: పెన్నానదిలో ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు... చెన్నూరు మండలం ఉప్పరపల్లె ఎస్సీ కాలనీకి చెందిన సగినాల ఓబులేసు(35) ,తప్పెట వెంకటరమణ మరో ముగ్గురు యువకులతో కలసి ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు సరదాగా గడపడానికి వచ్చారు. ఆనకట్ట సమీపంలో నదిలో ఈత ఆడుతుండగా ప్రమాదవశాత్తూ ఓబులేసు, వెంకట రమణలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఓబులేసు నీటిలో పూర్తి మునిగి కొట్టుకుని పోయాడు. వెంకట రమణ మాత్రం కొద్ది దూరం నీటిలో కొట్టుకుని పోయి నది మధ్యలోని ఒక బండ రాయిని ఆసరాగా చేసుకుని నిలబడ్డాడు. రక్షించమని కేకలు వేశాడు. స్నేహితులు రక్షించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ కొండారెడ్డి సంఘటనా స్థలానికి సిబ్బందితో వెంటనే చేరుకున్నాడు. స్థానికంగా ఉన్న గజ ఈతగాల్ల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. ఎన్ .ఆంజనేయరెడ్డి, వాసు, జీ. ఆంజనేయరెడ్డి, విజయ్, శ్రీను అనే యువకులు తాడు సహాయంతో నదిలోకి దిగి నీటిలో చిక్కుకున్న వెంకట రమణను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. కాగా గల్లంతైన ఓబులేసు దాదాపు 10 సంవత్సరాల క్రితం రాజంపేటకు చెందిన పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సంతానం లేక పోవడంతో తన సోదరుని కుమార్తెను పెంచుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. ఓబులేసు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా రోధించారు. మద్యం మత్తుతోనే.. చెన్నూరుకు చెందిన యువకులు మద్యం సేవించి నదిలోకి దిగడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. నదిలో పెద్ద ప్రవాహమేమీ లేదు. మద్యం సేవించి నదిలోకి దిగిన యువకులు అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుని పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ వెంకటేష్ సందర్శించారు. ఎస్ఐ కొండారెడ్డితో మాట్లాడి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. -
దేశరాజధానిలో పట్టపగలే యువకుడి దారుణ హత్య
కత్తులతో దాడి చేసి హత్య.. నిందితుల్లో మైనర్లు.. సీసీటీవీలో వీడియో ఫుటేజీ న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే 21ఏళ్ల యువకుడు ఐదుగురు బాల నేరస్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆగ్నేయ ఢిల్లీలో జనంతో కిక్కిరిసిన మదన్‌గిర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నరకు ఈ దారుణ సంఘటన జరిగింది. ఐదుగురు బాలురు దారికాచి సచిన్ అనే యువకుడిపై కత్తులతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారని, తీవ్రంగా గాయపడిన సచిన్‌ను ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. సీసీటీవీల్లో రికార్డయిన భయానక వీడియో దృశ్యాల ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులిచ్చిన ఆధారాల సాయంతో ఐదుగురినీ అరెస్ట్ చేసి, వారిపై హత్యకేసు నమోదు చేశామన్నారు. సచిన్ తన స్నేహితుడితో కలసి బైక్‌పై వెళ్తుండగా, ఐదుగురు బాలురు ఎదురుగా దూసుకొచ్చారు. సచిన్‌ను ఒక్కసారిగా బైక్నుంచి కిందకు తోసివేశారు. సచిన్ స్నేహితుడు పారిపోగా, ఐదుగురూ సచిన్‌పై దాడిచేసి హతమార్చారు. దీనితో ఆ దారిన వెళ్తున్నవారు కూడా భయంతో హడలిపోయారు. అతన్ని రక్షించే ప్రయత్నం చేయలేకపోయారు. దాడిచేసిన వారిలో ఒకరు కత్తిని గాలిలో తిప్పుతూ, జనాన్ని బెదిరిస్తున్న దృశ్యాలు కూడా సీటీటీవీలో రికార్డయ్యాయి. తమ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురిలో 15ఏళ్ల బాలుణ్ణి పోలీసులు ప్రశ్నించగా కొన్ని విషయాలు తెలిశాయి. -
ఐపీఎస్ అధికారిగా కిరోసిన్ హాకర్ కొడుకు
కర్ణాటక పోలీస్ శాఖలో 16న బాధ్యతలు స్వీకరించనున్న కిశోర్‌బాబు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన యువకుడు గుడివాడ, న్యూస్‌లైన్ : జీవిత లక్ష్యసాధనకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఈ యువకుడు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో డిగ్రీ వరకు చదివిన ఈ యువకుడు ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరాలనే తన లక్ష్యాన్ని సాధించాడు. ఓటమి చెందినా వెరవకుండా అవిశ్రాంతంగా పోరాడి సాధించాడు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం గంగాధరపురం గ్రామానికి చెందిన డెక్కా కిశోర్‌బాబు ఈ నెల 16న కర్ణాటక పోలీసు శాఖలో ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం తన స్వగ్రామానికి వచ్చిన ఆయన్ను ‘న్యూస్‌లైన్’ పలకరిచింది. ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే వారు వైఫల్యాలు ఎదురైనా సాధించే వరకుకొనసాగించాలని యువకులకు సందేశం ఇచ్చారు. పంచాయతీరాజ్ ఈవోపీఆర్డీగా.. కళాశాల లెక్చరర్‌గా పనిచేసి.. కిశోర్ ఐదేళ్లపాటు జిల్లాలోని తోట్లవల్లూరు మండలంలో ఈవోపీఆర్డీగా ప్రభుత్వోద్యోగం నిర్వహించారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామాచేసి అక్కడ నుంచి రెండేళ్లుపాటు ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. నాలుగు సార్లు సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరైన ఆయన ఐదోసారి విజయాన్ని సాధించారు. దిగువ మధ్యతరగతి కుటుంబమే.. కిశోర్బాబుది దిగువ మధ్యతరగతి కుటుంబమే. గుడివాడ రూరల్ మండలంలోని బొమ్ములూరు శివారు గంగాధరపురం గ్రామం. తండ్రి ప్రసాదరావు కేవలం ఐదో తరగతి వరకే చదివాడు. తల్లి సుశీల పెద్దగా చదవుకోలేదు. తండ్రి ప్రసాదరావు కిరోసిన్ హాకర్‌గా గుడివాడ పట్టణంలోని నలంద స్కూల్ సమీపంలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు తనను పెద్దపెద్ద పాఠశాలల్లో చదివించలేరని తెలిసినా తన లక్ష్యాన్ని మాత్రం ఏనాడు విస్మరించలేదని చెబుతున్నారు. కిశోర్‌బాబు గంగాధరపురం మండల పరిషత్ పాఠశాలలో ప్రాథమిక చదువులు చదివి అనంతరం నిమ్మకూరు గురుకుల పాఠశాలలో ఎనిమిది నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ఆతరువాత ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలలో బీఎస్సీ (మ్యాథ్స్) చదివారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేశారు. ఇదే సమయంలో పంచాయతీరాజ్‌శాఖ ఈవోపీఆర్డీ పోస్టు రావటంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. చిన్నతనం నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదవాలనేది తన లక్ష్యంగా చెబుతున్నారు. తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగా పయనించేందుకుగాను తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఖమ్మంజిల్లా ఇల్లెందులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చలర్‌గా చేరారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యంనే ఏనాడు విస్మరించలేదని చెబుతున్నారు. కిషోర్ భార్య సంధ్య భీమవరంలోని ఒక కళాశాలలో ఈసీఈ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఒక కుమార్తె కూడా ఉన్నారు. కిశోర్ సోదరి తహశీల్దార్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్ల కృషి ఫలించింది... సివిల్ సర్వీస్ అధికారిగా ఎంపిక కావాలనే లక్ష్యంకోసం ఎనిమిదేళ్లుగా అలుపెరగని కృషి చేశానని కిశోర్ ‘న్యూస్‌లైన్’కు వివరించారు. నాలుగుసార్లు ప్రిమిలినరీ, మెయిన్స్లోఉత్తీర్ణత సాధించినా నాలుగుసార్లు ఇంటర్వ్యూలో విఫలం చెందానని అన్నారు.ఐదోసారి లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. 2012 బ్యాచ్‌లో ఎంపికైన తనకు ఈనెల 16న కర్ణాటకా పోలీసు శాఖలో బాధ్యతలు ఇవ్వనున్నారని చెప్పారు. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనుకునే వారు వైఫల్యాలు ఎదురైనా నిరాశ చెందకుండా కొనసాగిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారని చెప్పారు. తన విజయంలో తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల సహకారం ఉందని అన్నారు. ప్రజలు మెచ్చే పోలీసు అధికారిగా పనిచేయాలనేది తన జీవిత లక్ష్యంగా వివరించారు.