పాడేరు రూరల్: జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు విశాఖపట్నం పోర్టు ఆథారిటీ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ మారిటైం షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు ఆసంస్థ చీఫ్ ఆపరేటింగ్ అధికారి గోపీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్,డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీయువకులకు కొరియర్ సూపర్‌వైజర్,వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, సీఎన్‌సీ ఆపరేటర్, డిజైన్ ఇంజినీర్ తదితర కోర్సుల్లో 2నుంచి 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. అర్హులైన వారు విశాఖపట్నం సింథియా జంక్షన్‌లో గల సీఈఎంఎస్ కేంద్రంలో లేదా 7794840934, 8688411100 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment