జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. పెరుగుతున్న డెంగీ కేసులు.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. పెరుగుతున్న డెంగీ కేసులు..

Published Tue, Jul 18 2023 4:24 AM | Last Updated on Tue, Jul 18 2023 9:12 AM

- - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో జనం సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్‌ జ్వరాలు సోకుతున్నా యి. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలువృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రభా వం ప్రజారోగ్యంపై పడింది.

దీంతో ప్రభుత్వ, ప్రైవే ట్‌ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి పోతున్నా యి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం రిమ్స్‌ ఆస్పత్రి ఓపీ విభాగం రోగులతో కిటకిటలాడింది. పేరు నమోదుకు జనం బారులు తీరా రు. దాదాపు 1500 మంది వరకు వైద్యం కోసం తరలివచ్చారు. అయితే ఇందులో దాదాపు వెయ్యి మంది వరకు దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పెరుగుతున్న డెంగీ కేసులు..

పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా జ్వరాలు ప్ర బలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా డెంగీ కేసులు పెరిగాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 23 నమోదవగా, ఇందులో ఈనెలలోనే 5 నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

జిల్లాకేంద్రంలోని కేఆర్‌కే కాలనీ, చిల్కూరి లక్ష్మీనగర్‌తో పాటు ఇచ్చోడ, గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లిలో డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మలేరియా కేసులు ఈఏడాది 2 నమోదు కాగా, తాంసిలో 1, నర్సాపూర్‌(టి)లో మరో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. సాధారణ జ్వరాలు ఈనెలలో వెయ్యికి పైగా నమోదయ్యాయి.

రోగులతో కిటకిట..

జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తో పాటు ఉట్నూర్‌, బోథ్‌ ఏరియా ఆస్పత్రులు, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,అర్బన్‌హెల్త్‌సెంటర్లు, జిల్లాకేంద్రంలోని ప్రైవే ట్‌ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో జ్వరాల కేసులు అధికంగా ఉ న్నాయి.

చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచం బారిన పడుతున్నారు. కాగా మార్చిలో సాధారణ జ్వరాలు 1617,ఏప్రిల్‌లో 1558, మేలో 1628, జూన్‌ లో 1571, జూలైలో ఇప్పటివరకు వెయ్యికి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

బ్రీడింగ్‌ చెక్కర్ల నియామకం..

సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో 25 మంది బ్రీడింగ్‌ చెక్కర్లను నియమించింది. డిసెంబర్‌ వరకు వీరిని కొనసాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒ క్కో బ్రీడింగ్‌ చెక్కర్‌ రోజుకు వంద ఇళ్ల చొప్పున సర్వే చేస్తారు. వ్యాధులపై అవగాహన కల్పిస్తారు. డెంగీ జ్వరాలు ప్రబలిన చోట స్ప్రే చేయిస్తారు. మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించే విధంగా చర్యలు చేపడతారు.

ప్రత్యేక దృష్టి..

వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచారు. కలెక్టర్‌ సమక్షంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కళాజాత బృందాలతో గోండీ భాషలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంద్రవెల్లి, దంతన్‌పల్లి, గాదిగూడ, నార్నూర్‌, ఉట్నూర్‌ మండల వాసుల కోసం ప్రత్యేకంగా ఐదు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.

16 ట్రైబల్‌ పీహెచ్‌సీల్లో ప్రతిరోజు ర్యాపిడ్‌ సర్వే చేపడుతున్నారు. మైదాన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పల్లె దవాఖానాల్లో మందులు, 14 రకాల టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది నమోదైన డెంగీ కేసులు -23 (ఈ నెలలో 05), సాధారణ జ్వరాలు -6,500, మలేరియా కేసులు -02 హైరిస్క్‌ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటున్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలుతాయి. వారంలో రెండు రోజులు డ్రైడే పాటించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ర్యాపిడ్‌ సర్వే చేయిస్తున్నాం. బ్రీడ్‌చెక్కర్లను నియమించాం. ఆస్పత్రుల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. – నరేందర్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement