గిరిజన సంక్షేమశాఖడీడీ బాధ్యతల స్వీకరణ
రంపచోడవరం: స్థానిక గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం.రుక్మాండయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో డీటీడబ్ల్యూవోగా, పార్వతీపురం ఐటీడీఏలో డీడీగా పనిచేసినట్టు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానన్నారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఐటీడీఏ పీవో సూచనల మేరకు పనిచేస్తానని తెలిపారు. విధుల్లో చేరిన డీడీని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. డీడీ కార్యాలయం సూపరింటెండెంట్ బి.కిషోర్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, చక్రధర్, రాజన్న తదితరులు డీడీని మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment