గిరి రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి
రంపచోడవరం: గిరిజన రైతులకు శాసీ్త్రయతతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ముందుండాలని ఉద్యానవన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.గోవిందరాజులు తెలిపారు. పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన 13వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు వ్యవసాయంలో మెరుగైన దిగుబడి సాధించేందుకు సరైన దిశానిర్దేశం చేయాలన్నారు. రైతుల కోసం ఏం చేయాడానికై నా కేవీకే సిద్ధంగా ఉందని చెప్పారు. హెచ్‌వో ముత్తయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో కొంత భాగం జాఫ్రా సాగుకు అనుకూలంగా ఉందని, జాఫ్రా సాగు చేసే విధంగా రైతులను ప్రొహించాలన్నారు. కేవీకేలోనే రబ్బరు అంట్లు తయారు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఏడీ చౌదరి మాట్లాడుతూ జీడిమామిడి పంట ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతంలో జీడిపిక్కలను ప్రాసెసింగ్ చేసే యూనిట్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. కొత్త సంవత్సరంలో చేపట్టవలసిన ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ద్వారా కేవీకే అధిపతి డాక్టర్ కె.రాజేంద్రప్రసాద్ వివరించారు. హెచ్‌ఆర్‌ఎస్ హెడ్ డాక్టర్ పి.సి.వెంగయ్య మాట్లాడుతూ నిపుణుల శిక్షణల ద్వారా గిరిజన యువతకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. జీలుగు రైతుల కోసం అవగాహన సదస్సు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, ప్రవీణ్‌కుమార్, వీరాజంనేయులు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన విశ్వవిద్యాలయ సంచాలకులు గోవిందరాజులు
Comments
Please login to add a commentAdd a comment