ఇద్దరి ప్రాణాలు కాపాడిన బాసర పోలీసులు
బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరినది వద్ద గురువారం ఆత్మహత్యకు యత్నించిన వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన తిరుమనపల్లి సంపత్ గోదావరిలో దూకేందుకు యత్నిస్తుండగా విధి నిర్వహణలో అటుగా వెళ్తున్న పోలీసులు గమనించి అతన్ని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన కొమ్ము సుమలత గోదావరిలో దూకేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఎస్సై గణేశ్ ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.