అరచేతిలో స్వర్గం.. ఆచరణలో విఫలం
అరకులోయ టౌన్: ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చడంలో విఫలమయ్యారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో రూ. 1.19 లక్షల కోట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను చంద్రబాబు పీకేశారన్నారు. గత ప్రభుత్వంలో ముందుచూపుతో సముద్ర తీర ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మూడు చోట్ల పోర్టులు, హార్బర్ల నిర్మాణానికి నిర్మిణానికి శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు తమ వారికి కట్ట బెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య రంగంలో విప్లవాత్మకంగా సంస్కరణలు చేపట్టి 17 వైద్య కళాశాలలు మంజూరు చేసి, నిర్మాణాలు చేపట్టారని, అందులో పూర్తి స్ధాయిలో సీట్ల భర్తీకి చంద్రబాబు అడ్డుకట్ట వేశారన్నారు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి, ప్లే యాష్, మద్యం మాఫీయాలు రెచ్చిపోయి జేబులు నింపు కుంటున్నారన్నారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు మాటలు వట్టి మాటలేనన్నారు. నీతి అయోగ్ పేరిట చంద్రబాబు విడుదల చేసిన రిపోర్ట్ ఆశ్చర్యంగా ఉందన్నారు. 2014లో చంద్రబాబు పాలనలో మూలధనం వ్యయం కింద రూ. 13.800 కోట్లు ఖర్చు పెడితే జగనన్న పాలనలో సగటున ఏడాదికి రూ. 15.632 కోట్లు ఖర్చు చేశారన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు టూరిజం అభివృద్ధికి 1/70 చట్టం అడ్డంకిగా ఉందని, దీని సవరించాలని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ శెట్టి రోషిణి, అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, సర్పంచ్‌లు బీబీ బొజ్జ, మాదల బుడిటి, పెట్టెలి సుస్మిత, సమిడ వెంకట పూర్ణిమ, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కు మార్, శత్రుఘ్న, ఎం.లలిత, వైస్ ఎంపీపీ కిల్లో రామ న్న, మండల పార్టీ అథ్యక్షుడు లొక్కోయి లక్ష్మణ్‌కుమా ర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రాజరమేష్, గ్రీవెన్స్ విభాగం అరకు అధ్యక్షుడు కొండబాబు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ హామీలు గాలికి
సంపద సృష్టి ప్రచారానికే పరిమితం
1/70 చట్టంపై స్పీకర్ వ్యాఖ్యలు సరికాదు
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment