ప్రకృతి అందాలకు నిలయమైన ఆంధ్రా ఊటీ అరకులోయ చలి ఉత్సవాల
సందర్శకులను
ఆకట్టుకునేలా సాంస్కృతిక
కార్యక్రమాలు
విజయవంతానికి
పకడ్బందీగా
ఏర్పాట్లు
ప్రకృతి అందాలను
తిలకించేలా హెలీ రైడ్,
హాట్ ఎయిర్‌బెలూర్,
పారా గ్లైడింగ్
నృత్యాలతో అలరించనున్న
వివిధ రాష్ట్రాల
గిరిజన కళాకారులు
సాక్షి, పాడేరు/అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయకు పూర్వం నుంచి ఆంధ్రా ఊటీగా పేరుంది. ఈ ప్రాంత అందాలకు దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఫిదా అవుతుంటారు. ఇంతటి ప్రత్యేకత ఉన్న అందాల అరకులోయ చలి ఉత్సవాలకు ముస్తాబయ్యింది.శుక్రవారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవాలకు పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను గురువారం కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గైడ్, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఏఎస్పీ ధీరజ్‌లతో కలిసి గురువారం పరిశీలించారు. తురాయిగుడ కొండ సమీపంలోని హెలీ రైడ్‌లో కలెక్టర్‌తోపాటు అధికారులు పాల్గొని విహరించి, అరకు అందాలను తిలకించారు. ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. హెలీరైడ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఉత్సవం నిర్వహించే డిగ్రీ కళాశాల మైదానం, పద్మాపురం ఉద్యానవనం, హెలీ రైడ్ ప్రాంతంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ట్యాంక్లతో నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఫైర్ ఇంజన్, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచామన్నారు.
150 మంది బుకింగ్
హెలీరైడ్ కోసం ఆన్‌లైన్‌లో 150 మంది బుక్ చేసుకున్నారని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో హెలీ రైడ్‌కు రూ. 3,500, స్పాట్ బుకింగ్‌రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. హెలీరైడ్‌లో విహరిస్తే అరకు అందాలు అద్భుతంగా కనిపించాయన్నారు. గిరిజన వంటకాలు, అరకు కాఫీ పర్యాటకులకు రుచి చూపించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకదృష్టి
చలి ఉత్సవాలకు భారీగా సందర్శకులు తరలివస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టారు. స్టాళ్లు, మారథాన్ ర్యాలీ, వాహనాల పార్కింగ్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్
దినేష్‌కుమార్ ఇప్పటికే ఆదేశించారు. ఉత్సవాలు జరిగే మూడు రోజులు మెరుగైన పారిశుధ్యంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఉత్సవాల్లో ముందుగా నిర్వహించే అరకు మారథాన్‌లో భారీగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఉత్సవ ఏర్పాట్లను జిల్లా అధికారులతోపాటు టీడబ్ల్యూ ఈఈ వేణుగోపాల్, డేవిడ్‌రాజు, డీఆర్‌డీఏ పీడీ మురళీ, మ్యూజియం క్యూరేటర్ మురళి, డీపీఆర్వో గోవిందరాజులు, తహసీల్దార్ ఎంవీవీ ప్రసాద్, ఎంపీడీవో అడపా లవరాజు పర్యవేక్షించారు.
మైమరిచిపోయేలా హెలీరైడ్
ఉత్సవాల్లో భాగంగా హెలీ రైడ్‌లో పాల్గొనే సందర్శకులకు ప్రకృతి అందాలు మైమరిచి పోయేలా చేయనున్నాయి. అరకులోయ పరిసరాలు, పద్మాపురం ఉద్యానవనం, ఎత్తయిన కొండలు, లోయలను తిలకించేలా హెలీరైడ్‌ను రూపొందించారు.
నోరూరించనున్న గిరిజన వంటకాలు
ఉత్సవాలు మూడు రోజులపాటు గిరిజన వంటకాలు నోరూరించనున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరి ధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శిస్తారు. వీటిలో రాగి పిండితో తయారు చేసిన అంబలి (రాగి జావ), తోఫ (రాగి సంగటి), సామ, కొర్ర బియ్యంతో అన్నం, రాజ్‌మా, కందులు, బొబ్బర్లు (అలసందలు, తదితర గిరిజన వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన వంటకాలు ప్రదర్శనలో ఉంచుతారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా పుష్పాలంకరణ
పద్మాపురం ఉద్యానవనంలో ఏర్పాటుచేస్తున్న ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందుకు ప్రత్యేకంగా పుష్పాలను రప్పించారు. ప్రదర్శనలో భాగంగా పద్మాపురం ఉద్యానవనంలో ఫ్లవర్ బొకేలతోపాటు ఫ్లవర్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అతిథులకు స్వాగతం పలికేందుకు కూడా ప్రత్యేకంగా పుష్పాలతో బొకేలను సిద్ధం చేస్తున్నట్ట అధికారులు తెలిపారు
కలెక్టర్ దినేష్‌కుమార్
పర్యవేక్షణలో
సిద్ధమైన అరకులోయ
Comments
Please login to add a commentAdd a comment