వైభవంగా గంగమ్మతల్లి ఉత్సవాలు
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ముంచంగిపుట్టు: మండలంలోని పాత,కొత్త సుజనకోట గ్రామాల్లో గంగమ్మతల్లి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి అఽధిక సంఖ్యలో భక్తులు శతకం పట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు ఘటాలను మోసుకొని వెళ్లి సమర్పించారు.రాత్రి గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం బుడియాలు సందడి చేశారు.సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి ఆంధ్ర,ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి మంగళవారం తెల్లవారు జాము నుంచే అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.ముంచంగిపుట్టు కిరాణా వ్యాపారులు గుడ్ల వెంకటరావు,శ్రీనివాసరావులు ఐదు వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర,పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గంగమ్మ తల్లిని దర్శించుకుని, చీరలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
వైభవంగా గంగమ్మతల్లి ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment