రోగులకు మెరుగైన వైద్య సేవలు
డీసీహెచ్‌ఎస్ లక్ష్మి ఆదేశం
చింతపల్లి: ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కె.లక్ష్మి ఆదేశించారు.ఆమె డీసీహెచ్‌ఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా బుధవారం చింతపల్లి ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వార్డుల్లో రోగులతో మాట్లాడారు. రోగులకు అందజేస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ ఇందిరా ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌ను, రక్త నమూనాలను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రత్యేక నవజాతి శిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్యాధికారులు,సిబ్బందితో వేర్వేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.ఆస్పత్రిలో వైద్యుల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అనంతరం స్థానికంగా నిర్మాణంలో ఉన్న నూతన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఎప్పటిలోగా పూర్తిఅవుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు భారతి,రుక్మిణి,లావణ్య,ప్రభావతి,చంద్రశేఖర్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment