ఇసుకాసురుల అడ్డా
మత్స్యగెడ్డ మధ్యలో వ్యాన్‌లోలోడ్ చేస్తున్న కార్మికులు
మత్స్యగెడ్డలో ఇసుక అక్రమ తవ్వకాలు
జోరుగా అక్రమ తవ్వకాలు
భారీగా వ్యాపారం
టిప్పర్లతో యథేచ్ఛగా రవాణా
పట్టించుకోని అధికార యంత్రాంగం
సాక్షి,పాడేరు: జిల్లాలో హుకుంపేట నుంచి పెదబయలు మండలం వరకు విస్తరించిన మత్స్యగెడ్డ ఇసుకాసురులకు కాసులు కురిపిస్తోంది. అక్రమార్కులకు అడ్డాగా మారింది.గిరిజనుల ఇళ్ల నిర్మాణాల కోసమన్న నెపంతో పగలురాత్రీ తేడా లేకుండా మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అధికారులు చోద్యం చూస్తుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హుకుంపేట మండలం కామయ్యపేట,పెదబయలు మండలం గంపరాయి,మంగబంద ప్రాంతంలో మత్స్యగెడ్డలో అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కనీసం 100 టిప్పర్ల లోడ్‌ను ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో మత్స్యగెడ్డలోని పలు ప్రాంతాల్లో భారీగా గోతులు ఏర్పడ్డాయి. ఏకంగా టిప్పర్లను మత్స్యగెడ్డలోకి దింపి ఇసుకను లోడ్ చేస్తున్నారు.సరిహద్దులోని ఒడిశా వ్యాన్ ఆపరేటర్లు కూడా ఇక్కడ ఇసుకనే సేకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ,పోలీసు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచే మత్స్యగెడ్డలో ఇసుక తవ్వకాల దృశ్యాలను ప్రజలంతా చూస్తున్నప్పటికీ అధికార యంత్రాంగానికి మాత్రం కనిపించడం లేదు.
రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం
మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.అయితే వ్యాన్,ట్రాక్టర్ల ఆపరేటర్లు గెడ్డలో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు.మత్స్యగెడ్డలో తవ్విన ఇసుకను పాడేరు,ముంచంగిపుట్టు, హుకుంపేట,జి.మాడుగుల మండలాలకు తరలిస్తూ రోజూ లక్షలాది రూపాయల ను జేబుల్లో వేసుకుంటున్నా రు.ఇసుకకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో అనుమతులు లేకపోయినప్పటికీ భారీగా తవ్వేస్తుండడంతో మత్స్యగెడ్డ మరింత ప్రమాదకరంగా మారుతోంది.
మత్స్యగెడ్డ..
Comments
Please login to add a commentAdd a comment