YSR Bima Scheme
-
YSR Bima: దిగులు తీర్చి.. ధీమానిచ్చి
జీవన ప్రయాణంలో అన్ని వైపుల నుంచి అదృష్టం కలిసొస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. పొరపాటున ఊహించని సంఘటన ఏదైనా జరిగి, కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రాణాలు వదిలితే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అదే నిరు పేదల పరిస్థితైతే వర్ణణాతీతం. అలాంటి పేద కుటుంబాల దిగులు తీర్చి ధీమా నిస్తోంది వైఎస్సార్ బీమా పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. కడప రూరల్: పేద కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అనుకోని విధంగా ప్రమాదం జరిగినపుడు ఎవరూ ఆదుకోరనే భయాన్ని పోగొట్టారు. దీంతో నిరుపేదలకు భరోసా లభించింది. ప్రభుత్వం 2020 అక్టోబరు 22న రాష్ట్రంలో వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తెల్లరేషన్‌కార్డు కలిగిన 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు ప్రజలందరూ ఈ పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తు మరణించినా, వృద్ధాప్య తదితర సహజ కారణాలతో మృతిచెందినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా ఈ పథకం ద్వారా బాధిత కుటంబానికి ఆర్థికసాయం లభిస్తుంది. కుటుంబంలో నామినీగా ఉన్న వ్యక్తికి బీమా నగదు అందుతుంది. ఆ ప్రకారం ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు, 18–50 ఏళ్లలోపు సహజ మరణం పొందిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందుతుంది. తక్షణ సాయంగా దహన సంస్కారాలకు రూ. 10 వేలను అందజేస్తారు. 566 కుటుంబాలకు ప్రయోజనం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ బీమా కింద సహజ మరణాలకు సంబంధించి 572 నమోదయ్యాయి. అందులో ఒకరికి రూ. ఒక లక్ష చొప్పున 481 కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం రూ 4.81 కోట్లు బీమా సొమ్మును అందజేసింది. అలాగే వివిధ ప్రమాదాల్లో 111 మంది మృత్యువాతపడగా, అందులో ఒకరికి రూ 5 లక్షల చొప్పున 85 మందికి మొత్తం 4.25 కోట్ల బీమా సొమ్ము లభించింది. మొత్తం 683 మందికిగాను 566 కుటుంబాలకు చెందిన నామినీలకు మొత్తం రూ.9.06 కోట్ల ప్రయో జనం చేకూరింది. బీమాకు సంబంధించిన పత్రాలను సమర్పించిన 21 రోజుల్లోపే ప్రభుత్వం నామినీ ఖాతా లకు సొమ్మును జమ చేయడం ప్రశంసనీయం. దీంతో బాధిత కుటుంబాలకు దిగులు తీర్చి బీమా ద్వారా ధీమాను కలిగించినట్లైంది. ఈ పథకం అమలు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1. పిల్లలతో ఉన్న ఈమె పేరు మూడే అరుణ. భర్త శ్రీను నాయక్. చేపలు పట్టేవారు. వారు మైదుకూరులో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఓ రోజు శ్రీనునాయక్ చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ ఊహించని విధంగా నీళ్లలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అలాంటి కుటుంబంలో వైఎస్సార్ బీమా పథకం వెలుగులు నింపింది. తనకు అధికారులు వైఎస్సార్ బీమా కింద రూ 5 లక్షలు ఇచ్చారని అరుణ తెలిపింది. ప్రభుత్వం తన కుటుంబానికి అండగా నిలిచినందుకు కృతజ్ఙతలు తెలిపింది. 2. ఈమె పేరు మాండ్ల వరలక్ష్మి. కూలీ పనికి వెళుతుంది. భర్త శివప్రసాద్ హమాలీ పని చేçస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వీరిది రాజుపాళెం మండలం. వీరికి ఇద్దరు సంతానం. శివప్రసాద్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ తరుణంలో ఆ కుటుంబంలో వైఎస్సార్ బీమా పథకం కొండంత అండగా నిలిచింది. నామినీగా ఉన్న వరలక్ష్మికి ప్రభుత్వం రూ 5 లక్షలను అందజేసింది. దీంతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని ఆమె తెలిపింది. 3. ఈమె పేరు గోవిందు శ్యామల. కూలీ పనులకు వెళుతుంది. భర్త పేరు లక్షుమయ్య. మగ్గం పని చేసేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిది మూద్దనూరు మండలం. ఒక రోజు పొలంలో గడ్డి కో స్తుండగా లక్షుమయ్యను పాము కాటుతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలో నామినీగా ఉన్న లక్షుమయ్య భార్య శ్యామలకు బీమా కింద రూ 5 లక్షలు వచ్చింది. బీమా కారణంగా తనకు ఆర్థిక సహయం కలిగిందని, ప్రభుత్వం తమ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేసింది. వైఎస్సార్ బీమాను సద్వినియోగం చేసుకోవాలి తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలంతా వైఎస్సార్ బీమా పథకానికి అర్హులు. సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి పెద్దకు ఏమైనా జరిగితే నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను సమరి్పంచిన 21 రోజుల్లోనే నామినీకి క్లైమ్ను అందజేస్తాం. ప్రభుత్వం ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తోంది. – ఆనంద్ నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -
వైఎస్సార్ బీమా నమోదు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబాలకు ప్రభుత్వం వైఎస్సార్ బీమా అందజేస్తోంది. గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ బీమా పథకాన్ని 2021 జూలై 1న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాగా, 2023–24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. 18–50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారంగా అందజేస్తారు. అలాగే 18–70 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు. బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరిహారం చెల్లింపును ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.372 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. -
అత్యుత్తమ బీమా పథకం ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ – క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించింది. రైతులపై పైసా కూడా భారం పడకుండా నోటిఫైడ్ పంటలకు 100 శాతం బీమా కల్పిస్తున్న రాష్ట్రమని ఏపీపై ప్రశంసలు కురిపించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)పై చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో గురువారం ప్రారంభమైన జాతీయ స్థాయి వర్కుషాపులో ‘ఇన్నోవేషన్ కేటగిరి’ కింద ఉత్తమ బీమా పథకంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎంపిక చేశారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 44 నెలల్లో రూ.6,684.84 కోట్ల పరిహారం.. నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగు చేసిన ప్రతి ఎకరాకూ ఈ– క్రాప్, ఈ –కేవైసీ ప్రామాణికంగా ఖరీఫ్ 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో గరిష్టంగా 25.86 లక్షల హెక్టార్లలో పంటలకు బీమా కవరేజ్ కల్పించగా ప్రస్తుతం ఏకంగా 60 లక్షల హెక్టార్లలో కవరేజ్ వర్తింపచేశారు. 2018–19 సీజన్లో గరిష్టంగా రూ.1263 కోట్ల పరిహారం చెల్లించగా ఖరీఫ్ 2021 సీజన్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పరిహారం అందించారు. 44 నెలల్లో 44.28 లక్షల మంది రైతులు రూ.6,684.84 కోట్ల పరిహారాన్ని అందుకున్నారు. ఈ – క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్ కల్పించేందుకు కేంద్రం ముందుకు రావడంతో 2022–23 సీజన్ నుంచి పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఖరీఫ్ 2022 సీజన్‌కు సంబంధించి ఇప్పటికే నూరు శాతం ఈ – క్రాప్‌తో పాటు 97 శాతం ఈ – కేవైసీతో రికార్డు సృష్టించారు. ఏపీ స్ఫూర్తితో మార్పులు: అహూజా ఆంధ్రప్రదేశ్‌ను స్ఫూర్తిగా తీసుకుని జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పలు మార్పులు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా వెల్లడించారు. పంటల బీమా అమలులో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వర్కుషాప్‌లో ఆయన ప్రశంసించారు. రైతులపై పైసా భారం పడకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించడం నిజంగా గొప్ప ఆలోచనన్నారు. నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. ఏపీ తరహాలోనే సీజన్ ముగియకుండానే బీమా పరిహారాన్ని అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేలా కసరత్తు జరుగుతోందన్నారు. పంటల బీమా పథకంతో పాటు రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంకితభావాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. వర్కుషాప్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, బీమా కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
దిగులు తొలగిస్తూ.. ధీమానిస్తూ!
కర్నూలు(అగ్రికల్చర్): అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలు.. ఊహించని విపత్తులు.. పేద కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో ఆయా కుటుంబాల్లో నైరాశ్యం నెలకొంటోంది. అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితం తలకిందులవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు సైతం ఆగిపోతున్నాయి. పేదల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తూ వారిలో దిగులును తొలగిస్తోంది. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తూ ధీమా నింపుతోంది. రూపాయి కూడా ప్రీమియం లేకుండా.. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఒకరికి (ఇంటి యజమానికి) రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో 5,05,094 కుటుంబాలకు, నంద్యాల జిల్లాలో 4,13,498 కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. బీమా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో రెండు కాళ్లు లేదంటే రెండు చేతులు పోతే రూ.5 లక్షలు, ఒక కాలు, ఒక చేయిపోతే రూ.2.50 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.లక్ష ప్రకారం పరిహారం లభిస్తుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ప్రమాద బీమా, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణం బీమా వర్తిస్తుంది. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకొని క్లయిమ్‌లను పరిష్కరిస్తారు. సహజ మరణానికి పరిహారం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అసంఘటిత రంగంలోని రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం లేకుండా వైఎస్సార్ బీమా సదుపాయం కల్పించడం విశేషం. సహజ మరణం పొందినా, ప్రమాదశాత్తూ మరణించినా వెంటనే సంబంధిత సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంటుకు సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లిస్తారు. గడువులోపు పరిహారం.. వైఎస్సార్ బీమా కింద క్లయిమ్‌ల పరిష్కారానికి ప్రత్యేక షెడ్యూలు ఉంది. దీని ప్రకారం సహజ మరణం క్లయిమ్‌లను 24 రోజులు, ప్రమాద మరణం క్లయిమ్‌లను 65 రోజుల్లోను పరిష్కరిస్తున్నారు. సచివాలయం స్థాయిలో జరిగే డాక్యుమెంటేషన్‌ను అనుసరించి క్లయిమ్‌లు పరిష్కారం అవుతాయి. సహజ, ప్రమాద మరణాలకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంటు డాక్యుమెంటేషన్ పూర్తి చేసి కలెక్టరేట్లోని డీఆర్డీఏ– వైకేపీలోని వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్‌కు పంపాల్సి ఉంది. కాల్ సెంటరులో బీమా డీపీఎం, డీఆర్డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఆమోదించి పరిహారం చెల్లింపు కోసం జీఎస్డబ్ల్యూస్ డిపార్టుమెంట్‌కు పంపుతారు. సహజ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రమాద మరణాలకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. సత్వర సాంత్వన వైఎస్సార్ బీమా పరిహారం ప్రొసీడింగ్స్ అందుకుంటున్న ఈమె పేరు జెల్లి జయమ్మ. ఆదోని మండలం ఆరేకల్ గ్రామానికి చెందిన ఈమె భర్త జెల్లి రాఘవేంద్ర ప్రమాదవశాత్తూ్త 2022 సెప్టెంబరు 6వ తేదీన మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరికి వైఎస్సార్ బీమా అండగా నిలిచింది. నాలుగు నెలల్లోనే 2022 డిసెంబరు 1న రాఘవేంద్ర భార్య జెల్లి జయమ్మకు రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. సత్వర స్వాంతన చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని జయమ్మ తెలిపారు. బాధిత కుటుంబానికి ఊరట ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు నాగేశ్వరమ్మ, కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని మాసామసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈమె భర్త కురువ నాగరాజు ప్రమాదవశాత్తు 2022 ఆగస్టు 10న మృతి చెందాడు. ఇద్దరు కుమారుల పోషణ కష్టంగా ఉన్న తరుణంలో ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా ద్వారా చేయూత ఇచ్చింది. నాగేశ్వరమ్మకు రూ. 5 లక్షల పరిహారం లభించింది. పకడ్బందీగా బీమా పథకం అమలు వైఎస్సార్ బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సచివాలయంలో ఎంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి పంపితే అంత త్వరగా క్లయిమ్ పరిష్కారం అవుతుంది. రైస్ కార్డు కలిగిన కుటుంబాలన్నిటికీ వైఎస్సార్ బీమా లభిస్తుంది. కర్నూలు జిల్లాలో 5 లక్షలకుపైగా కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయం ఉంది. – వెంకటసుబ్బయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ–వైకేపీ లక్షలాది పేద కుటుంబాలకు భరోసా జాప్యం లేకుండా క్లయిమ్‌లు పరిష్కారమవుతుండడంతో ఆయా కుటుంబాలకు భరోసా లభిస్తోంది. 2021–22లో వైఎస్సార్ బీమా కింద 1,398 కుటుంబాలకు భరోసా దక్కింది. 2022–23లో కర్నూలు జిల్లాలో సహజ మరణం పొందిన 496 కుటుంబాలకు రూ.4.82 కోట్లు, నంద్యాల జిల్లాలో 477 కుటుంబాలకు రూ.4.60 కోట్లు పరిహారం లభించింది. 30 క్లయిమ్‌లకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 80 రిజిష్టర్ కాగా 35 పరిష్కారం అయ్యాయి. నంద్యాల జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్‌లు 76 రిజిష్టర్ కాగా 23 పరిష్కారం అయ్యాయి. మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయి. -
వైఎస్సార్ బీమా పేరిట మోసం
కడప అర్బన్: వైఎస్సార్ బీమా పేరుతో మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని వైఎస్సార్ జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో రెండు నెలలుగా ఓ అంతర్రాష్ట్ర ముఠా పథకం ప్రకారం కోవిడ్ సందర్భంగా మరణించిన మృతుల వివరాలను సేకరిస్తున్నది. వాటి ఆధారంగా ఆయా మృతుల బంధువులకు ఫోన్లు చేసి.. తాము కలెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామని, వైఎస్సార్ బీమా పథకం కింద నష్టపరిహారం వస్తుందని మభ్యపెడుతోంది. అయితే అంతకుముందు.. కొంతమొత్తం ప్రభుత్వానికి చెల్లిస్తేనే ఆ మేరకు నష్టపరిహారం మంజూరవుతుందని అమాయక ప్రజలను నమ్మిస్తున్నది. అనంతరం ఫోన్–పే తదితర మనీ వ్యాలెట్ల నుంచి లక్షల రూపాయలను స్వాహా చేస్తోంది. కడపకు చెందిన బీరం రమణారెడ్డి, నిర్మల, ఎం.వి. సునీత, ఖాజీపేటకు చెందిన నాగవేణి, పెండ్లిమర్రికి చెందిన విఘ్నేశ్వరి, విజయకుమారి, బి.మఠానికి చెందిన కృష్ణచైతన్య, ప్రొద్దుటూరుకు చెందిన జింక హారతి, బద్వేల్‌కు చెందిన పి.ఆదిలక్ష్మి సదరు ముఠా చేతిలో చిక్కి సుమారు రూ.9 లక్షల మేరకు సమర్పించుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేసి కడప వన్‌టౌన్ సీఐ ఎన్.వి.నాగరాజు దర్యాప్తు చేపట్టారు. కేసు పరిశోధనలో భాగంగా కడప సైబర్ క్రైం టీం సహాయంతో యూపీఐల ఆధారంగా 9 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. వీటిలోని రూ.7,34,964 ఫ్రీజ్ చేశారు. ముఠాలో సభ్యుడైన ఖాజీపేట మండలం మిడుతూరు గ్రామానికి చెందిన మీనుగ వెంకటేష్‌ను ఇర్కాన్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. కొంతమంది వ్యక్తులతో కలిసి వెంకటేష్ ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి బీమా పేరిట దందాను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడీ పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
వైఎస్సార్ పశు బీమా.. రైతులకు ధీమా!
సాక్షి, అమరావతి: విపత్తులు, కరువు కాటకా లు, రోడ్డు, రైలు ప్రమాదాలు, విద్యుద్ఘాతా లతో ఏటా వేలాది మూగ, సన్నజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని కన్నబిడ్డల్లా సాకే యజమానుల బాధ వర్ణణాతీతం. తమ కుటుంబ పోషణకు వీటిపైనే ఆధారపడి జీవించేవారు ఆ జీవాలు మరణిస్తే తల్లడిల్లిపోతారు. ఈ నేపథ్యంలో వివిధ ఘటనల్లో మూగ జీవాలను కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్సార్ పశు బీమా పథకం ద్వారా వారికి అండగా నిలవ నుంది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ ప్రతిపా దనలను రూపొందిస్తోంది. అక్టోబర్ నెలాఖరు లో శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం కార్యాచ రణ సిద్ధం చేస్తోంది. పశువులు, మేకలు, గొర్రెలకు బీమాను వర్తింపజేయనుంది. చదవండి: దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్ మరింత మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో.. వివిధ ఘటనల్లో తమ పశువులు, సన్నజీవాలను కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి ఇప్పటివరకు ప్రభుత్వపరంగా బీమా పథకం అంటూ ఏమీలేదు. గతంలో బీమా పథకాలపై కాస్త అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగినవారు మాత్రమే సొంతంగా తమ జీవాలకు బీమా చేయించుకునే వారు. అవి చనిపోయినæ ఏడాదికో రెండేళ్లకో.. అదీ బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే కానీ అరకొరగా పరిహారం దక్కేది కాదు. నూటికి 95 శాతం మంది అవగాహన లేక, ఆర్థికభారం కారణంగా బీమాకు దూరంగా ఉండేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా వైఎస్సార్ పశు నష్టపరిహారం కింద 1.12 లక్షల జీవాలకు రూ.58.02 కోట్ల పరిహారం అందించింది. ఇప్పుడు మరింత మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొస్తోంది. 50 జీవాలకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు.. వైఎస్సార్ పశు బీమా పథకం కింద నాటు ఆవులు, గేదెలకు రూ.15 వేలు, మేలు జాతి గేదెలు, ఆవులకు రూ.30 వేల చొప్పున, సన్న జీవాలకు ఒక్కో దానికి రూ.6 వేలు చొప్పున పరిహారం ఇస్తారు. ఏడాదిలో ఒక రైతుకు గరిష్టంగా ఐదు పశువులకు మాత్రమే బీమా వర్తిస్తుంది. గతంలో ఏదైనా విపత్తు బారినపడి చనిపోతే ఒక్కో కుటుంబం పరిధిలో 20 సన్నజీవాలకు రూ.1.20 లక్షలకు మించకుండా పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు దాన్ని 50 జీవాలకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం పొందేలా విస్తరిస్తున్నారు. గతంలో మూడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో మర ణిస్తేనే సన్నజీవాలకు పరిహారం ఇచ్చేవారు. ఇక నుంచి ఒక్క జీవి మరణించినా పరిహారం అందిస్త్రాు. అంతేకాదు తొలిసారి ఎద్దులు, దున్నపోతులతో పాటు కరువు బారిన పడిన పశువులకు కూడా బీమా వర్తింప చేయను న్నారు. అలాగే క్లైమ్ సెటిల్మెంట్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పరిహారం చెల్లిం చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మూగ, సన్నజీవాలకు పూర్తి స్థాయిలో బీమా కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తెస్తు న్నాం. రాష్ట్రంలోని ప్రతి పాడి పశువుతో పాటు మూగ జీవాలు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లకు కూడా బీమా కల్పిం చాలని సంకల్పించాం. ఇందుకోసం ప్రభుత్వం 80 శాతం ప్రీమియం భరి స్తోంది. ఈ పథకం కోసం మార్గదర్శ కాలు రూపొందిస్తున్నాం. అక్టోబర్ నెలాఖరులో ఈ పథకానికి శ్రీకారం చుట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. –డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ మొత్తం ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వానిదే.. వైఎస్సార్ పశు బీమా పథకం కింద చెల్లించే మొత్తం ప్రీమియంలో 80 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 20 శాతం మాత్రమే సన్న, చిన్నకారు రైతులు భరించాల్సి ఉంటుంది. దేశీయ ఆవులు, గేదెలకు ఒక్కోదానికి ప్రభుత్వం రూ.924 ప్రీమియం భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.231, ఎద్దులు, దున్నపోతులకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.578 భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.116, మేకలు, గొర్రెలకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.185 భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.46 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రైతుల తరఫున 80 శాతం ప్రీమియం రూపంలో ఏటా సుమారు రూ.110 కోట్లు వరకు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రైతులకు బాసటగా నిలిచే సిబ్బందికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సంకల్పించింది. బీమా చేయించినందుకు రూ.50, పోస్టుమార్టంకు రూ.125 చొప్పున ఇవ్వనుంది. -
2 లక్షల ప్రమాద బీమా: ‘ఈ–శ్రమ్’లో పేర్లు నమోదు చేసుకోండి
సాక్షి, అమరావతి: చేతి వృత్తిదారులు, చిరు వ్యాపారులు, వ్యవసాయ, వలస కూలీలు సహా అన్ని రకాల అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈ–శ్రమ్’ ఆన్లైన్ పోర్టల్‌లో అర్హులందరి పేర్లు నమోదుకు ఈ నెల 17, 18 తేదీల్లో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ– శ్రమ్ పథకంలో పేర్లు నమోదు చేసుకునే వారు రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందుతారని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ బీమా పథకం ద్వారా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన దాదాపు 1.21 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. కాగా రాష్ట్రంలోని పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల పేర్లను ఈ – శ్రమ్ పోర్టల్‌లో ఉచితంగా నమోదు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా మిగతా అర్హులందరి పేర్లు పోర్టల్‌లో నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్ సాగిలి షాన్మోహన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్ల భాగస్వామ్యం ఉపాధి హామీ పథకంలో కూలీలు పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు అసంఘటిత కార్మికుడిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకోవడంలో వలంటీర్లను భాగస్వాములను చేశారు. వలంటీర్లు వారి పరిధిలో అర్హులను గుర్తించి 17, 18 తేదీల్లో జరిగే ప్రత్యేక శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు. 23, 24 తేదీల్లో స్కూళ్లలో ఆధార్ క్యాంపులు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో పలు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తెలిపింది. గత రెండు నెలలుగా ప్రతి నెలా రాష్ట్రంలోని సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పాఠశాలల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. -
AP: పక్కాగా ఈ-పంట
ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్ ఏర్పాటుకు త్వరితగతిన రైతు కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి కమిటీలో ఇంటర్ ఆ పై చదువుకున్న రైతు ఉండేలా చూడాలి. వారిని డ్రోన్ పైలెట్లుగా గుర్తించి.. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో ఐటీఐ/పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట నమోదు పక్కాగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడా చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం ఇవ్వని రీతిలో వంద శాతం పంట నమోదు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో అనుసంధానిస్తూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే అమలు చేస్తున్నందున రైతులకు గరిష్టంగా లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ప్రతి రోజూ నిశితంగా పరిశీలించాలని, నమోదైన తర్వాత ప్రతి రైతుకు భౌతిక, డిజిటల్ రశీదులు ఇవ్వాలని చెప్పారు. ఈ– పంట నమోదుతో పాటు వేలి ముద్రలు తీసుకోవడానికి ఉపయోగిస్తున్న ఈకేవైసీని ఇక నుంచి నో యువర్ క్రాప్ (మీ పంట తెలుసుకోండి) అంటూ ప్రచారం చెయ్యాలని సూచించారు. వెబ్‌ల్యాండ్‌లో ఏక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని, ఆర్బీకేల్లోని వ్యవసాయ, రెవెన్యూ సహాయకులు ఈ–పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇన్పుట్స్ నాణ్యతపై దృష్టి సారించండి – ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి. ప్రస్తుత సీజన్లో ఎరువుల కోసం ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి. – ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ, ఎరువుల సరఫరా ఇన్పుట్స్ పంపిణీ, అందిస్తోన్న సేవలు, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై వ్యవసాయ సహాయకుల నుంచి ప్రతి రోజూ సమాచారం తెప్పించుకోవాలి. ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్ పని చేసేలా చర్యలు తీసుకోవాలి. వాటికి సవ్యంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? లేదా? అన్న దానిపై నిరంతరం పరిశీలన చేయాలి. అవి సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. – వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలి. వ్యక్తిగత పరికరాల పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయ్యాలి. – మండలానికి 3 ఆర్బీకేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 2 వేల ఆర్బీకేల పరిధిలో డ్రోన్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. తొలుత మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలి. 18.8 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు – ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు వివరించారు. ఆగష్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో 36.82 లక్షల హెక్టార్ల మేర పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని వివరించారు. – ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) ద్వారా ఈ–క్రాప్ నమోదు చేస్తున్నామని, సాగవుతున్న ప్రతి పంటను సాగు విస్తీర్ణంతో సహా జియో ట్యాగింగ్ చేయడమే కాకుండా, వెబ్ ల్యాండ్‌తో అనుసంధానిస్తున్నామని వివరించారు. – ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మంచి మార్పుతో చరిత్ర లిఖిద్దాం.. మీతోడు అవసరం: రాజాం కార్యకర్తలతో సీఎం జగన్ -
ఆదుకున్న సర్కార్‌పై నిందలా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కౌలు రైతుల బలవన్మరణాలను అడ్డుపెట్టుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వినూత్న పథకాలు, విప్లవాత్మక కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతాంగానికి అన్ని విధాలా వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలను పెద్ద మనసుతో ఆదుకుంటోంది. ఈ వాస్తవాలను పక్కనబెట్టి.. మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ రాజకీయ లబ్ధి కోసం పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో 53 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష వంతున పంపిణీ చేశారు. ఈ రైతుల వాస్తవ పరిస్థితి పరిశీలించగా.. వీరిలో అర్హతలున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందజేసింది. వీరిలో ఒక్కరు కూడా పట్టా రైతు కారు. అయినప్పటికీ పంట సాగు హక్కు పత్రం (క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డ్ – ప్రత్యేక చట్టం ద్వారా జగన్ ప్రభుత్వం ఇచ్చింది) ఉన్న ఏ ఒక్కరినీ విడిచి పెట్టకుండా రూ.7 లక్షల చొప్పున సాయం అందించింది. ఆ కార్డులు లేని వారికి కూడా వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.లక్ష ఇచ్చి ఆదుకుంది. అటు కౌలు రైతు కార్డు లేక, వయసు మీరడంతో ఇటు బీమా వర్తించక ఒకరికి మాత్రమే పరిహారం అందలేదు. ఇలాంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సాయమే చేయలేదని పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఇదివరకే ప్రభుత్వ పరిహారం అందుకున్న వారిలో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి. రూపాయి లంచం లేకుండా రూ.7 లక్షలు ఇతని పేరు గుత్తుల వెంకట్రావు (54). వరి పంట సాగుచేసే కౌలు రైతు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు స్వగ్రామం. అప్పుల బాధతో 2021 నవంబర్ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య భవాని, కుమారుడు సురేష్, కుమార్తె దేవి ఉన్నారు. ఇతనికి కౌలు రైతు కార్డు ఉండటంతో కుటుంబ సభ్యులు నేరుగా అధికారులను ఆశ్రయించారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి రూ.7 లక్షలు మంజూరైంది. ఈ సాయం భవాని బ్యాంక్ ఖాతాలో జమ అయింది. దరఖాస్తు చేయగానే పరిహారం ఇతని పేరు శీలం త్రిమూర్తులు. కౌలు రైతు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామ పంచాయతీ ప్రత్తిగొంది గ్రామం. ఆరు ఎకరాల్లో వరి సాగు చేసేవాడు. సాగులో నష్టాలు రావడంతో 2021 ఏప్రిల్ 12 ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. ప్రభుత్వం ఇచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో భార్య శీలం సుజాత ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకుంది. రూ.7 లక్షల పరిహారం ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయింది. ప్రభుత్వం ఆదుకోక పోయుంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనని ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతోంది. ఎవరి సిఫారసు లేకుండా సాయం ఈమె పేరు సుంకర నాగమణి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి. భర్త సుంకర చంద్రయ్య కౌలు రైతు. నాలుగున్నర ఎకరాల పొలం కౌలుకు చేసేవాడు. పంట నష్టపోవడంతో 2020 నవంబర్ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో వలంటీర్ ద్వారా విషయాన్ని ఎవరి సిఫారసు లేకుండానే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ.7 లక్షలు పరిహారం మంజూరైంది. తమ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకుందని వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబానికి ఆధారం చూపారు.. ఈమె సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన ఉమ్మిడిశెట్టి వెంకటలక్ష్మి. భర్త ఉమ్మిడిశెట్టి వెంకట దుర్గారావు (45) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వర్జీనియా పొగాకు సాగు చేసేవాడు. అప్పులపాలై 2022 ఫిబ్రవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు దొరబాబు, కుమార్తె దేవి, పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న తండ్రి సుబ్బారావు, తల్లి మంగమ్మ పోషణ ఇబ్బందిగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో ప్రభుత్వం రూ.7 లక్షలు మంజూరు చేసింది. ఆ డబ్బులు ఆమె బ్యాంక్ ఖాతాకు జమ చేశారు. కౌలు కార్డు లేకపోయినా సాయం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన పట్టపగలు సురేష్ (28) 2021 నవంబర్ 30న, ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన కర్రి శ్రీనివాస్ (28) 2021 జూలై 11న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు కార్డు కోసం భూ యజమాని సంతకం చేయకపోవడంతో వీరికి కౌలు కార్డు మంజూరు కాలేదు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వైఎస్సార్ బీమా పథకం ద్వారా సురేష్ భార్య మహాలక్షి, శ్రీనివాస్ భార్య కర్రి వీరవేణి బ్యాంకు ఖాతాలకు రూ.లక్ష చొప్పున జమ చేసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకర పాలెం శివారు చింతాకుల వారి పాలెంకు చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ (65) పంట నష్టంతో పాటు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి కూడా కౌలు రైతు కార్డు లేదు. 65 ఏళ్లు దాటడంతో బీమా వర్తించలేదు. -
కౌలురైతులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు చెప్పారు. గతంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇచ్చే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.7లక్షలకు పెంచడమే కాకుండా వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే భూ యజమాని, కౌలుదారుడు అనే భేదం లేకుండా వాస్తవ సాగు దారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. సీసీఆర్సీ (పంట సాగు దారుల హక్కు పత్రం) కార్డులున్న వారికి రూ.7లక్షలు, సీసీఆర్సీ కార్డుల్లేని వారికి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా ‘కౌలుపాశమా?’ అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించడంపై మండిపడ్డారు. పంట సాగు హక్కుదారుల చట్టం–2019 ప్రకారం గడిచిన మూడేళ్లలో 15 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 5.76 లక్షల సీసీఆర్సీలు జారీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2.97 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి ఈ నెలాఖరులోగా జారీ చేస్తామని తెలిపారు. సీసీఆర్సీల ద్వారా వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పెట్టుబడి రాయితీ వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ–క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటను కౌలురైతులు ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారని చెప్పారు. గతంలో పరిహారంపై వడ్డీనే తీసుకునే వారు గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.5లక్షల పరిహారం ఇచ్చేవారని, ఈ మొత్తంలో 1.5 లక్షలు అప్పులకు జమ చేయగా, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునే సదుపాయం రైతు కుటుంబానికి ఉండేది కాదని వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే సదుపాయం ఉండేదన్నారు. ఎప్పుడో ఐదేళ్లకో..పదేళ్లకో నిర్ణీత గడువు ముగిసిన తర్వాత మాత్రమే ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం సీసీఆర్సీ కార్డు ఉంటే రూ.7 లక్షలు, లేకుంటే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం నేరుగా బాధిత కుటుంబ సభ్యుల ఖాతాకే జమ చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 450 మందికి మాత్రమే రూ.5లక్షల చొప్పున రూ.20.12 కోట్ల పరిహారం అందించిందన్నారు. టీడీపీ హయాంలో పరిహారం దక్కని 471 మందికి రూ.5లక్షల చొప్పున రూ.23.55కోట్ల పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం అందించిందన్నారు. మూడేళ్లలో ఆత్మహత్యకు పాల్పడిన 850 మందికి రూ.7లక్షల చొప్పున రూ.59.50 కోట్ల పరిహారం అందించామన్నారు. వారి మరణాల వెనుక వాస్తవాలివి.. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన పెన్నాడ వెంకటసుబ్బారావు, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాదుకు చెందిన షేక్ జానీబాషా, అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం బందార్లపల్లికి చెందిన సోమశేఖర్లు వ్యవసాయమే చేయడం లేదని శేఖర్‌బాబు తెలిపారు. ఈ ముగ్గురు కూడా కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారని త్రిసభ్య కమిటీ నివేదికల్లో స్పష్టంగా పేర్కొందని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే వ్యవసాయంలో కలిసిరాక, అప్పుల బాధ తాళలేక వీరంతా ఆత్మహత్యలకు ఒడిగట్టినట్టుగా ఈనాడులో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ఇలాంటి అసత్య కథనాలు ప్రచురించడం మానుకోవాలని హితవు పలికారు. మూడేళ్లలో కౌలురైతులకు అందిన సాయమిలా సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద 2019–20లో 1.08 లక్షల మందికి రూ.146.15 కోట్లు, 2020–21లో 69,899 మందికి రూ.94.36 కోట్లు, 2021–22లో 89,877 మందికి రూ.121.33 కోట్లు చొప్పున మూడేళ్లలో 2,68,032 మందికి రూ.361.84 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించామని వివరించారు. ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా 2019–20లో 6,331 మందికి రూ.5.73 కోట్లు, 2020–21లో 1.38 లక్షల మందికి రూ.140.70 కోట్లు, 2021–22లో 68,911 మందికి రూ.77.84 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ)ని అందించామన్నారు. ఖరీఫ్–2020 లో 51,238 మందికి రూ.156.80 కోట్లు, ఖరీఫ్–21 సీజన్లో 1,21,735 మందికి రూ.330.34 కోట్ల పంటల బీమాపరిహారాన్ని అందించామన్నారు. 3 ఏళ్లలో 1,69,088 మంది రైతులకు రూ.3,382.06 కోట్ల సబ్సిడీతో కూడిన 7,247.5 క్వింటాళ్ల విత్తనాలందించగా, 8.29 లక్షల మందికి రూ.5,421 కోట్ల రుణాలివ్వగా,రూ.లక్ష లోపు తీసుకున్న పంట రుణాలు సకాలంలో చెల్లించిన 30,044 మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించామని వివరించారు. -
అర్హులైన రైతులందరికీ ఉచిత పంటల బీమా పరిహారం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఖరీఫ్–2021లో పంట నష్టపోయిన రైతులందరికీ డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం అందించి న్యాయం చేస్తామని కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగా పలువురు రైతులకు పంటల బీమా రాలేదని వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్లను, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలోనే పంటల బీమా పరిహారం అనంతపురం జిల్లాకు అత్యధికంగా రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. చాలాచోట్ల వేరుశనగ పంటకు బీమా రాలేదన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాస్తవానికి ఈ–క్రాప్ నిబంధనల ప్రకారం అన్ని పంటలకూ ఇస్తారని స్పష్టం చేశారు. అర్హత ఉన్నా బీమా రాని రైతులకు కచ్చితంగా పరిహారం వచ్చేలా చేస్తామని తెలిపారు. అలాంటి రైతులు ఆర్బీకేలు, తహసీల్దార్ కార్యాలయాల్లో సంప్రదించాలని ఇదివరకే సూచించామని చెప్పారు. అర్జీలు ఇచ్చుకోవడానికి 15 రోజులు గడువు ఇస్తున్నామన్నారు. ఎరువులు ఇబ్బంది లేకుండా.. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. లక్షలాదిమంది రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత రాకుండా పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 1.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 33.36వేల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. సెపె్టంబర్ వరకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నెలవారీ ఎరువులు సేకరిస్తున్నామన్నారు. ఒక్క యూరియానే 37వేల టన్నులకు పైగా అవసరం ఉందని, కాంప్లెక్స్, 9వేల టన్నులు, ఎస్ఎస్పీ, ఎంఓపీ 9618 టన్నుల అవసరం ఉన్నట్టు గుర్తించామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల లభ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పంటల బీమా పరిహారం ‘అనంత’కు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్–2021లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ప్రభుత్వం రూ.2977.82 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఉమ్మడి ‘అనంత’కు అత్యధిక మొత్తం వచ్చింది. అనంతపురం జిల్లాలో 2,32,580 మంది రైతులకు రూ.629.77 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 1,71,881 మంది రైతులకు రూ.255.78 కోట్లు విడుదలైంది. ఇది కూడా చదవండి: మారవా.. నారాయణా! -
వైఎస్సార్ బీమా.. పేదలకు ధీమా
బీమా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. కంపెనీలు ప్రీమియమూ పెంచేశాయి. అయితే, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీమా అమలు విషయంలో వెనక్కి తగ్గలేదు. సొంతంగా వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకొచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. పెద్ద దిక్కు కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబీకులకు నేనున్నా అంటూ భరోసా కల్పిస్తోంది. అనంతపురం అర్బన్: పేదలకు సంక్షేమాన్ని అందించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వైఎస్సార్ బీమా అమలులో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో బీమా పథకం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వంతుగా 60 శాతం నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇచ్చేది. అయితే, 2020 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం పథకం నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో బీమా కంపెనీలు కూడా ప్రీమియం (కంతు) మీద 35 శాతం పెంచాయి. కేంద్రం తప్పుకోవడంతో పథకం అమలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. కంపెనీలు ప్రీమియం పెంచినా, కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. పేదలకు అండగా నిలవాలనే నిర్ణయించుకున్న వైఎస్ జగన్ సర్కారు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. వైఎస్సార్ బీమా పథకం తీసుకొచ్చి.. అమలు బాధ్యత మొత్తాన్నీ తన భుజాన వేసుకుంది. మూడేళ్లలో 4,379 మందికి రూ.73.14 కోట్లు.. వైఎస్సార్ బీమా ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 2019–2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం మధ్య మూడేళ్లలో 4,379 క్లెయిమ్‌లకు రూ.73.14 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెదు దుఃఖంలో కూరుకుపోయిన ఆయా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించింది. ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్ బీమా పాలసీదారులు 5,03,579 మంది ఉన్నారు. బీమా వర్తింపు ఇలా.. వైఎస్సార్బీమా కుటుంబంలో ఒకరికి... ప్రధానంగా కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు ఇచ్చే వ్యక్తికి వర్తింపజేస్తారు. బీమా తీసుకునే వ్యక్తి బియ్యం కార్డులో సభ్యుడై ఉండాలి. 18 – 70 ఏళ్ల వయసు వారు బీమా పాలసీకి అర్హులు. 18– 50 ఏళ్లలోపు సహజమరణం పొందినా, 18–70 ఏళ్ల లోపు ఏదైనా ప్రమాదంలో మరణం పొందినా బీమా వర్తిస్తుంది. సహజ మరణానికి రూ. లక్ష ఇస్తారు. ప్రమాద మరణానికి రూ.5 లక్షలు, పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం పొందితే రూ.2.50 లక్షలు అందజేస్తారు. మరణించిన పాలసీదారుని అంతిమ సంస్కారాలకు (మట్టిఖర్చులు) గతంలో ఉన్న రూ.5 వేల మొత్తాన్ని కూడా ప్రభుత్వం రూ.10 వేలకు పెంచి ఇస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎంఎస్బీవై (ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన) కింద కూడా రూ.12 కడితేనే పాలసీకి అర్హులవుతుండడం గమనార్హం. ప్రభుత్వం ఆర్థిక అండనిచ్చింది నా భర్త బోయ ఈరన్న వ్యవసాయ కూలీగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రమాదవశాత్తు 2021, నవంబరు 11న చనిపోయాడు. వైఎస్సార్ బీమా కింద ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వడంతో మా కుటుంబానికి ఆర్థిక అండ లభించింది. – భాగ్యమ్మ, గరుడాపురం, కళ్యాణదుర్గం నియోజకవర్గం రూ. 3.90 లక్షలు అందింది లారీ డ్రైవర్‌గా పనిచేసే నా భర్త లక్ష్మణ్‌నాయక్ గతేడాది ప్రమాదానికి గురై చనిపోయాడు. నాకు ఇద్దరు సంతానం. బాబు వయసు 10, పాప వయసు 8 ఏళ్లు. వైఎస్సార్ బీమా ద్వారా ప్రభుత్వం రూ.3.90 లక్షలు ఇచ్చి ఆదుకుంది. మరో రూ.లక్ష వస్తుందని అధికారులు చెప్పారు. – రుక్మిణి, కువరగేరి, గుంతకల్లు మూడేళ్లలో రూ. 73.14 కోట్లు వైఎస్సార్ బీమా పాలసీదారుడు మరణిస్తే విషయాన్ని సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌కు తెలియజేయాలి. వారు తక్షణమే మట్టి ఖర్చులకు రూ.10 వేలు ఇస్తారు. పథకం ద్వారా మూడేళ్లలో 4,379 మందికి రూ.73.14 కోట్లు అందించాం. – సత్యనారాయణ, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, వైఎస్సార్బీమా కుటుంబ పెద్ద పేరున పాలసీ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే వ్యక్తి పేరున బీమా పాలసీ తీసుకోవాలి. ఆ వ్యక్తికి ఏదేని ప్రమాదం జరిగితే బీమా ద్వారా అందే సొమ్ము కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. వలంటీర్లు కూడా కుటుంబ పోషకుని పేరునే పాలసీ ఇవ్వాలి. – నరసింహారెడ్డి, పీడీ, డీఆర్డీఏ -
3 Years Of YS Jagan Ruling: జనమే సాక్షి - ప్రజా పాలనకు మూడేళ్లు
-
AP: అన్నదాతకు ఆత్మస్థైర్యం
సాక్షి, అమరావతి: ఏ అన్నదాతకూ ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి రాకూడదు. అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడితే... పాలకులు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుని భరోసా ఇవ్వాలి. కానీ చంద్రబాబు హయాంలో... పరిహారం కోసమే ప్రాణాలు తీసుకుంటున్నారని వారిని ఎగతాళి చేశారు. సాయాన్నీ గాలికొదిలేశారు. ‘ప్రశ్నిస్తా!’ అని పదేపదే అరిచే జనసేనాని పవన్‌కల్యాణ్ ఈ దురాగతంపై నోరెత్తితే ఒట్టు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలపై రీసర్వే చేయించారు. చంద్రబాబు హయాంలో మరణించిన 469 మంది రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచి మరీ అందజేశారు. దీన్ని ప్రశ్నించలేని జనసేనాని కొత్త రాగం అందుకున్నారు. రైతుల ఊసెత్తకుండా.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ప్రభుత్వం సాయం చేయలేదంటున్నారు. ఏం! కౌలు రైతుల వివరాల్ని గ్రామ సచివాలయాల స్థాయిలో నమోదు చేసుకుని లక్షల మందికి సీసీఆర్సీ (గుర్తింపుకార్డులు) ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? వారందరికీ రైతు భరోసా అమలు చేసిన తొలి రాష్ట్రం ఏపీ కాదా? పంటల బీమా సహా రైతులకిచ్చే అన్ని పథకాలనూ కౌలు రైతులకూ వర్తింపజేసింది ఈ ప్రభుత్వం కాదా? ఎవరు చనిపోయినా కౌలు రైతే అంటే ఎలా? కౌలురైతులు కాని సామాన్యులు ఆత్మహత్యకు పాల్పడినా వైఎస్సార్ బీమా కింద ప్రభుత్వం సాయం అందిస్తుండటం మీకు తెలీదా? చంద్రబాబు హయాంలో రైతులకు సైతం సాయం ఎగవేస్తే ప్రశ్నించలేదు ఈ దత్తపుత్రుడు. ఇపుడు కౌలు రైతులంటూ ఎందుకీ డ్రామా అన్నదే అందరి ప్రశ్న!!. ► మట్టినే నమ్ముకుని సేద్యం చేస్తున్న కౌలు రైతుల కడగండ్లను గుర్తిస్తూ దేశంలోనే తొలిసారిగా రైతు భరోసా నుంచి పంటల బీమా దాకా అన్ని రకాల ప్రయోజనాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందచేస్తోంది. లక్షల మంది కౌలు రైతులకూ గ్రామ సచివాలయాల ద్వారా సీసీఆర్సీ కార్డులను ఇచ్చి పంట రుణాలు సమకూర్చి వెన్ను తడుతోంది. గత సర్కారు హయాంలో వంచనకు గురై ఆత్మహత్యలకు ఒడిగట్టిన 469 మంది అన్నదాతల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం కింద రూ.23.45 కోట్లను చెల్లించింది. రుణమాఫీ పేరుతో మోసపోయిన రైతన్నలకు సాంత్వన చేకూరుస్తోంది. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి అన్ని సేవలను అక్కడే అందచేస్తోంది. విత్తనం నుంచి నూర్పిళ్ల దాకా ప్రతి అడుగులోనూ వారికి తోడుగా ఉండే బాధ్యతను సంతోషంగా స్వీకరించింది. సాయంపై సేనాని బుకాయింపు గత సర్కారుకు రైతుల ఆత్మహత్యలను గుర్తించేందుకే మనసు రాలేదు. రుణమాఫీ పేరుతో అన్నదాతలను నిలువునా ముంచేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే ఆ డబ్బుల కోసమే చనిపోతారని వ్యాఖ్యానిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో పరిహారాన్ని చంద్రబాబు ఎత్తివేశారు. రైతుల ప్రాణాలకు వెల కట్టి చులకనగా మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కౌలు రైతులతో సహా రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండటం, తాను వచ్చాకే సాయం అందుతోందంటూ బుకాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాపరికం లేకుండా.. పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2019 జూన్ 1వతేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వతేదీ వరకు ఆత్మహత్యలు చేసుకున్న 41 మంది రైతన్నల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. గత సర్కారు రైతుల ఆత్మహత్యలను కనీసం నమోదు చేయకపోగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాపరికం లేకుండా పారదర్శకంగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తోంది. ఎప్పటికప్పుడు వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకుంటోంది. రైతు శ్రేయస్సే ధ్యేయంగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతు శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, కౌలు రైతుల వివరాలు సేకరించి ఆదుకోవాలని ఆదేశించారు. 2014 నుంచి 2019 మే 31 వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డ 773 మంది రైతులకు సంబంధించి పునఃపరిశీలన చేయాలని నిర్దేశించారు. విచారణ అనంతరం 469 రైతు కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు అర్హులని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పన మొత్తం రూ.23.45 కోట్లను చెల్లించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 19 మంది కూడా ఉన్నారు. పరిహారం పెంపు.. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.7 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 2019 అక్టోబర్ 14న జీవో 102 జారీ అయింది. పెంచిన పరిహారాన్ని 01–06–2019 నుంచి వర్తింప చేసేందుకు వీలుగా 20–02–2020న మరో జీవో 43 జారీ చేశారు. ఈ జీవోల ప్రకారం 01–06–2019 నుంచి 31–12–2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్న 308 మంది రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.21.56 కోట్లను ఎక్స్‌గ్రేషియాగా చెల్లించారు. ఇదే ప్రకారం 2020 సంవత్సరంలో ఆత్మహత్యలు చేసుకున్న 260 రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.18.20 కోట్లను పరిహారంగా చెల్లించారు. ఇక 2021 సంవత్సరంలో 126 రైతు కుటుంబాలకు రూ.8.82 కోట్లను అందచేశారు. గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలతో కలిపి 2021 వరకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.72.145 కోట్లను చెల్లించారు. కలెక్టర్ల వద్ద కార్పస్ నిధి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను తక్షణం ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లా కలెక్టర్ వద్ద కార్పస్ నిధిగా కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచింది. 2021–22 బడ్జెట్లో బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రూ.20 కోట్లను కేటాయించగా రూ.15.345 కోట్లు వ్యయం చేసింది. 2022–23 బడ్జెట్లోనూ పరిహారం కోసం రూ.20 కోట్లను కేటాయించారు. పశ్చిమలో 41 కుటుంబాలకు పరిహారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 జూన్ 1 నుంచి 2022 ఫిబ్రవరి 2 వరకు 41 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా ప్రభుత్వం అందరికీ పరిహారం చెల్లించింది. సాగు చేస్తున్నట్లు నిర్థారించిన 26 మందికి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా ఇతరులకు అలాంటి రుజువులు లేకున్నా మానవత్వంతో వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించారు. ఇందులో నాలుగు రైతు కుటుంబాలకు రూ.రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించగా 11 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందింది. పరిహారంతో పాటు పథకాలూ.. బాధిత కుటుంబాలకు కేవలం ఎక్స్‌గ్రేషియా మాత్రమే కాకుండా వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఒక్కో కుటుంబానికి కనిష్టంగా రెండు.. గరిష్టంగా ఏడు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ తదితర పథకాలను ఆ కుటుంబాలకు వర్తింప చేస్తున్నారు. -
వ్యవసాయం పండుగే.. రైతు ముంగిటకే పథకాలు
ఆకివీడు: ‘పల్లెటూరు మన భాగ్య సీమరా, పాడిపంటలకు లోటు లేదురా’ అన్న కవి మాటలను నిజం చేసేలా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగుతోంది. పల్లె ప్రగతికి పట్టం కడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పథకాలను అమలుచేస్తుండటంతో అన్నదాతలు ఆనందంగా జీవనం గడుపుతున్నారు. రెండేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. వీటి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. జిల్లాలో 5.85 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంది. సుమారు 80 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. ఆరు వేల ఎకరాల్లో కూరగాయాల పంటలు పండిస్తున్నారు. పాడి రైతులకు అదనపు ఆదా యం లక్ష్యంగా అమూల్ పాల సేకరణ కేంద్రాలను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద మహిళా రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. పశువుల పెంపకం, పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రైతు ముంగిటకే పథకాలు ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, సున్నావడ్డీ రుణాలు అందిస్తూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతోంది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతుల చెంతకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ–క్రాపింగ్ విధానంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు పంటల బీమా వర్తింపజేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానించి మద్దతు ధరలు అందిస్తున్నారు. దళారుల బెడద లేకుండా కళ్లాల్లోనే ధాన్యాన్ని అమ్ముకునేలా ఏర్పాట్లు చేశారు. కౌలువ్యవస్థను కూడా పటిష్ట పరిచేలా కౌలుచట్టంలో మార్పులు తీసుకువచ్చారు. భూమి యజమానికి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కౌలు వ్యవస్థ పటిష్టపడింది. మీసం మెలేస్తున్న రొయ్య రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు అభివృద్ధి చేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. కోవిడ్ విపత్తులోనూ ధరలో లాబీయింగ్‌ను అరికట్టి మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు చేయించారు. ఆక్వా చెరువులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా, ఈ మార్కెట్ సదు పాయం, ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు, నాణ్యమైన సీడు, ఫీడు, మందులు అందించేలా చర్యలు తీసుకున్నా రు. ఆక్వాజోన్లతో త్వరితగతిన ఆక్వా అనుమతులు లభిస్తున్నాయి. చేపలు, రొయ్యలకు మార్కెట్ కల్పించేలా ఈ–వెహికల్స్ ఏర్పాటుచేయనున్నారు. ఈనెల 9 నుంచి చైతన్య యాత్రలు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీ నుంచి రైతు చైతన్య యాత్రలను నిర్వహించేలా కార్యాచరణ ప్రకటించింది. వ్యవసాయశాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రాప్, రైతు భరోసా కేంద్రం విధివిధానాలు, పంటల బీమా, వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతుల్లో అవగాహన పెంచేలా చైతన్య యాత్రలను నిర్వహించనున్నారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించేలా సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. -
శభాష్ వలంటీర్: బెంగళూరు వెళ్లి బీమా..
కురబలకోట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. కురబలకోట మండలం భద్రయ్యగారిపల్లె గ్రామ వలంటీర్ వేపలపల్లె దయ్యాల కిరణ్ కుమార్‌రెడ్డి తన పరిధిలోని వారు కొందరు బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. గురువారం వారి వద్దకు వెళ్లి.. బీమా ఈకేవైసీ చేశాడు. తమ కోసం గ్రామ వలంటీర్ బెంగళూరు వచ్చి వైఎస్సార్ బీమా నమోదు చేయడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం దాటిన వలంటీర్ల సేవలు ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పింఛన్‌దారులకు మూడు నెలల నగదు అందజేత చీరాల టౌన్: అభాగ్యుల పాలిట వలంటీర్ వ్యవస్థ ఆశా దీపంగా మారుతున్నది. వరుసగా మూడో నెలకూడా పింఛన్ తీసుకోకపోతే కార్డు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో వార్డు వలంటీర్లు చొరవ చూపిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వలంటీర్లు షేక్.నాగూర్‌బాబు, కె.గోపి మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి చెల్లించడంతో సంబంధిత వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. చీరాల బోస్ నగర్‌కు చెందిన కె.అంజలీకుమారి ఊపిరితిత్తుల వ్యాధితో చెన్నై పెరంబూర్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో మూడు నెలల నుంచి చికిత్స పొందుతోంది. పెరంబూర్ వైద్యశాలలో అంజలీకుమారికి పింఛన్ అందిస్తున్న వలంటీర్ కె.గోపి గురువారం రాత్రి గోపి రైలులో పెరంబూర్ వెళ్లి మూడు నెలల వైఎస్సార్ పింఛన్ ఒకేసారి అందజేశాడు. అలానే బోస్‌నగర్‌కు చెందిన గుంటి రామచంద్రరావు క్యాన్సర్ వ్యాధికి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడంలేదు. దీంతో వలంటీర్ షేక్.నాగూర్‌బాబు శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకుని మొత్తం నగదు అందజేశాడు. 95.4 శాతం మందికి పింఛన్ల పంపిణీ ► నేడు కూడా వలంటీర్ల ద్వారా కొనసాగనున్న పంపిణీ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు శుక్రవారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి వరకు మొత్తం 58,16,064 (95.4 శాతం) మందికి రూ.1,405.74 కోట్ల పింఛను డబ్బు పంపిణీ చేశారు. శనివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. -
బీమా భారం మాదే
ఎవరైనా శతమానం భవతి అని దీవిస్తుంటారు. అంటే వందేళ్లు వర్ధిల్లండి అని అర్థం. అలా రాష్ట్రంలో అందరూ నిండు నూరేళ్ల ఆయుష్షుతో జీవించాలి. ప్రతి కుటుంబం చల్లగా ఉండాలి. ఏ ఒక్కరికీ ఎటువంటి ఆపద రాకూడదని మనసారా కోరుకునే ప్రభుత్వం మనది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలి. సాక్షి, అమరావతి: బీమా పథకం నుంచి కేంద్రం తప్పుకున్నా.. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భారం భరిస్తూ ఏకంగా 1.32 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకాన్ని వర్తింప చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి రాకూడదని, అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. తన పాదయాత్రలో అలాంటి గాథలు చాలా చూశానని.. విన్నానని, అందుకే దురదృష్టవశాత్తు కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆదుకునే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చామన్నారు. అలాంటి కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద ఆర్థిక సాయం అందిస్తూ పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైఎస్సార్ బీమాను అమలు చేసే కార్యక్రమాన్ని గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న.. ఈఎస్ఐ, పీఎఫ్ వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ బతుకు బండిని లాగుతున్న దాదాపు 1.32 కోట్ల కుటుంబాలు మన రాష్ట్రంలో వైఎస్సార్ బీమా పరిధిలోకి వస్తాయన్నారు. కుటుంబ పెద్దను ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల 2021–22 సంవత్సరానికి గాను రూ.750 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ పథకం కోసం ఈ రెండేళ్లలో మనందరి ప్రభుత్వం రూ.1,307 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క రూపాయి భారం పడనివ్వం ► గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల విపరీతమైన ధ్యాస పెట్టాం. అందులో భాగంగా ఆరోగ్యశ్రీలో చాలా చాలా మార్పులు చేశాం. ఆ పథకం రూపురేఖలు మార్చాం. రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చాం. గతంలో వెయ్యి లోపు ఉన్న రోగాలను, ప్రొసీజర్స్‌ను ఏకంగా 2,450కి వర్తింపచేసేలా కార్యాచరణ చేశాం. ► ఇవన్నీ చేసినప్పటికీ ఒక్కోసారి మన బతుకులు మన చేతిలో ఉండవు. సంపాదించే వ్యక్తి కనుక చనిపోతే ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ బీమా పథకం తీసుకొచ్చాం. ► పేద కుటుంబం మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల సంపాదించే కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నాం. ► 18 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు గల సంపాదించే కుటుంబ పెద్ద ప్రమాదంలో మరణించినా లేక శాశ్వత అంగవైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇచ్చేలా వైఎస్సార్ బీమాను రూపొందించాం. ఈ నిర్ణయం వెనుక.. ► కేంద్రం 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం నుంచి తప్పుకుంది. దీనికి తోడు ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీం స్థానంలో అర్హుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల ద్వారా బీమా చేయించాలని ఆదేశించింది. దీంతో 1.21 కోట్ల కుటుంబాలకు బీమా ప్రీమియం మొత్తం రాష్ట్రమే చెల్లించింది. ► అయితే బ్యాంకులు వ్యక్తిగత ఖాతాలు తెరిచి, ఆ ఖాతాల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టి.. ఎన్రోల్ చేయించలేకపోతున్నాయి. కేవలం 62.5 లక్షల మంది లబ్ధిదారులనే బ్యాంకులు ఎన్రోల్ చేయగలిగాయి. మిగిలిన 58.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించినా బ్యాంకులు ఎన్రోల్ చేయలేకపోయాయి. ► అర్హులై ఉండి బ్యాంకులలో ఎన్రోల్ కాకుండా మిగిలిపోయిన వారు, ఎన్రోల్ అయినా 45 రోజుల లీన్ పీరియడ్ పూర్తికాక ముందే దురదృష్టవశాత్తు గత సంవత్సరం మరణించిన వారు దాదాపుగా 12,039 మంది ఉన్నారు. ఆ కుటుంబాలను అలానే వదిలేయలేక, మన ప్రభుత్వమే మానవతా దృక్పథంతో ఆ బీమా క్లెయిమ్స్ రూ.254.72 కోట్లు చెల్లించింది. ఈ కారణాలన్నింటి వల్ల రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లింది. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ ► ఏ నెలలో ఘటన జరిగితే ఆ నెలలోనే సెటిల్ అయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాలకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాం. ► ఇకపై ఎలాంటి ఘటన జరిగినా ఆ నెలలోనే చెల్లింపులు జరుగుతాయి. వలంటీర్లు, గ్రామ సచివాలయాలు తోడుగా ఉంటాయి. అదే గ్రామంలో అప్లికేషన్ పెట్టగానే వెరిఫికేషన్ జరుగుతుంది. క్లెయిమ్స్ జాయింట్ కలెక్టర్‌కు వెళతాయి. అదే నెలలోనే క్లెయిమ్ సెటిల్ అయ్యేలా మార్పులు తీసుకొచ్చాం. దీని వల్ల త్వరితగతిన అప్పటికప్పుడే క్లెయిమ్ సెటిల్ అవుతుంది. 1.32 కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుంది. -
గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించాం: సీఎం జగన్
-
బీమా పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదే
-
బీమా పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదే: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: నూతన మార్గదర్శకాలతో కూడిన 'వైఎస్ఆర్ బీమా' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వర్చువల్‌గా ప్రారంభించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, రూ.5లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీలో చేర్చామని తెలిపారు. వేయికి పైగా రోగాలను గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చామని, కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 'వైఎస్ఆర్ బీమా' అమలు చేస్తామని, 155214 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 'వైఎస్ఆర్ బీమా'పై సందేహాలు నివృత్తి చేసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మృతికి రూ.లక్ష సాయం,18 - 70 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యానికి రూ.5లక్షల బీమా అందిస్తామన్నారు. పేద కుటుంబాలపై భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ పథకం నుంచి 2020 ఏప్రిల్ నుంచి కేంద్రం తప్పుకుందని, పేదలకు మేలు చేయాలని మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వానిదేనని, 2021-22 ఏడాదికి 1.32కోట్ల పేద కుటుంబాలకు రూ.750 కోట్లతో బీమా కల్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకు రెండెళ్లలో మొత్తం రూ.1,307 కోట్ల మేర బీమా రక్షణ అమలులో ఉందని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 'వైఎస్ఆర్ బీమా' అమలు చేస్తామని,155214 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 'వైఎస్ఆర్ బీమా'పై సందేహాల నివృత్తి చేస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చదవండి: Andhra Pradesh: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ‘జగనన్న కాలనీలు’ సీఎం జగన్ మానసపుత్రికలు: మంత్రి పెద్దిరెడ్డి -
నేడు ‘వైఎస్సార్ బీమా’ ప్రారంభం
-
నేడు ‘వైఎస్సార్ బీమా’ ప్రారంభం
సాక్షి, అమరావతి: నూతన మార్గదర్శకాలతో కూడిన వైఎస్సార్ బీమా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించనున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం చెల్లిస్తారు. 18 – 50 ఏళ్ల లోపు వారు సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా లక్ష రూపాయలు చెల్లిస్తుంది. 18 – 70 ఏళ్ల వయసువారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తారు. అర్హత ఉన్న వారి తరఫున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంది. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకునేందుకు 2021–22కిగాను రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.1,133 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఉచిత బీమా రక్షణ కల్పిస్తోంది. నాలుగు రోజుల క్రితమే బీమా పాలసీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు గతంలో సెర్ప్ విభాగం నోడల్ ఏజెన్సీగా ఉండగా తాజాగా గ్రామ/వార్డు సచివాలయ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నిర్ణయించారు. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత వివరాలను సచివాలయాల్లోనూ తెలుసుకోవచ్చు. 2020 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి తప్పుకున్నప్పటికీ పేదలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా కింద రూ.765 కోట్లు వ్యయం చేసింది. బ్యాంకుల్లో వివరాలు నమోదు కాని 12 వేల మందికిపైగా మృతుల కుటుంబాలకు కూడా మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వమే రూ.254.72 కోట్లు పరిహారం చెల్లించింది. బీమా నమోదు, క్లెయిముల చెల్లింపులకు సంబంధించి 155214 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
వైఎస్సార్ బీమాలో చేర్పించేందుకు..
కొనకనమిట్ల/తెర్లాం(బొబ్బిలి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ బీమా పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు కృషి చేస్తున్నారు. పనుల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారి వద్దకు కూడా వెళ్లి ఈ పథకంలో చేర్పిస్తున్నారు. వివరాలు.. ప్రకాశం జిల్లా ఎదురాళ్లపాడు గ్రామ వలంటీరు పులుకూరి వెంకట్రావు తన పరిధిలోని 15 కుటుంబాలకు చెందిన వారు హైదరాబాద్ పరిసరాల్లోని పటాన్చెరు, శంషాబాద్, కరీంనగర్‌లలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. వారు స్వగ్రామానికి రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించిన వెంకట్రావు.. తానే వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. రెండు రోజుల కిందట వారి వద్దకు వెళ్లి.. పథకం గురించి తెలియజేశాడు. అర్హుల నుంచి వేలిముద్రలు తీసుకొని వైఎస్సార్ బీమాలో నమోదు చేయించాడు. అలాగే విజయనగరం జిల్లా తెర్లాం మండలం కాలంరాజుపేటకు చెందిన కొన్ని కుటుంబాలు హైదరాబాద్‌లో ఉంటున్నాయి. గ్రామ వలంటీర్ దుర్గారావు హైదరాబాద్ వెళ్లి ఈ కుటుంబాల్లోని అర్హులకు వైఎస్సార్ బీమాకు సంబంధించిన ఈకేవైసీ చేయించారు. కూలి పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్న తమను వెతుక్కుంటూ వచ్చి ప్రభుత్వ పథకాన్ని వర్తింపజేసిన వలంటీర్లు వెంకట్రావు, దుర్గారావులకు వీరు కృతజ్ఞతలు తెలిపారు. -
బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే
సాక్షి, అమరావతి: పేద కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు సత్వరమే ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి సహజమరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు (నామినీ)కి రూ. లక్ష పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.అనంతరాము ఆదివారం ఉత్తర్వులిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఉపశమనం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి తాజా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 18 నుంచి 70 ఏళ్ల వయసు వారై ఉండి, ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ స్కీముకు నోడల్ ఏజెన్సీగా కార్మిక శాఖ, ఇంప్లిమెంటింగ్ (అమలు) ఏజెన్సీగా గ్రామ సచివాలయ/వార్డు సచివాలయ విభాగం పనిచేస్తుంది. బీమా పరిధిలోకి దారిద్య్ర రేఖ దిగువన ఉన్న అన్ని కుటుంబాలు వస్తాయి. వైఎస్సార్ బీమా పథకంపై ఇటీవల సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ పథకం నుంచి కేంద్రం వైదొలిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఇన్సూరెన్స్ మొత్తాన్ని భరిస్తోంది. అయినప్పటికీ బీమా కంపెనీలు, బ్యాంకుల ద్వారా ఎదురవుతున్న చిక్కుల నేపథ్యంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా వైఎస్సార్ బీమాలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజా మార్గదర్శకాలు ఇవే ► లబ్ధిదారులను గుర్తించడం కోసం గ్రామ వార్డు సచివాలయ వలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తారు. లబ్ధిదారులను నిర్ధారించే అధికారం (రిజిçష్ట్టరింగ్ అథారిటీ) వెల్ఫేర్ అసిస్టెంట్‌కు ఇస్తారు. ఈ జాబితాను కార్మిక శాఖ పరిశీలిస్తుంది. ► వైఎస్సార్ బీమా పరిధిలోకి రావాలంటే 18 ఏళ్ల పైనా, 70 ఏళ్లలోపు ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి. అతను లేదా ఆమె కుటుంబ పోషణ చేసే వారై ఉండాలి. ► వయసు నిర్ధారణ విషయంలో నోడల్ ఏజెన్సీ సంతృప్తి చెందాలి. ► ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్ బీమా రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుంది. ► లబ్ధిదారుల నమోదు సంబంధించిన ఫిర్యాదులను డీఆర్డీఏ పీడీ పరిష్కరిస్తారు. ► సహజ మరణం చెందిన వారికి ఇచ్చే లక్ష రూపాయలు చట్టబద్ధమైన వారసుడికి చెందే విషయమై గ్రామ/వార్డు వలంటీర్లే పర్యవేక్షణ చేస్తారు. ► ప్రమాదవశాత్తు మరణం, లేదా శాశ్వత వైకల్యం గుర్తించే విషయంలో గ్రామ/వార్డు సెక్రటేరియట్ పర్యవేక్షణ చేస్తుంది. ► జిల్లా స్థాయిలో ఈ పథకాన్ని జాయింట్ కలెక్టర్లు (సంక్షేమం) నిశితంగా పరిశీలిస్తారు. కుటుంబ పోషకుడు మరణించిన 15 రోజుల నుంచి 30 రోజుల లోపు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ► నామినీ లేదా వారసులకు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాకు (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) చేస్తారు. ► పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. మరో 8 మంది సభ్యులుగా ఉంటారు. ► రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి కార్మిక ఉపాధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గానూ, మరో 9 మంది వివిధ విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. -
YSR Bima: హైదరాబాద్ వెళ్లి.. వైఎస్సార్ బీమా నమోదు
జగ్గయ్యపేట: లబ్ధిదారుల చేత వైఎస్సార్ బీమా నమోదుకు మండలంలోని గౌరవరం గ్రామం నుంచి ముగ్గురు వలంటీర్లు హైదరాబాద్ వెళ్లిన ఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు కూలి పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అర్హులందరికీ వైఎస్సార్ బీమా నమోదు చేయాలని ఆదేశించడంతో గ్రామంలోని వలంటీర్లు పెసరమల్లి శివాజీ, కనపర్తి గోపి, బూతుకూరి దుర్గారెడ్డి హైదరాబాద్‌కు వెళ్లి 20 కుటుంబాల యజమానుల పేర్లు వైఎస్సార్ బీమా పథకంలో నమోదు చేయించారు. దీంతో గ్రామస్తులు వలంటీర్లను అభినందించారు.