దళారుల చేతుల్లో మోసపోకండి
రంపచోడవరం: దళారుల చేతిలో మోసపోవద్దని జీడిమామిడి రైతులకు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం సూచించారు. ఐటీడీఏ సమావేశం హాలులో మంగళవారం రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు, ఎన్‌జీవోలతో నిర్వహించిన సమావేశంలో పీవో మాట్లాడారు. ఐటీడీఏ ద్వారా గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎక్కడికక్కడ జీడిపిక్కలు కొనుగోలు చేస్తామని తెలిపారు. జీడిమామిడి రైతులకు అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి వేధించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జీడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2021–22 సంవత్స రంలో వన్‌ధన్ వికాస కేంద్రాల ద్వారా 70 మెట్రిక్ టన్నుల జీడిపిక్కలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈఏడాది వంద మెట్రిక్‌టన్నుల జీడిపిక్కలు కొనుగోలు చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. జీడిపిక్కల తూకంలో రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.గిరిజన రైతుల ఉత్పత్తులకు సంబంధించిన యాప్‌ను ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పురుగు మందులు, యంత్రాలను సరఫరా చేయాలని రైతులు పీవోను కోరారు. ఈ సమావేశంలో ఏపీవో డి.ఎ.వి. రమణ, పీహెచ్‌వో చిట్టిబాబు, రామరాజు, నవజీవన్ సంస్థ ప్రతినిధి పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వంద మెట్రిక్ టన్నుల
జీడి పిక్కలు కొనుగోలు లక్ష్యం
రంపచోడవరం ఐటీడీఏ పీవో
కట్టా సింహాచలం
Comments
Please login to add a commentAdd a comment