విశాఖ లీగల్ : విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జిల్లాలో అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటారు ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్, బ్యాంకు, మనీ రికవరి కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగదాలు(విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment