జీసీసీ గోదాము తనిఖీ
పెదబయలు: మండలంలోని గిరిజన సహకార సంస్థ (జీసిసి) గోదామును పాడేరు జీసీసీ డివిజినల్ మేనేజర్ డి. సింహాచలం గురువారం తనిఖీ చేశారు. జేసీ ఆదేశాల మేరకు గోదాము తనిఖీ చేసి విశాఖ సెంట్రల్ గోదాము నుంచి ఎంత సరకు వచ్చింది.. మండల గోదాములో ఉన్న స్టాక్ ఇక్కడ నుంచి డిపోలకు, ఆశ్రమ పాఠశాలలకు ఎలా సరఫరా అయిందీ పరిశీలించానని చెప్పారు. తనిఖీ నివేదిక జేసీకి అందజేస్తానని తెలిపారు. పౌరసరఫరాల సరకులకు డిపోల్లో సకాలంలో సక్రమంగా అందించాలన్నారు. అనంతరం జీసీసీ కార్యాలయం, ఇతర నిత్యావసర సరకుల గోదాములను తనిఖీ చేశారు. స్థానిక జీసీసీ మేనేజర్ గాసీ, గోదాము ఇన్‌చార్జి దీనాకుమారి డీఎం వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment