విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: మండల కేంద్రం వై.రామవరం నుంచి లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిలో బుధవారం స్థానిక ఎస్‌ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్టు ఎస్‌ఐ తెలిపారు. వాహనాల్లో ప్రయాణికులను, రవాణా చేస్తున్న సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించి, వాహన రికార్డులను తనిఖీ చేశారు. సీఐ బి.నరసింహమూర్తి ఆదేశాల మేరకు ఒకపక్క వాహన తనిఖీలు నిర్వహిస్తూ మరోపక్క నూతన వాహన చట్టాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆ చట్టాల వివరాలకు సంబంధించిన కరపత్రాలను వాహనదారులకు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment