త్వరితగతిన సర్వేలు | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన సర్వేలు

Published Wed, Mar 5 2025 1:09 AM | Last Updated on Wed, Mar 5 2025 1:04 AM

త్వరితగతిన సర్వేలు

త్వరితగతిన సర్వేలు

పాడేరు : జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ పీవోలు, 22 మండలాల ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈ, మిస్సింగ్‌ సిటిజన్స్‌, ఆధార్‌ నమోదు, జనన, మరణాల నమోదు, పాఠశాలల టాయిలెట్ల తనిఖీలు, వర్క్‌ ఫ్రం హోం తదితర సర్వేలు వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆధార్‌ కార్డులేని పిల్లలు 68 వేల మంది ఉండగా, ఇప్పటి వరకు కేవలం 35 శాతం మాత్రమే నమోదు పూర్తి చేశారన్నారు. ప్రతి ఎంపీడీవో వారంలో కనీసం నాలుగు గ్రామ సచివాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి వారం రెండు సార్లు వెల్ఫేర్‌ అసిస్టెంట్లు పాఠశాలల టాయిలెట్స్‌ తనిఖీ చేసి ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. లేని పక్షంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 సర్వే జిల్లాలో ఈనెల 8నుంచి 18 వరకు జరుగుతుందని, ఈనెల 21నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి మార్చి 27లోగా తుది నివేదిక ఇవ్వాలన్నారు. సర్వే పనుల్లో పురోగతి తక్కువగా ఉన్న మండల స్థాయి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యుటేషన్‌ వేగవంతం చేయండి

మ్యుటేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి సబ్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ఫిర్యాదులు, భూ సమస్యల పరిష్కారం, రిజిస్ట్రేషన్‌, భూ సర్వే, మ్యుటేషన్‌ ప్రక్రియపై సమీక్షించారు. భూముల సర్వేకు సహకరించని సర్వేయర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టర్లకు సూచించారు. తహసీల్దార్లు కార్యాలయాలకు హాజరు కావడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సదస్సులో స్వీకరించిన ఫిర్యాదులను తహసీల్దార్లు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌, సబ్‌ కలెక్టర్లు శౌర్యమాన్‌ పటేల్‌, కల్పనశ్రీ, డీఆర్వో పద్మాలత, సర్వే సహాయ సంచాలకులు దేవేంద్రుడు, 22 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement