కోలుకుంటున్న విద్యార్థినులు
సాక్షి,పాడేరు: కడుపు నొప్పి,వాంతులతో సోమ వారం అస్వస్థతకు గురైన పెదబయలు మండలం తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోలుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అస్వస్థతకు గురవడంతో పెదబయలు,గోమంగి పీహెచ్‌సీల వైద్యులు,వైద్యసిబ్బంది రాత్రంతా అక్కడే మకాం ఉండి వైద్యసేవలందించారు. మంగళవారం ఉదయం వైద్యపరీక్షలు జరిపి, మందులు ఇచ్చారు. విద్యార్థినుల ఆరోగ్యం మెరుగు పడుతుండడంతో వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
జాయింట్ కలెక్టర్ విచారణ
గిరిజన విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై స్పందించిన జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్‌గౌడ మంగళవారం తురకలవలస ఆశ్రమ పాఠశాలను సందర్శించి, విచారణజరిపారు. ఉదయం, మధ్యా హ్నం తిన్న ఆహారం వివరాలను జేసీ తెలుసుకున్నారు. అనంతరం స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. పెదబయలు ఎంఈవో పుష్పజోసెఫ్ కూడా ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment