గిరి రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యం
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ఐటీడీఏ సమావేశపు మందిరంలో గురువారం వ్యవసాయ అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలకరి నాటికి వ్యవసాయానికి సంబంధించిన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఏజెన్సీలో పశువులకు టీకాలు కార్యక్రమం ఫిబ్రవరి 5 నాటికి నూరుశాతం పూర్తి చేసి, పశు సర్వే నిర్వహించి తమకు నివేదించాలన్నారు. మేకలు, గొర్రెలు, గేదెలు పెంచుకునేందుకు బ్యాంకులు ద్వారా రుణాలు పొందేందుకు అర్హులైన వారిని గుర్తించి దరఖాస్తు చేయించాలని సూచించారు. ఏజెన్సీలో చేపల చెరువులపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. చేపల పిల్లలు ఉచితంగా రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చెరువులు, కాలువల పూడిక తీతకు ప్రతిపాదించాలన్నారు. ఉపాధి పనులకు సంబంధించి కొత్త పనులు మంజూరుకు నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ ఏడాది వీడీవీకేల ద్వారా జీడిపిక్కలు కొనుగోలు చేసి, రంపచోడవరం, అడ్డతీగలల్లో జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పశు సంవర్థకశాఖ డీడీ షరీఫ్, ఏడీ సీహెచ్ కేవీ చౌదరి, కె సావిత్రి, పీహెచ్వో కె చిట్టిబాబు, పీఏవో ఎల్.రాంబాబు, ఏవో లక్ష్మణ్ పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవోకట్టా సింహాచలం
Comments
Please login to add a commentAdd a comment